గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, జూన్ 2012, శుక్రవారం

శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా నివాళి.

జైశ్రీరామ్.
శ్రీ పూడిపెద్ది వేంకట రమణయ్య అప్పలకొండ దంపతులకు తే.02-01-1910 ని పుఫ్త్తిన మహా కవి శ్రీనివాసరాచు శ్రీరంగం సూర్య నారాయణ దత్తుడైనపిదప శ్రీరంగం శ్రీనివాసరావుగా ప్రసిద్ది పొందారు. మహాప్రస్థానం సంకలన ముద్రణానంతరం రచనలలో భావాలలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబడింది.
అంతటి మహాకవి శ్రీశ్రీ యొక్క షష్టి పూర్తి విశాఖపట్టణంలో తాపీ ధర్మారావుగారి అధ్యక్షతన మున్సిపల్ ష్టేడియం లో జరిగింది.చాలా అధ్బుతంగా జరిగిన ఆ షష్టి పూర్తి మహోత్సవంలో నేనూ పాల్గోవడం జరిగింది. ఆ నాటి ఆ అపురూప సంఘటనకు సంబంధించిన చిత్తరువులను మీరు తిలకించడం కోసం ఈ క్రింద పొందుపరుస్తున్నాను.  చూడండి.

కుర్చీలలో కూర్చున్న వారిలో అడ్డు చారల మఫ్లర్ తో ఉన్నది శ్రీశ్రీ కాగా
అతనికి కుడివైపు ఐదు స్థానాలలో ఉన్నది అధ్యక్షత వహించిన తాపీ ధర్మారావుగారు
వారి వెనుకనున్నది నేనేనని మరే గ్రహింప కలరు.
సభలో ఉపన్యసిస్తున్న శ్రీశ్రీ.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, "ప్రజారథం" వార పత్రికా సంపాదకులు శ్రీ భాట్టం శ్రీరామమూర్తి గారు శ్రీశ్రీని గూర్చిన "సోవియట్ రష్యాలో మహాకవి శ్రీశ్రీ" అనే శీర్షికతో శ్రీ నినా నికోలయేవా వ్రాసిన ఒక వ్యాసమును తమ పత్రికలో ప్రచురించారు. అవ్యాసాన్ని ఈ క్రింది చిత్తరువులలు పెద్దదిగా చేసుకొని చదవండి.
 పెద్దక్షరాలకోసం పత్రికపై క్లిక్ చెయ్యండి.
చక్కటి విశ్లేషణను చూచారుకదండీ! 
అంతటి మహా కవి శ్రీశ్రీ తన అంతిమ శ్వాసను సరిగ్గా ఇదే రోజు అనగా 15-06-1983 లో విడిచారు.
అట్టి మహా కవికి నివాళులర్పుస్తున్నాను.
జైహింద్.
Print this post

4 comments:

రవి చెప్పారు...

ఓహ్, చాలా బావుందండి. ఈ రోజుకు సరిగ్గా వారం రోజులకు అంటే 22 వ తారీఖున చిలుకూరి నారాయణరావు గారి వర్ధంతి.

కథా మంజరి చెప్పారు...

చాలా బాగుంది మిత్రమా. అప్పటి ఫొటోలు ఇంకా భద్రంగా ఉంచావు. నీవల్ల ఆనాటి సంగతులు మరోసారి మననం చేసికో గలిగాను. ఆ సభకి మనం అందరం కలిసే వెళ్ళాం కదా. మరి మన మిత్రులు రామ జోగారావూ, నేనూ, రమణఫ మూర్తీ, దువ్వూరి వాడూ ఎవరూ ఈ ఫొటోలో లేరా ఏమిటి ?

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మిత్రమా!జోగారావూ! ఆరోజు ఏం జరిగిందో , ఆ సభలో వారి వెనుక నాతో పాటు మీరు ఎందుకు లేరో తెలియటం లేదు.మీరూ ఆ ప్రజానీకంలో ఉన్నారేమో. గుర్తించలేకపోతున్నామేమో.పొటో సెంట్రల్ వాడు ఆఫొటోలు తీసాడని తెలిసి నేను ఆ ఫొటోకాపూ తీసుకున్న గుర్తు.
మన భోజన సత్రవును గూర్చి నీవు వ్రాసినది చదివేటప్పుడు అది నన్ను ఆ రోజులలోకి తీసుకుపోయి అన్నీ స్మృతి పథంలో కదిలాడెలా చేసింది. చాలా బాగా వ్రాసావు.చాలా ఆనందం కలిగింది.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఒక ప్రముఖ వ్యక్తిని గుర్తు చేసి నందుకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.