గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, జనవరి 2022, శుక్రవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). రచన. చింతా రామకృష్ణారావు.

2 comments

  .               జైశ్రీరామ్

పరమాత్మస్వరూపులయిన మహనీయులారా! వందనములు.

తే.09 .. 9 . 2018ని గుంటూరునుండి సామర్లకోట వెళ్ళే సమయంలో 36 పద్యములు వ్రాసి  మరునాడు తే 10 . 9 . 2018ని తిరుగు ప్రయాణంలో సామర్లకోటనుండి సికింద్రాబాదు చేరే సరికి 92 వ పద్యం వరకు, ఆరాత్రి ఇంటికి చేరి108 వపద్యం వరకు ఆ జగన్మాత నాచేత వ్రాయించిన శతకమిది.

తెలుఁగులో ఉండే ప్రాస నియమమును పాటించుచు, యతివిషయమున మాత్రము అప్పకవి చెప్పిన విధముగా కాక కాళిదాసు సంస్కృతమున పాటించిన ప్రాసయతిని ప్రతీపాదమునా మూడుచోటులందుపాటిస్తూ ఈశతకము వ్రాయఁబడినది.


అష్టోత్తరశత సతీ అశ్వధాటి

(సతీ శతకము).

రచన. చింతా రామకృష్ణారావు.

ఓంశ్రీమాత్రే నమః.


1. .శ్రీ శాంభవీ! సుగుణులాశింత్రు నీ కృపకు నీ క్తినెన్నుచు సదా.

ధీశాలియౌ శివునికాశావహంబువయి నీ శక్తినే గొలిపితే.

నీ శక్తినే బొగఁడ నాశక్తి చాలదుగ ధీశక్తినిమ్ము కృపతో

నాశాంతముల్ వెలుగు ధీశాని నీ ప్రతిభ లేశమ్ము గాంచుదు సతీ!


2. వందారు భక్తజన మందారమా నిలుమ డెందంబునన్ కరుణతో

సౌందర్య రాశివయి డెందంబునన్ నిలువ నెందైన నిన్నె కననా.

కందున్ నినున్ సతము కందున్ త్వదీయ కృప కందున్ శుభంబులనిలన్.

వందే జగజ్జనని ముందుండి నా  కనుల విందై కనంబడు సతీ!


3. నీ రూపమే కనిన నేరూపమున్ గనఁగఁ గోరంగ లేము ధరణిన్,

ధారాళ సత్ కవిత పారున్ నినుం గనిన శ్రీరమ్య తేజ నిలయా.

పారాడు దుర్గతుల నేరీతిఁ బాపుదువొ చేరంగ నిన్ శుభ మతిన్,

వారాహి నిన్ దలచు వారే మహాత్ములిల వారిన్ నుతింతును సతీ!


4. శక్తి ప్రదాతవని ముక్తిప్రదాతవని భక్తిన్ నినున్ గొలిచెదన్

భక్తాగ్రగణ్యులు విముక్తిన్ గనన్ మిగుల రక్తిన్ నినున్ గొలుతురే.

రక్తాక్షివై దురిత శక్తిప్రపూర్ణులను రక్తంబు చిందఁ గనుమా.

యుక్తంబులిచ్చుచునయుక్తంబులన్ దరిము యుక్తిప్రదా వర సతీ!


5. అశ్రాంతమున్ జనుల సుశ్రేయమున్ గని గుణశ్రీదవై నిలుతువే.

సుశ్రీ పదోజ్వలిత సుశ్రావ్యకావ్యపు శుభశ్రీగ నీవు నిలుమా.

అశ్రద్ధనే విడిచి విశ్రాంతినే మరచి సుశ్రీద నిన్ గొలువనా.

సుశ్రోతలన్, కవుల సుశ్రేయమున్ గనుదవిశ్రాంతమీవిల సతీ!


6. రక్షించుమా జనని, రక్షించుమీ జన నిరీక్షన్ మదిన్ దలచుమా.

రక్షింతువీవని నిరీక్షించు సజ్జనులు మోక్షప్రదా కనుమికన్.

సాక్షాత్కరింపకిటు శిక్షింపగా తగున దాక్షాయినీ కను మమున్,

లాక్షారుణప్రభల శిక్షించు దుష్టులను రక్షించు మమ్మిక సతీ!


7. నీ దివ్య నామమును నీ దివ్య రూపమును నీ దివ్య శక్తిని మదిన్

శోధించి నే కనుదు వేదింపకింక నను బోధన్ మదిన్ గొలుపుమా.

మేధన్ ప్రపూర్ణవయి మోదంబుతో నిలిచి యీ దాసునిన్ గరుణతో

బాధా విదూరునిగ బోధా ప్రపూర్ణునిగ సాధించి చూపుము సతీ!


8. అజ్ఞాన దుశ్చరిత నజ్ఞాన భావనలనజ్ఞాన కృత్యములికన్

విజ్ఞాన తేజమున విజ్ఞేయ! నే విడిచి సుజ్ఞానినై వెలుగుచున్.

సుజ్ఞేయునై వెలుఁగ విజ్ఞుల్ ననున్ దలచ ప్రాజ్ఞుండనై నిలువనీ

సుజ్ఞాన తేజము మహాజ్ఞానమీయుమిక విజ్ఞుండుగా కను సతీ!


9. పల్కంగ నేరవొకొ? యల్కన్ మదిన్ నిలిపి, కల్కీ! హృదబ్జ నిలయా!

పల్కంగనే వరము లొల్కంగ తప్పదని మేల్కొంచు పల్క వెరపా?

కల్కి ప్రభావమిల మేల్కాంచె చూడుమిక మేల్కొల్పు శిష్ట జనులన్

పల్కించు పద్యములు చిల్కించు సన్నుతులు పల్కించుమెల్లెడ సతీ!


10. విశ్రాంతి బోధకుఁడ, విశ్రాంతి కోరని యవిశ్రాంత సేవకుఁడ నీ

కశ్రాంతమున్ గృతులు  సుశ్రేయమున్ గొలుపఁగా శ్రద్ధతో నొనరుతున్.

ధీశ్రీ భవత్ కరుణ సుశ్రోతలందునను సుశ్రావ్య గాన గరిమన్

సుశ్రీలిడన్ నిలిపి విశ్రాంతిగా కొలిపి శుశ్రూష నందుము సతీ!


11. వేదాంత సారమ, ప్రమోదంబుతోఁ గనుమ. పేద ప్రజన్ నిరతమున్.

కాదన్నచో ప్రజలకేదున్నదింకఁ దరి? సాదంబుకే కరువగున్.

నీ దివ్య సత్ కరుణనే దారిగాఁ దలచి మోదంబుతోఁ గొలుతురే

బాధావహంబు కద మోదంబుతోఁ గనమి నేదారిఁ గానరు సతీ!


12. దేవీ నినున్ మదిని భావించినంతటనె నీ వర్ణ్య భవ్య కళలే

భావంబునన్ నిలిచి సేవింప నే గొనుచు ప్రోవంగ నుండు సతమున్.

జీవాళిలో నిలిచి నీవే మమున్ గనుచు సేవించు భాగ్య మిడుచున్

వేవేల చందముల నీవే కనంబడుచు నీవారలన్ గను సతీ!


13. దోసంబులెన్నకుమ భాసించి సత్ కనుమ,ధ్యాసన్ ననున్ నిలుపుమా.

నా సేవలం గొనుమ నా సత్కృతిన్ గనుమ భాసింపఁ జేయుమ కృతిన్.

మోసంబులన్ బడక నీ సేవలన్ మనఁగ నాసింతు నేను జననీ,

ధీసద్గుణంబులిడు నీ సన్నిధిన్ నిలుపు. ధ్యాసన్ నినున్ గన సతీ!


14. ఆశావహుల్ జగతి నాశంబు చేయుదురు నీ శక్తితో నిలుపుమా.

దేశాధినాథులు దురాశాపరుల్ కలరు దేశంబె నాశనమగున్.

కాశీపురంధ్రివి ప్రకాశంబు నిల్పుమిక దేశంబునే కరుణతో

హేశాంభవీ జనని, హే శక్తి రూపిణి మహేశాని, శాంకరి! సతీ!


15. కల్లల్ కనన్ జగతి, నెల్లప్పుడున్ నిజమునుల్లంబు పొంగ కనఁగన్

తల్లీ వరంబిడుమ సల్లాపమందయిన కల్లల్ ప్రవర్తిలకనే

యుల్లాసమున్ గొలిపి సల్లోచనంబులిడి యుల్లంబులన్ మెలఁగనీ

ఫుల్లాబ్జ నేత్రవుగ ముల్లోకముల్ నడుపు తల్లీ కృపం గను సతీ!


16. అబ్జాత పత్ర ముఖి కుబ్జత్వమున్ మదికి నబ్జోద్భవుండొసఁగెనే.

కుబ్జత్వమున్ దరిమి యబ్జోద్భవున్ గెలిచి యబ్జాసనా కనఁగదే.

అబ్జాక్షివీవిక కరాబ్జంబులన్ సతత మబ్జోద్భవోత్కులజు నన్

కుబ్జత్వమున్ దరిమి యబ్జాత్మలో నిలువు మబ్జేశుఁడెన్నగ సతీ!


17. అమ్మా భవత్ పదములిమ్మానసాబ్జమున నెమ్మిన్ గృపన్ నిలువనీ.

పొమ్మన్న నేమిగతి? చిమ్మున్ కనుల్ జలము లమ్మా కృపన్ గనుమికన్.

సమ్మోదమున్ దెలిపి రమ్మంచు నీ సుతుని సమ్మానమున్ నిలుపుమా.

యిమ్మేను భారమది ముమ్మాటికిన్ తమది సొమ్మేలనాకిక సతీ!


18. నీలాల నింగినిటులేలీలఁ జేసితివి? చాలన్ మదిన్ దలఁపగా,

నీ లాలితంబు గని శూలిన్ మదిన్ గనిన పోలంగలాడె? యనరా?

ఏలీల పత్నివయి నీలో సగంబొసఁగి పాలించుచుంటివి శివున్?

నీలాల నింగినట నీ లీల కానఁబడు లాలిత్యమున్ గన సతీ!


19. శ్రీ కాళిదాసుమది నీ కాంతులుల్లసిల నేకాంతమున్ నిను గనెన్

శ్రీకారమే కృతుల కాకారమున్ గొలుప శ్రీ కావ్యముల్ వెలిసెగా.

శ్రీకారమీవెయని యా కాళిదాసెఱిఁగి చేకొంచు నిన్ నిలిపెనే

ఓ కాళికా! హృదయమేకాగ్రతన్ నిలుప నాకిమ్ము బాసను సతీ!


20. ఓంకార తేజమునహంకారమే తొలఁగు నింకేల నాకొసఁగుమా.

ఓంకార రూపిణివి ఓంకార భాసినివి ఓంకార భాషిణివిగా.

ఓంకారమున్ గనుదు నోంకారమైన నిను నోంకార వర్తివగుటన్

ఓంకారమే తమకు సంకేతమమ్మ గన నోంకార పూర్ణవు సతీ.


21. దైవాంశ లేక నిను భావింపనెట్టులగు దేవీ మదాత్మ నిలయా!

జీవాత్మవీవగుచు జీవిం చువారిఁగని భావింతు నిన్ సుజనులన్

సేవా పరత్వమున నీవే ప్రభాసిలఁగ నీవైన వారిని గనన్

శ్రీవాణి సత్ కృపను భావించి పద్యములు నీవే రచింతువు సతీ!.


22. బాలార్క తేజమున పాలింప భక్తులను స్త్రీలన్ గనంబడుదువే,

నీలీలలం గనఁగ చాలంగలారెవరు నీలాలకా భగవతీ!

నాలోని మాయనిక నీ లీలచేఁ దునిమి పాలించునన్నిలఁ గృపన్.

భూలోక వాసులకు లోలోన మాయనిడి నీ లీలఁ జూపితి సతీ!!


23. కాలంబు నీవనుచు నీ లీలలం గనుచు లోలోన పొంగుదునుగా.

నీలాల మేఘముల నీ లీలలే కనుదు నాలోన గాంచెద నినున్.

నీలాల మేఘమది నాలోని మాయ కనఁ బాలింతు వీవటులనే

శ్రీలాలితా సుగుణ జాలంబు నీవె కద, యీ లీలఁ గాంచెద సతీ!


24. ఆహారమీవె కన నాహార్యమీవె, కల మోహంబు నీవె, చెపుమా.

మోహంబు నీవయిన మోహార్తినే దురిమి స్నేహంబుతో మెలఁగనీ.

దేహంబు నీవగుచు స్నేహంబు నీవగుచు మాహాత్మ్య మీదె యగుచున్,

రాహిత్యముం గొలిపి దేహంబులో నిలిచి సాహాయమున్ నిలు సతీ!


25. పూలన్ గనన్ తమరె నేలన్ గనన్ తమరె మ్రోలన్ గనన్ తమరెగా.

చాలింపుమింక మొరలాలింపుమింక పరిపాలింపుమా కరుణతో.

గాలింప లేను నిను జాలిన్ ననున్ గనుచు మేలున్ దయన్ గొలుపుమా.

బాలా సదా కలిత హేలా మహత్ సుజన పాలాపరాజిత సతీ!


26. పూర్ణంబు నీవె కల వర్ణంబులీవె శశి పూర్ణాకృతిన్ గలవుగా.

కర్ణామృతంబయిన పర్ణంబులీవెకద పూర్ణేందుబింబ వదనా.

స్వర్ణంబులీవెకద పర్ణంబులీవెకద ఘూర్ణించు మేఘమగుదే.

చూర్ణంబు చేయుమిక దుర్నీతులన్ కని యపర్ణా! కృపం గను సతీ!


27. నీ దివ్య తేజమును సాధుస్వభావమును బోధన్ గనన్ గొలుపుమా,

శోధించి చూచినను నీ దీప్తి యన్యులను లేదన్నదే నిజముగా.

మాధుర్య భావన ప్రమోదంపు జీవనము నీ దీవనన్ గలుఁగుగా,

హే దీన బాంధవి ప్రమాదంబులన్ దుడిచి యీ దీను గావుము  సతీ.


28. చిత్తంబులో గల మహత్తైన శక్తిని ప్రవృత్తిన్ సదా మెలుగుమా.

మత్తున్ భువిన్ విడిచి చిత్తంబు నీ పయి మహోత్తుంగ భక్తియుతమై

సత్తెంబుగా నిలుపుమెత్తీరునైనను లసత్తేజమున్ గొలుపుమా.

హత్తన్ మదిన్ సుగుణులెత్తీరునుండిరది చిత్తేజమై కల సతీ.


29. భారంబు నీది శుభ తీరంబు చేర్చగను లేరన్యులీ వసుమతిన్.

కోరంగనేల నిను చేరంగనున్నపుడు తీరంబు చేర్చు జననీ.

శ్రీరమ్య తేజసవు శ్రీరామ రక్షవయి వారింపుమా దురితముల్.

కోరన్ నినున్ ధనము కారుణ్యమున్ గనెడి ధీరాత్మవీవెగ సతీ!


30. సంతానమున్ గొలిపి సంతాపమున్ గొలుప చింతేకదా ఫలితమౌన్.

సంతాపమున్ విడిచి సంతానమిచ్చిన సుఖాంతంబెగా జననమే.

సంతాన హీనులకు సంతానమున్ గొలిపి శాంతంబుగా బ్రతుకనీ.

సంతాప హీన మదినంతేసువాసివయి సాంతంబు కాంచుము సతీ!


31. నిత్యారుణద్యుతిని సత్యప్రబోధవయి స్తుత్యంబుగా వెలుఁగుదే

నిత్యంబు నిన్ గొలిచి యత్యున్నత స్థితిని స్తుత్యుల్  కనన్ గొలుపుమా.

భృత్యాళి సమ్మదుల నిత్యంబు వెల్గగను స్తుత్యా! పొనర్చు జననీ.

కాత్యాయనీ కనుమ భృత్యున్ ననున్ సతము స్తుత్యంబుగా నిల సతీ!


32. పంకేరుహానన! కుశంకల్ మదిన్ విడిచి కైంకర్యమున్ సలుపనా.

ఓంకార రూపము నుటంకించి తెల్పెదను శ్రీంకార తేజవగు నిన్.

సంకాశమే కనని ఐంకార భాసినివి. యింకేలనీ వ్యవధులో.

హ్రీంకార తేజస యహంకారమున్ తుడిచి కైంకర్యమున్ గొను సతీ!


33. ఏలన్ సృజించితివి నీలాంబరంబచట నేలన్ మమున్ భగవతీ?

ఏలన్ మమున్ మరచి తేలన్ గృపన్ గనక మేలమ్మొ నీకనుపమా!

ఏలేటి తల్లివని నేలన్ జనుల్ గనుదు రేలా మదిన్ కనవో? హే

బాలేందువక్త్ర! పరిపాలింపుమమ్మ మము నీలాలకాక్షర! సతీ!


34. కాయంబశాశ్వితము. కాయంబు లేని తరి మాయన్ విడన్ సులభమౌన్.

నీయందె నమ్మకము కాయంగనుంటివని కాయంగ రమ్ము పతితోన్.

నీయానతే సతము నాయందు శక్తినిడు న్యాయంబునే నడుపగా.

మాయా జగంబున యమేయప్రభన్ నిలుతు నీ యానతిన్ గని సతీ!


35. శ్రీమన్మహాభవుని ప్రేమార్ణవంబు గొని శ్రీమాతవై వెలుగు నీ

ధీమంతుఁడౌ సుముఖు నే మానసంబునను ప్రేమన్ సదా కొలిచెదన్.

నీమంబుతో శతక ధామంబునే గొలిపి ప్రేమన్ నినున్ నిలిపెదన్.

నీ మానసంబు గని ప్రేమన్ రచించెదను శ్రీమాత నీ కృప సతీ!


36. భద్రేభ గామిని సుభద్రాక్షయాక్షర! సముద్రమ్మునన్ మధువువై,

నిద్రించు నా మదిని భద్రంబుగా వెలిగిముద్రించుదీవు మహతిన్.

క్షుద్రాళినే యణచి సద్రక్షణన్ గొలుపనుద్రేకమొప్పు కవితన్

మద్రమ్య సద్రచన సద్రక్షణీ! కొలుపు భద్రమ్ము కాగను సతీ!


37. భూజంబులే సుఫల రాజంబులన్ సుగుణ బీజంబులన్కనుఁగొనన్

రాజిల్లు చున్న వర భూజంబులన్ నరుకునీ జాతినే యణచుమా.

ఏ జాతికైన భువి భూజంబులే బ్రతుకు రాజిల్లఁ జేయు సిరులై.

సాజంబుగాపెఱుఁగు భూజంబులన్ నిలుపు.రాజీవ నేత్రవు  సతీ!


38. ఓ పార్వతీ! సుగుణమే పంచుచున్జనుల తాపంబు మాన్పునటులన్

దీపించు సత్ కృతికి సోపానమై నిలుము పాపంబులార్పు జననీ!

నీ పాపలౌ జనుల పాపంబులన్ గనక కాపాడుమమ్మ జననీ!

శ్రీపాదముల్ కొలిచి నే పావనుండగుదునో పాప హారిణి సతీ!


39. క్షేత్రంబు నీవె కన క్షేత్రజ్ఞవీవె కన క్షేత్రార్థ మీవె కనఁగా.

గోత్రంబులేల నిల పాత్రంబు లేల శుభ ధాత్రిన్ నినున్ గలిగినన్.

సూత్రంబు నీవె కన గోత్రంబు నీవె గుణ పాత్రంబు నీవె కనఁగా.

గోత్రార్థమీవెగ. పవిత్రార్థమీవెగ. మహత్త్రాతవీవెగ సతీ!


40. జ్ఞానామృతంబు గొన మానావమానములవీనాకెటుల్ తెలియునే?

దీనావనా కనుచునీనా మనస్థితిని జ్ఞానాగ్ని దగ్ధ ఫలునై

నీ నామ కీర్తనను నేనెప్పుడున్ తనియ జ్ఞానంబు నాకునిడుమా.

ప్రాణంబుగా నిలిచి మానంబునే కొలుపు నే నిన్ దలంతును సతీ!


41 శక్తిప్రదా! మహిత ముక్తిప్రదా! విమల భక్తిప్రదాయివి కదా.

భుక్తి ప్రదాయివరి రక్తిప్రదాయివయి యుక్తంబునేలనిడవో?

రక్తాక్షివై మహి విరక్తాళినే కనవు.రక్తిన్ విడన్ సుగుణభా!

రక్తిన్ ధరన్ తుడిచి భక్తిన్ సదా యిడుమ ముక్తిం గనంగను సతీ!


42. మంత్రంబు లీవె కద, యంత్రంబు లీవెగ కుతంత్రంబు లీవగుదువా?

మంత్రార్థమున్ దెలిసి మంత్రోదకంబిడుచు మంత్ర స్వరూపులిలపై

మంత్రంబు వేసెడి కుతంత్రజ్ఞులన్ కనవొ మంత్రార్థమీవె యగుచున్,

తంత్రంబులేలనిల మంత్రంబు లేల నిను మంత్రంబులన్ గన సతీ!


43. కన్నార నిన్నుఁ గన నెన్నం, గనం జనమినెన్నంగ నా కనులిలన్

మృన్నిర్మితంబులవి మన్నించుచున్ గనుమ.నిన్నున్ గనం గొలుపుమా.

పున్నెంబుచేఁ గనెడు కన్నున్ గనంగనుదు మున్నున్న నిన్ను జననీ.  

నన్నేలుమా జనని కన్నార జూతు నినునన్నేలు దీప్తివి సతీ!


44. సాహిత్యమున్ మిగుల సౌహార్ద్రతన్ వెలుఁగు దేహంబునన్ నిను గనన్

స్నేహోన్నతిన్ గలుఁగు సౌహార్ద్ర చిత్తుల కిదే హారతిన్ కొలిచెదన్.

నీ హస్తమే యిచట నా హస్తమున్ గొనుచు స్నేహోన్నతిన్ కవితతో

నాహా యనన్ దెలియు మోహార్తి బాపుకద సౌహార్ద్రతన్ గను సతీ!


45. ఉత్సాహమీవెకద ప్రోత్సాహమిచ్చుచు శుభోత్సేకమిచ్చెదవు నీ

వాత్సల్యమెన్నఁగ మహోత్సాహమే కలుఁగు సత్ సిద్ధి ప్రాప్తమగుగా.

మత్సేవ్య తేజమ సరిత్సాగరంబువయి ద్యుత్సామ్యమున్ గొలుపుమా.

కుత్సిత్వమున్ గనని ప్రోత్సాహులన్ గనఁగ నుత్సాహమిమ్మిక సతీ!


46. ధీశక్తివీవగుచు ప్రాశస్త్యమున్ గొలిపితే శాంతి గొల్పనిక నీ

వే శాశ్వితంబగుచు, నా శాంతివీవఁగ, నాశించి నిన్ గొలువనీ.

ఆశా పరాఙ్ముఖుగ, నీ శక్తితో మలచి, శాశించుమమ్మ గనుచున్.

హే శాస్త్ర భాసిని! మహేశాని! నిన్ గొలుతు, ధీశక్తి నిచ్చెడి సతీ!  


47. కాత్యాయనీ జనని సత్యస్వరూపిణివి నిత్యంబు నిన్నుఁ గొలుతున్.

సత్య స్వరూపముగ నిత్యంబు నేఁ గనెద నత్యంత ప్రీతిని శివా!

ముత్యాల జల్లులటు సత్యస్వరూప పద మత్యంత ప్రేమనిడుమా.

గత్యంతరంబగుచు స్తుత్యంబుగా నిలుమ సత్యా! హృదిన్ శుభ  సతీ!


48. ఇల్లాలివై హరునిఁ జల్లంగ గాచు పరమోల్లాసినీ! భగవతీ!

ముల్లోకముల్ గనుము చల్లంగ, సజ్జనుల యుల్లంబులన్ వెలుగుమా.

కల్లల్ మదిం గనని యుల్లాసులన్ గనుమ యల్లారు ముద్దుగ భువిన్.

తల్లీ నినున్ దలతు నుల్లంబులో నిలుమ చల్లంగ నీవిక సతీ!


49. నిందా ప్రశంసలకు సందీయనీయక మరందంబు పోలు మదితో

సౌందర్య సద్గణిత మందార ధామముగ నందింతు నీకు కవితల్.

సుందోపసుందులనుడెందంబు వీడునటు ముందెంచి బాపెదవుగా.

యందాల శారదగ. ముందుండి శాంతినిడు సౌందర్య భాసిత సతీ!


50. ఏనాటి పుణ్య ఫలమీనాడు కల్గుటిది శ్రీనిర్మలాత్మవు నినున్

జ్ఞానాక్షితోఁ గనుటదే నాకు భోగమగుసాన్నిధ్యమున్ నిలిచితే.

ప్రాణంబు నీవయి ప్రమాణంబుగా నిలిపి రాణింపఁ జేయుమిలలో

హే నా జగజ్జనని నేనున్ నినుం దలతు కానంగనందగు సతీ!


51. కర్ణామృతంబయిన స్వర్ణాక్షరాళినిడి వర్ణింతు నీదు ఘనతన్,

పూర్ణ స్వరూపిణివి పూర్ణేందు భాసవి యపర్ణా! కృపం గనుమికన్..

దుర్నీతులన్ దునుము పర్ణంబులట్లురల స్వర్ణాక్షరీ కొలుతు నిన్,

కర్ణంబులుల్లసిల వర్ణింపనిమ్ము నిను కర్ణామృతంబుగ సతీ!


52. జాలిన్ సుధీమణి కపాలిన్ వరించితివి నీ లీలలెన్నఁ దరమా.

ఏ లీల నీవతని పాలిం మెలంగెదవొ లోలాక్షిరో! తెలుపుమా.

చేలాంచలంబతని నీలీల నిల్పినద? నీలాలకల్ మహిమమా?

పాలింతువెల్లరిని జాలిం కనంబరిచి హేలన్. సుశోభిల సతీ!


53. పాలింపుమా సుకృతినాలింపుమా మొదల నీలీలలన్ని తెలియన్,

గాలించి చూడ నిను పోలంగనెవ్వరిల లోలాక్షిరో మహిమలో.

నీ లీలలన్ బొగడి మాలోన నిన్ నిలిపి లోలోన పొంగుట తగున్.

హేలన్ ననున్ గనుచు నేలన్ మనన్ గనుమ శ్రీలంద జేయుము సతీ!.


54. నీలాలకా! సుగుణ పాలా! త్రిలోక పరిపాలా త్రిశూలధర! ని

న్నేలీల నే గనుదు నేలీల నిన్ గొలుతు నీ లీల లెన్నుచు మదిన్.

కాలాత్మవీవెకద కేళిన్ రచింతువిల నీలీలలివ్వె కనగా

జాలన్ ననున్ మహిమనేలన్ గదమ్మ కను హేలన్ శుభాకర సతీ!


55. రాత్రించరుల్ దురిత పాత్రుల్ దురాత్ములయి, ధాత్రిన్ వినాశనము కాన్

చిత్రంబుగా కనిన మాత్రంబునన్ గొలుపు మైత్రిన్ ప్రవర్తనము చేన్.

మిత్రుండవీవయను చాత్రంబునన్ గనరె శత్రుత్వమున్ నెరపుచున్

మా త్రాత వీవగుచు ధాత్రిన్ మమున్ గనుమ శత్రుఘ్నపావన సతీ!


56. దారుల్ గనంబరిచి నేరంబులన్ గొలిపి నేరంబులన్ బొనరచన్

కారుణ్యమున్ విడిచి, పారింతు వేలమము నీరీతి చేయఁ దగునా?

శ్రీరామ రక్షణగ నేరీతి మమ్ములను నీ రాక నిల్పునొ కదా.

హే రాక్షసాంతక సదా రక్షనీయుమిక, కోరన్ వరంబులు సతీ!


57.  హృద్యాద్భుతంబయిన  పద్యంబులన్ సుజన వేద్యంబుగా నుడువనా?

సాధ్యంబు నీ కృపను వేద్యంబె నీకిదియు, విద్యావతీ కనుదువా.

రధ్యంబులన్ దనుప ఖాద్యంబులన్ దనియ విద్యన్ వరంబడిగెదన్.

సద్యోఫలప్రదవు, సద్యోగమిమ్మికను, విద్యాధరీ భువి సతీ!


58. వేదార్థ భాసిత ప్రమోదంబు గొల్పుమిక వాదేలనమ్మ జననీ

బోధావహంబయిన  సాధారణార్థ గతి నేదారి నేర్పుదువుగా.

నాద ప్రియా! సుగుణ బోధప్రభాస రస వాదప్రియా కనుమికన్.

నీదారిలో నడిపి శ్రీదంబువై నిలుపుమా ధైర్య మబ్బగ సతీ!


59  అగ్రాహ్యముల్ విడిచి సుగ్రాహ్యమంది యనవగ్రంపుమార్గ సుగతిన్

శ్రీ గ్రామ దేవతగ నుగ్రాకృతిన్ విడిచి శ్రీగ్రంథమందెదవుగా.

సుగ్రాహ్యమౌ కవితనగ్రేసరుండనుచు నగ్ర స్థితుల్ పొగడు నన్,

స్వగ్రాహ్యముల్ పొదిగి యీ గ్రంథమిచ్చెద సదగ్రేసరీ గొను సతీ!


60. రాజాధిరాజులకు నేఁ జాలనీయఁగను రాజీవమైన కృతినే.

రాజిల్లు నీకొసఁగ రాజిల్లు భక్తినిడ రాజీవలోచన భువిన్

పూజాఫలమ్మదియె రాజేశ్వరీ కొనుమ రాజిల్లఁ జేయుమ ననున్,

నే జేయుదున్ నతులు నా జీవమీవెయని రాజీవలోచన సతీ!


61  సంపూర్ణ భక్తినిడి, సంపూర్ణ శక్తినిడి సంపూర్ణ ముక్తినిడుమా.

సంపూర్ణ ధ్యాసనిడి, సంపూర్ణ భాషనిడి సంపూర్ణ వాసినిడుమా.

సంపూర్ణతన్ గనుచు సంపూర్ణతన్ వెలుఁగు సంపూర్ణ మూర్తివగుమా,

సంపూర్ణచంద్రముఖి సంపూర్ణ వీవగుమ, సంపూర్ణ తేజస సతీ!


62 సంగీత సాహితులు ముంగొంగు పుత్తడిగ సింగారమౌను తమచే

నింగిం గనంబడు విహంగంబులం గలవు సంగీత రూప జననీ!

సాంగత్యమిచ్చిననుసంగీత సాధనను భంగంబుగా మహితులన్

సంగీతమబ్బును వినం గీర్తి కల్గునుగ సంగీత రూపిణి సతీ!


63 పంకేరుహానననుటంకింతు దేవతల సంకాశమే కననిదం

చింకేమి చెప్పుదును, జంకేల పొందుదును, శంకన్ బ్రవర్తిలుదునా.

ఓంకార తేజమ! యహంకారమున్ దుడిచి శ్రీంకారమున్ నిలుపుమా.

హ్రీంకార బంధుర యహంకారమున్ గొలుపు మైంకార భాసిత సతీ!


64 ఆశావహంబయిన ధీశక్తి నే నడుగ నాశింతు సత్యగతి నే

నాశింప దుష్కలిమి నాశింప దుశ్చరిత, నాశింతు శోభనములే

నాశింపనన్యగతు లాశింప బావుకత నాశింతు నీ కృప సదా.

ఆశావహుండనయి యాశింతు మంగళము కాశీపురాంబకు సతీ!


65 విద్వన్నుతుండనని సద్వర్తనుండనని విద్వజ్జనుల్ సతతమున్

విద్వత్ ప్రభా కలిత విద్వాంసులెన్నుటది విద్వన్మణీ తమ కృపే.

విద్వత్ప్రకాశమది సద్విద్యచేఁ గలుగు. విద్వాంసులందు తమరే

విద్వత్ కనంబరచి విద్వాంసుగా పొగడరే ధ్వాంత నాశిని, సతీ!


66. ముంజేతి కంకణమ! సంజీవివీవెకద, రంజిల్లు భక్తతతికిన్.

భంజించుమా కుగతి, భంజించు దుష్టులను, రంజింపఁ జేయుము మమున్,

కంజాత సంభవుని రంజింపఁ బద్యములు, సంజీవినీ కొలుపుమా.

భంజింప దౌష్ట్యములు మంజీరనాదమటు రంజింపఁ జేయుము  సతీ!


67. రాజేశ్వరీ! వినుత రాజీవ నేత్ర  నిను పూజింపనిమ్ము కృపతో.

పూజింతు నీ పద సరోజమ్ములన్ సతము, రాజిల్లు నాదు మదిలో.

రాజిల్లఁ జేయుము సరోజాననా! భువిని స్త్రీజాతినెన్ని సతమున్

మా జీవమీవనుచు స్త్రీజాతి నమ్మి నిను పూజించు, నమ్ముము  సతీ!


68. కల్లోలముల్ ప్రబలె ముల్లోకముల్ కలియ, తల్లీ కనంగ తగవో.

ముల్లోకవాసి వల కల్లోలముల్  చెరిపి చల్లంగ కావుమికపై.

ఉల్లంబులన్ నిలిచి యెల్లప్పుడున్ శుభసముల్లాసమే గొలుపుమా.

కల్లల్ మదిం గనక యుల్లంబులోన నిను సల్లీలఁ గాంచెద సతీ!.


69. కాదంబ సద్వన ప్రమోద ప్రవాసినివి మా దారి నీవె శుభదా.

రాదేల నీకు కృప మోదంబుతో నిలిపి బాధల్ విడన్ గొలుపఁగా.

సాధింతుమమ్మ  వరబోధన్ వరంబునిడ నీదివ్య తేజఫలమున్

బాధా నివారిణివి సాధింపఁ జేయుమిది మోదంబుతోడను  సతీ!


70. కన్నన్ నినున్ గలుగు మిన్నైన సత్ఫలము కన్నార గాంతుము నినున్.

నిన్నెంచు కన్నులకు మన్నించి కన్బడుమ పున్నెంబునే కొలుపుమా.

మిన్నైన నిన్గనెడి కన్నుల్ కదా కనులవన్యంబులెన్న కనులా?

జన్నంబు లెందులకు కన్నార నిన్ గనిన పున్నెంపురాశివి  సతీ!


71. చాడీలు చెప్పు విరిబోడుల్ మగల్ జగతి నేడేల నిండిరిలపై.

నే డాయఁబోవ నిను నీడై ననున్ తగిలి కీడెంచుచున్ విడువరే

ఓడించి వీరి మదు లే డాయఁగా వలతు నీడై నినున్ గనియెదన్.

పాడిన్ మదిన్ దలచి నాడిన్ సదా కనుచు పాడిన్ పొనర్చుమ  సతీ!.


72. శ్రీభారతీ జనని నే భార వాహినిని శోభిల్లఁ జేయమననా

శోభిల్లఁ జేసిన మహాభాగ్య మైన తమ వైభోగమే కనెదగా.

వైభోగి నిన్నుఁ గన వైభోగమబ్బు కద స్వాభావికంబు విడువన్.

హే భాగ్యదాయి. కనే భారమీదె కద నాభాగ్యమీవెగ  సతీ!


73. హేదేవదేవి పరమోదార సద్గుణమె నాదారి చేయు జననీ.

నీ దివ్య తేజసము నీ ధర్మ పోషణము మేధావులెన్ను సతమున్.

బాధల్ విడంగొలిపి బోధల్ మదిం గొలుపు శ్రీధర్మ తేజసవుగా.

బోధావహంబయిన వేందాంతదీప్తివిగ హేదీనబాంధవి!  సతీ!.


74. దేదీప్యమానమగు నీ దివ్య రూపము ప్రమోదంబుతో కనుటకై

యేదారియున్ గనక నీ దివ్య పాదముల నే దారిగా కలిగితిన్.

మోదంబుతో కనుమ వాదేలనమ్మ కన రాదా ననున్ధరణిపై

ఓ దేవి నీవె నను కాదన్న వేరెవరు నాదారి యౌదురు సతీ!


75. ఓ పార్వతీ. ప్రతిభనే పంచి పద్యములు దీపించ వ్రాయు పటువున్

నాపైద యన్ గొలిపి శ్రీపాదముల్ మదిని స్థాపించి నిల్పితి విలన్.

గాపాడు తల్లివికదా. పాపపంకిలమ దీపించ మంచి నిడుమా.

నా పుణ్య సత్ఫలమ నాపాలి దైవతమ.దీపాకృతిన్గల  సతీ!


76. భూమిన్ జనించు మము నీ మానసంబునను ప్రేమన్ గనన్ దెలియవో

ఏమేమి పాపములు మేమెన్నఁ జేసితిమొ శ్రీమాత తెల్పతగదే.

ప్రేమామృతాత్మవని మేమున్ నినున్ దలచి నీమంబుతో కొలుతుమే.

మా మానసం బెఱిఁగి ప్రేమన్ మమున్ గనుమ భూమిన్ శుభాస్పద  సతీ!


77. విజ్ఞానమీవె కద. విజ్ఞాన తేజము మనోజ్ఞంబుగా నొసగుమీ

యజ్ఞానమన్ నిశిని విజ్ఞాన తేజమున  ప్రాజ్ఞుల్ కనన్ విడిచెదన్.

సుజ్ఞేయమౌ నినునవజ్ఞన్ కనన్ జనక విజ్ఞానదూరునయితిన్

విజ్ఞానమిచ్చి కను సుజ్ఞాని వీవె కద . రాజ్ఞీ గుణోన్నత  సతీ!.


78. సారస్వతంబు కన నోరాజ్ఞి నీవె కద. నీరాక మాకు వరమే.

నీ రాకకై వలతు నే రాత్రియున్ బవలు. చేరన్ననున్ తలచవా.

చేరన్ నినున్ మనసు మారున్ సుబోధఁ గని శ్రీరామరక్షయగునే.

హే రాక్షసాంతక! సుధారాశి రమ్మికను ధీరాత్మ నీయఁగ  సతీ!


79. శ్రీమార్గమున్ గొలుప క్షేమంబుఁ గొల్పగను నీ మానసంబు నిలదో.

నా మార్గమీవయియు నామీద లేదొ కృప శ్రీమాతరో తెలుపుమా.

హేమాత నీవె తగు ప్రేమామృతంబిడిన క్షేమంబె నాకుఁ గలుగున్.

స్త్రీమూర్తులందొదిగి ప్రేమన్ గనంబరచు మామాత వీవెగ  సతీ!


80. ధర్మానువర్తులిల మర్మంబెఱుంగరుగ ధర్మార్థమే బ్రతుకుచున్.

దుర్మార్గులట్టియెడ దుర్మార్గమున్ నెరపి ధర్మంబునే గెలుతురే

ధర్మంబె యోడిన యధర్మంబె రాజగును ధర్మంబునే నిలుపు మా.

మర్మజ్ఞులన్ దునుమ ధర్మంబె నిల్చును సుకర్మల్ వెలుంగను  సతీ!


81. హేమాద్రి పుత్రివిగ, మామీద సత్కృపను క్షేమంబుఁగొల్ప వలదా.

మోమాటమే విడిచి ప్రేమన్నదే మరచి యే మంచియున్ గొలుపవో.

ధీమంతులెల్ల నిను సేమంబునిత్తువని ప్రేమన్ మదిన్ గొలుతురే.

ఏమాత్రమైన గుణ ధీమంతులన్ గనుమ ప్రేమన్ భువిన్ గని  సతీ!


82. లీలావినోదముగనేలో సృజించుటిది. నీలీలఁ గాంచ తరమా.

జాలంబదేల మము బాలింపగా శుభములే లక్ష్యమై కొలుపుచున్.

బాలుండనమ్మ. మది పాలించు తల్లివిగ. జాలిం గనం దగదొకో.

లోలాక్షి నీ దయను పాలింపుమీ జగతి నేలీలనైనను  సతీ!


83. రాజిల్లఁజేయ నను నీ జాతకం బెవరు నీ జాలి చాలదొ భువిన్.

సాజంబుగా తమరి రాజీవ నేత్రములె రాజిల్లఁ జేయఁగ తగున్.

ఈ జాతి గౌరవము మా జీవమై నిలువఁగాఁ జేసి పొంగుమెదలో.

నేజీవినైనఁ గని సాజంపు ధర్మమున రాజిల్లఁ జేసెడి  సతీ!


84. కష్టంబులేలనిల నష్టంబులేల పరి పుష్టే ల మేము గనమో.

దృష్టిన్ సదా నిలిపి యిష్టంబుతోడ నిను పుష్టిం గనన్ గొలిచినన్

కష్టంబులే తొలఁగు నష్టంబులుండవిల దృష్టంబిదేను జననీ.

ఇష్టంబుతో మదిని సృష్టించుమీవిధము. కష్టంబు బాపెడి  సతీ!


85. శ్రీచక్ర వాసినివి  శౌచంబుతోడ నినుఁ బ్రోచంగఁ గోరి కొలువన్

నీచత్వమున్ దరిమి శౌచంబునే కొలిపి బ్రోచంగ నుంటివి మమున్.

ప్రాచీన సత్కవులు నీ చిన్మయాకృతిని బ్రోచంగఁ గోరి కనగా

శ్రీ చేతనంబునిడి కాచేవు వారలను మాచింతఁ బాపెడి  సతీ!


86. రాజాధిరాజయిన పూజింపకున్న నిను నాజీవి వ్యర్థుఁడె భువిన్.

రాజీవ లోచన విరాజిల్లఁ జేయుదువుగా జీవు లెన్నుటను నిన్.

సౌజన్యమున్ గలుఁగు రాజన్యులన్ నిలుపుమా జీవనైకవరమై.

నాజీవితాంతమును పూజింపనిమ్ము నిను సౌజన్యరూపిణి  సతీ!


87. కామాంధులీజగతి నేమాత్రమున్ వరుసలేమీ గణింపరు మదిన్.

ప్రేమన్ నటించుచును కామంబు తీర్చుకొని యేమాత్రమున్ దొరకరే.

ఓమాత దుష్టతతినేమాత్రమున్ విడక సేమంబు కొల్లగొనుమా.

రామామణీ. జనుల ప్రేమానురాగముల నీమంబు కొల్పుము  సతీ!


88. హేమాద్రి పుత్రివగు శ్రీమాత నీ చరణ మేమాత్రమైన తలవన్

కామాదులే తొలగి క్షేమామృతంబొదవు భూమిన్ నిజంబిదెకదా.

మామీద చూపు దయ కేమేను చేయఁగలనో మాతరో తమకిలన్.

ప్రేమామృతంబువగు మామాతగా కొలుతు నీమంబుతోడను  సతీ!


89. ముల్లోకముల్ కొలిపి యుల్లాసమొప్పగను తల్లీ దయన్ విడుచుచున్

కల్లోలముల్ కొలిపి యుల్లంబులన్ కుదిపుటెల్లన్ ముదంబొ చెపుమా.

చల్లంగ చూచితివొ సల్లీల నిన్గొలుతుముల్లంబులన్ సతతమున్.

కల్లల్విడన్ గొలిపి చల్లంగ కాచుము సముల్లాసివౌచును  సతీ!


90. ప్రారబ్ధ కర్మ ఫలమేరీతిఁ బాయనగు వారాహి. మాకు చెపుమా.

శ్రీరామ రక్షగ మరేమంత్రమున్నదిల నీరమ్య నామమదియౌన్.

భారంబు నీదె కద పేరాశ బాపఁగను. శ్రీరమ్య తేజస హృదిన్

వారించి దుర్గతి నివారించు తల్లివిగ. శ్రీరమ్య తేజస  సతీ!


91. దీనావనాభిరత మౌనంబదేల మము నీనీడలో నిలుపఁగా. 

జ్ఞానాంజనంబునిక మానేత్రపాళికిని రాణింపఁజేయ పులమన్.

దానాది సద్గుణములే నేర్పి మాకికను ధ్యానించి నిన్ను కొలువన్

నీ నేర్పు చూపుచును మౌనంబుగా గొలిపి రాణింపఁ జేయుము సతీ!


92. రామాభిరామవుగ శ్రీమాతరో సుగుణ నీమంబుతో తలతుమే.

మామానసంబులను క్షేమంబుతో సుగుణమై మేలు కూర్చ నిలుమా.

ఏమాత్రమున్ దురితమే మమ్ముచేరనటు క్షేమంకరీ! కనఁగదే.

నీమానసంబునను మేమున్న చాలును. ప్రమాదంబులొందము  సతీ!


93. సృష్టించి లోకములు సృష్టించి బంధనలు కష్టంబులేలనిడితో.

కష్టంబులే కనని సృష్టిన్ సృజించుటను కష్టంబులే కనముగా.

సృష్టించునీవె కని కష్టంబులే కనని సృష్టిన్ సృజించుమికపై.

సృష్టిన్ శుభాస్పదగ సృష్టింప నీకగును. సృష్టించు మమ్మరొ  సతీ!


94. పాపంబులన్ విడువ కోపంబులన్ తరుమ నీపాదముల్ శరణమౌన్.

నీపాద దర్శనము నీ పాద సంస్పృశము దీపింపఁజేయు మములన్.

హే పార్వతీ జనని శాపంబులన్ తుడిచి నీపైన భక్తికొలుపన్

నేపుణ్యసత్ఫలమునే పొందుదున్ కనుమ యీపాపదూరుని  సతీ!


95. ఆచారబోధిత సమాచారముల్ తెలిసి శ్రీచక్ర పూజ సలుపన్

శ్రీచక్రవాసినివి నీచే శుభావళులె మాచెంత నిల్చును కదా.

ప్రోచే నినున్ గొలిచు స్త్రీ చేతనన్ వెలిఁగి కాచున్ కుటుంబమునిలన్.

స్త్రీ చేతనత్వమది నీచేతనే కలుఁగు శ్రీచిత్ప్రభా కన  సతీ!


96. అమ్మా నినున్ దలవనిమ్మా నిరంతర సుఖమ్మందగా కరుణతో

నిమ్మా యనుజ్ఞ వరమిమ్మా ప్రమోదముగ సమ్మోదముం గొలుపుమా.

నమ్మన్ నినున్ మదిని కొమ్మంచు శోభనములమ్మా యొసంగెదవుగా.

మమ్మున్ సదా కనుచు నెమ్మిన్ భరింతువు ఘనమ్మిద్దె మాకిది  సతీ!


97. దీనావనా. జనని. ప్రాణంబె నీవు కద. మానంబు కాచుదువుగా.

మానావమానములు నేనెట్లు మ్రోయుదును దీనావనా యెఱుఁగవా?

యేనాటికీజగతి నీనవ్య తేజసమునే నిర్వికల్ప కనునో.

రాణింప జేయునుగ నీ నామ సంస్మరణ జ్ఞాన ప్రదా వర  సతీ!


98. శ్రీకల్వపూడి కుల రాకాసుధాకరులు నాకూర్మి రాఘవ గురుల్

నాకైతకున్ బలము నాకున్ బ్రభాకరులు. నాకున్న శక్తి కనగా.

నాకోరికన్ గనుచు నేకంబుగా నిటుల లోకుల్ కనన్ దినములో

నీకల్పనన్ గొలిపినీకీయజేసిరిటు శ్రీకార రూపమ సతీ!


99. చింతా వరాన్వయుఁడ నంతా ననున్ గృపను సంతోషమున్ గనుదురే.

చింతావిదూరునిగ సాంతంబు చేసి నను భ్రాంతిన్ గృపన్ గనఁగదే.

అంతా త్వదీయ కృప. సుంతైన నిన్ దెలిసి శాంతిన్ గనన్ శుభమగున్.

శాంతిన్ మదిన్ నిలిపి సంతోషమున్ గొలుపొకింతైన నాకిల  సతీ!


100. అంగీకరించెద ననంగున్ జయింపమిని సంగీత రూపిణి నినున్

మాంగళ్యదాయినిగ బంగారు రూపిణిగ పొంగార గాంచమనుచున్.

బెంగన్ విడం గనుచు రంగారు నిన్ను గను భృంగార తేజులు భువిన్.

బంగారు తల్లివి ననుం గాంచు మెల్లెడ శుభాంగీ శుభాస్పద సతీ!


101. శక్తి ప్రదా గనుచు రక్తిన్ సదా జనుల యుక్తంబుగా నడుపుమా.

భుక్తి ప్రదా ధిషణ శక్తి ప్రదాయివయి. రక్తిన్ నినున్ గొలవనీ

యుక్తి ప్రదా జనుల శక్తిన్ వెలుంగుమిల, యుక్తంపు యీ శతకమున్ 

రక్తిన్ గృపన్  గొనుమ భక్తిన్ రచించితిని. ముక్తిన్ వరంబిడు సతీ! 


102. అంబా విషాద వలయం బేల చుట్టె నను? సాంబున్ సదా కొలుతునే,

సాంబుండె నాకును వరంబై సదానిలువ దంబంబునన్ నిలుతు. హే

రంబుండనంచు గను మంబా శుభాస్పద. కరంబీవె కావుమిక నా

లంబంబు నీవె కనుమంబా ననున్ మది గుణం బెన్న బోకుము సతీ!


103. దీనాళి నేలెడి సుధీ నామొరన్ వినుమ జ్ఞానంబునే కొలుపుమా.

మౌనంబు వీడి నను ప్రాణంబుగా కనుచు జ్ఞానంబిడన్ నిలుపుమా.

నేనేమి పల్కినను క్షోణిన్ శుభంబవఁగ రాణింపఁజేయుచు ననున్

భూనాథులుం బ్రజలు జ్ఞానప్రదుండనఁగనీనాడు చేయుము సతీ!


104. సత్య స్వరూపిణివి. నిత్యత్వదాయినివి సత్యంబె చూపఁ దగు నౌ

న్నత్యమ్మునే గొనగ నిత్యంబు నీ స్మరణ స్తుత్యంబుగా జరుపనీ.

కాత్యాయినీ! శుభద! స్తుత్యా!మమున్ సతము నత్యంత ప్రీతి గనుమా.

నిత్యోత్సవంబులుగ నత్యంత ప్రీతి నిను నిత్యంబు గొల్తుము సతీ!


105. స్వర్ణాక్షరాళిని యపర్ణావెలుంగుదువు. పూర్ణస్వరూపిణివిగా.

నిర్ణీతకాలమున దూర్నీతులన్ దునుము స్వర్నీతి పాదుకొలుపన్.

పూర్ణేందునిన్ గెలుచు స్వర్ణ స్వరూప! గుణ పూర్ణా నినున్ దలచుచున్.

కర్ణామృతంబన సువర్ణాళి నిన్నిట నపర్ణా! లిఖించితి సతీ!


106. కష్టాష్టకంబునిల సృష్టించి మమ్ములను నష్టంబులన్ నిలిపితే

సృష్టించు శక్తి! కొను సాష్టాంగ వందనము కష్టాళిఁ బాపు జననీ.

దృష్టిన్ సదా నిలిపి యిష్టంబుతో కొలుతు నష్టాళి పో నడుపుమా..

అష్టార్థసిద్ధినిడ సృష్టిన్ గనంబడుమ యిష్టార్థదాయిగ. సతీ!


107. భ్రాంతిన్ సతీ శతకమంతా పఠించు గుణవంతుల్ శుభంకరులుగా

చింతించి నీకృపను సాంతంబు పొందునటు పంతంబుతో నిలుపుమా.

అంతా సతీ మహిత కాంతిన్ మనంబులను కొంతైన జూడఁ గననీ.

శాంతస్వభావమిడి క్రాంతిన్ గనే విధము సాంతంబొసంగుమ సతీ.


108. శ్రీమంగళాంగివి. సదామంగళంబులను క్షేమంబు కూర్చి మములన్

శ్రీమంతమార్గమున శ్రీమంత భావనల ప్రేమన్ వసింపఁ గనుమా.

నీ మంగళాకృతికి శ్రీమంగళంబగుత భూమిన్ శుభాకరముగా

నీమంచితో నిలిపి ధీమంతులన్ గనుమ శ్రీమంగళంబులు  సతీ!


స్వస్తి

 నా అశ్వధాటిలో

త , భ , య , జ , స , ర , న , గ .... గణములుండును    

ప్రాస నియమము కలదు

ప్రాసయతి.2 ... 9 ... 16 అక్షరములకు  

చింతా రామ కృష్ణా రావు.

జైహింద్.

.


కర్మణ్యేవాధికారస్తే.. || 2 . 47 || ..//..యోగస్థః కురు కర్మాణి.. || 2 . 48 || ..//..సాంఖ్య యోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |

మా కర్మఫలహేతుర్భూః మా తే సంగో௨స్త్వకర్మణి || 47

తే.గీ.  కర్మ చేయుటకర్హత కలదు నీకు,

కర్మఫలముపై నర్హత కలుగ దీకు,

కర్మఫలముల హేతువు కావు నీవు,

కర్మచేయుటమానకు ధర్మంఇదియె.

భావము.

వేదాదులచే విదింపబడిన కర్మను చేయుటకే నీకు అర్హత కలదు. కాని 

కర్మఫలముల యందు  ఎట్టి అదికారమును లేదు. నీవే కర్మఫలములకు 

హేతువని  ఎప్పుడునూ బావింపకుము.ధర్మమును 

నిర్వహింపకుండనుండుట  యందు ఎప్పుడునూ ఆసక్తుడవు కాకుము

శ్లో.  యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ |

సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే || 48

తే.గీ.  సఖుఁడ! విజయాపజయములన్  సమముగఁ గను,

మహిత సమభావమున ధర్మ మార్గముననె

నిర్వహింపు నీ ధర్మము,నిర్మలమతి

నిదియె యోగము, కనుమిది ముదముతోడ.

భావము.

ఓ అర్జునా! జయాపజయములందు ఆసక్తి విడిచి నీవు సమ భావముతో 

స్వధర్మమును నిర్వహింపుము. అట్టి సమభావమే యోగమనబడును.

జైహింద్.

27, జనవరి 2022, గురువారం

శ్రీ కందిశంకరయ్య తన శంకరాభరణం బ్లాగులో యిచ్చిన గరిక పాటి సేయునొక్కొ గరికిపాటి సూడఁగన్ అను సమస్యకు నా పూరణము

0 comments

జైశ్రీరామ్.

శ్రీ కందిశంకరయ్య తన శంకరాభరణం బ్లాగులో యిచ్చిన సమస్య

 గరిక పాటి సేయునొక్కొ గరికిపాటి సూడఁగన్

దీనికి నా పూరణము.

కరిముఖున కలంకరించు గరికపాటి లేదిలన్,

దురితుని దశకంఠుఁ గాంచి దూరుచున్న వేళలో

కరుణ భరిత సీత చేతి గరికపాటి లేదిలన్ 

గరిక పాటి సేయునొక్కొ గరికిపాటి సూడఁగన్

చింతా రామకృష్ణారావు.

జైహింద్.

త్రైగుణ్యవిషయా వేదా. || 2 . 45 || ...//..యావానర్థ ఉదపానే.. || 2 . 46 || ..సాంఖ్యయోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున |

నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ || 45

తే.గీ.  వేదములుగుణత్రయముల ప్రీతిగొలుపు

కర్మకాండను వివరించు,గాన పార్థ!

తలఁ బోవకు వాటికై ద్వంద్వరహిత

శుద్ధ సత్వగుణుండవైశోభిలుమిల.

భావము.

అర్జునా ! వేదాలు సత్వ రజ స్తమములను మూడుగుణాలు కలిగిన 

కర్మకాండలను వివరిస్తాయి.  నీవు త్రిగుణాలనూ విడిచిపెట్టి, 

ద్వంద్వాలు లేనివాడవై యోగక్షేమాలు కోరకుండా శుద్ధ 

సత్వగుణం అవలంబించి ఆత్మజ్ఞానివి కావాలి.

శ్లో.  యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే |

తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః || 46

ఎవరు వర నదీజలములకేగనెంత్రు

వారు బావినీటికొఱకు పోరు తెలియ,

భహ్మసుజ్ణానమరసెడివారుప్రతిఫ

లముల నిచ్చు వేదములకిల నరుగరుగ.

భావము.

నదినుంచి నీరుతెచ్చుకునేవాళ్ళు నూతికి ఎలా ప్రాముఖ్యమివ్వరో 

అలాగే బ్రహ్మజ్ఞానులు ప్రతిఫలాపేక్షతో కూడిన వేదకర్మలకు ప్రాధాన్యం 

ఇవ్వరు.

జైహింద్. 

26, జనవరి 2022, బుధవారం

వ్యవసాయాత్మికా బుద్ధి.. || 2 . 41 || ..//.. యామిమాం పుష్పితాం.. || 2 . 42 ||..//..కామాత్మానః స్వర్గపరా జన్మ.. || 2 . 43 ||..//.భోగైశ్వర్యప్రసక్తానాం.. || 2 . 44 || .//..సాంఖ్య యోగమ్యు.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునందన |

బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో௨వ్యవసాయినామ్ || 41

తే.గీ.  నిశ్చయాత్మక బుద్ధి సన్నిశ్చితముగ

నుండునెల్లప్పుడున్ ,వేరె యుండఁబోవ

దస్థిరమగు సంకల్పుల నరసి చూడ

వార లస్థిరాలోచనల్ పరుగు పెట్టు,,

భావము.

కురునందనా ! నిశ్చయాత్మకమైన బుద్ధి ఒకే విధంగా వుంటుంది. 

స్థిరసంకల్పం లేనివాళ్ళ  ఆలోచనలు పరిపరివిధాల పరుగులెడతాయి.

శ్లో.  యామిమాం పుష్పితాం వాచం  ప్రవదంత్యవిపశ్చితః |

వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః || 42

శ్లో.  కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్ |

క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి || 43

ఆ.వె.  గొప్ప జన్మ నెంచి, కూర్మితో స్వర్లోక

మొంద నెంచి, పదవులంద నెంచి,

చేయఁ దగిన క్రియలు చెప్పెను వేదమే.

అట్టి మాట లల్పు డనుసరించు.

ఆ.వె.  వేదవాక్కులనుచు  వేరేమి లేదంచు

భోగ వాంఛితుండు పొందఁ జేయు.

పుణ్యఫలము తరుగ పుడమిపై జనియించు,

ముక్తిపొంద తా నయుక్తుఁడెంచ.

భావము. :

స్వర్గలోకప్రాప్తి, ఉత్తమజన్మము, అధికారము వంటివానిని పొందుటకై 

వివిధములైన కర్మలను ఉపదేశించు వేదములందలి మధురమైన

వాక్కుల యెడ అల్పజ్ఞులు అనురక్తులగుదురు. భోగానుభవమును 

మరియు సంపన్న జీవితమును కోరువారగుటచే అట్టివారు దానికి 

మించినది వేరొకటి లేదని పలుకుదురు.

శ్లో.  భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసామ్ |

వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే || 44

తే.గీ.  భోగములయెడను, విలాస ములయెడలను

నిరుపమాసక్తులకు బుద్ధి నిలువనేర

దరయ నిశ్చయమొనరదయ, నిజ మిదియె,

అర్జునా,! నాదు మాటల నాదరించు.

భావము. 

భోగములు; విలాసముల పట్ల;  మిక్కిలి మమకారాసక్తి ఉన్నవారికి; 

దాని వలన;  దిగ్భ్రమచెందిన బుద్ది తో;  నిశ్చయమైన బుద్ది సాఫల్యం 

 కాదు అది స్థిరముగ  నిలువదు.

జైహింద్.

భారత దేశ 73వ సర్వసత్తాక గణతంత్ర సామ్రాజ్య దినోత్సవ శుభాకాంక్షలు.💐

0 comments

 జై శ్రీమన్నారాయణ.🙏

భారతమాత ముద్దుబిడ్డలయిన మీకు

భారత దేశ 73వ సర్వసత్తాక గణతంత్ర సామ్రాజ్య దినోత్సవ శుభాకాంక్షలు.💐


వందే భారత మాతరమ్.


25, జనవరి 2022, మంగళవారం

పద్మశ్రీ పురస్కార గ్రహీత డా.గరికిపాటి నరసింహారావు మహా సహస్రావధానిగారికి అభినందనలు.

0 comments

 

జైశ్రీరామ్.
పద్మశ్రీ పురస్కార గ్రహీత డా.గరికిపాటి నరసింహారావు మహా సహస్రావధానిగారికి అభినందనలు.

ఆనందామృత మొల్కునట్టి నగవుల్, హాస్యప్రసంగాంచితం
బౌనానందముఖారవిందమహితుండౌ నారసింహాఖ్యుఁడే
తా నాసందమనోజ్ణుఁడై తనర.పద్మశ్రీపురస్కారమున్,
జ్ణానోద్భాసితుడై గ్రహించెను శుభాకాంక్షల్ నృసింహా! సుధీ!

జైహింద్.

ఏషా తే௨భిహితా సాంఖ్యే .. || 2 . 39 || ..నేహాభిక్రమనాశో௨స్తి .. || 2 . 40 || ..//..సాంఖ్య యోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  ఏషా తే௨భిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు |

బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి || 39

తే.గీ.  ఆత్మతత్వమ్ము సాంఖ్య మతానుసార 

మీకు వివరించి చెప్పితి ప్రాకటముగ. 

కర్మయోగబుఁ దెలిపెద కలిగియున్న

బంధనము లాత్మ వీడగా పార్థ! వినుము.

భావము.

పార్థా ! ఇంతవరకూ నీకు సాంఖ్యమతానుసారం ఆత్మతత్వం గురించి 

చెప్పాను. ఇక సంసారబంధం వదులుకోవడానికి సాధనమైన నిష్కామ 

కర్మయోగం గురించి చెబుతాను విను.

శ్లో.  నేహాభిక్రమనాశో௨స్తి ప్రత్యవాయో న విద్యతే |

స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ || 40

తే.గీ.  కర్మయోగమారంభించి కడవరకును 

చేయకున్నను, యేకొద్ది చేసిన నది

వ్యర్థమయిపోదు,చక్కగా సార్థకమగు

కలుగు సంసారభయమును దొలఁగఁ జేయు,

భావము.

ఈ కర్మయోగం ప్రారంభించి, పూర్తి చేయలేకపోయినా వృథాగా పోదు; 

దోషం లేదు. ఏ కొద్దిగా ఆచరించినా ఈ యోగం దారుణమైన సంసారభయం 

నుంచి కాపాడుతుంది.

జైహింద్.

24, జనవరి 2022, సోమవారం

హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా.. || 37 || ..//..సుఖదుఃఖే సమే కృత్వా.. || 38 || ..//..సాంఖ్య యోగము.

0 comments

 శ్లో.  హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్ |

తస్మాదుత్తిష్ఠ కౌన్తేయ యుద్ధాయ కృతనిశ్చయః || 37

తే.గీ.  యుద్ధరంగంబులో మృతి యొసగు ముక్తి,

జయముపొందిన రాజ్యంపు సౌఖ్యమబ్బు,

నర్జునా యిది నీమది నరయవేల?

యుద్ధసన్నద్ధుఁడుగ నగు మొప్పుగాను

భావము.

అర్జునా ! ధర్మయుద్ధంలో మరణిస్తే స్వర్గం పొందుతావు. శత్రువులను 

జయిస్తే రాజ్యభోగాలు  అనుభవిస్తావు. అందువల్ల కృతనిశ్చయంతో 

యుద్ధానికి నడుంబిగించు.

శ్లో.  సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జాయాజయౌ |

తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి || 38

తే.గీ.  సుఖము దుఃఖము నొకటిగ ఊడు పార్థ!

లాభనష్టంబుల గనవలయునటులనె,

అపజయంబైన జయమైన నటులె గనుము,

యుద్ధమునకు సన్నద్ధమై యొప్పుమయ్య.

భావము.

సుఖదుఃఖాలూ, లాభనష్టాలూ, జయాపజయాలూ సమానంగా భావించి 

సమరం సాగించుఅప్పుడు నీకు పాపం కలగదు.


జైహింద్.

23, జనవరి 2022, ఆదివారం

భయాద్రణాదుపరతం మంస్యన్తే..|| 2. 35..|| ..//.. అవాచ్యవాదాంశ్చ బహూన్ ,, || 2 . 36 ||| ..//..సాంఖ్య యోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  భయాద్రణాదుపరతం మంస్యన్తే త్వాం మహారథాః |

యేషాం త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్ || 35

కం.  వీరాగ్రేసరునిగ నిను

గౌరవముగఁ జూచువారు గాంచుదు రికపై

భీరువనుచు చులకనగా,

పోరాములవేల ధీరపుంగవ నీకున్.,

భావము.

ఇన్నాళ్ళూ నిన్ను మహావీరుడిగా గౌరవిస్తున్న వాళ్ళంతా, భయపడి యుద్ధం 

మానేశావని భావించి చులకనగా చూస్తారు.

శ్లో.  అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యన్తి తవా௨హితాః |

నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్ || 36

తే.గీ.  నీ పరాక్రమమును గూర్చి నీదు రిపులు

చెడుగ పల్కుచు నిందింత్రు, చేవలేని

వాని వలె నుండ సాధ్యమా? దీనముగను

,దుఃఖితులమయిపార్థుఁడా! తోచలేదొ?

భావము.

నీ శత్రువులు నీ పరాక్రమాన్ని నిందిస్తూ అనరాని మాటలెన్నో 

అంటారు. అంతకుమించిన  దుఃఖమేముంది?

జైహింద్.


22, జనవరి 2022, శనివారం

అథ చేత్త్వమిమం ధర్మ్యం.. || 2 . 33 || ..//..అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి.. || 2 . 34 || ..//..సాంఖ్యయోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి |

తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి || 33

తే.గీ.  చేయుమీ ధర్మ యుద్ధము చేయకున్న

కులపు ధర్మము వీడిన కూళవగుదు

పేరు ప్రఖ్యాతులన్ బాపు భీరువగుదు,

పాపివగుదు వర్జున నీవు పరువు తీసి.

భావము.

నీవు ఈ ధర్మయుద్ధం చేయకపోతే నీ కులధర్మమూ, పేరు 

ప్రఖ్యాతులూ పాడుచేసి పాపం  కట్టుకంటావు.

శ్లో.  అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే௨వ్యయామ్ |

సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే || 34

తే.గీ.  అంత మాత్రమే కాదయ, వింతగాను,

నీకు కలిగిన యపకీర్తి లోకమందు

చెప్పుకొందురు లోకులు, చింత చేయ

మరణమే కన యపకీర్తి మాన్యులకును., 8

భావము.

అంతే కాకుండా నీ అపకీర్తిని ప్రజలు చిరకాలం చెప్పుకుంటారు. 

పరువు  ప్రతిష్ఠలున్నవాడికి  అపనిందకంటే మరణమే మంచిది.

జైహింద్.

21, జనవరి 2022, శుక్రవారం

స్వధర్మమపి చావేక్ష్య న.. || 2 . 31 || ..//..యదృచ్ఛయా చోపపన్నం..|| 2 . 32|| ..//..సాంఖ్యయోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  స్వధర్మమపి చావేక్ష్య న వికమ్పితుమర్హసి |

ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయో௨న్యత్ క్షత్రియస్య న విద్యతే || 31

తే.గీ.  నీదు ధర్మంబు కనియైన నీవుజంకు

వీడఁగాతగు, యుద్ధంబు వీరవృత్తి

క్షత్రియోత్తమ! యిది నీవు కానలేవొ?

ధర్మబద్ధంపు వర్తన తగును నీకు. 

భావము.

నీ ధర్మాన్ని తెలుసుకుని అయినా నీవు జంకకు. ఎందుకంటే 

క్షత్రియుడికి ధర్మయుద్ధాన్ని మించిన మహాభాగ్యం మరొకటి లేదు.

శ్లో.  యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్ |

సుఖినః క్షత్రియాః పార్థ లబంతే యుద్ధమీదృశమ్ || 32

తే.గీ.  తెరచి యున్న స్వర్గ ద్వార మరయ యుద్ధ

రంగము  లభియించెను నీకు బెంగదేల?

పుణ్యఫలమిదికనగ నపుణ్యులకిల

దొరకబోదని గ్రహియించు దురిత దూర.

భావము.

తెరచివుంచిన స్వర్గద్వారం లాంటి ఈ సంగ్రామం నీకు అప్రయత్నంగా 

లభించింది. ఇలాంటి సదవకాశం పుణ్యం చేసుకున్న క్షత్రియులే 

పొందగలుగుతారు.

జైహింద్.

20, జనవరి 2022, గురువారం

శ్రీ మరుమామల దత్తాత్రేయశర్మ గారు మాయింటికి అభిమానముతో వేంచేసిన సందర్భముగా ప్రేమతో సమర్పించిన అభినందన మందార మాల.

0 comments

జైశ్రీరామ్.

సహృదయశిరోమణి శ్రీ మరుమామల దత్తాత్రేయశర్మగారు గత నవంబరు ఆఖరు వారములో మాయింటికి వచ్చిన స<దర్భముగా మియాపూర్ మిత్రమండలి అభిమానంతో వచ్చి శ్రీ దత్తాత్రేయశర్మగారిని గౌరవార్థం కలిసిన సందర్భములోని ఛాయా చిత్రము.దత్తాత్రేయులవారికి కుడిప్రక్కనున్నది  నేను. శ్రీ బండికాడ అంజయ్యగారు, శ్రీముద్దురాజయ్యగారు, ఎడమప్రక్కనున్నది శ్రీకవిశ్రీ సత్తిబాబుగారు, శ్రీ కటకం వేంకట రామశర్మగారు, శ్రీ మాచబవోలు శ్రీధరరావుగారు, శ్రీ ధనికొండ రవిప్రసాదు గారు.

శ్రీరస్తు...శుభమస్తు...అవిఘ్నమస్తు
శ్రీ మరుమామల దత్తాత్రేయశర్మ గారు మాయింటికి అభిమానముతో వేంచేసిన సందర్భముగా  ప్రేమతో సమర్పించిన
అభినందన మందార మాల. 

శా.  శ్రీమన్మంగళ భావనా కలితుఁడున్, జిన్మార్గ సద్వర్తియున్,
ధీమంతుండును, పండితుండు, కవనోద్దీప్తుండు దత్తాఖ్యుఁడే
శ్రీమంతంబుగ నేగుదెంచి రిటకున్ శ్రేయంబులన్ గొల్పగాఁ
బ్రేమన్ స్వాగతమార్య! మీకు, సుకవీ! శ్రీరాముఁడేలున్ మిమున్. 

శా.  సాహిత్యాభిరతిన్ నిరంతరముగా సత్సంగముల్ గొల్పుచున్
మోహాతీత మనోజ్ఞ భావ కలనన్ బుణ్యాత్ములన్ గొల్చుచున్
స్నేహంబున్ బ్రకటించుచున్ సుజనలన్ జేకొంచు మిత్రాళిగా
సౌహార్దంబును జాటు మీకు శుభముల్ సౌందర్య భాస్వన్మణీ!

ఉ.  దక్షతతోడఁ గార్యములు తన్మయతన్ బొనరించు చుందురే,
యక్షయమైన బ్రేమను సమాదరలీలను జూపుచుందురే,
శిక్షణ నొందు వారలను జేరి సుశిక్షణనిచ్చుచుందురే
రక్షణ మీరె భాషకు, వరమ్ముగ భారతి మిమ్ము మాకిడెన్.

చం.  పరమదయా పరత్వమున భాసిలు మీ ముఖమండలం బహో,
నిరుపమ భాషణాలహరి నిత్య సుగంధ పరీమళంబె, కి
న్నెర పలుకుల్ తలంపగ, మనీషులు మెత్తురు మీదు వాగ్ఝరిన్,
ధరణిని మంగళాకృతుఁడ! ధార్మిక వృత్తిని వెల్గుడెల్లెడన్.

మ.  అవధానాద్భుత విద్యలో ఘనులు. మీ రానంద భాగ్యోన్నతుల్,
నవనీతాన్విత చిత్తతేజులు సదానందప్రదుల్, సత్కృతుల్
కవిలోకంబునకాచరించు సచివుల్ కల్యాణ సంపత్కరుల్
భువికే మంగళకారియౌచు సతమున్ పూజ్యుండుగా వెల్గుడీ.
స్వస్తి.

మల్లినాథసూరి వర్ణనము...భక్తిసాధనమ్.

0 comments

శ్రీరామ్.
కోలాచలం మల్లినాథసూరి వర్ణనము.
జైహింద్.

సాహితీ ప్రియులు, సహృదయులు శ్రీమతి చింతమనేని వేదవతీకృష్ణారావు (91)నిన్న అర్థరాత్రి దేవిని సన్నిధికి చేరుకున్నారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటున్నాను.

0 comments

 

ఓం నమశ్శివాయ.
శ్రీమతి జింతమనేని వేదవతి.
అనేక గ్రంథములు రచించినజ్ణాని.
ప్రతీ సంవత్సరమూడిశంబరు పందొమ్మిదవ తేదీన ఈరిపతిదేవులయిన కృష్ణారావుగారి జయంతి చేస్తూ సభ ఏర్పాటు చేసి పండితులకు కవులకు ఘనమైన సత్కారములు చేసేవారు.
సాహితీ ప్రియులు, సహృదయులు శ్రీమతి చింతమనేని వేదవతీకృష్ణారావు (91)నిన్న అర్థరాత్రి దేవిని సన్నిధికి చేరుకున్నారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటున్నాను

ఓం నమశ్శివాయ.

ఓం శాంతిః.

ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం.. || 2 . 29 || ..//..దేహీ నిత్యమవధ్యో௨యం.. || 2 . 30 ||..//..సాంఖ్య యోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం

ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః |

ఆశ్చర్య వచ్చైనమన్యః శృణోతి

శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ || 29

తే.గీ.  అచ్చెరువుగను కను నొకండాత్మనెంచి,

చిత్రముగ బల్కు నొక్కండు చింత చేసి,

వింతగా నొక్క డాత్మను వినుచు నుండు,

నొక్కడున్ దెలియగ నేర డక్కజమిది.

భావము.

ఒకడు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇంకొకడు దీన్ని 

గురించి విచిత్రంగా  మాట్లాడుతున్నాడు. మరొకడు వింతగా 

వింటున్నాడు. అయితే ఈ ఆత్మ స్వరూపస్వభావాలు 

తెలుసుకున్న వాడు ఒక్కడూ లేడు.

శ్లో.  దేహీ నిత్యమవధ్యో௨యం దేహే సర్వస్య భారత |

తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి || 30

తే.గీ.  అన్ని దేహంబు లందుండు నాత్మ కరయ

మరణ ముండదు, దీనికై మదిని దలచి

వగచుటెందుల కో పార్థ! ప్రాణులకయి,

వీడుమజ్ణానమును నీవు, వీడు చింత.

భావము.

అన్ని దేహాలలోనూ వుండే ఆత్మకు చావు అనేది లేదు. అందువల్ల 

ఈ ప్రాణుల గురించి నీవు దుఃఖించనక్కరలేదు.

జైహింద్.

19, జనవరి 2022, బుధవారం

గొల్లపూడివారి మాటలు ఎంతవిలువైనవో మనం గ్రహించగలమా?

0 comments


జైశ్రీరామ్.
గొల్లపూడివారి మాటలు ఎంతవిలువైనవో మనం గ్రహించగలమా?
జైహింద్.

గయాక్షేత్ర వర్ణనలు...భక్తిసాధనము.

0 comments

జైశ్రీరామ్.
భక్తిసాధమ్.
గయాక్షేత్ర వర్ణనము.
జైహింద్.

భవిష్యత్ సూచించిస్తూ అమ్మవారు పలికించిన సమస్య, ఆలస్యముగా అర్థమయింది.

0 comments

 జై శ్రీరామ్.

జై శ్రీమన్నారాయణ.🙏

భక్తిసాధనం వారి కోరికమేరకు నేనిచ్చిన సమస్య.

👇

కర్కటరాశి వీడనని గట్టిగ పట్టును బట్టె సూర్యుడున్.

దీనికి

నా పూరణము.

👇

ఉ.  అర్కుఁ డసాదృశంబుగ మహాద్భుత యోగము కూర్ప జాతికిన్

కర్కట రాశి వీడి వెలుగన్ మకరంబున, నేను చత్తునం

చర్క సమాన తేజుఁడు మహాత్ముఁడు భీష్ముఁడు పల్క, .. బాధతో 

*కర్కటరాశి వీడనని గట్టిగ పట్టును బట్టె సూర్యుడున్.*

ఇది ☝️ఆ రోజే నేను చేసిన పూరణము..🙏

అమ్మవారు ఇటువంటి సమస్య నా చేత యిప్పించడం గురించి 

ఆలోచిస్తుంటే ఇప్పుడు అర్థమవుతోందండి.

అపరవ్యాసులయిన బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రిగారు 

ఉత్తరాయణం రాక కోసం వేచి ఉన్న సంగతి అమ్మకు తెలియును. 

ఆ సూర్యభగవానుడు కూడా వీరు కాలం చేయుట యిష్టము లేక 

కర్కట రాశి నుండి మకరమునకు వెళ్ళితే ఇంతటి మహాత్ముఁడు 

లోకానికి దూరమవ డానికి కారకుఁడనవుతానని భావించి అక్కడనుండి 

కదలకూడదని మొండి చేశాఁడు. ఐనా విధికి తలవంచక తప్పని రవి

కర్కటాన్ని వదిలి మకరానికి చేరక తప్పలేదు.

అపరవ్యాసులయిన శాస్త్రిగారు తనకు అనుకూలమయిన సమయం 

వచ్చినదని పరమాత్మలో లీనమయారు.

ఇంతటి భవిష్యత్ ముందుగా మనము గ్రహించ లేకపోవచ్చును గాని 

ఆమ్మ పలికించే మాటలు అర్థవంతాలు భావి సూచికలున్నూ.

ఆ విధముగా పలికించిన అమ్మపాదస్మరణకన్న పరమార్థ 

మేముంటుందండీ.🙏

జైహింద్.

జాతస్య హి ధ్రువో మృత్యుః.. || 2 . 27 || ..//..అవ్యక్తాదీని భూతాని .. || 2 . 28 || ..//..సాంఖ్య యోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ |

తస్మాదపరిహార్యే௨ర్థే న త్వం శోచితుమర్హసి || 2 . 27 || 

కం.  పుట్టిన మరణము తప్పదు

పుట్టుట తప్పదు మరణము పొందినచో,  నే

జట్టియు మార్చగ లేడిది,

యిట్టుల దుఃఖింపతగ దిదేల నెఱుఁగవో?

భావము.

పుట్టిన వాడికి చావు తప్పదు. చచ్చిన వాడికి పుట్టుక తప్పదు. 

తప్పించరాని ఈ విషయంలో తపించనవసరం లేదు.

శ్లో.  అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత |

అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. || 2 . 28 || 

కం.  పుట్టక పూర్వము తెలియదు

గిట్టిన పిదపను తెలియదు కించిత్తయినన్.

బుట్టిన జీవిని గూర్చి మ

రిట్టుల యీమద్యము కని యేలను చింతల్? 

భావము.

జీవులు పుట్టుకకు పూర్వం కాని, మరణానంతరం కాని ఏ రూపంలో 

వుంటాయో తెలియదు. మధ్యకాలంలో మాత్రమే కనబడుతాయి. 

అర్జునా !అలాంటప్పుడు విచారమెందుకు?

జైహింద్.

18, జనవరి 2022, మంగళవారం

అవ్యక్తో௨యమచింత్యో.. || 2 . 25 || ..//..అథ చైనం నిత్యజాతం నిత్యం.. || 2 . 26 || ..//..సాంఖ్యయోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  అవ్యక్తో௨యమచింత్యో௨యమవికార్యో௨యముచ్యతే |

తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి || 25

తే.గీ.  ఇంద్రియములకగోచరమెన్ననాత్మ,

మనసుకందదదవికారి,మదిని యాత్మ

తత్వమెఱుఁగుమునీవిక మదిని గలుగు

చింత వీడుముబాధ్యతావంత కనుము.,

భావము.

ఆత్మ జ్ఞానేంద్రియాలకు గోచరించదు. మనస్సుకు అందదు. 

వికారాలకు గురికాదు. ఈ ఆత్మతత్వం తెలుసుకుని నీవు విచారించడం 

మానుకొనుము.

శ్లో.  అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్ |

తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి || 26 || 

తే.గీ.  పార్థ!! దేహంబుతోఁ బాటు వరలుచున్న

యాత్మకున్ జావు పుట్టుక లలరు ననుచు

నీవు భావించుచున్నను, ధీవరేణ్య!

మదిని శోకింపఁ బనిలేదు మృదుల హృదయ!.

భావము.

అర్జునా ! శరీరంతోపాటు ఆత్మకు కూడా సదా చావు పుట్టుక

లుంటాయని భావిస్తున్నప్పటికీ నీవిలా శోకించవలసిన పనిలేదు.

జైహింద్.

17, జనవరి 2022, సోమవారం

నైనం ఛిందంతి శస్త్రాణి.. || 2 . 23 || ..//..అచ్ఛేద్యో௨యమదాహ్యో.. || 2 . 24 ||..//..సాంఖ్య యోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః |

న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః || 23 || 

తే.గీ.  అగ్ని కాల్చగ లే దాత్మ నరసి చూడ,

శస్త్రములు చీల్చలేవు ప్రశస్తమయిన

నీరు తడుపంగలే దిక ఘోరమైన

గాలి యెండగాఁ జేయలే దేలొ? కనుమ.

భావము.

ఈ ఆత్మను ఆయుధాలు నరకలేవు; అగ్ని కాల్చలేదు; నీరు 

తడుపలేదు; గాలి ఎండబెట్టలేదు.

శ్లో.  అచ్ఛేద్యో௨యమదాహ్యో௨యమక్లేద్యో௨శోష్య ఏవ చ |

నిత్యః సర్వగతః స్థాణురచలో௨యం సనాతనః || 24 || 

తే.గీ.  ఆత్మ ఖండింపఁబడని దీవరసి చూడ,

కాల దగ్నికి, తడవదు కనగ నీటి

కి నిల నెండదు, నిత్యము, వినగ శాశ్వ

తంబ దచలమునయి, సనాతనమెఱుంగ,.

భావము.

ఆత్మ ఖండించరానిది, కాలనిది, తడవనిది, ఎండనిది; అది 

నిత్యం, సర్వవ్యాప్తం, శాశ్వతం, చలనరహితం, సనాతనం.

జైహింద్.

16, జనవరి 2022, ఆదివారం

శ్లో. వేదావినాశినం నిత్యం.. || 2 . 21|| ..//..వాసాంసి జీర్ణాని యథా విహాయ.. || 2 . 22|| ..//..సాంఖ్యయోగము

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ |

కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతి కమ్ || 2 .  21|| 

తే.గీ.  చావుపుట్టుకల్ లేనిదై శాశ్వతమయి

యుండునాత్మయం చెఱిగిన నోపునెవఁడు 

చంపగను దాని దానిచేఁ జంపఁజేయ?

పార్థుఁడా! నీ వెఱుఁగవొకొ? పద్ధతినిట. 

భావము.

పార్థా ! ఆత్మ నాశనరహితమనీ, చావు పుట్టుకలు లేనిదనీ, శాశ్వత

మైనదనీ  తెలుసుకున్నవాడు  ఎవరినైనా ఎలా చంపుతాడు?

ఎలా చంపిస్తాడు?

శ్లో.  వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో௨పరాణి |

తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహీ  || 2 .  22|| 

తే.గీ.  ప్రాత చిరిగిన వస్త్రము విడిచిపెట్టి

నూతనంబైన వస్త్రమును తొడుగునటు,

శిధిలదేహంబు వీడుచు జీవుం_డటులె

క్రొత్త దేహంబులో చేరి కుదురుకొనును

భావము.

మానవుడు చినిగిపోయిన పాతబట్టలను విడిచిపెట్టి క్రొత్తబట్టలు 

వేసుకున్నట్లే ఆత్మ కృశించిన  శరీరాలను వదలి కొత్త దేహాలు 

పొందుతుంది.

జైహింద్.

శతావధానం,10-01-2022, शतावधानम्, SHATAVADHANAM By Ambalam Parthasarathi |...

0 comments

జైశ్రీరామ్.
బ్రహ్మశ్రీ వద్దిపర్తిపద్మాకర్ శతావధానిచేసిన శతావధానములోశ్రీ మరుమామల దత్తాత్రేయ శర్మగారు, నేను ఇచ్చిన సమస్యలకు అవధానిగారి పూరణలను, శ్రీ అంబాళం పార్థసారథి గారు వివరణాత్మకంగా చేసిన దృశ్యశ్రవణ చిత్రీకరణాద్భుతముగా ఉన్నది వారికి నా ధన్యవాదములు. 
జైహింద్.

15, జనవరి 2022, శనివారం

గీతార్ధ సారము వినుము | భగవద్గీత పాట | గీతోపదేశం 18 చరణాలలో.

0 comments

జైశ్రీరామ్.
గీతార్ధ సారము వినుము | భగవద్గీత పాట | గీతోపదేశం 18 చరణాలలో.
జైహింద్.

భగవద్గీత సారము...పాటగా..

0 comments

జైశ్రీరామ్.
భగవద్గీత సారము...పాటగా..
జైహింద్.

య ఏనం వేత్తి హంతారం.. || 2 . 19 || ..//..న జాయతే మ్రియతే వా.. || 2 . 20 || ..సాంఖ్య యోగము..

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతమ్ |

ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే || 19

తే.గీ.  చంపునాత్మయనుచు నాత్మ చంపఁబడున

నుచును మూర్ఖులనుచునుం ద్రనుపమముగను

చంపఁబోవదాత్మయు తాను చంపఁబడదు

తెలియవలయునిదియె నీవు తెలివిఁ గలి గి.

భావము.

ఈ ఆత్మ చంపుతుందని కాని, చంపబడుతుందని కాని భావించే 

వాళ్ళిద్దరూ అజ్ఞానులే. ఆత్మ చంపేది కాని చచ్చేది కాని కాదు.

శ్లో.  న జాయతే మ్రియతే వా కదాచిత్

నాయం భూత్వా భవితా వా న భూయః |

అజో నిత్యః శాశ్వతో௨యం పురాణో

న హన్యతే హన్యమానే శరీరే || 20

తే.గీ.  జనన మరణముల్లేనిది, సతము కలది,

జన్మరాహిత్య శాశ్వత సంస్థితమది

యాత్మ, నశియింపబోవద నంతమదియు

దేహమంతమైపోయినన్ దేహి నిలుచు.

భావము.ఆత్మకు పుట్టడం చావడం అనేవి లేవు. అది ఒకప్పుడు ఉండి, 

మరొకప్పుడు లేకపోవడం జరగదు. జన్మరహితమూ, శాశ్వతమూ, 

అనాది సిద్ధమూ అయిన ఆత్మ నిత్యం. అందువల్ల శరీరాన్ని నాశనం 

చేసినా అందులోని ఆత్మ మాత్రం చావదు.

జైహింద్.

14, జనవరి 2022, శుక్రవారం

మీకు భోగిపండుగ శుభాకాంక్షలు

0 comments

జైశ్రీరామ్...

మీకు 

భోగిపండుగ శుభాకాంక్షలు.

శ్రీమన్మంగళ భోగి మీకు శుభముల్ చేకూర్చుతన్ భోగముల్,

శ్రీమాతృకృప, చిద్వివేకము, జయశ్రీ సంపదల్, సద్ధనం

బేమాత్రంబును లోటు లేని సుఖముల్ హృద్యంపు సద్భావనల్

ధీమంతుల్ తమరందుకో వలచెదన్ దీపించుడీ సద్విధిన్

💐

జైహింద్.

అవినాశి తు తద్విద్ధి యేన..//.. || 2 .17 ||..//..అంతవంత ఇమే దేహా..//.. || 2 .18 || ..//,.. సాంఖ్యయోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్ |

వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్‌కర్తుమర్హతి || 17

తే.గీ.  ఆత్మ విశ్వంబునంతటన్ వ్యాప్తమయిన

వస్తు వని గ్రహియింపుము పార్థ! నీవు,

నాశనములేనిదయ్యది నరుఁడ! ఇఎలియ,

చేయలేరణంతమున్ దాని, చెడనిదదియె.

భావము.

ఈ విశ్వమంతటా వ్యాపించివున్న ఆత్మవస్తువు నాశనం 

లేనిది. దానినెవరూ అంతం చేయలేరు.

శ్లో.  అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః |

అనాశినో௨ప్రమేయస్య తస్మాద్యుద్ధ్యస్వ భారత || 18

తే.గీ.  నాశనము లేనియాత్మకు నీశరీర

మెన్నగాశాశ్వతము కాదు, కన్నుతెరిచి

యాత్మయే నిత్యమని నమ్ముమయ్య పార్థ!

యుద్ధమునుచేయ నీవింక సిద్ధమగుము.

భావము.

నాశనం లేని ఆత్మకు ఈ శరీరాలు శాశ్వతాలు కావు. ఆత్మ ఒక్కటే 

నిత్యం. కనుక ఓ భారత వీరా! యుద్ధం మొదలు పెట్టు.

జైహింద్.

13, జనవరి 2022, గురువారం

యం హి న వ్యథయన్త్యేతే..//...|| 2 . 15..//..నాసతో విద్యతే భావో..|| 2 . 16 || సాంఖ్యయోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  యం హి న వ్యథయన్త్యేతే పురుషం పురుషర్షభ |

సమదుఃఖసుఖం ధీరం సో௨మృతత్వాయ కల్పతే || 15

కం. పురుష శ్రేష్టుఁడ! యెవడిల

నిరుపమసుఖదుఃఖములు గణించు సమముగా

వెరపున ద్వంద్వములంటవు,

వరధీరుఁడతండమృతమువడయగనొప్పున్.

భావము.

పురుషశ్రేష్టుడా! సుఖదుఃఖాలలో సమంగా ఉండే ఏ ధీరుణ్ణి 

ద్వందాలు భాదించవో అతడు అమృతత్వానికి అర్హుడు అవుతాడు.

శ్లో.  నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః |

ఉభయోరపి దృష్టో௨న్తః త్వనయో స్తత్త్వదర్శిభిః || 16

తే.గీ.లేనిదుండ దాయున్నది లేకపోదు

భువిని తత్వజ్ణులెఱుఁగుదురవి జగాన,

నీవు తత్వజ్ణుఁడవు పార్థ!భావనమున

తెలిసికొమ్మిది, నిజమును తెలియవలయు.

భావము.

లేనిది ఎప్పటికీ వుండదు. ఉన్నది ఎప్పటికీ లేకపోదు. ఈ రెండింటి 

నిర్ణయం తత్వజ్ఞులకే తెలుస్తుంది.

జైహింద్.


12, జనవరి 2022, బుధవారం

దేహినో௨స్మిన్ యథా దేహే.. || 2..13..//.. మాత్రాస్పర్శాస్తు కౌంతేయ. || 2..14...//..సాఖ్య యోగము.

0 comments

 జైశ్రీరామ్. 

శ్లో.  దేహినో௨స్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా |

తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి || 13

కం. జీవుని కిల కౌమారము

యౌవనవార్ధక్యములవి యరయుచు దేహం

బే వదలి మరల పుట్టును,

జీవముదుఃఖింపదుకద క్షితి నెన్నినచో.

భావము.

జీవుడికి ఈ శరీరంలో కౌమారం, యౌవనం, వార్థక్యం వచ్చినట్లే 

మరణానంతరం మరో శరీరం వస్తుంది. ఇందుకు ధీరుడు 

దుఃఖించడు.

శ్లో.  మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః |

ఆగమాపాయినో௨నిత్యాః తాం స్తితిక్షస్వ భారత || 14

తే.గీ.  విషయవశమైన యింద్రియా లసదృశమగు

సుఖము దుఃఖములను తేలుచున్జరింప

వే,, యశాస్వత మింద్రియ విషయముల క

లయిక,బాధలనుసహించు ప్రియ నరుండ!

భావము.

కుంతీ పుత్రా! విషయాలకు వశమైన ఇంద్రియాలవల్ల 

శీతోష్ణాది గుణాలూ,సుఖదుఃఖాలూ కలుగుతుంటాయి. కోరికలకూ, 

ఇంద్రియాలకూ కలయిక అశాశ్వతం. కనుక ఓ భరతవీరా ! 

ఆ బాధలను సహించు.

జైహింద్.


స్వామివివేకానందుని 159 వ జయంతి. ఈ సందర్భముగా జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు.

0 comments

 జైశ్రీరామ్.

నేడు 

భరతమాతముద్దుబిడ్డ,  

భారతీయతత్త్వవేత్త, 

ఆధ్యాత్మికశక్తిసంపన్నుడు,   

రామకృష్ణమిషన్ వ్యవస్థాపకుడు, 

యువతకు జాగృతి కలిగించిన 

నిరంతర ఆదర్శప్రాయుడు 

స్వామివివేకానందుని 

159 వ జయంతి.

ఈ సందర్భముగా

జాతీయ యువజన దినోత్సవ 

శుభాకాంక్షలు.వివేకానందుని జీవిత చరిత్రను ఆబాల గోపాలము 

పఠించవలెను.

ప్రపంచ దేశములలో మన భారత దేశము యొక్క గౌరవమును 

ఏ విధముగా  తనప్రవర్తనద్వారా, 

ఉపన్యాసము ద్వారా ఇనుమడింప చేసెనో గ్రహించి, భారతీయునిగా 

మన కర్తవ్యమును మనమే 

గ్రహించుకొని ఈ భూమిపై పుట్టినందులకు ఈ తల్లి ఋణమును 

తీర్చుకొనవలెనని అందరమూ 

గ్రహించుకొలవలసి యున్నది.

జైహింద్.

11, జనవరి 2022, మంగళవారం

అశోచ్యానన్వశోచస్త్వం .. || 2 . 11 || ..//..న త్వేవాహం జాతు నాసం.. || 2 . 12 || ..//..సాంఖ్య యోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్రీభగవానువాచ

శ్రీకృష్ణభగవానుడిట్లనుచున్నాడు.

శ్లో.  అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే |

గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః || 11

తే.గీ.  నీవు దుఃఖించు చుంటివి నేడు పార్థ!

యవసరము లేని వారికై యనవసరము,

జ్ణాని వలె పల్కుచుంటివి చనిన, యున్న

వారికొఱకు దుఃఖింపరు ప్రతిభు లిలను.

భావము.

అర్జునా! దుఃఖించనవసరం లేనివాళ్ళకోసం దుఃఖిస్తున్నావు. పైగా 

మహావివేకిలాగా  మాట్లాడుతున్నావు. చచ్చిపోయినవాళ్ళ

 గురించికాని, బ్రతికున్నవాళ్ళ గురించి కాని వివేకులు శోకించరు.

శ్లో.  న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః |

న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్ || 12

కం.  నీవును నేనును వీరును

భావింపగ యుందుముకద నేడును రేపున్

నీవేల తెలియకుంటివి?

నీవిది గ్రహియింప వలయు నేర్పరివగుచున్.

భావము.

నీవూ నేనూ వీళ్ళంతా గతంలోనూ వున్నాము. భవిష్యత్తులో 

కూడా వుంటాము.

జైహింద్.

10, జనవరి 2022, సోమవారం

ఏవముక్త్వా హృషీకేశం.. || 2 . 9 || ..//..తమువాచ హృషీకేశః.. || 2 . 10 || ..//..సాంఖ్య యోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్లోఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప |

యోత్స్య ఇతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవ || 9 || 

తే.గీఇట్లు శ్రీకృష్ణునుని తోడ నెఱుకపడగ

నర్జునుఁడు తన భావన ననుపమముగఁ

దెలిపి యుద్ధము చేయక నిలిచె నకట,

మొద్దుబారిన మదితోడ భూమిపైన.

భావము.

అర్జునుడు శ్రీకృష్ణుడితో అలా చెప్పి యుద్ధం చేయనని 

ఊరకున్నాడు.

శ్లోతమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత |

సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః || 10 || 

తే.గీరెండు సేనలమధ్యలో నుండి యున్న 

దుఃఖ తప్తుఁడౌ యర్జునున్ దురిత హరుఁడు

మురహరి కనుచు పరిహాసముగను బలికె

జ్ణాన సంపూర్ణ సద్భాసమాన ముఖుఁడు.

భావము.

రెండుసేనల మధ్య విషాదవశుడైవున్న అర్జునుణ్ణి చూసి 

శ్రీ కృష్ణపరమాత్ముడు పరిహాసంగా ఇలా అన్నాడు.

జైహింద్.

9, జనవరి 2022, ఆదివారం

కార్పణ్యదోషోపహతస్వభావః.. || 2. 7 ||..//.. న హి ప్రపశ్యామి మమాపనుద్యాత్..|| 2. 8 ||..//..సాంఖ్య యోగము

0 comments

  జైశ్రీరామ్.

శ్లో.  కార్పణ్యదోషోపహతస్వభావః

పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః |

యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే

శిష్యస్తే௨హం శాధి మాం త్వాం ప్రపన్నమ్ || 7

కం. గురువులు బంధువులనుచును

దరగని మమకారమునను తరిగెను జ్ణానం

బరయుచు మార్గము చూపుము

గురువుగ నీ శిష్యునకునుగోవింద! కృపన్.

భావము.

గురువులూ బంధువులూ అనే మమకార దోషంవల్ల నాబుద్ధి 

నశించింది. మంచి ఏదో చెడు ఏదో తెలియడం లేదు. 

శిష్యుడిగా నిన్ను ఆశ్రయించిన నాకు 

ఏది శ్రేయోమార్గమో దాన్ని ఆదేశించు.

శ్లో.  న హి ప్రపశ్యామి మమాపనుద్యాత్

యచ్ఛోక ముచ్ఛోషణమింద్రియాణామ్ |

అవాప్య భూమావసపత్నమృద్ధం

రాజ్యం సురాణామపి చాధిపత్యమ్ || 8

తే.గీ.  ఆధిపత్యంబు భువిని నాకమరవచ్చు

అట్లె స్వర్గాధిపత్యమే యమరవచ్చు

నైనగానిస చ్ఛాంతి నాకమరఁబోవ

దలముకొనియున్న దుఃఖంబు తొలఁగిపోదు.

భావము.

భూలోకాధిపత్యం లభించినా, స్వర్గాధిపత్యం సిద్ధించినా 

నా శోకం తగ్గుతుందనుకోను.

జైహింద్.

8, జనవరి 2022, శనివారం

గురూనహత్వాహి.. || 2 . 5 || ..//..న చైతద్విద్మః కతరన్నో.. || 2 . 6 || ..సాంఖ్యయోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  గురూనహత్వాహి మహానుభావాన్

శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే |

హత్వార్థకామాంస్తు గురూనిహైవ

భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ || 5

తే.గీ.  మహితులైనట్టి గురువులన్ మడియఁ జేసి,

రక్తసిక్తంపురాజ్య సంప్రాప్తమవగ

పాలనము సేసి బ్రతుకుట పాడియగునె,

దీనికన్నను భిక్షాన్నమే నయమిల.

తే.గీ.  మహిత గురువులన్  వధియించి మనుట శ్రేయ

మవదుగ, కన రక్త కలిత మయిన రాజ్య

భోగముల కంటె బ్రతుకఁగ ముష్టి మేలు.

పాపమును తిని బ్రతుకుట పాడి యగునె?

భావము.

మహానుభావులైన గురువులను చంపడం శ్రేయస్కరం 

కాదు. వారిని సంహరించి రక్తసిక్తాలైన 

రాజ్యభోగాలు అనుభవించడం కంటే బిచ్చ

మెత్తుకోవడం మేలు.

శ్లో.  న చైతద్విద్మః కతరన్నో గరీయో

యద్వా జయేమ యది వా నో జయేయుః |

యానేవ హత్వా న జిజీవిషామః

తే௨వస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః || 6

తే.గీ.  యుద్ధమును చేయుటొప్పౌనొ? యొప్పు కాదొ?

యెఱుఁగ లేకుంటి,విజయంబదెవరికగునొ

తెలియ దెవరిని చంపినతృప్తిఁ గనుదొ

వారె యెదురుగనుండిరి నీరజాక్ష!

తే.గీ. రణ ఫలంబది గ్రహియింప రాదు నాకు,

జయమొ, యోటమియో చెప్పఁ జాలముకద,

యెవరినివధించిన విరక్తి నెరయును మది

నదిగొ ధార్తరాష్ట్రులిచటనెదుట కలరు.

భావము.

యుద్ధం చేయడం మంచిదో కాదో తెలియడం 

లేదు. మనం జయిస్తామో, వారు జయిస్తారో

చెప్పలేము. ఎవరిని చంపితే మనకు జీవితం 

మీద విరక్తి కలుగుతుందో ఆ ధార్తరాష్ట్రాదులే

ఎదురుగా ఉన్నారు. 

జైహింద్.

క్లైబ్యం మా స్మ గమః పార్థ || 2 - ౩ ll.//..కథం భీష్మమహం సంఖ్యే.. || 2 - 4 ll../..సాంఖ్యయోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే |

క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప || 3

తే.గీ.  పొందకధైర్య మిటను నపుంసకునటు,

తగదు నీకిది, వీడుట తగు నధౌర్య

మునిక, హృదయపు దౌర్భల్యమును త్యజించు,

యుద్ధమునుచేయ నీవింక సిద్ధమగుము.

భావము.

నపుంసకుడిలాగ అధైర్యం పొందకు. ఇది నీకు పనికిరాదు, 

మనోదౌర్బల్యం నీచం. దాన్ని విడిచిపెట్టు. నీవు శత్రుమర్దనుడవు 

కదా! యుద్ధం ప్రారంభించు.

అర్జున ఉవాచ:

అర్జునుఁడు ఇట్లు పలికెను.

శ్లో.  కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన |

ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన || 4

తే.గీ. మహిత మధుసూదనా!నేను మహితులయిన

ద్రోణ భీష్మాది యోధులతోరణమున

యుద్ధమెట్టులచేయుదు నుజ్జగించి

పెద్దలయెడగౌరవమును? వద్దువద్దు.

భావము.

అర్జునుడు : మధుసూదనా! పూజార్హులైన భీష్మ ద్రోణాదులను 

బాణాలతో నేనెలా కొట్టగలను? 

జైహింద్.

తం తథా కృపయావిష్ట..2 - 1..//..కుతస్త్వాకశ్మలమిదం..2 - 2..//..సాంఖ్యయోగము.

0 comments

 జైశ్రీరామ్. 

ఓం నమో భగవతే వాసుదేవాయ.

శ్రీమద్భగవద్గీత

రెండవ అధ్యాయం సాంఖ్యయోగం

సంజయ ఉవాచ:

సంజయుడుఅనుచున్నాడు.

శ్లో. తం తథా కృపయావిష్ట మశ్రుపూ ర్ణాకులేక్షణమ్ |

విషీదం త మిదం వాక్య మువాచ మధుసూదనః || 1

తే.గీ.  కలతఁ జెందుచు కన్నీరు కార్చుచున్న

యర్జునుని జూచి శ్రీకృష్ణుఁడనియెనిట్లు. 

మానవాళికి మార్గంబు మహిత గతిని

జీవనము సాగ గీతను చెప్పఁ బూని.

భావము.

దయామయుడైన అర్జునుడు కన్నీరు కారుస్తుండగా 

శ్రీ కృష్ణపరమాత్మ ఇలా అన్నాడు.

శ్రీ భగవానువాచ:

శ్రీకృష్ణుఁడనుచుండెను.

శ్లో. కుతస్త్వాకశ్మలమిదం విషమే సముపస్థితమ్ |

అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరమర్జున || 2 

తే.గీ.  ఆర్యధర్మ విరుద్ధంబు, ననుచితమగు

ఘోరమైనట్టి యపకీర్తి కోరుకొనుచు

నరక దుష్ప్రాప్తిహేతువౌ దురిత బుద్ధి

పొడమె నీకెటు లర్జునా? మూర్ఖుఁడవొకొ? 

భావము.

అర్జునా! ఈ సంక్లిష్ట సమయంలో ఆర్యధర్మ విరుద్ధమూ, అపకీర్తి 

దాయకమూ, నరకప్రాప్తి హేతువూ అయిన ఈ పాడుబుద్ధి నీ కెందుకు పుట్టింది? 

జైహింద్.