గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, జూన్ 2012, శుక్రవారం

సాహిత్య సోపానం - మొదటి మెట్టు ‘మా నిషాద’ .

జైశ్రీరామ్.
శ్లో:- మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః| 
యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్||
గీ:-
ఓ కిరాతుఁడా! కామ మోహోపజీవి,
క్రౌంచ దంపతులం దొక క్రౌంచము నిటు
చంపి, కొఱగాని యపకీర్తి నింపుకొంటి
వేల? నెందులకయ్య నీ పాడు జన్మ?
భావము:-
ఓ కిరాతుఁడా! క్రౌంచ దంపతులలో కామ మోహితమగు ఒక దానిని చంపి, నీవు శాశ్వితమగు అప కీర్తిని పొందితివి. 
ఆ నాటి ఆ విషాదకర సంఘటనయే అంతటి మహత్తర ఆదికావ్య రామాయణావిర్భావానికి తద్వారా ఈ సాహిత్య సోపానానికీ మూలమయింది.మహాత్ములైనవారు విషాదము పొందినను, సంతోషము పొందినను లోక కల్యాణకర ప్రవృత్తినే కలిగి ఉంటారు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అవును జగతి ఉన్నంత కాలం నిలిచి ఉండే మహత్తర మైన కావ్యం రామాయణం . అందుకు మూల మైన శ్లోకాని గుర్తు చేసి నందులకు ధన్య వాదములు. ఆశీర్వ దించి .అక్క

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.