జైశ్రీరామ్
శ్రీమన్నారాయణ శతకము.
రచన. చింతా రామకృష్ణారావు
1. శా. శ్రీన్నీవక్షమునందు నిల్పి, సుజన శ్రేయంబు చేయించు నీ
వన్నన్ మాకు ప్రమోదమే. సుగుణ సౌహార్ద్రంబులన్ మాకు మే
మున్నన్నాళ్ళునుఁ దక్కఁ జేతువని దీనోద్ధారకా! దేవ!. శ్రీ
మన్నారాయణ! సత్య సన్నుత గుణా! మద్భాగ్య సంవర్ధనా!
భావము. దీనోద్ధారకా! ఓ దేవాది దేవా! సత్యము కారణముగా సన్నుతింపఁ బడెడి గుణములు కలవాడా! నా భాగ్యమును ప్రవృద్ధి చేయువాఁడా! శ్రీమన్నారాయణా! మేమున్నన్నాళ్ళును సుగుణ సౌహార్ద్రంబులను మాకు కలుఁగ చేతువని లక్ష్మీదేవిని నీ వక్షస్థలముపై నిలిపి, మంచివారికి శ్రేయస్సును చేయించెడి నీవన్నచో మాకు చాలా యిష్టమే సుమా.
2. శా. నిన్నున్నే ధర నెంచఁగా తగుదునా? నీరేజపత్రేక్షణా!
పున్నామాదులనుండి కాచెదవుగా, పూజ్యుండ! నన్నెంచుచున్.
మన్నింతున్ మది నిన్ను నేను. కనుమా మర్యాదనే నిల్పి, శ్రీ
మన్నారాయణ! కావుమీజగతిఁ బ్రేమన్ మీ రమా సాధ్వితోన్.
భావము. ఓ శ్రీమన్నారాయణా! ఓ పద్మనేత్రుఁడా! భూమిపై నిన్ను నేను ఎంచుటకు సరిపోదునా? ఓ పూజ్యుఁడా! నన్ను గుర్తించుచు పున్నామాది నరకముల నుండి మమ్ము కాపాడుదువు కదా. నిన్ను గుర్తించి నేను గౌరవింతును. నామర్యాద నిలిపుచు, లోకమును ప్రేమ అతిశయించు మీ రమా సాధ్వితో కాపాడుము.
3. శా. క్రన్నన్ గావఁగ వచ్చి ప్రోతు వనుచున్, కన్పింతువీవంచు నో
కన్నా! చిత్త కవాటమున్ దెరచి, నీకై వేచి నేనుంటి, నా
కన్నుల్ కాయలు కాచుచుండె, నయినన్ గన్పింప రావేల? శ్రీ
మన్నారాయణ! గాంచ నేరనొ నినుం భాసించుచున్నన్ హృదిన్.
భావము. ఓ శ్రీమన్నారాయణా! ఓ కన్నతండ్రీ! వేగమే కాపాడుటకు వచ్చి నన్ను కాపాడుదువనియు, నీవు నాకు కనిపింతువనియు, నా హృదయ కవాటమును తెరచి నీకై వేచి యుంటిని. నా కన్నులు కాయలు కాచుచుండెను అయినప్పటికీ నీవు నాకు కనిపించగా రావేమి? నా హృదయముననే నీవు ప్రకాశించుచున్నప్పటికీ నిన్ను చూచుట నే నెఱుఁగకుంటినా?
4. శా. అన్నా కేశవ! మాధవా! నృహరి! మోహాతీత! గోవింద! రా
మన్నా! కృష్ణుడ! వామనా! సకల ప్రేమాధార! విశ్వేశ! యే
మన్నన్ నీదు ప్రశస్తనామమగు. మోహాంధంబునే బాపు. శ్రీ
మన్నారాయణ! నీదు నామ మహిమన్ మమ్మున్ సుఖంబందనీ.
భావము. ఓఅన్నా. శ్రీమన్నారాయణా! కేశవా! మాధవా ! నరహరీ ! మోహాతీతుడా ! గోవిందుడా! ఓ రామన్నా ! ఓ కృష్ణుడా! వామనా! సమస్తమైన ప్రేమాధారమైనవాడా! ఓ లోకేశా! మేము ఏది పలికినప్పటికీ అది నీ యొక్క.పేరే యగును. మోహాంధకారమును పోగొట్టును. నీ నామ మహీమచే మమ్ములను సుఖమునందనిమ్ము. పోగొట్టెడివాడా. నీ నామ మహీమచే మమ్ములను సుఖమునందనిమ్ము.

5. శా. ఎన్నం జాలుదె? నీ ప్రసిద్ధ పద సంస్పృత్యంబు నా చిత్తమం
దెన్నెన్నో మహిమల్ కనం బరచునే దృగ్గోచరంబైన నో
కన్నా! నా కనులార చూచుటకు నే కాంక్షించుదున్. నీవె శ్రీ
మన్నారాయణ! నీదు పాద వరపద్మమ్ముల్ కనం జేయుమా.
భావము. ఓ దేవా! శ్రీమన్నారాయణా! నీ ప్రసిద్ధమైన పాద స్పర్శను కనీసము నేను మనసున ఊహించుటకైనను సరిపోదునా? ఓ కన్నతండ్రీ! నా కంటికి ఆ పదములు కనిపించినచో ఎన్నెన్నో మహిమలను చూపించును కదా. అట్టి నీ పాద పద్మములను నా కనులారా చూడవలెనని నేను కోరుకొందును. నీవే నీ పాద పద్మములు నాకు చూచునట్లుగా చేయుము.
6. శా. నిన్నుం గాంచిరి ధీనిధుల్ జగమునన్ నిత్యాత్ముఁగా నేర్పుతోన్
గన్నుల్ వేయిగ, కాళ్ళు వేయి, శిరముల్ గాంచంగ వేయుండుటన్,
సున్నాయౌ పరి పూర్ణమందు నిను దాసుల్గాంచినారయ్య! శ్రీ
మన్నారాయణ! చూతునన్నిట నినున్ మన్నించి నిన్ గాంచనీ.
భావము. ఓ శ్రీమన్నారాయణా! ధీ నిధులు నిన్ను నిత్యాత్మునిగా లోకములో వేయి కన్నులుగ,
పాదములు వేయిగా వేయి శిరములుగా నీకు ఉండుట. శూన్యమయిన ఆకారములో పరిపూర్ణ
స్వరూపుడుగా నీ దాసులు నిన్ను నైపుణ్యముతో చూడఁగలిగిరి. నిన్ను నేను
అన్నింటియందును చూతును. నన్ను మన్నించి నిన్ను చూడనిమ్ము.
7. శా. మన్నున్ దింటివటంచు తల్లి నిను ప్రేమన్ వీడి చూపించు మో
యన్నా యంచును తిట్టినంతటనె మోహబ్రాంతులన్ బాపుచున్
నిన్నున్నట్టిజగమ్ము చూపితివిగా! కృష్ణుండుగా నీవు. శ్రీ
మన్నారాయణ! మేము కూడ కనలే మా చూపరావేలరా?
భావము. ఓ శ్రీమన్నారాయణా! నేవు కృష్ణుఁడుగా ఉన్నప్పుడు నీ తల్లి నీవు మన్ను తింటివని ప్రేమనుకూడా విడిచిపెట్టి నిన్ను ఏదీ నీ నోరు చూపించు అని కోపగించి పలుకగా ఆమెలో ఉన్న
మోహభ్రాంతులను పోగొట్టుచు నీలో ఉన్న సమస్త విశ్వమును చూపితివికదా. మేము
మాత్రము నీవు ఆవిధముగా చూపినచో చూడలేమా యేమి. మై మాకు చూపుటకు
నీవేలరాకుంటివి?
8. శా. మున్నే నిన్ను మనమ్మునన్ మననమున్ మన్నించి మున్నుంచినన్
నన్నున్, నానిను నెన్నునాన్ననుననూనా! మున్నె రక్షించు నీ
కన్నా రక్షకు లెవ్వరయ్య. మనమున్ కాచేటి మా దేవ! శ్రీ
మన్నారాయణ! పాహిపాహి జగతిన్ మన్నించి రక్షింపుమా! భావము. అనూనమైన ఓ శ్రీమన్నారాయణా! ఇతః పూర్వమే నిన్ను మనసులో మన్నించి ముందుగా నిలిపిన నన్ను నాకు సంబంధించిన నిన్ను, గుర్తించెడి నా యొక్క అన్నను ముందుగానన్ను రక్షించునటువంటి నీకన్నారక్షకులింకెవరు? మనసుపెట్టి కాపాడేటువంటి మా దేవా! లోకమునుమన్ననఁ జేయుచు బాగుగా రక్షింపుము.
9. శా. ఉన్నావీవు హృదంతరాళమున స్నేహోదార సంపత్ప్రభన్,
9. శా. ఉన్నావీవు హృదంతరాళమున స్నేహోదార సంపత్ప్రభన్,
పిన్నన్, నేఁ గనఁ జాలుదెట్లు నిను? గోపీనాథ! యంతర్ముఖుం
డెన్జాలు నినున్, శుభాస్పదుఁడ! నీవే నన్ను దర్శించు. శ్రీ
మన్నారాయణ! పూజ్య పాద జలజా! మాం పాహి సర్వేశ్వరా!
భావము. ఓ శ్రీమన్నారాయణా! నీవు నా హృదంతరాళమున స్నేహోదార సంపత్ప్రభతో కొలువై యున్నావు. నేను చిన్నవాడిని. నిన్ను ఏ విధముగ చూడఁగలను? అంతర్ముఖుఁడైనవాఁడు నిన్ను గుర్తించగలడు. ఓ శుభాస్పదుఁడా! నీవే నన్ను దర్శించుకొనుము. ఓ పూజ్య పాదపద్మములు కలవాడా! సర్వేశ్వరా! నన్ను రక్షించుము.
10. శా. మిన్నున్ గాంచిన నీవె నిండితివటన్ కృష్ణా! జగత్ కారకా!
మన్నున్ గాంచిననుంటివీవె యచటన్ మాదేవరా! యెట్లు నీ
వున్నావన్నిట నెల్ల వేళలను ? నేనున్నా నిటన్ జూడు శ్రీ
మన్నారాయణ! నీదు పాద యుగళిం భావింపఁగా చేయరా!
భావము. ఓ శ్రీమన్నారాయణా! జగత్కారకుడవైన ఓ శ్రీకృష్ణా! ఆకాశమును చూచినచో అక్కడ నీవే నిండియున్నావు. భూమిని చూచినను అక్కడ కూడా నీవే నిండియున్నావు. ఓ మా దైవమా! అన్ని సమయములందును అన్ని ప్రదేశములయందునుఏ విధముగా నీవుంటివి? ఇక్కడనేనుంటిని. నన్ను చూడుము. నీ పాదద్వయమును నా మనమున భావించునట్లు చేయుము.
11. శా. పున్నెంబుండును పేదలన్ గనుమయా. పోషింపగా లేక తా
మన్నంబైనను పెట్ట లేక సుతులం బాధించుచున్నారు. నీ
వున్నావన్నది సత్యమై ప్రబలగానోదార్చి పోకార్పు శ్రీ
మన్నారాయణ! భాధలన్ బ్రజలకున్, మాకీవ మూలంబుగా.
భావము. ఓశ్రీమన్నారాయణా! నీకు పుణ్యముఃడును. పేదవారిని చూడుము. తమ
సంతానమునుపోషింప.లేక కనీసము వారికన్నమైనను పెట్ట లేక ఆకలిబాధకు లోనగునట్లు
చేయుచున్నారు. నీవున్నావన్నవిషయము సత్యమై వ్యాపించునట్లుగా అట్టి
పేదలనోదార్చి వారి పేదరికమును పోగొట్టుము. శ్రేష్టమైన మనసు కలవాడవయి వారి
కష్టములను మాపివేయుము.
12. శా. పున్నెంబే కద పేద సాదలకు ప్రాపుం గొల్ప నీవున్నచో
మన్నింపంబడు దీవెగా? దయను రామా! కావు మమ్మంచు వా
రున్నం గానవు, నీకు నొప్పగునొ? కాదో పాపమిట్లున్న? శ్రీ
మన్నారాయణ! శ్రీరమా రమణ! ప్రేమం జూపుమా వారిపై!
భావము. ఓ శ్రీమన్నారాయణా! నీవున్నట్లైనచో పేదసాదలకు ఆధారము కల్పించితివేని అది నీకు పుణ్యమే కదా. వారిచేత నీవేకదా గౌరవింపఁబడుదువు? ఓ రామా దయతో మమ్ము కాపాడుమయ్యా అనుచు ఆ పేదలు నిన్ను ప్రార్థించుచున్నను నీవు చూడవుకదా. ఇది నీకు సముచితమగునాయేమి? ఈ విధముగ చేసిన నీకు పాపమంటదా? ఓ రమారమణా! నీవు అట్టి వారిపై ప్రేమను చూపుము.
13. శా. కన్నుల్ కల్గఁగఁ జేసితీవె కనఁగా కన్నార నిన్ గానగాన్.
కన్నా! నిన్ గనుఁగొన్న మన్ననమెగా? కాన్పింప రావేలఁ, గా
కున్నన్ సర్వ జగంబునన్ గనమనా కూర్మిన్ నినున్? దేవ! శ్రీ
మన్నారాయణ! కాంతుమన్నిట నినున్ మర్మంబు పోకార్పినన్!
భావము. ఓ శ్రీమన్నారాయణా! ఆలోచింపగా కన్నులనిండుగా నిన్ను చూచుట కొఱకు నీవు మాకు కన్నులను కల్గునట్లు చేసితివి. ఓ కన్నయ్యా! నిన్ను చూచినచో మాకు గౌరవమే కదా. అటువంటప్పుడు మాకు కనిపించవేమి? ఆ విధము కానిపక్షమున సమస్త లోకమున ప్రేమతో నిన్నే చూడమనా. ఓ దేవా! మాలో మాయను నీవు పోవునట్లు చేసితివేని అన్నింటి యందును నిన్నే మేము చూచెదము.
14. శా. కన్నుల్ జూచెడి శక్తి కల్గియును నిన్ గాంచంగ లేవేలనో?
మన్నైపోయెడి దేహమందు కల నిన్ మర్యాదగా జూడలే
కున్నన్ గన్నులవేల మాకు? కననీవో నిన్ను గుర్తించి, శ్రీ
మన్నారాయణ! దేహివౌచు గల నిన్ మా కండ్లతోఁ జూడనీ.
భావము. ఓ శ్రీమన్నారాయణా! కన్నులకు చూచెడి శక్తి యున్నప్పటికీ ఎందుచేతనో కాని నిన్ను చూడలేకపోవుచున్నవి మన్నైపోయే ఈ శరీరమునగల నిన్ను గౌరవప్రదముగా చూడలేకపోయినచో అట్టి కన్నులు మాకెందులకు? నిన్ను గుర్తించి చూడనీయవా యేమి? దేహధారివై మా రూపములో నున్న నిన్ను ఈ కన్నులతో చూడనిమ్ము.
15. శా. కన్నారన్ నినుఁ గాంచ వేడుక, జగత్ కల్యాణ రూపుండ! నే
నున్నానంతట చూడు నన్ననుచు మా యూహల్ నిజంబంచు, మా
పున్నెంబై కనిపించుమొక్కపరి. మేమున్ నీకు కన్పింప. శ్రీ
మన్నారాయణ నీదు మంచి కననీ. మాపూజలందించనీ. .
భావము. లోక కల్యాణ స్వరూపా! ఓ శ్రీమన్నారాయణా! మా కన్నులారా నిన్ను చూడవలెనని మాకు వేడుక. నేను అంతటా ఉన్నాను అనుచూ మా ఊహలు నిజమే అనుచు ఒక్కపర్యాము మేమూ నీకు కనిపించు విధముగా మా ముందు నిలిచి, మా పుణ్య ఫలమై కనిపించుము. నిన్ను మనసారా చూడనీ. మా పూజలు నీకు మేమందించునట్లు అనుగ్రహింపుము.
16. శా. విన్నన్ నీ శుభ నామమే వినవలెన్ విభ్రాంతులం బాయగా.
కన్నన్ నీ దర హాసమే కనవలెన్ గాంచంగ మోక్షంబు. లే
కున్నన్ జన్మము వ్యర్తమే కనగ. దీనోద్ధారకా! దేవ! శ్రీ
మన్నారాయణ! ప్రేమతోడ మములన్ మన్నించి రక్షింపుమా.
భావము. దీనోద్ధారకా! ఓ శ్రీమన్నారాయణా! విన్నట్లైతే మాలో క్రమ్ముకొనిన భ్రాంతులు మాసిపోవువిధముగా నీ నామమే వినవలెను కదా. చూచినట్లైతే మోక్షము పొందజేయు నీ చిఱునగవే కనవలెను. ఆ విధముగ కానినాడు ఈ జన్మము వ్యర్థమే సుమా. ప్రేమతో మమ్ములను మన్నించి రక్షించుము.
17. శా. వన్నెల్, చిన్నెలు, భ్రాంతి కారకములా భ్రాంతిన్ హృదిన్ గోర్కెలౌ
నెన్నన్, గోర్కెల శత్రు షట్కమలమున్, దృష్టంబధోదుర్గతుల్.
కన్నుల్ మూలములింతకున్ కనుక నే కాంక్షింతు జ్ఞానాక్షి. శ్రీ
మన్నారాయణ! జ్ఞాన నేత్రమగుచున్ మాయందు నీవుండుమా.
భావము. ఓ శ్రీమన్నారాయణా! ఈ జగత్తులోని వన్నెలు చిన్నెలు కేవలము మాలో భ్రాంతి పుట్టుటకు మూలములు. అట్టి భ్రాంతి కారణముగా మాలో కోరికలు జనించును. ఈ కోరికల కారణముగా అరిషడ్వర్గము మాలో అలముకొనును. ఆపై దుష్టమైన అధోగతులు నిశ్చయము.. ఇన్నింటికీ కన్నులే మూలము కనుక నేను నిన్ను జ్ఞాననేత్రమును మాకు ప్రసాదించుమని కోరుచుందును. నీవే జ్ఞాన నేత్రముగా ఉండుము.
18. శా. విన్నన్ జాలును నీదు నామ మహిమల్ వీనుల్ శుభంబుల్ కనున్.
విన్నన్ లౌకిక దౌష్ట్యముల్ పతనమే వీనుల్ ప్రబంధించు, నో
యన్నా నీ శుభ నామ దివ్య సుధ జ్ఞేయంబై వినం జేసి, శ్రీ
మన్నారాయణ ముక్తి దాతవయి మా మర్యాదనే నిల్పుమా.
భావము.
ఓ శ్రీమన్నారాయణా!నీ నామ మహిమను విన్నంత మాత్రమున చెవులు శుభములు పొందును.లౌకికమైన దౌష్ట్యములను ఈ చెవులు విన్నచో పతనమునే ప్రబంధించును. నీయొక్క శుభప్రదమైన దివ్యమైన నామామృతమును జ్ఞేయమగుచు వినునట్లు చేసి మాకు ముక్తి దాతవయి, మా మర్యాదను నిలుపుము.
19. శా. పున్నెంబెంతగ కావలెన్ గొలువ నీ పూజ్యాంఘ్రి సాహస్రమున్?
కన్నుల్ కాయలవెంత కాయవలె నిన్ గాంచంగ విశ్వేశ? పో
తన్నన్ గావలెనా నుతింప నిను మోహ భ్రాంతులన్ వీడి? శ్రీ
మన్నారాయణ! మా మదిన్ నిలువుమా! మమ్మున్ గృపన్ జూడుమా.
భావము.
ఓ శ్రీమన్నారాయణా! నీ పూజ్య పాదములను సేవించవలెనన్న మాకెంతటి పుణ్యఫలము ఉండవలెనయ్యా? ఓ విశ్వేశ! నిన్ను చూచుటకొరకై ఎదురు చూచుచు కన్నులెంతగా కాయలు కాయవలెను? మోహభ్రాంతులను విడిచిపెట్టి నిన్ను నుతింపవలెనన మేము భాగవతోత్తముఁడైన పోతన్నగా అవవలెనా? మా మదిలో నీవు నిలిచియుండుము. మమ్ములను కృపతో చూడుము.
20. శా. జున్నున్, బాలును, మీగడల్, పెరుగు, సంశోభన్ మదిన్ దోచు నా
వెన్నల్, ఘుంఘుమలాడు నేయియును, భావింపంగ నీకేలయా?
మన్నున్ మెక్కితి వంచు నీ జనని నిన్ మర్దింపగా జూచె, శ్రీ
మన్నారాయణ! చూడ నన్నిట నినున్మాకున్ బ్రబోధింపనో?
భావము.
ఓ శ్రీమన్నారాయణా! మన్నును తింటివని నిన్ను నీ తల్లి దండింపఁ జూచెను కదా! ఆవిధముగా మన్నుతినెడి నీకు జున్ను, పాలు, మీఁగడ, పెరుగు, వెన్న, నేయి, ఇవన్నియు యెందులకు? నిన్ను అన్నింటిలోను చూచెడి విధానమును మాకు ప్రబోధించుట కనియా?
21. శా. ఉన్నావీవిట నన్నుఁ జేరి యని, స్నేహోత్సాహ సంపన్నులై
నన్నున్ మాన్యులు సన్నుతింతురయ. నేనా? నీవ? స్తుత్యార్హతన్
వన్నెన్ గాంచుట? నే గ్రహించితిని. నీ వన్నెల్ ననుం జేరి శ్రీ
మన్నారాయణ! నన్ను నిల్పుటను, సన్మాన్యత్వమున్ గొల్పుటన్.
భావము. ఓ శ్రీమన్నారాయణా! ఇచ్చట నీవు నన్ను చేరి ఉన్నావని స్నేహ భావముచే కలిగిన ఉత్సాహమే సంపదదగా కలవారైమాన్యులు నన్ను సన్నుతి చేయుదురు. స్తుత్యార్హతతో నీవా నేనా వన్నెను గాంచిట? ఆలోచింపగా నీవు నన్ను చేరి నన్ను స్థిరపరచుటకును, సమ్మాన్యత్వము కల్పించుటకును నీవు చేయుచున్నదని నేను గ్రహించితిని.
22. శా. నిన్నున్ గోరగ లేదు పుట్టుటకునై, నీవేల బుట్టించితో?
పున్నెంబీయఁగ వేడ లేదు. నిను నే భోగంబులం గోరలే
దున్నన్నాళ్ళును నీదె బాధ్యత కదా! ఉద్ధారకుండీవె. శ్రీ
మన్నారాయణ! కన్న నీవె సతమున్ మమ్మున్ గృపన్ జూడనౌన్.
భావము. ఓ శ్రీమన్నారాయణా!నిన్ను మేము మమ్ములను పుట్టించమని మేము కోరలేదుకదా. మరి నీవేల మమ్ము పుట్టించితివి?నిన్ను మేము పుణ్యమునీయమని కోరలేదు. భోగభాగ్యములను కోరుట లేదు. ఉన్నన్నాళ్ళును బాధ్యత నీదే కదా.మమ్ములను ఉద్ధరించువాడవు నీవే కదా. మమ్ములను కన్నట్టి నీవే ఎల్లప్పుడూ కృపతో చూడనగును కదా.
23 శా. పున్నెంబెన్నఁగ నేది యౌను? గుడిలోఁ బూజించ నిన్ బున్నెమా?
మన్నున్ దున్నుచునుండి, పంట ప్రజకై పండించినన్ బున్నెమా?
ఎన్నాళ్ళైనను సేద్యమున్ విడిచి పూజింపంగ నెట్లౌను? శ్రీ
మన్నారాయణ! నిన్ను నాత్మఁ గనుచుం బ్రార్థింప పున్నెంబెగా.
భావము. ఓ శ్రీమన్నారాయణా! ఎన్నిక చేసి చూచినచో పుణ్యమనాగా ఏది యగును? గుడిలో నిన్ను పూజించుట పుణ్యమగునా? భూమిని దున్నుచు ప్రజలకై పంటలు పండించుట పుణ్యమా?ఎన్నాళ్ళు గడుచుచున్నను వ్యవసాయము చేయుట మాని నిన్ను గుడికి వచ్చి కొలుచుట ఎట్లు కుదురును? నిన్ను మనసులో తలచుకొని, ప్రార్థించినచో పుణ్యమేకదా.
24. శా. సాన్నిధ్యంబున నిల్పు నీకు ననునీశా భక్త కల్పద్రుమా!
సన్నద్ధుండను నీ పదార్చనవిధిన్ సంతోషమున్ బొంద నీ
మున్నున్నన్ భవ బంధముల్ తొలఁగు సంపూర్ణాకృతిన్ గాంచ, శ్రీ
మన్నారాయణ భక్తియుక్తునయి నీ మాహాత్మ్యమున్ గాంచనీ.
భావము. ఓ శ్రీమన్నారాయణా! ఓ పరమేశా! భక్తులపాలిటి కల్పవృక్షమా! నన్ను నీకు సమీపమున నిలుపుము. నీ పాదార్చన చేయుట అనే పని వలన సంతోషము పొందుటకు నేను సిద్ధముగా ఉంటిని. నీ ముందు ఉన్నచో నీ పరిపూర్ణమైన ఆకారము చూచుటచేత మా భవ బంధములు తొలఁగిపోవును. భక్తితో కూడుకొన్నవాడినయి నీయొక్క మాహాత్మ్యమును చూడనిమ్ము.
25. శా. ఉన్నావీవు మదిన్ సుచేతనముగా, నున్నావు దేహంబువై.
యున్నావెల్లెడ స్థావరంబులను నీవున్నావుగా జంగమం
బున్నిత్యుండుగ నుంటి వెల్లెడల, సంపూర్ణుండవౌ నిన్ను శ్రీ
మన్నారాయణ! కానలేకునికి యీ మాలోని `మా’భావనే.
భావము. ఓ శ్రీమన్నారాయణా! నీవు చైతన్య రూపములో నిత్యము మాలో ఉంటివి. ఈ శరీర ముగా ఉన్నదియు నీవే. అన్ని కదలని వాటియందును నీవుంటివి. అన్ని కదిలెడి వాటియందును నీవుంటివి. నీవు ఇత్యుఁడవై అంతటను ఉంటివి. పరిపూర్ణ స్వరూపుఁడవైన మేము కానలేకపోవుటకు కారణము మాలో గూడుకట్టుకొని యున్న మాది, మేము అనే మా అహం భావనయేయే కదా!
26. శా. ఉన్నామంచు నహంకరించితిమొ, మేమున్నట్లు సాక్ష్యంబుగా
మన్నున్ జేరక వన్నెలన్వెలుగుచున్ మాన్యత్వమున్ జూపనౌ
నెన్నాళ్ళైనను. కాని లేమటుల మా యిచ్ఛానుసారంబు. శ్రీ
మన్నారాయణ! నీవె మేమగుటచే మాయన్నదే లేదుగా!
భావము. మేముంటిమి అని అహంకరించుచు మేము ప్రవర్తించుదుమా? అట్లైన మా ఉనికికి సాక్ష్యముగా ఎన్నటికీ మట్టిలో కలియకుండా, ఏన్నాళ్ళైనను కళ కాంతులతో మా మాన్యత్వమును ప్రదర్శింప వలెను కదా? మరి మేము కోరుకొను ఆ విధముగా మేము ఉండలేము. ఓ శ్రీమన్నారాయణా! నీవే మేమయి యుండగా మరి మా అనేది ఎక్కడ కలదు? అంతా నీవే సుమా!
27. శా. నిన్నున్ నమ్మిన మేలటంచు సుజనుల్ నిత్యంబు నమ్మున్ నినున్,
నిన్నున్ నన్నును నమ్ముకొన్న ఘనులన్ నేర్పున్ గృపం గావుమా
పన్నత్రాతగ నిల్చి, భక్త సులభా! ప్రారబ్ధముల్ బాపు శ్రీ
మన్నారాయణ! మంచి మార్గమిడు సంపత్కారకా శ్రీధరా!
భావము. ఓ శ్రీమన్నారాయణా! నిన్ను నమ్మినచో తప్పక మేలు కలుగుననుచు భావించి సుజనులు నిన్నునమ్ముదురు. నిన్ను నిన్నుగూర్చి తెలిపెడి నన్నును నమ్ముకొనెడివారిని నిత్యము కృపతో కాపాడుము. ఓ సంపత్కారకా! ఓ శ్రీధరా! ఓ భక్త సులభా! ఆపదలనుండి రక్షించువాడివై నిలిచి మా ప్రారబ్ధములు పోఁగొట్టి, మాకు మంచి మార్గమిడుము.
28. శా. నిన్నే గంటిని పండితాళి మదులన్ నేర్పార నుండంగ, ని
న్నెన్నున్ మన్నన నా సుధీమణి గణం బేమా మహత్వంబు! మా
కన్నుల్ ముందర నిన్ను నిల్పుదురు రాగ ద్వేషముల్ బాప, శ్రీ
మన్నారాయణ! పండితాళి మదులన్ భాసింతువో నిత్యమున్?
భావము. ఓ శ్రీమన్నారాయణా! పండితుల మనసులలో నీవు నైపుణ్యముతో ఉండగా నేను వారిలో నిన్నే చూచితిని. ఆ జ్ఞానుల సమూహము మన్నన చేయుచు వారి మనసులలో నిన్నే ఎన్నును. అహా! ఏమా గొప్పఁదనము! మాలోని రాగద్వేషాదులను మటుమాయము చేయుట కొఱకు నీ గాధలు తమ ఉపన్యాసములద్వారా ఆవిష్కరించుచు మా కన్నులముందు నిన్ను నిలుపుదురుకదా. నీవు ఎల్లప్పుడు పండితుల మనసులలో ప్రకాశించుచుందువా?
29. శా. కన్నుల్ నిండుగ కాంతిరేఖలవిగో కారుణ్యమున్ వెల్గుచున్,
మిన్నున్ మించెడి నీలివర్ణమదిగో మేలైన ఈ దేహమున్,
కన్నుల్ పండువ కాదె కాంచ నిను శ్రీకాంతా శుభోపేత! శ్రీ
మన్నారాయణ! భక్త పాలన గుణా! మాకళ్ళలో నుండుమా!
భావము. భక్తపాలనగుణసంపన్నుడవైన ఓ శ్రీమన్నారాయణా! ఆహా! మా కన్నులు నిండుగా కారుణ్యముతో ప్రకాశించుచు కనిపించు నీ కాంతిరేఖలు అవిగో, కనిపించుచున్నవి. ఆకాశమును మించిపోయెడి నీలివర్ణము అదిగో నీ శరీరమున కానవచ్చుచున్నది. ఓ శ్రీకాంతుడా! శుభోపేతుఁడా! నిన్ను చూచినచో కన్నులపండువేకదా. నీవు మా కళ్ళలోనే ఉండిపొమ్ము.
30. శా. ఎన్నో జన్మలు ఘోరమైన తపముల్ హృద్యంబుగా చేసినన్
న్నిన్నుం జూడఁగఁ జాలరైరి ఋషులో నిత్యుండ! నీవే మమున్
గన్నారన్ గనమంచు చూపుదువు నీ కల్యాణ రూపంబు. శ్రీ
మన్నారాయణ! సర్వమీవె కద! ప్రేమన్ జూతుమన్నింట నిన్.
భావము. నిత్యుఁడవైన ఓ శ్రీమన్నారాయణా! ఘోరమైన తపస్సులు ఎన్నో జన్మలు హృద్యముగా చేసినప్పటికి ఋషులు నిన్ను చూడలేకపోయిరి. నీ మంగళప్రదమైన రూపమును మమ్ములను కనులారా చూడమని చూపుదువు నీవు. అంతా నీవే కదా. నిన్ను మేము అన్నింటియందును ప్రేమతో చూచెదము.
31. శా. నిన్నుం జూచెద పక్షులన్ బశువులన్, దృగ్గోచరంబౌచు నీ
వెన్నింటం గలవన్నిటన్ గనియెదన్ సృష్టిం వివేకంబుతోన్.
భిన్నంబింతయు కానరాదవియు నీవేగా! దయాపూర్ణ! శ్రీ
మన్నారాయణ! నీవె లేని యెడలన్ మాకెట్లు కానంబడున్?
భావము. ఓ శ్రీమన్నారాయణా! పక్షులయందున, పశువులయందున నేను నిన్నే చూచెదను సుమా. కంటికి కనఁబడుచు నీవు ఎన్నింటిలో ఉండియుంటివో అన్నింటియందును నిన్ను వివేకముతో చూచెదను.ఏమాత్రము భేదమనునదే ఈ సృషికి నీకు మధ్య కనఁబడదు. కనిపించెడి గొప్ప శోభలెల్లప్పుడు నీకు సంబంధించినవే కదా! నీవు లేవు అనునదేదైనా ఉన్నచో అది మాకు ఏవిధముగ కనబడును?
32. శా. మన్నై పోవఁడు దేహీ. దేహ జగతిన్ మార్తాండుఁడై వెల్గు తా
నెన్నోకర్మలు చేయఁ జేసి తుదకున్ హీనంబవన్ శక్తి, యా
మన్నున్వీడి పరంబు చేరు నిహమున్ బ్రాప్తించు పాపంబొ. శ్రీ
మన్నారాయణ పుణ్యమో. తమరివే. మాకేలనీ ప్రాప్తముల్.
భావము. ఓశ్రీమన్నారాయణా! దేహముననుండు దేహియైన ఆ ప్రాణశక్తి మట్టిగా అవడు. అతడు యీ శరీలమనెడి లోకములో సూర్యుడై వెలుగుచుండి ఆ దేహముచే ఎన్నో కర్మలను చేయజేసి, తుదకు శరీరమునందలి శక్తి క్షీణించగా ఆ శరీరమును విడిచి వెడలిపోవును. ఇక్కడ చేసెడి కర్మల వలన లభించెడిది పాపమో లేక పుణ్యమో, అవి తమరివేసుమా. ఈ కర్మ ఫలములు మాకవసరము లేదు.

33. శా. మిన్నున్ మన్నును నేకమైననగు, నీ మీదన్ ప్రమోదంబు పొ
మ్మన్నన్ బోవగరాని మార్గమిడు నీ మంచిన్, మనోజ్ఞంబుగా
నెన్నంజాలు పదంబులే దొరకవే, హే భక్త మందార! శ్రీ
మన్నారాయణ! సత్ పదాంబుజములన్ మాకందనీ కొల్వగా. 28 . 01 . 2018.
భావము. ఓశ్రీమన్నారాయణా! ఆకాశము భూమి ఒకటిగా ఐపోయినను ఐపోవచ్చునుగాక.మాకు నీపై ఉన్న మిక్కిలి యిష్టము మాత్రముపొమ్మన్నను పోకుండా ఉండు మార్గమును మాకు కల్పించునటువంటి నీలో ఉన్న మంచిని మనోజ్ఞముగా ఎన్నుటకు తగిన పదములే కరువైపోయినవి. ఓ భక్త మందారా! మంచి పద పద్మములను మేము కొలుచుకొనుటకు వీలుగా మాకు అందనిమ్ము.
34. శా. విన్నన్ జాలును నీ మహాద్భుత కథల్ విశ్వాసమున్ నిల్పి. నే
నున్నానంచు మనమ్మునన్ నిలిచి దీనోద్ధారకుండా మమున్
మన్నున్ జేతికినంటనీక జగతిన్ మన్నించి కాపాడు శ్రీ
మన్నారాయణ! భక్త బాంధవ! తరమ్మా నిన్ బ్రశంసింపగన్?
భావము. దీనులనుద్ధరించెడివాడవైనఓ శ్రీమన్నారాయణా! నీపై విశ్వాసముంచి నీకు సంబంధించిన అద్భుతమైన కథలను విన్నచో సరిపోవును. నేనున్నాను మీకు అనుచు మా మనస్సులలో నీవు నిలిచి మాచేతికి ఎటువంటి ఖిలము అంటుకోకుండా చూచుచు, లోకమును కాపాడు భక్తబాంధవుఁడవు. అట్టి నిన్ను ప్రశంసించుట మా తరమగునా.
35. శా. నిన్నేనమ్ముచు నైహికంబు విడు నీ దృష్టిన్ మనీషాళి, నీ
దన్నున్ గైకొను జీవులయ్య కననీ దారిద్ర్యనారాయణుల్,
కన్నా! నిన్నె మనమ్ము నెన్ను ఘనులన్ కాపాడు నిత్యంబు శ్రీ
మన్నారాయణ! భక్త పాలన చణా! మా మాట మన్నింపుమా.
భావము. భక్తులను పాలించుటయందు నైపుణ్యము కలవాడా! శ్రీమన్నారాయణా!మహనీయులు నిన్నే విశ్వసించిఐహిక వాంఛలను విడిచిపెట్టి మనుచుడిరి. దారిద్ర్యముతో కొట్టుమిట్టాడుచున్న వారు నీ దన్నునే స్వీకరించు జీవులు. ఓ కన్నా! నిన్నే నిత్యము మనసులో భావించు మహనీయులను నిత్యము నీవే కాపాడుము. ఈ విషయములో నీవు మా మాటను మన్నించితీరవలయునుసుమా.
36. శా. పన్నీటన్ జలకంబు లాడెదవు నీ భక్తాళిచే నిత్యమున్.
కన్నీరింతయు కారనీయక కనే కారుణ్యమే లేదొకో?
యెన్నాళ్ళీ కరుణావిహీన మతివై యిట్లుందువో నీవు? శ్రీ
మన్నారాయణ! కావు భక్త జనులన్ మన్నించి పోషించుమా!
భావము. ఓ శ్రీమన్నారాయణుడ! నిత్యము నీ భక్తుల సమూహముచేత పన్నీట జలకములాడెదవు. అట్టిన్నీకు, ఆ భక్తులకు కన్నీరించుకైనను కారకుండా చూచే కరుణా స్వభావమే లేదా యేమి? నీవింకా ఎన్నినాళ్ళు ఈ విధముగా కరుణ లేనివాడవై ఈ విధముగా ఉందువు?భక్తజనులను మన్నించి, కాపాడుచుచు, వారిని పోషించుము.
37. శా. నిన్నున్ గోరెద నాలకించు మనవిన్. సృష్టిన్ గుణోపేత సం
పన్నుల్, పేదలటంచు నెంచకుము. సంభాసించు నీ మానసం
బెన్నంజాలఁ గ జేసి మేల్కొలుపు, నీవే వారియందుండి. శ్రీ
మన్నారాయణ! సత్య పోషణ గుణా! మాన్య స్వరూపా! ఘనా!
భావము. ఓ శ్రీమన్నారాయణా!సత్యమును పోషించు గుణము కలవాడా! శ్రేష్ఠమైన పూర్ణ చంద్రుని బోలు ముఖము కలవాడా! ఓ గొప్పవాఁడా! నిన్ను నేను కోరుచుంటిని. నా మనవినాలకించుము. గుణ సంపన్నులనీ, పేదలనీ భేదమును కలిగియుండకుము. వారిలో నీవుండి ప్రకాశించే నీ మనసును గుర్తించునట్లు చేయుము.
38. శా. జన్నంబుల్ పచరించి సాధకుఁడు నీ సామీప్యమున్ జేరఁగా
నెన్నున్. నేనెటు నిన్ను జేరుదునొ? నే నే జన్నమున్ చేయలే
దిన్నాళ్ళైనను. దేవదేవ నిను నే నే రీతి దర్శింతు? శ్రీ
మన్నారాయణ! నీదు నామ జపమున్ మానన్ నినున్ జేరగన్!
భావము. ఓ శ్రీమన్నారాయణా! నిన్ను దర్శింప గోరు సాధకులు యజ్ఞములాచరించినీ సమీపమునకు చేరగా తలంచును. నేను నిప్పటికినీ ఏ యజ్!జమూ చేయలేదు కావున ఏ విధముగా నిన్ను చేరగలను? ఓ దేవదేవా! నేను నిన్నేరీతిని దర్శింప గలుగుదును? నిన్ను చేరుట కొఱకు నేను నీ నామ జపమును మాత్రము మాననుసుమా.
39. శా. అన్నంబో రఘురామ యంచధికులాహారంబు నర్ధింత్రు, సం
పన్నుల్ తిన్నది జీర్ణమే యవదనన్ భవ్యా ! మదింగాంచితే?
అన్నంబీవె. లభింపుమందరికి. దేహార్తిన్ తొలంగించు! శ్రీ
మన్నారాయణ! పేద సాధు జనులం బాలించు, భుక్తిప్రదా. .
భావము. భవ్యుఁడవైన ఓ శ్రీమన్నారాయణా!అన్నమో రామచంద్రా యని పెక్కురు ఆహారము కొఱకై నిన్ను వేడుకొందురు. సంపన్నులు తాము తిన్నది జీర్ణమవక బాధపడుచుండుటను మనసుపెట్టి చూచితివా? అన్నము నీవే కదా? అందరికీ లభింపుమయ్యా. ఆకలి బాధను తొలగించుము. ఓ భుక్తిప్రదా! పేదలను సాధుజనులను నీవు పాలించుమయ్యా.
40. శా. ఉన్నావన్నిట. కానరావు. హృదిలో నున్నట్టి నీ రూపమున్
గన్నారం గన జాలు వారలు కనన్ గల్యాణ మూర్తుల్ కదా!
పున్నెంబుండును నీకు, కానఁబడుమా. బుద్ధిన్ బ్రసాదించు. శ్రీ
మన్నారాయణ ! నిన్ను నమ్మిన ననుం భావింపుమా నీ మదిన్.
భావము. ఓ శ్రీమన్నారాయణా ! నీవు అన్నింటిలోను ఉన్నావు. ఐనా కంటికి కనబడవు. మనసులోనే ఉండే నీ రూపమును ప్రత్యక్షంగా చూడగలుగువారు మంగళస్వరూపులే కదా ! నీకు పుణ్యముండును. మాకు కనిపింపుము. చక్కని బుద్ధిని మాకు ప్రసాదించుము. నిన్ను 41. శా. సున్నా పూర్ణము. సృష్టి మూలము. సుధీశుల్ నిన్ను పూర్ణంబుగా
నెన్నున్ గావున నీవు పూర్ణమగుదో? యెన్నన్ మహత్ పూర్ణుగా
కన్నుల్ గానఁగ లేని రూపమున నాకాశంబునన్ నిండి, శ్రీ
మన్నారాయణ! మొత్తమీవె యగుదో? మన్నించి నన్ దెల్పుమా.
భావము. సున్నాయే పూర్ణమని, సృష్టికి మూలమని జ్ఞానులు నిన్ను పూర్ణ స్వరూపుఁడవని, భావింతురు. కావున నీవు పూర్ణ స్వరూపుఁడవా? పరిశీలించి చూచినచో మహత్తరమైన పూర్ణ స్వరూపుడుగా కన్నులు చూడలేని సుస్వరూపమున ఆకాశమంతయు నిండియుండి మొత్తమంతా నీవే నిండి యున్నావా? నన్ను మన్నించి నాకు తెలియఁ జేయుము.
42. శా. అన్నంబెవ్వనిచే సృజింపఁబడునయ్యాద్యుండు రైతన్నయే.
మన్నింపంబడునెల్ల వేళలను, సమ్మాన్యుండ నీచేతనే.
ఎన్నాళ్ళైనను మారనట్టి బ్రతుకై యిబ్బందులన్ బొందు. శ్రీ
మన్నారాయణ! హాలికున్ గనుమ ! సమ్మాన్యున్ గృపన్ బ్రోవుమా.
భావము. ఓ శ్రీమన్నారాయణా! మేము తినెడి ఆహారమైన అన్నము ఎవనిచే సృజింపఁబడుచున్నది? ఆ ఆది పూజ్యుఁడు వ్యవసాయము చేయు రైతన్నయే కదా. సన్మానింపఁబడువాడా ! ఆతఁడు ఎల్ల సమయములందు నీచేతనే మన్నింపఁబడు చుండును కదా. అట్టి ఆ రైతన్న బ్రతుకు ఎన్నాళ్ళైనను మారక ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉండెను కదా! అట్టి హాలికుని నీవు కరుణతో చూడుము. సన్మాన్యుఁడైన అతనిని ఎల్లప్పుడు నీవు కాపాడుచుండుము.
43. శా. ఖిన్నుండై తపియించు హాలికుననకున్ కేలిచ్చి కాపాడి నీ
వున్నావన్న నిజంబు నెన్నునటు నీవున్నన్ నిరూపించు. భా
వౌన్నత్యుండగు హాలికున్ కనుము స్నేహార్ద్రాంతరంగుండ! శ్రీ
మన్నారాయాణ! పోతనన్ గనితివే! మా రైతులన్ గానవో?
భావము. శ్రీమన్నారాయణా! వ్యవసాయము చేయు హాలికుడు కష్టములవలన శోకించుచు మిక్కిలి తపించుచుండెను అట్టి రైతునకు నీచేతిని అందించి సహాయపడి నీవు ఉన్నావన్న సత్యమును గుర్తించునట్లు నీవు న్నటులైన నిరూపించుము. స్నేహముతో ఆర్ద్రమగు మనస్సు కలవాడా! ఉన్నత భావములు కలిగియున్న రైతును చూడుము. పోతన్నను చూచితివికదా, మాకు ఆహారము పండించు రైతులను కాపాడకుందువా?
44. శా. కన్నా! నీ పద సేవకై విరులు వేగంబే విడున్ బ్రొద్దుటే.
వన్నెల్ చిన్నెలు నీ పదాంకితముగా భావించి పొంగున్ మదిన్,
మున్నేపున్నెము చేసెనో కనగ నీ పూవుల్ నినున్ జేర. శ్రీ
మన్నారాయణ! నా హృదబ్జమును ప్రేమన్ నిన్నికన్ జేరనీ.
భావము. ఓ కన్నా! పూవులు నీ పాద సేవకొఱకు ప్రొద్దున్ననే వేగముగా వికసించును. తమ వన్నెలు, చిన్నలు నీపాదములకంకితమగునని మనసులో భావించుకొనుచు పొంగిపోవుచుండును. నీపాదములను చేరుటకు ఈ పూవును పూర్వము ఎటువంటి పుణ్యమును చేసియుండెనోకదా! ఓ శ్రీమన్నారాయణా! నా హృదయ పద్మమును కూడా ఇంక ప్రేమతో నిన్ను చేరనిమ్ము.
45. శా. పున్నెంబో, మరి పాపమో యెఱుగ నేన్. పుష్పంబులన్ గోయుచున్ ,
నిన్నున్ పూజలొనర్చుచుంట. జగతిం ధీశాలి పాపయ్య తా
నెన్నెన్ పుష్ప విలాపమున్ , తెలుసుగా. హృద్యంబుగానుండు. శ్రీ
మన్నారాయణ ! పుష్పముల్ తునుముటన్ మాకబ్బవా పాపముల్ ?
నిన్నున్ పూజలొనర్చుచుంట. జగతిం ధీశాలి పాపయ్య తా
నెన్నెన్ పుష్ప విలాపమున్ , తెలుసుగా. హృద్యంబుగానుండు. శ్రీ
మన్నారాయణ ! పుష్పముల్ తునుముటన్ మాకబ్బవా పాపముల్ ?
భావము. ఓ శ్రీమన్నారాయణా! పుష్పములను తునిమి నీకు పూజలు చేయుచుండుట అను పని పుణ్యమో లేక పాపమో నేను ఎఱుఁగను. లోకమున ధీశాలియైన జంధ్యాల పాపయ్యశాస్త్రి పుష్ప విలాపమును గుర్తించి ఖండికగా వ్రాసెను. ఆ విషయము నీకు తెలుసును కదా. అది మిక్కిలి హృద్యమైన ఖండిక. ఆ విధముగ పుష్పములు తునుముట వలన మాకు పాపములు కలుగునా?
నమ్మియున్న నన్ను నీ మనసులో ఒక్కపర్యాయము భావన చేయుము.
46. శా. నన్నున్ గావగ రమ్ము నీవనినచో నా స్వార్థమే యౌను. నీ
వున్నావందరికోసమంచు కని , దీనోద్ధారకా ! స్వార్థమున్
మున్నే వీడి , నమస్కరించుట తగున్ , పూజ్యుండ ! నీపైన శ్రీ
మన్నారాయణ ! భారముంచ , కృపతో మన్నించి రక్షింపవో?
వున్నావందరికోసమంచు కని , దీనోద్ధారకా ! స్వార్థమున్
మున్నే వీడి , నమస్కరించుట తగున్ , పూజ్యుండ ! నీపైన శ్రీ
మన్నారాయణ ! భారముంచ , కృపతో మన్నించి రక్షింపవో?
భావము. దీనోద్ధారకుడవైన ఓ శ్రీమన్నారాయణా ! నన్ను కాపాడుట కొఱకు నిన్ను రమ్మనినచో అది నా స్వార్థమే అగును కదా. ఆ విధముగా కాక , నీవున్నది ఆందరికోసమూనని భావించి , స్వార్థమును వీడి , నీకు నమస్కరించి , నీపై భారము వేసినచో కృపతో నీవే మమ్ము రక్షింపకుండా ఉండ గలవా?
47. శా. పిన్నల్ పెద్దలు మంచి చెడ్డలనుచున్ పేర్కొంచు సిద్ధాంతముల్
నిన్నున్ నమ్మిన వారినెన్ని పలుకన్ నీవారు సందేహులై
యూన్నావంచును లేవటంచు మదినెన్నో భావముల్పొంద, శ్రీ
మన్నారాయణ ! సత్యమున్ దెలుపుచున్ మాన్పింతువే శంకలన్.
నిన్నున్ నమ్మిన వారినెన్ని పలుకన్ నీవారు సందేహులై
యూన్నావంచును లేవటంచు మదినెన్నో భావముల్పొంద, శ్రీ
మన్నారాయణ ! సత్యమున్ దెలుపుచున్ మాన్పింతువే శంకలన్.
భావము. ఓ శ్రీమన్నారాయణా ! చిన్నవారూ , పెద్దవారూ కూడా నిన్ను నమ్మియున్న భక్తుల వద్ద ఇది మంచి , ఇది చెడ్డ అనుచూ ఏవేవో సిద్ధాంతీకరించి చెప్పుచుండుట చేత నీ భక్తులు సందేహములో పడినవారై నీవు ఉన్నావని , లేవని , మనసులో అనేక భావములను పొందుచుండ, నీవు సత్యమును తెలియ జేయుచు సందేహములను పారద్రోలుదువు కదా.
48. శా. భిన్నత్వంబుననేకతన్ గలిగి నీవే మాకునన్నింటిలో
నున్నావంచు నెఱుంగఁ జేయు మతితో నొప్పారితో ? కానిచో
కన్నుల్ ముందట నుండి యుందువు కదా కన్పించుచున్ మాకు. శ్రీ
మన్నారాయణ ! మా ముదంబు కొఱకై మా ముందె నీవుండుమా !
భావము. ఓ శ్రీ మన్నారాయణా! అన్నింటిలోను మాకు నీవు ఉన్నావనుచు తెలుపుట కొఱకు మా ముందే భిన్నత్వములో ఏకతను కలిగి యుంటివా? అటుల కానిచో మా కన్నుల ముందరే మాకు కన్పించుచు ఎదురుగా ఉండెడివాడవు కదా. మా సంతోషము కొఱకై మాకు ఎదురుగా ఉండుము.
49. శా. కన్నుల్ మూసిన నీ పదాబ్జములనే కాంచన్ మదిన్ గోరుదున్.
కన్నుల్ చూచిన నీ స్వరూపమొకటే కాంక్షింతు చూడంగ. నీ
సాన్నిధ్యంబునె కోరుదున్నిరతమున్ సాయుజ్యముం గోరి. శ్రీ
మన్నారాయణ ! మార్గమీవె కద సన్మార్గంబు నే చేరగన్.
భావము. ఓ శ్రీమన్నారాయణా ! నా కన్నులు మూసియున్నప్పుడు నీ పాదపద్మములనే చూడ గోరుదును. నా కన్నులు చూచుచుండు సమయమున నీస్వరూపమును మాత్రమే చూడ గోరుదును. నీ సాయుజ్యము చేరుటకు ఎల్లప్పుడు నీ సాన్నీధ్యమునే కోరుదును. నేను సన్మార్గమును జేరుటకు మార్గము నీవే కదా!

50. శా. నిన్నే సూర్యునిగా తలంచితినిపో నీవుండవే రాత్రులన్.
నిన్నే చంద్రుడవంచు నెంచ గనినన్ నీవుండలేవే పవల్.
నిన్నున్ వాయువనంగ న్యాయమగునీ నిశ్వాస, యుచ్ఛ్వాస, శ్రీ
మన్నారాయణ ! నీవె రాత్రి, పవలున్. మా ప్రాణశక్తి ప్రదా !
భావము. మాప్రాణశక్తినొసగువాడా ! శ్రీమన్నారాయణా ! నిన్నే నేను సూర్యునిగా భావించినచో నీవు రాత్రులందు కానరావు కదా. పోనీ చంద్రునిగా తలంచుదమన్న నీవు పగలు కానరావు. నిన్ను వాయువుగా భావించుటయే న్యాయము. ప్రాణికోటికి ఎల్ల వేళల ఈ ఉచ్ఛ్వాస , నిశ్వాస నీవేకదా.
51. శా. ఔన్నత్యంబున వెల్గు సజ్జనుల భావౌన్నత్యమే దుష్టులం
దున్నన్ మేలుగ సాగదే జగతి? భావోదారులై శిష్టులై
పున్నామాదుల చేరకుండి. నిను సత్పూజ్యున్ మదిన్ గొల్త్రు. శ్రీ
మన్నారాయణ ! సత్ప్రవర్ధనమగున్. మంచిన్ ప్రవర్ధించుమా.
భావము. ఓ శ్రీమన్నారాయణా! ఉన్నతముగా ప్రవర్తించు సజ్జనులలోనుండే భావౌన్నత్యమే దుష్టులయందునూ ఉండినచో ఈ లోకము మంచిగా కొనసాఢదా ? ఉదార భావులై మంచిగా ప్రవర్తించువారై పున్నామాది నరకమంలకు చేరక సత్పూజ్యుడవయిన నిన్ను తమ మనసులో కొలుతురు. మంచి వృద్ధియగును. అందువలన మంచిని నీవు వృద్ధి చేయుము.

52. శా. ఎన్నాళ్ళీ కొఱగాని కర్మ ఫల దుష్కృత్యంబులం జేయు టిం
కెన్నాళ్ళీ దురపిల్లు కర్మ గతులన్ హేయంబుగానుంట? నీ
వన్నీ జూచుచు మిన్నకుండుదు విదేమైనన్ ప్రమోదంబొ? శ్రీ
మన్నారాయణ! కర్మలం గడిపి, ప్రేమన్ ముక్తి కల్పింపుమా.
భావము. ఓ శ్రీమన్నారాయణా! ఎన్నాళ్ళవరకూ ఈ వ్యర్థమైన పురాకృత కర్మఫలములుగా సంప్రాప్తించిన దుష్కృత్యములను చేయుట? ఇంకా ఎన్నాళ్ళు ఈ దుఃఖించు కర్మగతులలో హీనముగా జీవించుట? అన్నీ నీవు చూచుచుండియు మిన్నకుందువు. ఇదేమైనా సంతోషమా? ఈ కర్మలను పోఁ జేసి ప్రేమతో మాకు ముక్తిని ప్రసాదించుము.
53. శా. కన్నుల్, కాళ్ళును , జేతులున్, దనువు, నోంకారోజ్వలచ్చిత్తమున్,
మన్నైపోయెడి దేహమున్ , జెవులు , సమ్మాన్యోన్మహజ్జిహ్వయున్ ,
కన్నా ! నీ కథలాలకించు చెవులున్ , కానంగ నీచేత శ్రీ
మన్నారాయణ ! వెల్గు. నీవరిగినన్ మాయున్ గదా యిన్నియున్.
భావము. ఓ శ్రీమన్నారాయణా! బాహ్యేంద్రియములు , జ్ఞానేంద్రియమగు చిత్తము. నీవు శరీరములో నుండుటచే ప్రకాశించును. నిత్యుడవైన ఓ హరీ ! నీవు శరీరమును వీడి పోయినచో ఇవన్నియు మాసిపోవును కదా. ప్రాణశక్తివైన నీవే నిత్యుడవు. భౌతికమైన యీదేహాదులు అనిత్యములే.
54.శా. చెన్నారన్ నను చేర్రఁదీసిన హరీ ! శ్రీనాథ ! సర్వేశ్వరా !
ఎన్నాళ్ళైనను నీ పదాబ్జములు నా హృత్పీఠిపై నిల్పెదన్.
నిన్నే నమ్మిన నన్నుబోలు జనులన్ , నిర్భాగ్యులన్ బ్రోచు శ్రీ
మన్నారాయణ ! నీ కృపన్ దెలుపగా మాకౌనె ? సంపత్ఫ్రదా !
భావము. ప్రేమతో నన్ను చేరదీసినవాడవైన ఓ శ్రీ నాథుడా ! ఓ సర్వేశ్వరా ! ఎంత కాలము గడచినను నేను నీ పాద పద్మములను నా హృదయమనెడి సింహాసనముపైననే నిలిపి ఉంచెదను. నిన్నుమాత్రమే నమ్మియుండెడి నావంటి ప్రజలను , నిర్భాగ్యులను ప్రోచెడి ఓ శ్రీ మన్నారాయణా ! ఓ సంపత్ప్రదుడా ! నీకు గల కృపాస్వభావమును వివరిఃచుట మాకు తరమగునా !
55. శా. నిన్నే నమ్ముచు మన్ననమ్మున మనన్ నే భావనన్ జేతు, న
న్నెన్నో వేదనలంటి చిత్తమున నిన్నేకాగ్రతన్ గొల్వనీ
వెన్నాళ్ళీవిధినుంచనెంచితివి? రావేలన్ ననున్ గావ? శ్రీ
మన్నారాయణ! వేదనల్ సమయ నీమంబొప్ప నిన్ గొల్వనా?
భావము. ఓ శ్రీమన్నారాయణా! నేను నిన్నే నమ్ముకొని గౌరవముగా జీవించవలెనని భావించుదును.కాని ఎన్నో విధముల బాధలు నా మనసును చుట్టిముట్టి నిన్ను తదేక దీక్షతో కొలవనీయకున్నవి. ఎన్నాళ్ళీవిధముగా నన్ను నీవు ఉంచవలెననుకొనుచుంటివి? ఈ వేదనలను బాపి నన్ను కాపాడుటకు రావేమి? నా బాధలు సమసిపోయినచో ఏకాగ్రతతో నిన్ను నేని సేవించుదును కదా!
56. శా. మున్నే వేదములుగ్గడించె నిను సంపూర్ణుండుగా. సత్యమే.
అన్నీ కాంచుచునుండ నిక్కమని నాకర్థంబయెన్ నిన్నునే
మన్నన్ దక్కువె. నిత్య సత్యమగు నిన్నాత్మన్ సదా నిల్పి , శ్రీ
మన్నారాయణ! కాంతు నేను. కృపతో మన్నించి లోన్ వెల్గుమా.
భావము. నిన్ను సంపూర్ణుడవని వేదములానాడే ఉగ్గడించినవి. నిజమే.అన్నీ చూచుచున్నప్పుడు ఇది సత్యమని నాకర్థమయినది. నిన్ను ఏమన్నను అది తక్కువే యగును. నిత్య సత్యమైన నిన్ను నా ఆత్మలో నిత్యము నిల్పి నేను చూచుకొనుచుందును. కృపతో నీవు నాలో ప్రకాశించుము.
57. శా. మిన్నంటున్ మది హర్షచంద్రికలు నీ మీదన్మనంబుంచినన్.
జన్నంబుల్ పని లేదు. నీ తలపులే సద్యజ్ఞ సత్కార్యముల్.
మన్నించే గుణ గణ్య ! మములన్ మన్నించి కాపాడు. శ్రీ
మన్నారాయణ ! యజ్ఞతత్వమిదె కాన్ మా యజ్ఞమీవే సదా.
భావము. ఓశ్రీమన్నారాయణా ! నీపైనే మనసును నిలబెట్టినచో మా సంతోషములు ఆకాశమునంటును. యజ్ఞములతో పనియేమున్నది. నిన్నుగూర్చిన ఆలోచనలే మంచి యజ్ఞములు చేయుట యనెడి మంచిపనులు
మన్నించేటువంటి గుణము కలిగి యుండుట చేత గణింపబడువాడా !మమ్ములను మన్నించి కాపాడుము. ఓ
శ్రీ మన్నారాయణా ! యజ్ఞతత్వము ఇదే అయి యుండగా యెల్లప్పుడూ మాయజ్ఞము నీవే సుమా.
58. శా. పన్నీటన్ నిను సేవ చేయు ఘనులౌ భక్తాళికిన్ భాష్పముల్ . . . ?
కన్నీటిన్ గలిగించు దుష్ట తతికిన్ కామ్యార్థ సంప్రాప్తియున్ . . . ?
విన్నన్ నవ్వెరె నీ విలాస గతికిన్? విశ్వంబు నిట్లేల శ్రీ
మన్నారాయణ! చేయుచుంటి వకటా! మా మంచి నీకొప్పదా?
భావము. ఓ శ్రీమన్నారాయణా! నీకు పన్నీటితో స్నానము చేయించుట మున్నగు సేవలు చేయు భక్తుల సమూహమునకు కన్నీరు , ఇతరులచే కన్నీరు పెట్టించు దుర్మార్గుల సమూహమునకు కామ్యార్థలాభము, అయ్యో ఇట్టి నీ విలాసముతో కూడిన నడవడి విన్నవారు నవ్వరా? నీవు సృష్టిని ఈ విధముగా ఎందుకు చేయుచుంటివి? మా మంచితనము నీకు ఒప్పదా?
59. శా. కన్నుల్ గొల్పి, కనంగఁ జేసి, మదిలో కాంక్షల్ ప్రవర్ధింప, నీ
వన్నెల్ చిన్నెలశాశ్వితంబులను దేవా! నీవు కల్పించి, మ
మ్మున్నిల్పంగను ద్రోహిగాఁ, దలచితో? పూజ్యుండ! ధర్మంబె? శ్రీ
మన్నారాయణ! మంచి దృష్టినిడినన్ మర్యాదగా మెల్గమే?
భావము. ఓ శ్రీమన్నారాయణా! మాకు కన్నులనిచ్చి అన్నిటినీ చూచునట్లు చేసి, ఈ చూచుట మూలముఅ మాలో కోరికలను ప్రకోపింపఁ జేయుట కొఱకు లోకములో అశాశ్వితమైన వన్నెలు చిన్నెలు నీవే కల్పించి మమ్ములను ద్రోహిగా నిలుప దలచినావా? నీకిది ధర్మమగునా? నీవు మంచి దృష్టినే ప్రసాదించినచో మేము మర్యాదగా ప్రవర్తింపకుందుమా?
60. శా. తిన్నన్ నీ కృప లేనినాడరుగదే దీపించు దధ్యన్నమై
నన్నీసత్కృప గల్గ రాళ్ళయినజీర్ణంబౌనిదే వింత. నీ
కన్నన్ వింత మరేమి కల్గు భువి? శ్రీకాంతా! మనోద్భాస!. శ్రీ
మన్నారాయణ ! జీర్ణ శక్తినిడుమా మన్నించి జీవాళికిన్. 24 . 02 . 2-18.
భావము. ఓ శ్రీ మన్నారాయణ ! నీ కృప లేకపోయినచో మేము తీనెడి ప్రకాశవంతమైన పెరుగూ ఆన్నమైనా జీర్ణము కానేరదు. నీ కృప కలిగియున్నచో రాళ్ళైనా జీర్ణమగును కదా. ఇదే విచిత్రము. నీకన్నా వింత భూమిపై మరేమి ఉండును ? లక్ష్మీదేవి హృదయమున ప్రకాశించువాడవైన హరీ ! జీవాళిని మన్నించి జీర్ణశక్తీని ప్రసాదించుము.
61. శా. అన్నైవత్తువు నన్ను కావ కృపతోనానంద సంధాయివై,
అన్నాయంచును వచ్చి చేరుదువు నన్నా త్రంబుతోఁ దమ్ముగా
నన్నన్నా భవదీయ సత్కృపకునంతన్నట్టిదే లేదు. శ్రీ
మన్నారాయణ ! భక్తపాలనపరా ! మత్పుణ్యభాగ్యా ! హరీ !
భావము. ఓ శ్రీమన్నారాయణా! నీవు ఆనందమును కూర్చువాడవై నాకు అన్నగా కాపాడ వత్తువు. భక్తపాలనపరుడా. నా పుణ్యభాగ్యమైన శ్రీ హరీ. ఆ నీవే నన్ను అన్నాయని పిలుచుచు ఆతురతతో తమ్ముడుగా నన్ను చేరుదువు. అన్నన్నా. నీ కృపకు అంతు అనేటువంటిదే లేదుకదా.
62. శా. మన్నించే గుణమీకు కల్గెను కదా మాన్యుండ! నీ భక్తులన్
మన్నించన్ బరివర్తనన్ సుగుణసమ్మాన్యాళిగా మారి , యా
పన్నత్రాతవటంచు కొల్తురు కదా. ప్రార్థింతు మన్నింప. శ్రీ
మన్నారాయణ ! మంచి పెంచుమిలలో మా పూజ్య దేవా ! హరీ !
భావము. ఓ శ్రీమన్నారాయణా ! మన్నించుట అనెడి శుభ లక్షణము నీకున్నదికదా. మాన్యుడా. నీ భక్తులను నీవు మన్నించినచో వారిలో పరివర్తన కలిగి ,సుగుణములచే సమ్మాన్యాళిగా మారి , నిన్ను ఆశన్నత్రాతవని సేవింతురు కదా. ఆ విధముగా నీవు మన్నింప గలందులకు నేను నిన్ను ప్రార్థింతును. మా పూజ్యదైవమా! భూమిపై మంచిని పెంచుము..
63. శా. కొన్నాళ్ళే కద భూమిపై బ్రతుకు. మా కోపాదులన్ కాలమే
యెన్నాళ్ళైనను వ్యర్థమౌన్. కనవొ ? నీవీ మార్గమున్ వీడి మే
మున్నన్నాళ్ళును ప్రేమతోఁ బ్రతుకనీ ఉద్రేకముల్ బాపి. శ్రీ
మన్నారాయణ ! శాంతిమార్గమున సమ్మార్గంబునన్ నిల్పుమా.
భావము.
ఓశ్రీమన్నారాయణా! మేము భూమిపై ఉండునది కొన్నినాళ్ళేకదా. మాకున్న కోపతాపాదుల వలన ఎంత కాలమున్నను నిరుపయోగమగుచున్నదికదా. నీవు గుర్తించవా? నీవు ఈ మార్గమును విడనాడి , మేము బ్రతికి ఉన్నంత కాలము మాలోని కోపాదులను పోగొట్టి , ప్రేమతో బ్రతుకునట్లు చేయుము. మమ్ములను శాంతిమార్గములో మంచి మార్గములో నిలుపుము.
64. శా. అన్నన్ జాలును సోహమంచు, మరి దాసోహమ్మటంచంటి, నే
పిన్నన్, నేర్వను నన్ను నీ కొసగుటన్ విశ్వాసమున్ గొల్ప. నా
విన్నాణంబది చాలకుండెనయ. సంవేద్యంబె నీకిద్ది. శ్రీ
మన్నారాయణ ! నీకు తోచినటులే మమ్మందరిన్ జేయుమా.
భావము.
ఓశ్రీమన్నారాయణా! ఆ పరమాత్మను నేనే అనిన చాలును. నేను నీ ముంగిటదాసోహమ్మనుచుఃటిని. నీకు నమ్మకము కలుగు విధముగా నన్ను నేనునీ కర్పించుకొనుట యెఱుగను. అందుకు నాకు గల విజ్ఞానము సరిపోవుట లేదు. ఆ విషయమునీకు తెలిసినదే. నీకం తోచిన విధముగా మా అందరినీ నీవే చేయుము.
65. శా. కొన్నాళ్ళేమొ శిశుత్వమున్గొలిపి యింకొన్నాళ్ళు కౌమారమున్.
కొన్నాళ్ళంచిత యౌవనంబు నిడి , యింకోన్నాళ్ళు వార్ధక్యమున్.
క్రన్నన్ గొల్పి దురంత దుస్థితి మమున్క్రమ్మన్ నిరీక్షించు శ్రీ
మన్నారాయణ! నీకు ధర్మ మిదియా? మాకెందుకీవ్యర్థముల్?
కొన్నాళ్ళంచిత యౌవనంబు నిడి , యింకోన్నాళ్ళు వార్ధక్యమున్.
క్రన్నన్ గొల్పి దురంత దుస్థితి మమున్క్రమ్మన్ నిరీక్షించు శ్రీ
మన్నారాయణ! నీకు ధర్మ మిదియా? మాకెందుకీవ్యర్థముల్?
భావము.
ఓశ్రీమన్నారాయణా ! మాకు కొన్నాళ్ళపాటు బాల్యము , కొన్నాళ్ళు కౌమారము , మరికొన్నాళ్ళు యౌవనము , యింకొన్నాళ్ళు వార్ధకము కొలిపి అంతు లేని దుస్థితి మమ్ము చుట్టిముట్టగా నిరీక్షింతువు. నీకు ఇదేమైనా ధర్మమా! ఈ నిరుపయోగమైనవన్నియు మాకెందులకయ్యా?

66. శా. పిన్నల్ నిర్మల చిత్తశోభితులెగా. పెద్దౌదురవ్వారలే.
పిన్నన్ లేని దురంత దుష్కృతులిలన్ బెద్దైనచో నబ్బునే !
ఎన్నాళ్ళిట్టులొనర్తువీవిటుల నీకే చెల్లునేదైన. శ్రీ
మన్నారాయణ ! నిర్మలత్వమిడి సన్మార్గంబునన్ నిల్పుమా. 02 . 03 . 2018.
భావము. ఓ శ్రీమన్నారాయణా! పసివారునిష్కల్మష మైన మనస్సు కలవారే కదా. ఆ పసివారే పెరిగి పెద్దవారగుదురు. భువిపై బాల్యమందు లేని దురంతమైన చెడ్డ పనులు పెద్దవారవగానే వచ్చునా ? ఈ విధముగా నీవు ఎంత కాలము చేయుదువు? ఏదైనా నీకే చెల్లును కదా! మాకు నిర్మలత్వమును ప్రసాదించి మంచి మార్గములో నిలుపుము.
67. శా. సున్నంబైననునన్నమైన నొకటే శుద్ధాత్మవిజ్ఞానికిన్.
ఖిన్నుండవ్వడు పొంగిపోడు తెగడన్ గీర్తించినన్ భూమిపై.
విన్నాణంబది నీవు గొల్పినదెగా వెల్గొందునీరీతి. శ్రీ
మన్నారాయణ ! జ్ఞానభాగ్యవరదా! మాకున్ బ్రసాదించుమా. 03 . 03 . 2018.
భావము. ఓశ్రీమన్నారాయణా! విశుద్ధమైన ఆత్మజ్ఞానము కలవానికి సున్నమైనను , అన్నమైనను ఒక్కటేకదా. భూమిపై అతనిని నిందించినను , పొగడినను చిన్నపుచ్చుకొనడు అటులనే పొంగిపోడు. ఆట్టి విజ్ఞానము నీవు కలిగించినదే కదా. ఈ విధముగా ప్రకాశించును. జ్ఞాన భాగ్యమును వరముగనొసంగువాడా. మాకునూ ప్రసాదింపుము.
68. శా.నిన్నున్ మించిన భక్త రక్షకుని నే నెన్నన్ దగన్ బృథ్విపై.
నన్నున్ మించిన స్వార్థ వర్తనుడు కానన్ రాడదెట్లందువా
నిన్నున్నామదిలోనె శాశ్వితముగా నిల్వంగ వాంఛింతు. శ్రీ
మన్నారాయణ! నాది స్వార్థమె కదా. మన్నించు నా స్వార్థమున్. 06 . 04 . 2018.
భావము. ఓ శ్రీ మన్నారాయణా! భూమిపై నిన్ను మించిన భక్త రక్షకుని నేను గుర్తింప దగను. నన్ను మించిన స్వార్థపరుడు కనిపించనే కనిపించడు. అది యేవిధముగా అని అందువేమో. నిన్ను శాశ్వితముగా నా హృదయమునందునే యుండవలసినదిగా కోరు కొందును. నాది స్వర్థమే కదా? అట్టి నా స్వార్థమును మన్నించుమా.
69. శా. వెన్నల్ బాలు మనంబులే. కయికొనున్ వెన్నుండటంచున్ ఘనుల్
మన్నున్ మెక్కకు. వెన్నవంటి మదులన్ మన్నించిగైకొమ్మటం
చున్నిన్నార్తిని కోరుచుందురు గదా. శుద్ధాత్మ సంభాస! శ్రీ
మన్నారాయణ! నీవె శాశ్వితము. నన్ మన్నించి చేకొమ్మయా. 05 . 03 . 2018.
భావము.
శుద్ధాత్మతో ప్రకాశించు ఓ శ్రీ మన్నారాయణా ! మహాత్ములు తమ మనస్సులే యని , అవి నీవు స్వీకరింతువని భావించి , నీవు మన్ను తినుట యెందులకు ? మా మనసులే వెన్న పాలు , స్వీకరించుమని నీదరికార్తితో చేరి కోరంచుందురు.నీవే మాకు శాశ్వము. నన్ను నీవు మన్ననముతో చేనుకొము.

70. శా. కన్నుల్ కాంచెడి శక్తి కోల్పడును. నిన్ గానంగ జ్ఞానాక్షి నా
కున్నన్జాలును. నీవొసంగుమది నాకున్ దివ్య చక్షుప్రదా!
ఎన్నాళ్ళైహిక దృష్టితో మనగనౌనీశా! పరంధామ ! శ్రీ
మన్నారాయణ! భక్తి గొల్తు నిను. శ్రీ మాతాహృదీశా.హరీ. 06 . 03 . 2018.
భావము.
ఓ శ్రీ మన్నారాయణా ! లక్ష్మీతల్లియొక్క హృదయేశ్వరా ! శ్రీవారి రీ ! మాకు కలిగియున్న యీ కన్నులు కొన్నాళ్ళకు వాటీకి ఊఃడే చూచే శక్తీని కోల్పోవును. నిన్ను నేను చూచుట కొఱకు నికు జ్ఞాన నేత్రముండిన చాలును. నిన్ను నేను సేవిఃతును. అది నాకొసగుము. ఐహిక దృష్టితో ఎన్నాళ్ళు జీవనము కొనసొగించనగును?

71. శా. సన్నేతల్ మహనీయతా గరిమతో సత్కార్యముల్ చేయుచున్,
నిన్నేమున్ను స్మరింత్రు సంతసమునన్ నీ దివ్య తేజంబె సం
పన్నంబౌనటు చేయ కార్యముల నుద్భాసింపగాఁ జేసి. శ్రీ
మన్నారాయణ ! సజ్జనాళి కృషినే మన్నించి దీవించుమా.
భావము.
ఓశ్రీమన్నారాయణా ! మంచి నాయకులు వారికిగల మహనీయత యొక్క ఆధిక్యముతో మంచి పనులు చేయుచు, నీకు గల గొప్ప తేజస్సే తాము చేపట్టిన కార్యము ప్రకాశితమగునట్లు చేసి సుసంపన్నము అగునట్లు చేయుట కొఱకు ముందుగా సంతోషముతో నిన్నే స్మరించుదురు. అట్టి మంచివారి ప్రయత్నమును నీవు మన్నించి వారిని దీవింపుము.

72. శా. సన్నంబై చనుచుండెనాయువు. మన:శాంతిన్ నినుం గొల్వనే.
క్రన్నన్ వచ్చి ప్రశాంతిఁ గూర్చుమయ. నాకన్నన్ హితుల్ లేరనన్.
మన్నైపోవకమున్నె నేను నిను సమ్మాన్యా! మదిం గాంచ శ్రీ
మన్నారాయణ ! నీ పదాంబుజములం బ్రాణంబు చేరున్ గదా.
భావము. సమ్మాన్యుడవైనవాడా! ఓ శ్రీమన్నారాయణా! చిన్నదయిపోవుచు నా ఆయుర్దాయము తరిగిపోవుచున్నది. నేను శాంత మనస్కుడనై కనీసము మనసులో భావింపనైను లేదు. నా కన్నా హితులు నీకు లేరనునట్లుగా నీవు వెంటనే వచ్చి నాకు ప్రశాంతత కలిగించుము. నేను భూమిలో కలిసిపోవక మునుపే నిన్ను మనసులో చూచినచో నా ప్రాణము నీ పాద పద్మములను చేరును కదా.

73. శా. నిన్నన్, మొన్నను, నేడు, రేపు, సతమున్ నీ నామ సంకీర్తనే
నన్నున్ నిల్పెడి ప్రాణశక్తి, నృహరీ! నాకున్న ధీశక్తియున్.
మన్నింపంబడు పద్యధారవగుచుం బ్రాప్తించుచున్ బ్రోచు శ్రీ
మన్నారాయణ! నిన్ స్మరించు గుణమున్ మాకిమ్ము నిత్యంబుగా.
భావము. ఓనరసింహా! భూత భవిష్యద్వర్తమానములందు ఎల్లప్పుడు నీ నామ సంకీర్తనమే నన్ను నిలుపు ప్రాణశక్తి. నా ధీశక్తియునదియే. మన్నింపఁబడెడి పద్యధారవయి ప్రాప్తించుచు బ్రోచెడి ఓశ్రీమన్నారాయణా! నిన్ను స్మరించెడి
గుణమును నిత్యముగా మాకు ప్రాప్తింపఁజేయుము.

74. శా. ఎన్నం జాలని భవ్య భాగవతులన్ హృద్యంబుగానొప్పు శ్రీ
మన్నామాద్భుత వాక్సుధా లహరివా ? మచ్చిత్త సంవాసివై
క్రన్నన్ వెల్వడు సత్ కవిత్వ ఝరివా ? కారుణ్యవారాశి! శ్రీ
మన్నారాయణ! దివ్య శక్తినిడి , నీమంబొప్ప నిన్ గొల్వనీ. .
భావము. ఎన్నజాలనంతటి గొప్ప భాగవతోత్తములలో హృద్యముగానొప్పునట్టి శ్రీమన్నారాయణునికిసంబంధించిన వాగమృత లహరివా ? నా హృదయమున నివశించుచు క్రన్నన వెల్వడునటువంటి మంచి కవితా ప్రవాహమా నీవు? కరుణా సముద్రుడివా ? ఓ శ్రీ మన్నారాయణా ! మాకు దివ్యమైన శక్తినొసగి నిన్ను భక్తితో సేవించునట్లు చేయుము.

75. శా. ఎన్నోశంకలవాత్మలో కలుగు నీ వీతీరునీ సృష్టి చే
యన్నీకున్ గల మూలమేది ? మహనీయంబైన యామూలమీ
వెన్నాళ్ళే తపమాచరించి గనితో ? సృష్ట్యాదినే నీకు శ్రీ
మన్నారాయణ! సాధ్యమెట్లయినదో ? మా శంక పోకార్పుమా.
భావము. ఓ శ్రీమన్నారాయణా ! ఎన్నో అనుమానములు ఐవి నా ఆత్మలో కలుగుచున్నవి. నీవు ఏ విధముగా ఈ సృష్టిని చేయుటకు నీకు కలిగిన మూలాధారమేది ? గొప్పలయిన ఆ మూలాధారమును నీవు ఎన్నాళ్ళు ఎటువంటి తపస్సూను చేసి పొఃదితతివో? సృష్ట్యాదినే నీకు ఇది ఏవిధముగా సాధ్యమయినదో ? మా అనుమానములను నివృత్తి చేయుము.
76. శా. వెన్నన్ బోలిన మానసుండవనుచున్ వేమారు నిన్గొల్త్రు కా
వన్నిన్ వేడుచు భక్తపాళి. కనవో ? వారిన్ గృపన్ జూడవో ?
నిన్నేనమ్మిన భక్తులన్ నిలుపుమా. నిర్భాగ్యులన్ గాచు శ్రీ
మన్నారాయణ ! నమ్మకంబు కలుగన్. మా మాట మన్నింపుమా.
భావము. నిర్భాగ్యులను కాపాడెడి స్వభావమున్న ఓశ్రీమన్నారాయణా! వ్నవనీత సుకుమా హృదయుడవని భక్తులు తమను కాపాడమని , నిన్ను సేవించి అనేక పర్యాయములు నిన్ను వేడుకొందురు. అది నీవు గమనింపవా ? వారిని కృపతో చూడవా ? నిన్ను మాత్రమే నమ్ముకొనిన భక్తులను నిలుపుము.నీపై మాకు నమ్మకము. కలుగునట్లు చేయుటకు మామాట మన్నింపుము.

77. శా. కన్నా ! కన్నులు కల్గినట్టి ఘనులే గర్వాంధతన్ వర్తిలన్
కన్నుల్లేని కబోదిగా పుడమిపై గాంచున్ గదా జన్మమున్.
ఎన్నంజాలరదేలనో? వలచు దుష్కృత్యంపు దుర్వృత్తి. శ్రీ
మన్నారాయణ! మార్పుకొల్పుమనఘా ! మౌఢ్యంబు పోకార్పుమా..
భావము. ఓ కన్నయ్యా ! కన్నులు కల్గిన మహనీయులే గర్వాంధ ప్రవృత్తులైనచో భూమిపై కన్నులు లేని కబోదిగా జన్మింతురు కదా. ఈ విషయమును వారు ఎందుచేతనోగుర్తింపరు. చెడు వర్తనతో కూడిన ప్రవృత్తినే ఈష్టపడుదురు. పాపరహితుడవైన ఓ శ్రీమన్నారాయణా ! అట్టివారీలోని మౌఢ్యమును నశింప జేయుము. వారిలో
మార్పును తీసుకురమ్ము.

శ్రీ చక్రాల రాజారావు కవివరులు ఈ విధముగా తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేసియున్నారు.
చింతావారిమనోభిరామమగుసచ్చిద్బావమందాకినీ
ప్రాంతోద్యానవనాంతసీమ రమణీయాకారపుంస్కోకిలా
స్వాంతోద్భూతమనోజ్ఞగీతగతపద్యమ్మున్స్వరైకావిధిన్
సంతోషాత్మఁబఠించితిన్ముకుళితస్వాంతాన వందించితిన్
78. శా. నిన్నున్ గూర్చిన భక్తి సంయుత కథల్ నేర్పున్ ప్రబోధించు శ్రీ
మన్నారాయణ మానవుండవయి నీ మాహాత్మ్యముల్ నీవె మా
కున్నిత్యమ్ము వివేకమున్ దెలుపు వైకుంఠా! చిదానంద ! శ్రీ
మన్నారాయణ! భక్తపక్ష! శుభముల్ మాకబ్బు నీ సత్కృపన్.
మన్నారాయణ మానవుండవయి నీ మాహాత్మ్యముల్ నీవె మా
కున్నిత్యమ్ము వివేకమున్ దెలుపు వైకుంఠా! చిదానంద ! శ్రీ
మన్నారాయణ! భక్తపక్ష! శుభముల్ మాకబ్బు నీ సత్కృపన్.
భావము. ఓ వైకుంఠా! చిదానందరూపా ! శ్రీమన్నారాయణా ! నీకు సంబంధించిన భక్తి కథలను నేర్పుతో ప్రబోధించు శ్రీమన్నారాయణ మానవుడవయి, నీ కథలను నీవే నిత్యము మాకు వివేకముతో తెలుపుచుంటివా. భక్తుల పక్షము వహించువాడా ! నీ వలననే మాకు పుణ్యము లభించుచున్నది.
79. శా. కన్నా ! నీవె యనంతకృష్ణుడవు సత్ కామ్యార్థముల్ తీర్చ మీ
కున్నానంచును నన్ను చేరుదువు దీనోద్ధారకా నీవె న
న్నన్నాయంచును. నాదు భాగ్యఫలమై. యాత్మన్ ప్రదీపించు శ్రీ
మన్నారాయణ! తమ్ముడా యనుచు నిన్ మర్యాదతో పిల్వగన్. .
భావము. ఓ కన్నా ! ఆత్మలో ప్రకాశించు శ్రీమన్నారాయణా ! నీవు అనంతకృష్ణుడవే. ఓ దీనౌద్ధారకా ! నేను నిన్నుతమ్ముడా యని మర్యాదతో పిలుచుకొను విధముగామంచి కామితార్థములను తీర్చుట కొఱకు మీకు నేనున్నానని నాభాగ్య ఫలమై అన్నాయని పిలుచుచు నన్ను చేరుదువు కదా.
కున్నానంచును నన్ను చేరుదువు దీనోద్ధారకా నీవె న
న్నన్నాయంచును. నాదు భాగ్యఫలమై. యాత్మన్ ప్రదీపించు శ్రీ
మన్నారాయణ! తమ్ముడా యనుచు నిన్ మర్యాదతో పిల్వగన్. .
భావము. ఓ కన్నా ! ఆత్మలో ప్రకాశించు శ్రీమన్నారాయణా ! నీవు అనంతకృష్ణుడవే. ఓ దీనౌద్ధారకా ! నేను నిన్నుతమ్ముడా యని మర్యాదతో పిలుచుకొను విధముగామంచి కామితార్థములను తీర్చుట కొఱకు మీకు నేనున్నానని నాభాగ్య ఫలమై అన్నాయని పిలుచుచు నన్ను చేరుదువు కదా.
శ్రీ చక్రాల రాజారావు కవివరులు ఈ విధముగా తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేసియున్నారు.
హృద్యభావార్థసంబద్ధపద్యమిద్ది
భక్తితాత్పర్యసంయుక్తపద్యమిద్ది
పద్మనేత్రకృపాపాత్రపద్యమిద్ది
భవమునందంగదిక్సూచిపద్యమిద్ది
80. శా. నిన్నే గాంతును సోమయాజులయెడన్, నీవే సదా చూచుచున్,
నన్నున్ దోష విహీన సద్వరుగ గానం జేయ యత్నింతువే.
నిన్నున్ నమ్మిన దోషమెట్లు కలుగున్ నీవే సదా రక్ష. శ్రీ
మన్నారాయణ! పాపతాప హరణా! మామ్ పాహి సర్వేశ్వరా.
భావము. ఓ శ్రీమన్నారాయణా! యాజ్ఞికులగు సోమయాజులలో నిన్నే చూతును. నీవే యెల్లప్పుడూ నా రచనలను చూచుచు నన్ను దోషమేమాత్రము లేని మంచివారిలో శ్రేష్టునిగా చూపు యత్నము చేయుదువు కదా. నిన్నేనమ్ముకొనిననాడు దోషమేవిధముగా కలుగును? ఎల్లప్పుడూ నీవే మాకు రక్ష. పాపతాపమును హరించు సర్వేశ్వరా! నన్ను కాపాడుము.

81. శా. నిన్నున్ బోలుదు రార్యులెల్ల పృథివిన్ నీ నామ సారూప్యమున్,
పిన్నల్ పెద్దలు వారినెన్నుదురుగా విశ్వాసమొప్పారగా.
నిన్నే నీవు సృజించుకొందువొ హరీ ? నేర్పారఁగా బ్రోవ. శ్రీ
మన్నారాయణ! లోకమున్. సుజనులన్ మాపై కృపంజూపుచున్.
భావము.
ఓశ్రీమన్నారాయణా! పుడమిపై ఆర్యులు నామ సారూప్యముచే నిన్ను పోలి యుందురు. ఆబాలగోపాలము వారిని గుర్తించి విశ్వాసముతో ఫ్రశంసింతురు. నీ నేర్పు మీర లోకమును సుజనులను బ్రోచుట కొఱకు మాపై కృప జూపుతూ నిన్ను నువ్వే ఈ విధముగా పుట్టించుకొందువా?

82. శా. తిన్నన్ జాలు నుగాది పచ్చడిని, భాతిం గొల్పు నారోగ్యమున్,
విన్నన్ జాలును భూసురుల్ పలుకు భావిన్దెల్పు పంచాంగమున్.
కన్నా దివ్య యుగాదినాడు, నిజ సంకల్పంబులీడేరు. శ్రీ
మన్నారాయణ! నిత్య చేతనమిడన్ మాలో నుగాదైతివా?
భావము.
ఓశ్రీమన్నారాయణా! ఓ కన్న తండ్రీ. ప్రతీ సంవత్సరమూ ఉగాది రోజున ఉగాది పచ్చడిని తినిన చాలును. భాతిని, ఆరోగ్యమును కలిగించును. భూదేవతలు పలికెడి భావిని తెలియజేయు పంచాంగమును వినీనసరిపోవును. మా సంకల్పములన్నియు నెరవేరును. మాలో నిత్య చైతన్యము కల్పించుటకు నీవు మాలో ఉగాదివై యుంటుందువా.

83. శా. కొన్నన్మానస పీఠిపై నిలుపగా గోవింద ! నీ పాదముల్
చెన్నారన్ గొన నొప్పు మాకు శుభముల్ శ్రీ దేవి కల్పింపగా.
మిన్నున్ దాకును మా ముదంబు గని నీ మేలైన పాదాళి. శ్రీ
మన్నారాయణ ! మాదు పుణ్యఫలముం బండించు నీ సత్కృపన్.
చెన్నారన్ గొన నొప్పు మాకు శుభముల్ శ్రీ దేవి కల్పింపగా.
మిన్నున్ దాకును మా ముదంబు గని నీ మేలైన పాదాళి. శ్రీ
మన్నారాయణ ! మాదు పుణ్యఫలముం బండించు నీ సత్కృపన్.
భావము.
ఓ గోవిందా! నీ పాదములను మా మనసు ఆనెడి సింహాసనముపై నిలుపుటకు గ్లహిఃచినచో ఆ లక్ష్మీదేవి కటక్షముచే మాకు చెన్నుగా శుభములు స్వీకరింపనొప్పును. నీ మేలచన పాదములను చూడగనే మా ఆనందము ఆకిశమునంటును. ఓ శ్రీ మన్నారాయణా!. నీ మంచి కృపతో మా పుణ్యములు పండింము..

84. శా. ఎన్నన్ బుణ్య ఫలంబు స్వర్గసుఖమే యిచ్చున్ శుభోద్దీప్తితో
నన్నన్మాకది చేసినంతె కద? మాకత్యంత సౌఖ్యంబు మే
మున్నన్ నీదరినబ్బు సత్యమిది. లేకున్నన్ వ్యర్థమే చూడ. శ్రీ
మన్నారాయణ! నీ పదాబ్జమమరన్ మాకేలనీ పుణ్యముల్ ?
భావము. ఓ శ్రీమన్నారాయణా! మనము గుర్తించినచో మేము చేసుకొనెడి పుణ్యము వలన ప్రాప్తించెడి ఫలము శుభమునుద్దీపింప చేయుచు స్వర్గ సౌఖ్యమే యిచ్చుననిన అది మేము చేసుకొనినది ఎంత పుణ్యమో అంత మాత్రమే కదా. మేము నీ సమీపముననున్నచో మాకు అత్యంత సౌఖ్యము లభించును. ఇది సత్యము. ఆ విధముగా కానినాడు ఈ పుణ్యాదులు నిరుపయోగమే. నీ పాదపద్మములే మాకు అమరినచో యీపుణ్యములిక మాకెందులకు? వ్యర్థమే సుమా.

85. శా. భిన్నంబన్నది లేదు భావమున భావింన్ నినున్ నమ్ముటన్.
మన్నారాయణుడీవె. నన్ను సతమున్ మన్నించి రక్షింతువే.
నిన్నున్ వీడి మనంగలేను జగతిన్. నిత్యుండ నాకీవె. శ్రీ
మన్నారాయణ! మన్మనోజ్ఞ ధిషణా. మా ధైర్య మీవేనయా.
భావము. నాలో ప్రకాశించే నిన్ను నమ్ముట విషయములో నా భావనలో భిన్నమన్నదే లేదు. నీవు నా నారాయణుడవు. నన్ను ఎల్లప్పుడు మన్నించి రక్షించుదువు. నిన్ను విడిచి జీవించలేను. ఈ లోకములో నాకు నీవే భాగ్యము. నాకు మనోజ్ఞమయిన జ్ఞానస్వరూపా. నీవే మా ధైర్యము.

86. శా. మన్నింపంబడుదీవు శోభన లసన్మాన్యంబుగాఁ జేసి సం
పన్నంబౌనటు చేయఁ గల్గిన మమున్. మా జీవితంబున్, స్వభా
వౌన్నత్యంబున వెల్గఁజేయుచు నిరంతానంద సంధాయి ! శ్రీ
మన్నారాయణ! సత్ప్రవృద్ధ మహితా ! మామాటలాలింపుమా.
భావము. అంతులేని ఆనందమును కలిగించువాడా ! మంచిని పెంచెడివాడా ! ఓ శ్రీమన్నారాయణా! మా మాటలను ఆలకించుము. మమ్ము శోభన ప్రకాశముతో శ్రేష్టముగా చేసి , మా జీవితమును సుసంపన్నమగునట్లు చేయగలిగితివేని నీవు ఎల్లప్పుడూ మన్నింపబడుదువు.
87. శా. యన్నామైవ మహత్ప్రపుణ్యఫలదమ్ , హర్ష ప్రదమ్ , సత్ప్రదమ్,
యన్నామైవ దురంత పాప హరణమ్ , యత్ సౌఖ్యదమ్ , భాగ్యదమ్ ,
తన్నామైవ త్వదీయ నామ యనుచున్ దర్శింత్రు భక్తాళి. శ్రీ
మన్నారాయణ! నీదు నామమెదలో మార్మ్రోగనీ నిత్యమున్.
భావము. ఓ శ్రీ మన్నారాయణా! ఏ పేరు జగత్తున ఏకైక పుణ్య ఫలమునొసగునో , ఏ పేరు అత్యద్భుతమైనదో , ఏ పేరైతే పాపములు పోకొట్టెడి గొప్పదైన పేరో , ఏ పేరైతేఆయువునొసంగునో , ఆ పేరు నీ పేరే అనుచు భక్తులు ఆత్మలో దర్శింతురు. నీ నామమును నిత్యమూ మా మదిలో మార్మ్రోగునట్లనుగ్రహింపుము.
88. శా. ఎన్నున్ భారత జాతి నీ ప్రతిభ, నీ సృష్టిన్, బ్రవర్ధింప నీ
కన్ననన్ కర్తయు, కర్మయున్, క్రియయు లోకంబందు లేరం చిటుల్
నిన్నున్నమ్మగఁ జేసినట్టి ఘనుడా. నిన్నెట్లు కీర్తింతు? శ్రీ
మన్నారాయణ! భారతీయుల మదిం భాసించుమెల్లప్పుడున్.
భావము. ఓ శ్రీమన్నారాయణా! ఈ సృష్టిని ప్రవర్ధింపఁ జేయుటలో నీకన్నా కర్త, కర్మ, క్రియ, వేరొకరు లేరని భారత జాతి నీ ప్రతిభను గుర్తించును. ఈ విధముగానిన్ను నమ్ము విధముగా చేసిన గొప్పవాడా. నిన్నేవిధముగా నేను పొగడగలను? నీవు యెల్లప్పుడూ భారతీయుల మనసులలో ప్రకాశించుచూ ఉండుము.

89. శా. పున్నామాదిగ గల్గు యీ నరకముల్ పూరింప మాచేత నీ
వన్నీ గాంచుచు పాప కార్యములు మోహభ్రాంతిఁ జేయింతువా !
ఆన్నన్నా! మనసెట్టులొప్పు నరకంబందున్ మమున్నిల్ప. శ్రీ
మన్నారాయణ! మంచి చేసెడి మతిన్ మాకిమ్ము నిన్గొల్వగాన్.
భావము. ఓ శ్రీ మన్నారాయణా ! పున్నామాది మహా నరకములను నింపుటకని నీవన్నీచూచుచూకూడా మోహాదులు కల్పించి మాచేత పాపములు చేయించుచున్నావా? అన్నన్నా. మమ్ములను నరకమున నిలుపుటకు నీకు మనసెట్టులొచ్చును ? మంచి చేయవలెననెడి బుద్ధి మాకిమ్ము. నిన్నుకొలిచెదము.
90. శా. ఎన్నో జన్మల పుణ్య సత్ఫలముగానిద్ధాత్రి సీతమ్మ నీ
కన్నుల్ కాంతిగ వెల్గ నీ సతిగ, భూకాంతారమావల్లభా!
మిన్నున్ ముట్టదె మాదు సంబరము సామీ చేయ మీ పెండ్లి. శ్రీ
మన్నారాయణ! భక్తులన్ సతము ప్రేమం జూచి దీవింపుడీ.
భావము. ఓ శ్రీమన్నారాయణా! ఓభూకాంతారమావల్లభా! ఓ స్వామీ! పెక్కు జన్మలలో చేసిన పుణ్యఫలముగా ఈ ధాత్రిపై సీతమ్మతల్లి నీ పత్నియై నీ కన్నులలో కాంతియై ప్రకాశించు విధముగా మీ వివాహము చేయుటచే మా సంతోషము ఆకాశమునంటును. మీరెల్లప్పుడూ భక్తులను కృపతో చూచుచు దీవించుడు.

91. శా. నిన్నున్ గన్నదదెవ్వరయ్య? కలగా సృష్టించి యీ లోకమున్
మన్నుం జేసెడి నిన్నదేల కనిరో? మా ముందు వారున్నచో
మున్నే కారణముగ్గడింపుడనుచున్ మోమాటమున్ వీడి శ్రీ
మన్నారాయణ! ప్రశ్న వేతుము. మమున్ మన్నించు మీప్రశ్నకున్.
భావము. ఓ శ్రీమన్నారాయణా! నిన్ను గన్నట్టి ఆ తల్లిదండ్రులెవరు? ఈ లోకమును కలగా కల్పించి మన్నులో కలిపివేయుచున్న నిన్నువారు ఎందు నిమిత్తము కనియుండిరో? వారే ఇప్పుడు మా ముందున్నట్లైతే ముందుగా నిన్ను ఎందుకు కనిరో తెలియ జేయుడని నిర్మొహమాటముగా ప్రశ్నించుదుము. ఈ విధముగా ప్రశ్నించుచున్నందుకు నీవు మమ్ములను మన్నించుము.
92. శా. వెన్నే చాలదు నిన్ను బోల మదిలో విశ్వాస మొప్పారినన్.
మిన్నున్ దాకెడి కొండ చాలదు సుధీ పూర్ణాత్మ కాఠిన్యతన్.
నన్నున్ వెన్నమనంబుతోఁ గనుమయా ! నాలోన నీవుండి. శ్రీ
మన్నారాయణ! దన్ను నీవె కద. ప్రేమంజూడుమెల్లప్పుడున్.
భావము. ఓశ్రీమన్నారాయణా! నీకు మాపై విశ్వాసమొప్పారినచో మాపై చూపెడి నీమనసులో గలసుకుమారతకు వెన్నయైనను సరిపోలదు. ఓ సుధీపూర్ణుడా. కఠినత్వమే కలుగునెడల ఆకాశమునంటెడి కొండైనను సరిపోలనేరదు. నాలో నీవుండి నన్ను నీ వెన్నవంటి మనసుతో కనుము. మాకు ఆధారము నీవేకదా. ఎల్లప్పడూ ప్రేమతో చూడుము.
93. శా. ఛిన్నంబేలనొనర్తు వీ బ్రతుకులన్? చిత్రంబుగానుండె. నీ
విన్నాణంబున సృష్టి చేసితివిగా. విశ్వంబె నీ స్వంతమై
యున్నం గాని మమున్ కలంచ సుఖమై యొప్పారునా నీకు ? శ్రీ
మన్నారాయణ! సౌఖ్యదుండవగుమా. మమ్మున్ భువిన్ నిల్పుమా.
భావము. ఓశ్రీమన్నారాయణా! ఈ మా బ్రతుకులను విచ్ఛిన్నము చేసెదవేమి? ఇది విచిత్రముగానున్నది. నీ విజ్ఞానముతోనీ సృష్టి చేసితివి. ఈ సృష్టి మొత్తమే నీ స్వంతమై యున్నప్పటికీ మమ్ములను కలతలపాలు చేసీననే నీకు సుఖముగానుండి నీకు ఒప్పునాయేమి? నీవు సౌఖ్యప్రదుడవగుము.మమ్ము భూమిపై మమ్ములను సుఖముగా ఉండునట్లు చేయుము.
94. శా. ఎన్నన్ నీకును నాకు చాల మరుపే. హే దేవ! నా తప్పు లె
న్నున్నన్ నీకవి గుర్తు రావు. కృపనన్నుత్తేజితుంజేయ నీ
వెన్నో చేతు వవన్ని నేను మరతున్. దృష్టంబిదేనయ్య. శ్రీ
మన్నారాయణ! నీ కృపే వరముగా మా బోంట్లకున్ దేవరా.
భావము. హే దేవా! శ్రీ మన్నారాయణా! గణించి చూచినచో నీకూ నాకూ మరుపే సుమా. నా వల్ల ఎన్ని తప్పులున్నను నీకు అవేవియు గుర్తుకు రావు. అటులనే నాలో నిత్యమూ చైతన్యమును కొలుపుచూ నాకొఱకై నీవు ఎన్నో చేయుచుందువు. అవేవియు నాకు గుర్తుకు రావు. ఇదేకదా మనకు కనబడుచున్న విషయము. ఓ దేవరా. ఇటువంటి నీ కృపాగుణమే మావంటివారికి వరముకదా.
95. శా. కొన్నే మాకునెఱుంగునట్టులుగ నింకొన్నింటిపై సందియం
బన్నా కొల్పితివేల ? నీకు తగునా? యాత్మస్వరూపంబు మా
కెన్నంగల్గెడి శక్తినీయఁ దగదా? యీశా! నినుం గాంచ శ్రీ
మన్నారాయణ! శంకలెల్లఁ దొలగున్. మాయన్విసర్జించనౌన్.
భావము. ఓశ్రీమన్నారాయణా! కొన్నింటిని మాత్రమే మాకు తెలియునట్లుగను, ఇంకొన్నింటి విషయములో సందేహములను కలిగించితివెందులకు ? ఇట్లు సందేహాస్పదముగ చేయుట నీకు తగునా? కోరికతో నిన్ను మేము తెలుసుకొనుట కొ్ఱకు ఆత్మస్వరూపమును గ్రహింప గల్గెడి శక్తిని మాకు కల్గించుట నీకు తగదా? నిన్ను చూచినచో మా సందేహములు తొలగిపోవును. మాయను మేము విడిచిపెట్టుట సాధ్యమగును..
96. శా. కన్నారన్ గనబోవ నిన్ను, కలుగున్ గన్నీరు మున్నీరమై.
యన్నన్నా కనుటెట్లునిన్ను? మహనీయానందమెట్లబ్బు? నీ
కన్నన్ గాంచగనెవ్వడుండు జగతిన్? గాంక్షింతు నిన్గాంచ. శ్రీ
మన్నారాయణ! కన్నులన్ వెలుగుమా. మా మానసంబెంచుమా.
భావము. ఓశ్రీమన్నారాయణా! నిన్ను కనుల నిండుగా చూడబోవ కన్నీరు మున్నీరగును.
అయ్యయ్యో. నిన్ను మరి యే విధముగా చూడనగును? నిన్ను చూచుట వలన కలిగెడి
మహదానందమేవిధముగా లభించును? ఈ సృష్టిలో చూడదగువారు నీకన్నా ఎవరుందురు?
నిన్ను చూడ వలెనని కోరుకొందును. మా మనసు గ్రహించుము. మా కన్నులలో
వెలుగుము.

97. శా. ఎన్నో బాధ్యతలాత్మ మెచ్చనివి నాకేలన్? మహా దేవ!. నీ
కన్నన్బ్రీతి హితంబు వేరు కలదా? కామాదిషట్శత్రువుల్
నన్నున్వీడవు. ధర్మమెట్లొనరుతున్? నా యోగమున్ మార్చి శ్రీ
మన్నారాయణ! సత్య ధర్మ హిత సన్మార్గంబు కల్పింపుమా.
భావము. ఓ శ్రీ మన్నారాయణా! న మనస్సు చేయుటకంగీకరించని ఎన్నో బాధ్యతలనిన్నాళ్ళుగా నాపై మోపితివి. నీకన్నాప్రియమైనదీ హితమైనది వేరే ఏదైనా ఉన్నదాయేమి. కామాది శత్రుషట్కము నన్ను వీడిపోవు. ఇఃక నేను ధర్మమేరీతిగా ఆచరింపనగును. నాయోగమునే మార్చివేసి సత్య ధర్మ హిత సన్మార్గములను నాకుష

కల్పింపుము.
98. శా. సున్నుండల్, వడపప్పు, బూరె, లరిసెల్, శుద్ధోదకం, బుప్పు. క్షీ
రాన్నంబున్, పులిహోర , గార్లు, పుణుకుల్, యావన్మనోహార్యముల్
మున్నే నీకు తినంగ బెట్టుదుముగా. మూర్కొందువే గాని, శ్రీ
మన్నారాయణ! కొంచెమైన గొనవే, మా తృప్తికైనన్ హరీ!
భావము. ఓ శ్రీమన్నారాయణా! ఓ శ్రీహరీ! సున్నుండలు , వడపప్పు , బూరెలు , అరిసెలు , మంచినీరు ,
లవణము , పరమాన్నము , చిత్రాన్నము , గారెలు, పుణుకులు , సమస్తమైన మనోహర పదార్థములు ముందుగానే నీకు భుజించమని పెట్టుదుము కదా. వాటిని నీవు ఆఘ్రాణము చేతువే కాని, మా తృప్తి కొఱకైనను కొంచెమైనా తినవు కదా.

99. శా. జొన్నన్నంబయినన్ లభింపదు కదా శోధింప కోట్లుండినన్.
సన్నన్నంబె లభించు నీదు కృపచే సన్మాన్యతం బేదకై
నన్నీ వల్లనె. యెంత వింత! దయ గన్నన్ చాలదే మాకు. శ్రీ
మన్నారాయణ! జీవితేశ! సదయన్ మమ్మేలు లోకేశ్వరా!
సన్నన్నంబె లభించు నీదు కృపచే సన్మాన్యతం బేదకై
నన్నీ వల్లనె. యెంత వింత! దయ గన్నన్ చాలదే మాకు. శ్రీ
మన్నారాయణ! జీవితేశ! సదయన్ మమ్మేలు లోకేశ్వరా!
భావము. ఓ శ్రీమన్నారాయణా! మాకు పుణ్యముచే లభించినవాడా. మా జీవితేశా. దయతో మమ్ము పాలించు లోకేశ్వరా!. ఆలోచించగా కోట్లున్నను జొన్నన్నమయినా లభింపకపోవుట, పేదవానికయినా
సన్నబియ్యపన్నమే లభించుటవీటికి నీ కృపయే కారణము. ఆహా. ఇది నీవల్లనేకదా! యెంత వింత!
100. శా. అన్నీ నీ కెరుకే కదా. వరములే నాశింపగానేల? నా
కన్నుల్ గానని నాదు భావిని కనంగా నీకె సాధ్యంబు. నీ
కున్నే జెప్పఁ బనేమి? నీకె తెలియున్. కోరన్ నినున్ నేను. శ్రీ
మన్నారాయణ! 'వంద'నంబులయ. నా మార్గంబు నీవేనయా.
భావము. ఓశ్రీమన్నారాయణా! నన్ను గూర్చిన అన్ని విషయములు నీకు తెలియునుకదా. నీ నుండి వరములను నేనాశించ వలసిన పని యేమున్నది? నా కన్నులు చూడలేని నా భవిష్యత్తు చూచుట నీకే సాధ్యమగును. నీకు నేనిక చెప్పవలసిన పనియేమున్నది? ఏమి చేయ వలయునో నీకే తెలియును. ఇంక నేను నిన్నేమీ కోరను. నీకు నమస్కారములు. నాయొక్క మార్గము నీవేసుమా.

101. శా. నిన్నున్ నన్నును నమ్మినట్టి మహితుల్ నీ పేరిటన్ వ్రాయు శ్రీ
మన్నారాయణ దివ్యపద్య పఠనన్ మాన్యత్వమున్ బొంది, సం
పన్నుల్, సంతస పూర్ణులై ప్రబలుతన్ బ్రఖ్యాతినార్జించి. శ్రీ
మన్నారాయణ! వారినెల్లఁ గని సమ్మాన్యంబుగా ప్రోవుమా.
భావము. ఓ శ్రీ మన్నారాయణా ! నిన్నును , నన్నును విశ్వసించునటంవంటి మహాత్ములు నేను నీ పేరున వ్రాయుచున్న శ్రీ మన్నారాయణ పద్యమువలన మాన్యత్వమును పొంది , సంపన్నులుగను , ప్రఖ్యాతిని సంపాదించి, సంతోషముతో నిండినవారయి ప్రబలుదురు గాక. వొరినందరినీ నీవు ప్రేమతో చూచి, సన్మాన్యముగా చేసి కాపాడుము.

102. శా. కొన్నింటన్ కమనీయ కావ్య గుణముల్, కొన్నింట సద్బోధనల్,
కొన్నింటన్ వర భావ రమ్య సుగతుల్, కూర్మిన్ గనన్ జేయు నీ
వన్నింటన్ వర పద్యరూపుఁడవు. భావాతీత గోవింద! శ్రీ
మన్నారాయణ! దేవ దేవ! మహితా! మద్భావనోద్భాసితా!
వన్నింటన్ వర పద్యరూపుఁడవు. భావాతీత గోవింద! శ్రీ
మన్నారాయణ! దేవ దేవ! మహితా! మద్భావనోద్భాసితా!
భావము. నా భావనలో మిక్కిలి ప్రకాశించువాడా! ఓ శ్రీమన్నారాయణా! నీవు రచింపించిన యీ శ్రీమన్నారాయణ శతకమున గల పద్యములలో కొన్నింటిలో కమనీయమైన కావ్య గుణములు, కొన్నింట మంచిని చూపే బోధనలు, కొన్నింటిలో భావ రమ్యమైన సత్కవితా విధానములు, ప్రేమతో చూచునట్లు చేసెడి నీవు అన్నింటిలోను పద్యరూపముననుంటివి. భావాతీతుడవయిన ఓ గోవిందా! ఓ పాప రహితా! నీకు ‘వంద’నములు.
103. శా. మన్నింపందగు దోషముల్ కలిగినన్. మా దేవ దేవా! ననున్.
నీన్నే మానసమందు నిల్పితినయా నే వ్రాయు వేళన్ బ్రభూ!
ఎన్నం జాలను దోషముల్, మదిని నిన్నే నెన్నగన్ జాలి. శ్రీ
మన్నారాయణ! దోషముల్ కలిగినన్ మన్నించు. దోషాపహా!
ఎన్నం జాలను దోషముల్, మదిని నిన్నే నెన్నగన్ జాలి. శ్రీ
మన్నారాయణ! దోషముల్ కలిగినన్ మన్నించు. దోషాపహా!
భావము. మా దేవదేవా! ఓశ్రీమన్నారాయణా! ఈ నా రచనలో దోషములున్నను నన్ను మన్నింపదగును. ఓ ప్రభూ. ఈ పద్యములు వ్రాయు సమయమున నిన్నే నేను మనసులో నిలిపితిని సుమా. మదిలో నిన్నే ఎన్నుటకు సరిపోయి యున్న నేను దోషములనెన్న సరిపోను. దోషములను పరిహరించువాడా! దోషములున్నచో నన్ను మన్నించుము.
104. శా. నన్నున్ జిత్ర కవీశుడంచు సుజనుల్ నా బాధ్యతన్ బెంచ, నీ
వన్నెల్ చిన్నెలు చిత్ర గర్భ కవితన్ భాసించి నా గౌరవం
బెన్నంజేయుచు నిల్పు నన్ను కవిగా. హే మాధవా! నీవె శ్రీ
మన్నారాయణ! చిత్ర బంధ కవి కాన్, మర్యాద నాకబ్బెనే.
భావము. ఓ శ్రీమన్నారాయణా! సుజనులు నన్ను చిత్రకవీశ్వరుఁడు అని అనుచు, నా బాధ్యతను పెంచగా నీక సంబంధించిన వన్నెలు, చిన్నెలు, నా చిత్ర బంధ గర్భ కవితలలో భాసించి నా గౌరవమును పరిగణించునట్లు చేయుచు, నన్ను కవిగా నిలుపును. ఓ మాధవుఁడా! నీవే చిత్రబంధ కవివయి యున్నావు. ఆ విధముగా నీవుండగా ఆ మర్యాద నాకు లభించినది కదా!
105. శా. నిన్నున్నమ్మితినంచు నమ్మితివి నన్. నీ పేరుతో పద్యముల్
క్రన్నన్ వేకువనే రచించి చదువంగా పంపి భక్తాళికిన్
నన్నున్ మన్ననలందగా కనితివానందంబుతో నీవు. శ్రీ
మన్నారాయణ! నీ కృపామృతమునే మాకందఁగాఁ జేసితే.
భావము. ఓ శ్రీమన్నారాయణా! నిన్ను నమ్మితినని నన్ను నీవు విశ్వసించితివి. నీ పేరుతో పద్యములను వేకువనే రచించి చదువుట కొఱకు నీ భక్తులకు పంపి మన్ననలందునట్లు ఆనందముతో నన్ననుగ్రహించితివి. నీ కృపామృతమునే మాకు అందునట్లు చేసితివా.

106. శా. అన్నా! నీ నగుమోము బాధలను పోకార్పున్ గదా! ఏల నీ
వెన్నాళ్ళైనను కాన రావు? కన నింకెన్నాళ్ళు రాకుందువో?
కన్నా! కన్నులలోన నిన్ నిలిపి నే కన్మూయునాడైన శ్రీ
మన్నారాయణ! కావరమ్ము వరదా! మద్భాగ్య! మోక్షప్రదా!
భావము. నా భాగ్యమైన వాఁడా! మోక్షము నొసంగువాఁడా! ఓ శ్రీమన్నారాయణా! నీ నగుమోము బాధలను పోగొట్టును కదా! ఎన్నాళ్ళైనా నీవు ఎందులకు కనిపింప రావు? నన్ను చూచుట కొఱకు ఇంకా ఎన్నాళ్ళు నీవు రాకుండా ఉందువోకదా. ఓ కన్నతండ్రీ! ఓ వరదా! నా కన్నులలో నిన్ను నిలిపి నేను కన్ను మూయునాడైనను నీ మాన్యత్వమొప్పారునట్లుగా నన్ను కాపాదుటకు రమ్ము.
107. శా. ఉన్నంజాలును దేవ సంతతము నా యుచ్ఛ్వాస నిశ్వాసవై
కన్నన్ జాలును కాంతులీను కనులన్ కారుణ్య, మిత్రాళివై.
నిన్నున్నే వర చిత్ర గర్భకవినై నేర్పార చూపింతు శ్రీ
మన్నారాయణ! లోకులెన్నఁగ మహిన్ మాన్యుండ! ముక్తిప్రదా!
భావము. ఓ శ్రీమన్నారాయణా! ముక్తిని ప్రసాదించు ఓ సర్వ శ్రేష్టుఁడా! నీవు నా ఉచ్ఛ్వాసనిశ్వాసవై ఎల్లప్పుడు ఉండిన చాలును.ఓ కారుణాస్వభావా! నీ కాంతులు చిందే కనులతో మిత్రుల సమూహమై నన్ను చూచిన చాలును. నేను శ్రేష్టమైన చిత్ర గర్భ బంధ కవినై నా నైపుణ్యముతో లోకులు నిన్ను గుర్తించినట్లుగా ఈ భువిపై వారికి నిన్ను చూపుదును.
108. శా.చిన్నా! సద్గురు రాఘవార్యు కృపచే సిద్ధించెనీవిద్య. నే
మన్నింపంబడు రామకృష్ణుఁడ, కవిన్. మా తండ్రి సన్యాసిరా
ము న్నాతల్లిని రత్నమాంబను మదిన్ బూజించి, పద్యాళి, శ్రీ
మన్నారాయణ! వ్రాసితిన్ గొనుమ. శ్రీమంతా. సదా మంగళమ్.
భావము. ఓ చిన్నా! మద్గురుదేవులు కల్వపూడి వేంకటవీరరాఘవాచార్యుల కృపచే యీ విద్య నాకు లభించినది. సహృదయులచే మన్నింపఁబడు నేను చింతా వంశజుఁడనైన రామకృష్ణారావు అను పేరు గల కవిని. మా తండ్రిగారయిన సన్యాసిరామారావు గారిని, మా తల్లిగారయిన వేంకటరత్నమాంబను, ముందుగా మదిలో పూజించి, పిదప నిన్నెంచి యీ శతకము వ్రాసితిని. శ్రీమంతా! ఓ శ్రీమన్నారాయణా! నీవీ శతకమును కృతిభర్తవై స్వీకరింపుము. ఎల్లప్పుడు మంగళము అగును గాక.

స్వస్తి.
వ్రాసినది

0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.