గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, జులై 2011, ఆదివారం

అత్యద్భుత జ్యోతిశ్శాస్త్ర వేత్త శ్రీమాన్ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి కవి చెప్పిన జ్యోస్యం అక్షరాలా నిజమైంది.

విశాఖపట్టణం జిల్లా జుత్తాడ గ్రామ వాస్తవ్యులు, ప్రముఖ జ్యోతిశ్శాస్త్రజ్ఞులు, నిత్య శివారాధనా తత్పరులు, చిత్రకవితాభినివేశులు, ప్రముఖ సాయి తత్వజ్ఞులు ఐన బ్రహ్మశ్రీ వల్లభ వఝల నారసింహ మూర్తి గారు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు మియాపూరులో మేము నివాసముంటున్న మాయింటికి వస్తున్నారు.
వీరు వ్రాసి యిచ్చిన తేదీ ప్రకారము మా అబ్బాయి చిరంజీవి సి.వి.యస్.రామశర్మ వివాహము జరిగినది. వీరి గణితము తప్పలేదు. సరికదా తప్పిద్దామని నేననుకున్నా వారు చెప్పిన జ్యోస్యమే ఋజువైంది.
వారు వ్రాసినది మీరూ చూడండి.

చూచారు కదా! 2009 - 9 - 28 అని టిక్ చేసారు చూచారా సరిగ్గా ఆతేదీనే ఉదయం వివాహం జరిగింది. వారి గణితము, వాక్శుద్ధి నిరుపమానము.
వారి రచనా వ్యాసంగము కూడా అచ్చెరువు గొలుపు చుండును.
ఆంధ్రామృతమున ఏ చిత్ర కవితకు వెలుగు చూపినా వారు దానిని తానిదివరకే వ్రాసాననే విధంగా పద్యం వ్రాసి మన ఆంధ్రామృతం ద్వారా పాఠకులకందించిన విషయం మనకు స్పష్టమే.
అట్టి వీరి రాక మాకు చాలా ఆనందం కలిగిస్తోంది.
వారు మాయింటికి  ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు వస్తారు.
సత్సాంగత్యాన్ని అభిలషిస్తూ, వారి దర్శనం చేసుకో దలచిన వారుంటే హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.
నేరుగా వారితో సెల్ ద్వారా మాటాడ దలచుకొన్నవారి కొరకు వారి సెల్ నెంబరు.9491881480.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

2 comments:

సురేష్ బాబు చెప్పారు...

బాగుందండి కానీ సవాలక్ష సమస్యలతో బాధపడే జనాలు వారి సెల్ కు కనుక నిరంతరాయముగా ఫోన్ చెస్తే వారి పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి...

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

పార్వతీ పరమేశ్వర సంసేవనా భాగ్యులైన శ్రీమాన్ వఝలవారు ఆపదోద్ధారకులు సురేష్. సద్యోగం ఉంటే మాత్రమే వారు సెల్ ద్వారా లభిస్తారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.