గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, జూన్ 2012, ఆదివారం

చెప్పుకోండి చూద్దాం. 40.

జైశ్రీరామ్.
పాఠకులారా? ప్రయత్నించి సమాధానం చెప్పగలరని నా నమ్మకం. నా నమ్మకం ఒమ్ము చేయరు కదూ?
గీ:- 
ఇంటికిని - వింటికిని  ప్రాణమేది చెపుమ?
కంట - మింటను మనమేమి కాంచఁగలము?
పువ్వు నవ్వు  దేనిని గూడి పొలుపుఁ గాంచు?
ఒకటి రెండేసి ప్రశ్నల కుత్తరంబు.
మీ సమాధానం కోసం ఎదురుచూడనా?
జైహింద్.
Print this post

3 comments:

డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...

మొదటిది - నారి
రెండవది - వెలుగు
మూడవది - వికసనం
అంతేనాండి?

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆచార్యా! మీ ఓహ మొదటిది నూటికి నూరు పాళ్ళూ సరిపొయింది. ఇక రెండవదానికి మూడవ దానికీ మీ ఊహను కాదనలేము కాని,
కంటిలోను ఆకాశం లోను కనిపించేవి "తారలు".గాను,
మూడవదానికి "వలపు" అన్నది సరైనదిగా భావించుతున్నానండి.
మే ప్రతిస్పందనకు ధన్యవాదములు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

బాగుంది . అందరూ చెప్పేసారు . జవాబు తెలిసి పోయిందిగా ! అభినందన మందారాలు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.