గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, మే 2014, శుక్రవారం

న హి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః.మేలిమి బంగారం మన సంస్కృతి. 186.

జైశ్రీరామ్ 
శ్లో. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః                                                                                         న హి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః.                                                                                    
కం.కోరి నంతనె కోర్కెలు తీరఁ బోవు.
కోరి యత్నించ సిద్ధించు కోర్కెతీర్చు.
సుప్త సింహంబు నోటను చొచ్చునొక్కొ
మృగము లేవైన? కష్టించ మిగులు ఫలము.
భావము. ప్రయత్నంతోనే పనులు సిద్ధిస్తాయి  కాని , కేవలం కోరికలతో కాదు. నిద్రిస్తున్న సింహం నోటిలోనికి మృగాలు తమంతట తాము  ప్రవేశించవు  కదా.(సింహం వేటాడకుండా ఆహారం లభించదుకదా)
జైహింద్.
Print this post

2 comments:

కందుల వర ప్రసాద్ చెప్పారు...

శ్రీ చింతా రామ కృష్ణా రావు గురుదేవులకు పాదాభి వందనములతో ...

గురువు గారు నిజమండి, కానీ నేడు కష్ట పడుటకు జనులు ఇష్ట పడుట లేదు.
మంచి మంచి విషయములు తెలియ జేయు చున్న మీకు ధన్యవాదశతము .

శిష్య పరమాణువు
వరప్రసాదు .

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ముందు మనప్రయత్నం మనం చేస్తే తర్వాత దైవాను గ్రహం కలిసి వస్తుంది మంచి విషం చెప్పారు . ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.