గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, జులై 2011, బుధవారం

హనుమచ్ఛక్తి, హనుమద్భక్తి.

శ్లో:-
బుద్ధిర్బలం యశో ధైర్యం, నిర్భయత్వ మరోగతా
అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్భవేత్.
ఆ.వె:-
బుద్ధి, బలము, కీర్తి, పూజ్యమౌ ధైర్యము,
నిర్భయత, యరోగ నిగ్రహములు,
కన యజాఢ్యతయును, కమనీయ వాగ్ధాటిఁ
గొలుపు హనుమ తలపు, గురు తరముగ.
శ్లో:-
ఆయుః ప్రజ్ఞా యశో లక్ష్మీః శ్రద్ధాః పుత్రా సుశీలతా
ఆరోగ్యం దేహి సౌఖ్యంచ  కపి నాథ నమోస్తు తే.
తే.గీ:-
ఆయువును, ప్రజ్ఞ, కీర్తియు, నమర చేసి,
శ్రద్ధ, పుత్ర సుశీలత లొద్దిక నిడి,
సౌఖ్య మారోగ్యమమరంగ చక్కఁ గనుమ!
ప్రార్థనలుసేతు శ్రీరామ భక్త హనుమ!
ప్రమాదాలను నివారించే శ్రీ హనుమాన్ యంత్రం.
‘’ఓం ఓం హ్రీం హ్రీం శ్రీ వాయు పుత్రాయ నమః’’ అని రోజుకు కనీసము నూట ఎనిమిది పర్యాయములు భక్తితో జపము చేసి  శ్రీఆంజనేయ స్వామివారి కృపను పొందుదుము గాక.
రామ స్కంధం, హనూమంతం, వైనతేయం, వృకోదరం,
శయనేతు స్త్మృతే నిత్యం దుస్వప్నం తస్య నాశనం.
రాత్రులు శయనించే సమయమునఈ పై శ్లోకమును పఠించి, ఆ హనుమంతుని భక్తితో ప్రార్థించి పరుండినచీ దుస్వప్నములు రావు.
జైశ్రీరాం.
జైహింద్.

Print this post

1 comments:

durgeswara చెప్పారు...

jaisriraam

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.