గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, మే 2014, గురువారం

వ్యాఘ్రీవ తిష్ఠతి జరా పరితర్జయంతి. మేలిమి బంగారం మన సంస్కృతి191.

జైశ్రీరామ్.
శ్లో. వ్యాఘ్రీవ తిష్ఠతి జరా పరితర్జయంతి రోగాశ్చ శత్రవ ఇవ ప్రహరంతి దేహం
ఆయుః పరిస్రవతి భిన్నఘటాదివాంభో లోకస్తథాప్యహితమాచరతీతి చిత్రమ్!
క. పులి వలె వృద్ధత పయిఁబడు
పలు రోగములావహించు. పగిలిన కుండన్
నిలువని నీరటులాయువు
తొలగును. మరి దుష్ట బుద్ధి తొలగదదేలో?
భావము. ముసలితనం ఆడపులిలా చూపుడు వ్రేలితో బెదిరిస్తోంది.శత్రువుల్లా రోగాలు దేహాన్ని  దెబ్బ తీస్తున్నాయిపగిలినకుండలోని నీళ్ళలా ఆయుర్దాయం తరిగిపోతోంది.ఐనప్పటికీ లోకం అహితకార్యాలు చేస్తూ ఉండటమే ఆశ్చర్యం!
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును . ప్రాణం పోయేటప్పుడు కుడా నాఇల్లు నాపిల్లలు నా అన్నపదంతో తొట్టుకుంటారు కనీసం అప్పుడు కుడా దైవ చింతన ఉండదు .మానవ నైజమె అంత .చక్కని ఆణిముత్యం /ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.