గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, మే 2014, మంగళవారం

బకవత్ ధ్యాన మాచరేత్. మేలిమి బంగారం మన సంస్కృతి189.

జైశ్రీరామ్.
శ్లో. శుకవత్ భాషణం కుర్యాత్,బకవత్ ధ్యాన మాచరేత్
అజవత్ భోజనం కుర్యాత్గజవత్ స్నాన మాచరేత్.

క. చిలుక వలె పలుకు ముద్దుగ. 
నిలకడగా కొంగవోలె నిలుపుము ధ్యానం
బల మేక వలె భుజింపుము.
సలుపుము గజమట్లు నీట స్నానము హితమౌన్.
భావము. చిలుకలా మధురంగా మాట్లాడాలి. కొంగలా నిశ్చలంగా ధ్యానం చేయాలి,ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా మనకు లభించిన సాత్విక ఆహారాన్ని మేకలా భోజనం చేయాలి. ఏనుగులా ఆనందంగా ఎక్కువసేపు స్నానం చేయాలి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నిజానికి ఈ రోజుల్లో ఎవరైనా ఇవన్నీ చేస్తున్నారా ? చేస్తే ఆశ్చర్య పడాల్సిందే . ఇంత మంచి సూక్తిని ఆచరించ గలిగితే అదృష్టమే మరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.