గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, మే 2014, శుక్రవారం

అహన్యస్తమయాంతాని, మేలిమి బంగారం మన సంస్కృతి, 211.

జైశ్రీరామ్.
శ్లో. అహన్యస్తమయాంతాని, ఉదయాంతా చ శర్వరీ
సుఖస్యాంతం సదా దుఖం, దుఖస్యాంతం సదా సుఖమ్.

క. ఉదయం బస్తమయంబున 
నుదయంబున నస్తమయమునొందెడుచ్యుతి. స
న్మధుర సుఖాంతము దుఃఖము
వ్యధభరదుఃఖాంతము సుఖ మరయుఁడు నిజమున్.
భావము. పగలు– సూర్యాస్తమయంతో, రాత్రి – సూర్యోదయంతో అంతమౌతాయి. సుఖము పిదప ఎప్పుడూ దుఃఖము, దుఃఖము పిదప ఎప్పుడూ సుఖమును ప్రాప్తించుట తథ్యము.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును కష్ట సుఖాలు చీకటి వెలుగుల్లా వెన్నంటి ఉంటాయి మంచి మేలిమి బంగారం వంటి సూక్తులను అను నిత్యము అందిస్తున్నందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.