గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, జూన్ 2012, గురువారం

గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ.

జైశ్రీరామ్


గోమాత
శ్లోll
గవో మేచాగ్రతో నిత్యం! గావః పృష్టత ఏవచ!
గావో మే హృదయేచైవ! గవాం మధ్యే వసామ్యహం!
భావముః గోవులు నా ఎదుట, నా వెనుక, నా హృదయమునందు నిత్యము ఉండుగాక, నేను ఎప్పుడూ గోవుల మధ్య ఉందును గాక (స్కాంద పురాణాంతర్గతము).
శ్రీ కృష్ణ భగవానుడు గోపూజ చేసి మనకు తరుణోపాయం చూపారు. అందుకే గోపూజ చేసిన వారికి మోక్షం సులభ సాధ్యము. గోవు సమస్త దేవతా స్వరూపము.
గోమహత్యముః
గోపాదాలు - పితృదేవతలు, 
పిక్కలు - గుడి గంటలు, 
అడుగులు - ఆకాశగంగ, 
కర్ర్ఇ - కర్ర్ఏనుగు, 
ముక్కొలుకులు - ముత్యపు చిప్పలు, 
పొదుగు - పుండరీకాక్షుడు, 
స్తనములు- చతుర్వేదములు, 
గోమయము - శ్రీ లక్ష్మి, 
పాలు - పంచామృతాలు, 
తోక - తొంబది కోట్ల ఋషులు, 
కడుపు - కైలాసము, 
బొడ్డు - పొన్నపువ్వు, 
ముఖము - జ్యేష్ఠ, 
కొమ్ములు - కోటి గుడులు, 
ముక్కు - సిరి, 
కళ్ళు - కలువ రేకులు, 
వెన్ను - యమధర్మరాజు, 
చెవులు - శంఖనాదము, 
నాలుక - నారాయణ స్వరూపము, 
దంతాలు - దేవతలు, 
పళ్ళు - పరమేశ్వరి, 
నోరు - లోకనిధి.
ప్రాతఃకాల గో దర్శనం శుభప్రదము. 
పూజించుట మోక్షప్రదము. 
స్పృశించుటచే ఉత్తమ తీర్థ స్నాన ఫలము కలుగుతుంది. 
ఉదయాన్నే లేచి గో మహాత్మ్యాన్ని పఠిస్తే సకల పాపాలు తొలిగిపోతాయి. 
అంటు కలిపిన పాపము, ముట్టు కలిపిన పాపము, బంగారము దొంగిలించిన పాపము, తెలిసీ తెలియక చేసిన పాపాలు నశిస్తాయి.
మధ్యాహ్న కాలములో పఠిస్తే వెయ్యి గుళ్ళల్లో దీపారాధన చేసిన ఫలము, జన్మాంతరము ఐదోతనము ఇచ్చునట్లు,
రాత్రి పూటపఠిస్తే  యమబాధలు వుండవు.
గోమహాత్మ్యాన్ని ఒకసారి పఠించినవారికి మూడు నెలల పాపము,
సంధ్యవేళ గోమహాత్మము పఠించిన వారి ఇంటికి శ్రీ మహాలక్ష్మి స్వయముగా విచ్చేస్తుంది.
కాళరాత్రి గోమాహాత్మ్యము పఠిస్తే కాలయముని భయము దూరమవుతుంది.
నిత్యము గోమాహాత్మ్యము పఠించిన వారికి నిత్యము చేసిన పాపములు దూరమవుతాయి.
విన్నవారికి విష్ణులోకము చెప్పిన వారికి పుణ్యలోకము ప్రాప్తిస్తాయి.
ఎదురుగా కదలాడే తల్లి, తండ్రి, గురువు, గోమాత వంటి ప్రత్యక్ష దైవములను గుర్తించలేక దేవుడెక్కడున్నాడు అనుకొనే అజ్ణానులము మనము.
కనుక మిత్రులారా మనము చేయవలసినది కేవలము చదవటము మాత్రమే, చదివి పుణ్యమును సంపాదించుకోవటము ఎంతసులభము.
అయినా చదవలేకపోతే మన చేతులారా మనల్ని మనము దిగజార్చుకోవటమేనేమో?
జైహింద్
Print this post

2 comments:

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

గురువు గారూ,

గోమాతగురించిన వ్యాసము చాలా బాగున్నది. గోమాత యొక్క ప్రాశస్త్యాన్ని వివరించినదుకు శతథా ధన్యవాదాలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పూజ నీయ మైన గోమాత యొక్క వైభవాన్ని మనసుని హత్తుకునేలా తెలియ జెప్పారు. నిజం గా మన సంస్కృతి మేలిమి బంగారమే . గోవు సర్వాంగ సుందర మైన దేవతా స్వరూపమే . ఇలా మరిన్ని మీ కలం నుంచి మాకందించ మని కోరుతూ . శుభా కాంక్షలు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.