గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఏప్రిల్ 2026, బుధవారం

శతేషు జాయతే శూరః ... మేలిమి బంగారం మన సంస్కృతి

 జైశ్రీరామ్

శ్లో.  శతేషు జాయతే శూరః - సహస్రేషుచ పండితః

వక్తా శతసహస్రేషు - దాతా భవతివా నవా.


తే.గీ.  నూటి కొక్కండె శూరుఁడౌ మేటి యుండు,

వేయికొక్కండె పండిత్య విబుధుఁడుండు,

శతసహస్రమ్మునొకవక్త సంభవించు,

ఉండు, లేకుండు దాత యీ యుర్విపయిని.


భావము.  మానవులలో నూటికొక్కఁడు మాత్రమే శూరుఁడగు వాఁడు పుట్టును. 

వేయిమందిలో ఒఅకఁడు మాత్రమే పండితుఁడుండవచ్చును,లక్షమందిలో 

ఒక్కడు మాత్రమే మంచి వక్త ఉండును. కాని దాతృత్వముతో నొప్పు 

దాత అయినవాఁడు ఉండునో ఉండడో చెప్పజాలము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.