జైశ్రీరామ్.
అమ్మవారిపై భక్తి ఉన్నవారు, అమ్మవారిని త్రికరణశుద్ధిగా నమ్మినవారు, త్రికరణశుద్ధిగా అంతటా అమ్మవారిని దర్శింపగలిగినవారు, నిర్వ్యాజంగా పరోపకారం చేసేవారు ఎంతవేగంగా అనుకున్నవి సఫలీకృతం చేసుకోగలరో మనం శ్రీ భైరపనేని పోతురాజు చౌదరీని చూచి తెలుసుకోవచ్చును.
వీరు ప్రభుత్వౌన్నతపాఠశాలలో ప్రథమాంధ్రోపాధ్యాయునిగా తమ సేవలందించుచు, విద్యార్థులకు తానే రోల్ మోడల్ గా ఉండి వారికి ప్రేరణ కలిగించాలనే సదుద్దేశ్యంతో తాను భాషాపటిమను పెంచుకొనుచు, అవధాన విద్యను అభ్యాసం చేసి అతి తక్కువ వ్యవధిలో చక్కని అవధానిగా ఎదిగి హైదవధర్మదర్శనమయిన దర్శనం పత్రికా నిర్వాహకులైన దర్శనం శర్మగారియొక్క, వారి సహోదరులైన శ్రీ మరుమామల దత్తాత్రేయశర్మగారి యొక్క దృష్టిలో పడి వారి సమక్షంలోనే ప్రత్యక్షావధానం చేయగలిగారు అంటే మనం అర్థం చేసుకోవచ్చును వారి పట్టుదల ఎంతగొప్పదోనని.
శ్రీ భైరపనేని పోతురాజు గారికి ఇష్టమైన గుర్తు.
అహంకారమునకు స్వార్థమునకు దూరుఁడయిన శ్రీ భైరపనేని పోతురాజుచౌదరీ...
తమ ఎదుగుదలను మాత్రమే చూచుకొనేవారు లోకంలో అనేకులుండవచ్చును. కాని తన కారణంగా సాహితీప్రియులందరూ అవధానవిద్యాకర్షకులై సాధన చేసి అవధానులుగా తీర్చి దిద్దబడాలనే మహత్తరమైన తలంపు ఉండేది జగన్మాత అనుగ్రహపాత్రులలో మాత్రమే ఉంటుంది. అట్టి అపురూపమైన వ్యక్తులలో మన పోతురాజు అవధాని ఒకరు.
తమ ఎదుగుదలను మాత్రమే చూచుకొనేవారు లోకంలో అనేకులుండవచ్చును. కాని తన కారణంగా సాహితీప్రియులందరూ అవధానవిద్యాకర్షకులై సాధన చేసి అవధానులుగా తీర్చి దిద్దబడాలనే మహత్తరమైన తలంపు ఉండేది జగన్మాత అనుగ్రహపాత్రులలో మాత్రమే ఉంటుంది. అట్టి అపురూపమైన వ్యక్తులలో మన పోతురాజు అవధాని ఒకరు.
శ్రీ నారాయణీ అవధాన వేదిక అనే అంతర్జాల వేదికను కల్పించుకొని, ఔత్సాహికులను ఆ సమూహ సభ్యులుగా చేర్చి వారం వారం ఒక అవధానం ఔత్సాహికులతో చేయించు వీరి వైనం సాహితీ ప్రియులకు, అవధానప్రియులకు ఆనందం కలిగించక మానదు.
శ్రీ నారాయణీ అవధాన వేదిక ద్వారా తే16 - 8 - 2026న రెండు బృహత్తరమైన కార్యక్రమాలను వ్యయప్రయాసలకోర్చి నిర్వహించుటయే వీరిమహోన్నతమైన ఉద్దేశ్యాన్ని తెలియఁజేస్తుంది.
ఇది ఆరంభశూరత్వమే అనుకొంటే పొరపాటే. సభాముఖంగా వీరి ప్రతీనెలా నిర్వహింపదలుచుకొన్న కార్యక్రమ ప్రణాళికను వివరించారు.
అట్టి యీ జగన్మాత భక్తులు ఎవరికైనా ఆదర్శం కాకుండా ఎలా ఉంటారు?
అట్టి వీరి ఆశయాలు నిర్విఘ్నంగా నిరంతరం సాగేలా ఆజగన్మాత చేయఁగలదు. తోటివారిగా మనమంతా వారికివెన్నుదన్నుగా నిలఁబడి, మీతో మేమున్నాము అనే భరోసా యివ్వఁగలిగితే ఈ అవధాని అద్భుతాలు చేస్తారనడంలో సందేహం లేదు.
అవధాని భైరపనేని పోతురాజు గారికి జగన్మాత స్మరణపూర్వకంగా శుభాకాంక్షలందఁజేయుచున్నాను.
శ్రీమన్మంగళశాంభవీ తనయుఁడా! శ్రీపోతురాజాఖ్య! మీ
క్షేమంబున్ గను శాంభవీ జననియే శ్రీమార్గమున్ జూపుచున్,
ధీమంతా శతవర్షముల్ వెలుగుడీ తేజంబుతో నిట్టులే,
మీ మంచిన్ గ్రహియించు సజ్జనులు, సంప్రీతిన్ గనన్ జేయుచున్.
శుభమస్తు.
జైహింద్.
Print this post
వ్రాసినది



0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.