గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, మే 2014, మంగళవారం

నరత్వం దుర్లభం లోకే...మేలిమి బంగారం మన సంస్కృతి, 208.

జైశ్రీరామ్.
శ్లో. నరత్వం దుర్లభం లోకే , విద్యా తత్ర సుదుర్లభా 
శీలం చ దుర్లభం తత్ర వినయస్తత్ర సుదుర్లభః.

క. నర జన్మము దుర్లభమిల, 
వర విద్య సుదుర్లభంబు వర గుణ శీలం
బరయగ దుర్లభమందున
వర వినయము దుర్లభంబు వర్ధిల మనకున్.
భావము. లోకంలో మానవజన్మ లభించుటయే దుర్లభం. విద్య (జ్ఞానం) అబ్బటం మరింత దుర్లభం.మంచి నడవడిక , వినయం సిద్ధించటం ఇంకా దుర్లభం.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును మనిషిగా పుట్టడం పూర్వజన్మ సుకృతం కనీసం ఇప్పుడైనా మంచి పనులు చేయ గలిగితే ఉన్నతలోకాలు చేర వచ్చేమొ మంచి ముత్యాన్ని అందించారు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.