గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, ఆగస్టు 2026, శనివారం

80వ స్వాతంత్ర్యదినోత్సవము సందర్భముగా ఆంధ్రామృతపాఠకులకు శుభాకాంక్షలు.

 జైశ్రీరామ్.

80వ స్వాతంత్ర్యదినోత్సవము సందర్భముగా ఆంధ్రామృతపాఠకులకు శుభాకాంక్షలు.

శా.  శ్రీమన్మంగళ భారతావని ఘన స్వేచ్ఛన్ బ్రవర్ధిల్లఁగా

ధీమంతుల్ మహనీయులెంద రసువుల్ తృణ్యంబటుల్ వీడిరో

ఆమాన్యుల్ కృషి స్వేచ్ఛ నిచ్చె, మహనీయైశ్వర్యమీ స్వేచ్ఛ, యీ

శ్రీమంతంబగు స్వేచ్ఛ మీకు శుభముల్ చెల్వొంద వర్తింపుడీ. 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.