జైశ్రీరామ్.
శ్లో. మితం భుంక్తే సంవిభజ్యాశ్రితేభ్యః.,మితం స్వపిత్యమితం కర్మ కృత్వా , దదాత్యమిత్రేష్వపి యాచితః సన్,తమాత్మవంతం ప్రజహత్యనర్థాః.
గీ. ఆశ్రితులఁ గూడి మితముగ నారగించి,
శ్రమను చేయుచు నల్పవిశ్రాంతినుండి,
యాచకులకిచ్చి తృప్తిగ యలరువాని
చేరబోవనర్థముల్ ధీరులార!
భావము. ఉన్న ఆహారాన్ని ఆశ్రితులతో కలిసి విభజించుకొని మితంగా భుజించాలి. పని ఎంత ఎక్కువచేసినా మితంగానే నిద్రించాలి.యాచించినవాడు శత్రువైనా ఆనందంగా ఇవ్వాలి.ఈ లక్షణాలున్నవానికి ఏ అనర్థాలూ రానేరావు.
జైహింద్.
1 comments:
నమస్కారములు
అదేకదా ! పాతాళానికి అణచి వేస్తాడని తెలిసినా బలి చక్రవర్తి అంతటి రాక్షస రాజు ఆనందంగా అదృష్టంగా భావించి మూడడుగులు ఇచ్చేస్తాడు .ఉ న్నదాంట్లో నలుగురు పంచు కోవడం వంటి ఉత్తమ లక్షణములు గలవారు ఎప్పుడు భగవంతునికి అనుగ్రహ పాత్రులే మరి చాలా బాగుంది ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.