జైశ్రీరామ్.
శ్లో 𝕝𝕝 అశుచిర్వా శుచిర్వాపి గచ్ఛన్ తిష్ఠన్ స్వపన్నపి౹
మంత్రైక శరణో విద్వాన్ మనసైవ సదా౽భ్యసేత్౹౹("రామార్చన చంద్రిక")
నదోషో మానసే జాప్యే సర్వదేశే౽పి సర్వదా౹
జపనిష్ఠో ద్విజశ్రేష్ఠః సర్వయజ్ఞఫలం లభేత్ ||(శ్రీల గోపాల భట్ట గోస్వామి రచించిన, శ్రీల సనాతన గోస్వామి వ్యాఖ్యానించిన శ్రీ హరిభక్తి విలాసంలో17వ అధ్యాయం, 161వ శ్లోకం.)
తే.గీ. మంత్ర దీక్షను గొనినట్టి మహితుఁడవని
నున్న నశుచిగ, శుచిగ తానున్నఁ గాని,
నడచుచున్న, నిల్చున్న, స్వప్నమున గాని,
మదిని నిరతము జపవిధి మానరాదు.
తే.గీ. నిష్ఠగాజపమును జేయు శిష్ఠులకిల
నెల్లవేళలనియతిని నెచటనైన
చేయ జపమును దోషంబు చేరఁబోదు,
సర్వయజ్ఞఫంబులు సమకురరయ.
తా𝕝𝕝 మంత్రాన్ని మాత్రమే శరణు వేడిన జ్ఞాని... తాను అశుచిగా (అపవిత్రంగా) ఉన్నా, శుచిగా (పవిత్రంగా) ఉన్నా, నడుస్తున్నా, నిలబడి ఉన్నా, లేదా నిద్రిస్తున్నా సరే... ఎల్లప్పుడూ తన మనస్సులోనే ఆ మంత్రాన్ని నిరంతరం జపించాలి.
జపమునందు నిరంతర శ్రద్ధ, పట్టుదల కలిగిన, ఉత్తముడైన సాధకుడు చేసేటటువంటి మానసిక జపమునకు, ఏ అపవిత్రమైన లేదా పవిత్రమైన చోటనైనా సరే, ఎల్లప్పుడూ అపవిత్రత కాని విధివిరామ దోషము కాని కలుగదు. అన్ని రకాల యజ్ఞాలు, యాగాలు చేయడం వల్ల కలిగే పుణ్యఫలాన్ని పొందుతాడు.
జైహింద్.
Print this post
వ్రాసినది



0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.