జైశ్రీరామ్.
వల్లభేయ ఛందోదర్పణము,
అణిమా ఛందాంతర్గత
11,.త్రిష్టుప్ఛందము,
[వెలసిన వృత్తములు,2048.].
ప్రతి పాదమున 11.అక్షరములుండును,ప్రాస నియమము కలదు,
1.రవళీ వృత్తము,
సరి సరి యన సరియగునా?
పరి పరి భువి వరములునే?
కురియును గద!గురుతను లే?
సిరులను గన !సరియగు నే?
రవళీ వృత్తము,,న,న,న,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:512.
2.చరిత నిలు వృత్తము,
తెరవు గనుచు తిరుగ మేలౌ!
పరుల నెరిగి బ్రతుక మేలౌ!
సిరి వరదము స్థిరము నౌనే?
చరితను నిలు!చతురి మానన్?
చరిత నిలు వృత్తము,న,న,న,గగ,గణములు,
యతి,7.వ యక్షరము,వృ,సం;1024.
3.స్వార్ధతా వృత్తము,
అందరు దొంగలే?యనుట తప్పౌ!
కొందరి మంచికై!కులము చూపన్!
ముందుగ నిల్వగన్?ముదమదౌనే?
కొందరె!శోభిలన్?కుల వివక్షౌ?
స్వార్ధతా వృత్తము,భ,ర,న,గగ,గణములు,
యతి7.వ,యక్షరము,వృ,సం; 471.
4.శూన్య భవిత వృత్తము,
దొంగను దొంగనన్?దురము నగున్?
కొందరి స్వార్ధతన్?కుల మలమెన్
ముందుగ!నిల్వగా?ముదమెడలున్!
బంధము దూరమై!భవిత!చెడున్!
శూన్య భవిత వృత్తము,భ,ర,న,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:983.
5.శ్రీనివహ వృత్తము,
జీవన భాగ్యంబే?చెడి పోవంగన్!
పావన రామంబే?వర మోక్షంబౌ!
పావక!ధర్మంబే?పరి రక్షించున్!
నీవశమౌనే?శ్రీ నివహంబుల్?
శ్రీనివహ వృత్తము,భ,మ,స,గగ,గణములు
,యతి,7.వ యక్షరము,వృ,సం:199.
6.రాజిత వృత్తము,
రాజిత కల్యాణమ్!రమణీయమౌ?
భోజుడ!వయ్యేవా?పురి మేలగున్!
యాజిని నిల్చేవా!యరి వీరమౌన్!
తేజము బాసేవా!దిగులే?యగున్!
రాజిత వృత్తము,భ,మ,స,లగ,గణములు,
యతి,7.వ యక్షరము,వృ,సం:711.
7.జీవనసత్య వృత్తము,
జీవన సత్యము శివ మవగన్?
పావన భక్తియు పరమొనరున్!
నేవము నీతికి నిలయ మవన్?
శ్రీ వరదంబులు!జివురు రసన్!
జీవన సత్య వృత్తము,భ,భ,న,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:1015.
8.పురోగమ వృత్తము,
భావజు సాయక!పరవశానన్?
జీవన భాగ్యముచెడి యెడంబౌ ?
భావి పురోగతి!వడి చెరంచున్!
శ్రీవర దంబులు!చెడువడున్లే?
పురోగమ వృత్తము,భ,భ,న,గగ,గణములు,
యతి,7.వ,యక్షరమువృ,సం;503.
9.సుగంథి వృత్తము,
1. బంధాను బంధమ్ము!భద్రంబు నీవా?
గంథామరంబెంచి!కాపాడు దేవా!
అందాల సౌగంథి కానంద!సింథూ!
మందార సౌభాగ్య మాంగళ్య మీవా?
2.జీవాయు వృద్ధెంచు!శ్రీభద్ర రుద్రా!
నేవాన భక్తెంచు?నీదైన శైలిన్?
సేవాపరత్వాన!జీవాళి పర్వన్?
రావంబు రమ్యాన!రాణింపు!నిమ్మా!
సుగంథి వృత్తము,త,త,త,గగ,గణములు
యతి.7.వ,యక్షరము,వృ,సం:169.
10.విశ్వాంశ. వృత్తము,
ఆధార శూన్యంబు!ఆకాశ మదే?
నీ ధన్య జీవంబు!నిర్ణిద్ర గనన్?
వేదాలు విశ్వాంశ!మేల్జేయ!భువిన్!
సౌధామినుల్చిందు!చంద్రాంశ!తమిన్!
విశ్వాంశ వృత్తము,త,త,త,లగ,గణములు,
యతి.7,వ,యక్షరము,వృ,సం:425.
11.సాధనా వృత్తము,
నాదాను రావంబు!నవ్యత గనున్!
సాధాను సాధ్యంబు!సత్వ మమరున్?
శోధాను గుణ్యంబు!శోభిలు వడిన్!
మేథాను గుణ్యంబు!మేలొనరుతన్?
సాధనా వృత్తము,త,త,భ,లగ,గణములు
యతి,7.వ,యక్షరము,వృ,సం:932.
12.కమ్రతా వృత్తము,
శ్రీ లీల చెల్వాన!చెన్నొదవంగా!
కాలాను గుణ్యత!కమ్రత నేర్చన్!
మేలేర్చు జీవాలు మేథిని నిండన్!
నీ లోన దైవంబు!నీమము నింపున్!
కమ్రతా వృత్తము,త,త,భ,గగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:420.
13.చిరాశ వృత్తము,
చిరాయు వెట్లబ్బు?శ్రీ ధర్మ తేజా!
పరార్థ భుక్తంబు!పాపంబు గాదే?
చిరాశ!జీవంబు!చిన్ముద్ర యౌనే?
తరాల దోపిళ్ళు!ధర్మంబు!మాపున్!
చిరాశ వృత్తము,జ,త,త,గగ,గణములు,
యతి.7.వ,యక్షరము, వృ,సం:294.
14.కారాటవీ వృత్తము,
కారాటవీ!జ్యోత్స్న!కను నెవ్వారల్?
పోరాట యోథాళి!పొరి గీడొందన్?
చేరేటి నాథుండు!శివు డే?నెంచన్!
పేరాశ!జీవింపు!పెను స్వార్థంబే!
కారాటవీ వృత్తము,త,త,స,గగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:228.
15.పటుతా వృత్తము,
1 భోగాలు!భాగ్యాలు!పటు తెంతురే?
త్యాగాలు జేయంగ!దిగి రారయా?
పోగాల బుద్ధెంచి!పురి నొప్పగా!
యేగాని సాటౌనె?యిహమింతె లే?
2 రారాజు నారాజు రతి రాజులే?
చేరంగ రాడేమి?స్మిత భాషణన్!
కోరేటి రత్నాలు!కొదువాయెనే!
పోరాడ!శ్రీరేడు! పురిగొల్పెనో?
[ఏగాని=కానీ;దమ్మిడి కలిసి యేగానగును,పూర్వ లెక్క,].
పటుతా వృత్తము,త,త,స,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:740.
16.పొగరొనరు వృత్తము,మెరియగ!
పొగరు!పొంకంబు!భూభుజ న్యాయమ్!
నిగిడి!దర్పాన!నేరము! చేయున్?
తగిన!శిక్షేది?ధర్మ మదంతే?
సిగయె!రక్షంప!చేరునె?పాపమ్!
(సిగయె=అధినాయకుడె!రక్షింప=కాపాడు చుండగా! ).
పొగరొనరు వృత్తము,న,త,భ,గగ,గణములు
యతి,7.వ,యక్షరము,వృ,సం:840
17.వెన్నంటు వృత్తము,
నరుల న్యాయంబే!నర్మతం జనెన్!
సిరుల వెన్నంటెన్!చేరువై!వెసన్!
తగిన శిక్షేదీ?ధర్మ మే!తెగెన్?
భరపు జీవంబే!పౌర హక్కయెన్?
వెన్నంటు వృత్తము,న,మ,ర,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము,.వృ,సం:648.
18.కలుషిత వృత్తము,,
వెరచి ధర్మంబు!పెద్దలం దొప్పన్?
చిరిగె!సామాన్యుల!జీవితా లెల్లన్?
పెరిగె!స్వార్ధంబు!పిచ్చి లోకా నన్?
తిరిగి కల్యందు!తేరునే?న్యాయమ్?
కలుషిత వృత్తము,న,త,ర,గగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం;168.
19.విషవలయ వృత్తము,
విషము కుక్షంటి!పెద్ద లైతిరే!
భిషగు వేషాన!ప్రీతి నొందిరే?
విష వినోదంబు!వీర మేర్చెనే!
నిష విషాదాన!నీల్గ నేలనో?
విష వలయ వృత్తము,న,త,ర,లగ,గణములు
యతి,7.వ,యక్షరము,వృ,సం;680.
20.భూషిత వృత్తము,
రా!రాజ!శ్రీకార!సురాశ్రి!కామా!
మా!రామ!శ్రీరామ!తమాంతశూరా!
మా రాజ్ఞి!శ్రీ లేమ!సుమాశ్రితా!రా!
మా రాజిత స్మసోమ!నమామి!రామా!
భూషిత వృత్తము,త,త,జ,గగ,గణములు
యతి,8.వ,యక్షరము,వృ,సం:357.
21.భావచాతురి వృత్తము,
1. వేషాలు చాలించు!సువేది!యనన్?
ఘోషించు వేదాలు!స కూర్మి!భువిన్!
దోషాల పాపాలు సుదూర మిడున్!
భూషించు లోకాలు సుభూతి!జనున్!
2.రాజ్యాలు భోజ్యాలు!వరామము లై!
త్యాజ్యంపు దుష్కీర్తి!సుతార్హ!మిడున్!
భాజ్యంపు భోగంబు!విభూతి గనున్!
భోజ్యంపు!సంతృప్తి!సు పూజ్య మగున్!
భావ చాతురి వృత్తము,త,త,జ,లగ,గణములు
,యతి8.వ,యక్షరము,వృ,సం:869.
22..రమణిత వృత్తము,
మిడిసే వేలను?మేలు గనోయీ!
ఘడియ ల్డాసిన!కాలుడు లేపున్!
తుడుచున్శ్రీలను!ద్రోలుకు పోవున్?
వడి ప్రార్ధింపుమి!భద్రుని!శ్రీదున్!
రమణిత వృత్తము,స,భ,భ,గగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం,:440.
23.నిండుగ.వృత్తము,
తలచిం దెల్లను!దక్కు ననకన్?
నిలుపౌ! నీతిని!నిండుగ నిలన్!
భద్రుండా హరి!భద్రత!నిడున్!
విలువౌ!ముక్తిని!వే గను మికన్!
నిలన్=నిల బడగ,నిండుగను+ఇలన్=నిండుగా భూమియందు,
నిండుగ వృత్తము,స,భ,భ,లగ,గణములు,
యతి.7.వ,యక్షరము,వృ,సం:962.
24.శ్రీగుణ వృత్తము,
సర్వుండే ననుచున్జనగ నుతిన్!
పర్వం జూడకుమీ?వరమని!యా
సర్వార్ధు న్గొలువన్?జయ మమరున్!
దుర్వారంబు లడల్?తుల నిలు శ్రీల్!
శ్రీగుణ వృత్తము,మ,స,న,లగ,గణములు
,యతి.7.వ,యక్షరము, వృ,సం;985.
25..సర్వేశ వృత్తము,
శర్వుండే?భువినిన్!స దయ బ్రోచున్!
పర్వంబై!జగముల్!వరదమం!బౌన్!
దుర్వారంబు!లికందొలగు! ధాత్రిన్!
సర్వేశంబగు లే?జగము లెల్లన్!
సర్వేశ వృత్తము,మ,స,న,గగ,గణములు,
యతి,7.యక్షరము,వృ,సం:475.
26..ఉత్ఫల వృత్తము,
1. భ,ర,న,భంబులు!నంబరంబునన్!
వరుణ భావము శ్రీవరంబవన్?
పరిమళించిన యుత్పలంబులే?
వరలె నుత్పల శ్రీ!వరంబయెన్!
ఉత్ఫల వృత్తము,న,భ,ర,లగ,గణములు,
యతి,7.వయక్షరము,వృ,సం;696.
2. రఘుకులాన్వయ రత్న దీపమా!
మఘ సమోన్నత మాన్య ధీరమా!
విఘట మంటని!విశ్వ మేర్చుమా!
యఘమునంటని!హాయి నీయుమా!
మఘసమోన్నత=మఘనక్షత్రమువలె
యున్నతమైన,యనగా సింహమువలె
ధీరమైన ,విఘటమంటని=వికటించని.
27.కీర్తి వాస వృత్తము,
నిరుప మంబగు జ్ఞాన మూనంగా!
సరళ సంస్కృతి!భాస మానంబై?
పరమ పావనతా!వరం బేర్చున్!
చిర సుకీర్తిని!వాసివౌ !దీవే?
కీర్తి వాస వృత్తము,న,భ,ర,గగ,గణములు,
యతి,8.యక్షరము,వృ,సం:184.
28.,ధార్మిక వృత్తము,
శ్రీలున్గ లిగిన!స్థిర మగునే?
మేలున్దలచుమి!మెరియగన్?
కాలం!పరుగిడు!గతి గమనన్?
కైలాసుని గను! కలి మదియే?
ధార్మిక వృత్తము,త,న,న,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:1021.
29.సద్వచన;వృత్తము,
చేయన్వలెను!శివ తమంబుల్!
వ్రాయన్వలెను!సు వచనంబుల్!
కోయన్ద గదుర!గుణ సుదూరాల్?
న్యాయం బెడమిడ!నరక?మేయౌ?
సద్వచన వృత్తము,త,న,న,గగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:509.
30.నర్మ కర్మవృత్తము,
నేతి బీరయందు నేయెంతుండునో?
నేత మాట లందు! నీతంతే!సుమా?!
భూతభూతి నింప!పోరాటంబదే?
ఘాతుకాలవాల!కర్మే ?నర్మమౌ?
నర్మ కర్మ వృత్తము,ర,జ,మ,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:539.
31.భూతి మేత వృత్తము,
నీతి లేనివాడు!నేరాలం బారున్?
జాతి నీతి మాసి!సర్వేశం బాయెన్!
రాతి బొమ్మపూజ!రామంబా!యంచున్?
కూత భూతి మేత !పోరాటం బాడున్?
భూతి మేత వృత్తము,ర,జ,మ,గగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:27.
32.రసానిల వృత్తము,
నేతి బీరలవి!!నీతి పలుకుల్!
భూతి దామపు!పోతర మదే?
కూతలే?కడు కోతులటులున్!
ప్రేత కర్ములకు!ప్రీతి కబురుల్!
రసానిల వృత్తము,ర,న,భ,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము, వృ,సం:975.
33.ప్రీతిలు,వృత్తము,
నేతి బీరలవి!నీతివచంబుల్!
భూతి దామపు!పోతర మందెన్!
కూతలే!పలు!కోతుల నంగన్?
ప్రేత కర్మలకు ప్రీతి జెలంగెన్!
ప్రీతిలు వృత్తము,ర,న,భ,గగ,గణములు,
యతి.7.వ,యక్షరము,వృ,సం:463.
34.గుర్వర వృత్తము,
సర్వమున్!శివు చరణాలు గొల్వన్?
పర్వమౌ! సుర !వరదాలు గల్గున్!
శర్వమే!గద!సరి లేరు!గావన్?
గుర్వరంబదె?కురిపించు!శ్రీలన్!
గుర్వర వృత్తము,ర,న,జ,గగ,గణములు,
యతి.7.వ,యక్షరము,వృ,సం;379.
35. సిరికురియు,వృత్తము,
సర్వమున్!శివత!చరంబు!గదే?
పర్వమౌ!సురల !వరా మయమే?
శర్వమేగద!సరిలేరు!గనన్?
గుర్వరం బది!కురిపించు!సిరుల్!
సిరి కురియు వృత్తము,ర,న,జ,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం;891.
36.సుమాంజలి వృత్తము,
జయ మొందెదు!కూర్మి చరింపగన్!
భయ మాపుచు!శ్రీర్మ పరంబిడున్!
స యుతిం గను పేర్మి సరేదిలన్?
కు యుతిం విడు!కూర్మి గురున్మదిన్!
సుమాంజలి వృత్తము,స,స,స,లగ,గణములు,
యతి,8.వ యక్షరము,వృ,సం:734.
37,సరాగ వృత్తము,
.జయ మెంచుమి!కూర్మిస రాగానన్?
భయ మాపుచు!శ్రీర్మ!పరం బేర్చున్!
స యుతిం!గను!పీర్మి!సరే దెంచన్?
కుయు తిం!విడు!కూర్మి!గురున్భక్తిన్!
సరాగ వృత్తము,ర,స,స,గగ,గణములు,
యతి,8.వ,యక్షరము,వృ,సం:123.
38.యుర్వెణీ వృత్తము.
చరించుమి కూర్మి! సర్వమున్భువిన్!
వరంబయి చేరు!పర్వమౌ చిలన్?
సరేదియు లేదు?శర్వమే గదా?
గురున్మది కోరు!గుర్వరంబులన్!
యుర్విణీ వృత్తము,జ,జ,ర,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:430.
39.గుర్వరామ వృత్తము,
చరించుమి కూర్మి!సర్వ మీ దేలే?
వరంబయి!చేరు!పర్వంబౌచున్?
సరే దియు! లేదు?శర్వమే?సర్వమ్!
గురున్మది కోరు!గుర్వ రామంబున్?
గుర్వరామ వృత్తము,జ,జ,ర,గగ,గణములు
,యతి,7.వ,యక్షరము,వృ,సం;174.
40.చిమ్మచీకట్లు వృత్తము,
నమ్మక ద్రోహంబు నాశనం బేర్చున్!
వమ్మగు జీవంబు వాసమే గూల్చున్!
దమ్నును ధైర్యంబు!దగ్ధమౌ!నెంచన్?
చిమ్మును చీకట్లు!జీవితం బంతన్!
చిమ్మచీకట్లు వృత్తము,భ,త,ర,గగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:423.
41.కోమలతా వృత్తము,
కోమలత్వంబు!కూర్మి యేదిలన్?
గోముఖ వ్యాఘ్రాల!గోడు!పాలనన్?
క్షేమము జీవంబు!శ్రీ లొరంగుటే?
కామిత సౌఖ్యంబు!కల్లయే?భువిన్!
కోమలతా వృత్తము,భ,త,ర,లగ,గణములు
యతి.7.వ,యక్షరము,వృ,సం:167.
42.పాల్పడు,వృత్తము,
పైకి వెన్న యటుల్పాల్పంచు కొనన్?
లోక మేలుటకే? శ్లోకించు!మదిన్!
సాక గెల్పు భువిన్?స్వార్ధం బమరున్?
చీకుచున్ప్రజన్!సేవంద్రు!ప్రభుల్!
పాల్పడు వృత్తము,ర,స,త,లగ,గణములు,
యతి,,7.వ,యక్షరము,వృ,సం:795.
43.భుక్తెంచు వృత్తము,
1. మేక వన్నె పులుల్?మేల్జేయు నంటే?
పీక నొక్కుటయే?పేరొంద గోరే!
బూకరించి జనం!భుక్తెంచు వాంఛే?
లోక మేలుటకే?శ్లోకింతు!రంతే?
2. భూమి నేలుటదే?పూజ్యం బటంచున్?
నీమ మారగ తా నేరంపు దీక్షన్?
సామ దానములన్!సాకెంచు తీర్పే?
రామయా!సిరులన్రాబట్టుకోర్కే?
భుక్తెంచు వృత్తము,ర,స,త,గగ,గణములు,
,యతి,7.వ,యక్షరము,వృ,సం:283.
44.రంభజా వృత్తము,
కానదాయెను?కలియుగంబునన్?
కానకం జని!కలి యటంచు నున్?
పూని కట్టడి!కలన మేర్చిరిలన్!
మౌన మందగ మలినమాయెనే?
రంభజా వృత్తము,ర,న,స,లగ,గణములు,
యతి!6.వ,యక్షరము,వృ,సం:705.
45.రసానిల వృత్తము,
న్యాయమన్నది!యంటె కులమునున్!
కాయ రైరిల?కంటితుడుపులన్!
కూయు చుందురు కుంటి తెలివినిన్?
తీయు చుందురు!తింటు మనములున్?
రసానిల వృత్తము,ర,స,న,లగ,గణములు,
యతి.6.వ,యక్షరము,వృ,సం 987.:
46.రసనా వృత్తము,
న్యాయ మన్నది!యంటె!కుల మేలన్?
కాయ రైరిల?కంటి తుడుపే లే?
కూయు చుందురు!కుంటి తెలి వోపన్?
తీయు చుందురు,తింటు!మనుజాళిన్!
రసనా వృత్తము,ర,స,న,గగ,గణములు,
యతి,6.వ,యక్షరము,వృ,సం:475.
47..పరాభవ వృత్తము,
అంటె!కులమును!న్యాయ మేలనో?
కంటి తుడుపుల!న్యాయ మేర్చుచున్!
కుంటి తెలివిని గోయి నెట్టుచున్?
తింటు మనములు!ధీ యశంబనన్?
పరాభవ వృత్తము,భ,న,ర,లగ,గణములు
యతి6.వ,యక్షరము,వృ,సం:449.
48.దుర్యశ వృత్తము,
అంటె కులమును న్యాయ మింతింతై!
కంటి తుడుపుల!న్యాయ మెర్చెన్లే?
కుంటి తెలివిని!గోతి పాలాయెన్?
తింటు మనములు!ధీయశం బేదీ?
దుర్యశ వృత్తము,భ,న,ర,గగ,గణములు,
యతి,6.వ,యక్షరమువృ,సం:193.
49.రసఝరీ వృత్తము,
మనోను కూలమౌ?మాట లేలగన్!
ధనాను సారియై?ధర్మ మేగెలే!
మనెన్కులంబెపో?మంచి నొందుచున్!
కనంగ స్వేచ్ఛకే?కంటకం బయెన్!
రసఝరీ వృత్తము,జ,ర,ర,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం 662.
50..రామం రమ్యమ్,వృత్తము,
రామా!నీనామంబే?రమ్యంబిలన్!
క్షేమాలంకృతమౌ!శ్రీమంత మదే?
ధీమానం జీవింపన్!దేదీప్తు లిడున్!
కామారీ?నీవాడే!కార్తీకు డెయెగా!
రామమ్ రమ్యమ్ వృత్తము,మ,మ,త,లగ,గణములు
,యతి,7.వ,యక్షరము,వృ,సం:769.
51.సిద్ధాత్మ వృత్తము,
రాజీవాక్షా!రామా!రమ్యార్థ!భావా!
పోజేయున్బాపాలన్?పూజ్యం బదే నౌ!
వేజేరున్బుణ్యమ్!విద్వద్వరానన్!
శ్రీ జేరన్?భద్రంబౌ!సిద్ధాత్మ నేర్చున్!
సిద్ధాత్మ వృత్తము,మ,మ,త,గగ,గణములు
యతి,7.వ,యక్షరము,వృ,సం;257.
52.అత్యాశా వృత్తము,
పట్టిసొమ్మును మెక్కు!పందికొక్కై!
పట్టి వీడడు తిండి!పంది యట్లున్?
కట్ట డెంచడు వాడు!కండ పుష్టిన్!
గుట్టులేనటి గోళ కుండ తండే?
అత్యాశా వృత్తము,ర,స,జ,గగ,గణములు,
యతి,8.వ యక్షమువృ,సం:347.
53.పాప భూష,వృత్తము,
పట్టని పుత్రులు!పాప భూషలే?
కట్టును దప్పిన!కాల నేములౌ!
వట్టము గూర్తురు!పాపు లిద్ధరన్!
జెట్టులనంగను!జేరునే!సుఖమ్?
పాపభూష వృత్తము,భ,భ,ర,లగ,గణములు
,యతి.7.వ,యక్షరము,వృ,సం:-695.
54.వట్టమేర్చు వృత్తము,
పట్టని పుత్రులు!పాపులీ ధాత్రిన్!
కట్టును దప్పిన!కా పురూషుండే
వట్టము గూర్తురు!పాపమా పేక్షన్!
జెట్టు లనంగను!జీవనే?పాడౌ!
వట్ట మేర్చు వృత్తము,భ,భ,ర,గగ,గణములు,
యతి.7!వ,యక్షరము,వృ,సం:183.
55.వాసిలు వృత్తము,
వేసరితే?నిలన్!వేంకటేశ నన్?
వాసిల దీర్చుచున్?వల్లభం బిడున్!
దోసిలి యొగ్గుచున్?దిక్కు నీవనన్?
గాసిల నీయడే?కన్న తండ్రియై!
వాసిలు వృత్తము,భ,ర,ర,లగ,గణములు
,యతి,7.వ,యక్షరము,వృ,సం:663.
56.దోసిలి యొగ్గు వృత్తము
వేసరితే?నిలన్!వేంకటాద్రీశా!
వాసిల దీర్చుమా!వల్లభుం డీవై!
దోసిలి యొగ్గుచున్!దిక్కు నీవంచున్!
గాసిల నీయకన్!గావరా వేగన్?
దోసిలి యొగ్గు వృత్తము,భ,ర,ర,గగ,గణములు
,యతి,7.వ,యక్షరమువృ,సం:-151.
57.మనెండు వృత్తము,
కనంగ నైతేను!కర్మోప లబ్ధిన్!
వినంగ రానైతి విశ్వేశు కీర్తిన్!
మనంగ దైవాంశ!మాకేది?దేవా!
యనంతు కీర్తింతు!నాశీర్వ దింపన్!
మనెండు వృత్తము,జ,త,త,గగ,గణములు,
యతి,7. వ,యక్షరము,వృ,సం;-294.
58..పెనంగొను వృత్తము,
మనెండు ధర్మంబు!మావంత నగన్!
తినెండు సద్బుద్ధి!విశ్వేశు డుసగన్!
కనెండు దీక్షింత!కల్గింపు!శివా!
పెనంగు భక్తెంతొ?ప్రీతెంచి!గనుమా!
పెనంగొను వృత్తము,జ,త,త,లగ,గణములు
,యతి,7.వ,యక్షరము,వృ,సం,806.
59..మోహన వృత్తము,
వెలిగించు జీవమ్?పేర్మోప ధాత్రిన్!
కల లీల దోచెన్?కర్మార్థ చింతే!
వెలవోని తేజమ్?విల్వెంచు?శోభన్!
కొలిమేల?ద్రోయన్?కూర్మేది?జీవా!
మోహన వృత్తము,జ,య,త,గగ,గణములు,
యతి.7.వ,యక్షరము,వృ,సం:-270.
60..వెలుగెంచు వృత్తము,
వెలుగెంచి జీవమ్?పేరొందు మిలన్!
కల లీల దోచెన్?కర్మార్థ ఫలమ్!
వెలవోని తేజమ్?విల్వెంచు!రసన్!
వెలుగీవు కమ్మా!విశావస!మునన్!
వెలిగించు వృత్తము,స,య,త,లగ,గణములు
యతి,7.వ,యక్షరము,వృ,సం:-782.
61..తెలివిజీవ,వృత్తము,
తెలివి జీవివి తెలిసి కోమ్మా!
కలిమి నిల్వదు!కదులు నీతిన్!
వల దధర్మము!భముల గూర్చున్!
విలువ పెంచియు!వెలుగు ధాత్రిన్!
తెలివి జీవ వృత్తము,భ,న,న,గగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం;-511.
రేష్మ సుష్మ కరిష్మ
62..శ్రీనివస వృత్తము,
వరలు నీతికి!వన్నెయనంగన్!
సురల దీవన చూర గొనంగా
పరమ భాగ్య విభావ!మౌతన్?
సిరుల శోభిత! శీనివ సానన్?
శ్రీనివస వృత్తము,న,భ,భ,గగ,గణములు
,యతి,7.వ,యక్షరము,వృ,సం:-440.
63..సమాదర వృత్తము,
వినుము మంచి!వివేక మొనరున్!
కనుము నీతి!వికార పడకన్?
మనుము జాతి!సమాదరమునన్!!
తినకు యొంటరి!తీపిదములన్!
సమాదర వృత్తము,న,భ,భ,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-956.
64..సింగారు వృత్తము,
భంగాలం దేలేవా?భద్రంబే?మృగ్యమ్!
సింగారంబేలోయీ?ఛిద్రంబీ జీవితమ్!
కంగారే!మానింకన్?గన్పించున్సత్యమ్!
నింగీ నేలా!యేకమ్!నిర్వీర్యమ్!తేజమ్!
సింగారు వృత్తము,భ,భ,భ,గగ,గణముములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-01.
65..న్యాయంబేర్చు వృత్తము,
ఔదార్యం!జీవాళిన్!యార్తిం బాపుగా?
బోధార్థమ్!పర్మాత్మన్!పొత్తేర్చు న్వెసన్!
వేదాలంన్శోధింపన్?బేధార్తుల్విడున్?
కోదండుండే!రక్షౌ?గొల్వంగా వలెన్?
న్యాయంబేర్చు వృత్తము,భ,భ,భ,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-513.
66..పూర్ణమిదమ్ వృత్తము,
మోదంబే?ప్రమోద మోద మలమెన్!
వేదంబే?యమేయ మేథ నిడగన్!
శ్రీదంబే?శివంబు జేయు!భువినిన్!
బోధంబే?శుభంబు!పూర్ణ మిదమౌ!
పూర్ణ మిదమ్ వృత్తము,మ,జ,భ,లగ,గణములు,
యతి.7.వ యక్షరము,వృ,సం;-937.
67.సు సూక్తి వృత్తము,
వాదాడ న్జనంగ!బాధిలె దీవే?
జూదంబే?చెడుంగు!శోభయు మాపున్!
నీదేయౌ!నిజంబు!నీతిల బల్కన్?
బోధింపౌ?సు సుక్తి!బుద్ధిని పెంచున్!
సు సూక్తి వృత్తము,మ,జ,భ,గగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృసం;-425.
68.చేతనోద్ధార వృత్తము
త్రాతవై!దాతవై!సదాచారివై!
నేతవై!సర్వదా!నిధానంబునన్!
భూతి జేకూర్చుచున్బుధానందవై!
చేతనోద్ధారివై!శివుండైతివే?
చేతనోద్ధార వృత్తము,ర,ర,య,లగ,గణములు,
యతి ,7.వ,యక్షరము,వృ,సం:-595
69 .దైవదూర వృత్తము,
కామియై!గామియై!గతింపే!లేకన్?
స్వామినే?దూరగన్స దామంబౌనే?
ప్రేమయౌ?దైవమున్వెరం గేర్చంగన్!
క్షేమమా!లేదికన్?శివంబే?దూరన్!
దైవ దూర=దైవమును నిందించు,
దైవ దూర వృత్తము,ర,ర,య,గగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-83.
70..నిరుపమాన వృత్తము,
మా రామ!శ్రీరామ!మథుర నామా!
శ్రీ రాజ!రాజన్య!శివము!నీవే!
భారంబు నీదయ్య!భవ హరుండా!
నీమాన బ్రోచేటి?నిరుప మానా!
నిరుపమాన వృత్తము,త,త,న,గగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-485.
71.శివతా వృత్తము,
మల్లేశు!డిద్ధాత్రి!మహితు డనన్?
చెల్లించు కోరంగ!శివ!యనగన్?
బల్లాలు రానీడు?భవ హరియై!
చల్లటి!మూర్తౌచు!జయమిడున్!
శివతా వృత్తము,త,త,న,లగ,గణములు,
యతి.7వ,యక్షరము,వృ,సం:-997.
72..జీవరక్షా వృత్తము,
వేదాలు దోషార్హ విద్వంసం బేర్చన్?
క్రోధంబు దీపింప కోల్పోవన్కీర్తిన్!
పాదోర్వి మ్రింగంగ!పట్టేరే?దీక్షన్!
శ్రీధర్మ రా!వేగ!జీవాళిన్బ్రోవన్?
జీవ రక్షా వృత్తము,త,త,మ,గగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-37.
73..ఆరాదన వృత్తము,
దోబూచు లాడంగ!దోషమ్మౌ!?సుమా!
భూభారమే !నీది!పూజ్యార్హంబునన్!
చేబూని రక్షింప!శ్రీమంతం బగున్?
ఆబాల గోపాల!మారాధింపగన్?
ఆరాధన వృత్తము,త,త,మ,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-549.
74.నివాళీ వృత్తము,
వేదాల మంత్రాల విధానం!నీదే?
సాధించు సాధ్యాల!జయంబీవే!లే?
వాదించు వాదంబు!వధాన్యుడీవే?
నీ ధర్మ మిద్ధాత్రి!నివాళిం గూర్చున్!
నివాళీ వృత్తము,త,త,య,గగ,గణములు,
యతి.7.వ,యక్షరము,వృ,సం:-101.
75.సువిధాన,నృత్తము,
వేదాంత వేద్యమౌ?విధానములే!
శోధించి సాధించు!సుధాముండవే?
వాదాల సారంబు!వధాన్యుండవే!
నీధర్మ మిద్ధాత్రి! నివాళిన్గను లే!
సు విధాన వృత్తము,త,త,య,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృశసం;-613.
76.అర్థజాల వృత్తము,
భావార్థ జాలంబు!భవ్యమై!యొప్పన్!
సేవార్థ భావంబు!జీవమై!వెల్గున్!
దీవించి రక్షించు!దేవు డీవే!గా!
నావంక వీక్షించు!నన్ను గాపాడన్!
అర్థ జాల వృత్తము,త,త,ర,గగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-165.
77..కావ్య సంపుటి వృత్తము,
భావంబు భాసిల్ల!భద్రతం బవున్!
సేవింతు సర్వేశు!శ్రీకరంబవన్!
నావంతు నూహింతు నవ్యమౌ!నటుల్!
కావంగ రావయ్య?కావ్య సంపుటిన్!
కావ్య సంపుటి వృత్తము,త,త,ర,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-677.
78..ధనవికార వృత్తము,
మనుజు డేనని మనంగ!శ్రేయమ్!
ధన వికారము తరియ నీదే?
చనుము నీతిని!సదాచరానన్!
ఘనపు జన్మము!గలింగె!నెచన్!
ధన వికార వృత్తము,న,భ,జ,గగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-376.
79..తరించు వృత్తము,
తరము లెన్నియొ తరించె నిటన్!
వరలె పూజ్యత!వరామములన్!
పరమ శ్రీలవి!పరాయ మయెన్!
వెరసి నీతియె?వెలింగ నిశమ్!
తరించు వృత్తము,న,భ,జ,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-948.
80.ధీమహీ వృత్తము,
కామ వికారతన్!గమ్యంబే!చెడున్!
రామ!వరామతే?రమ్యంబారయన్!
ధీమహి గమ్మికన్?దీప్తుల్భాసిలన్!
నీమము!నీతియే!నిల్చున్ ధాత్రినిన్!
ధీమహీ వృత్తము,భ,ర,మ,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-535.
81.కాలంతీరు వృత్తము,
కాల గమంబునన్!కాలంబే!తీరున్!
మేలుకు మాలివై!మెల్గంగన్వలెన్!
చీలిన ప్రేమయే?చేజార్చున్శ్రీలన్!
పాలన నీతి శోభాయంబౌ!నిలన్!
కాలంతీరు వృత్తము,భ,ర,మ,గగ,గణములు
యతి,7.వ,యక్షరము,వృ,సం:-023.
82.సాదర వృత్తము,
సాదర మొందెడు చరింపే!ధన్యమ్!
బోధల సారంబు!పునీతం బేర్చున్!
మాధక సేవ్యంబు!మరెంతో కీడౌ!
భూధరముల్మ్రింగ!పురోగమ్యంబే?
సాదర వృత్తము,భ,త,య,గగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-103.
83.భూధర,వృత్తము,
పూజిలు దైవాస్తి భుజింపేలనో?
భోజులె పూజింప!బుధాహ్లాదమా?
భాజన భోజ్యంపు!ప్రభావంబిదా!
రాజిత కల్యాణ!రమంబే మయెన్?
భూధర వృత్తము,భ,త,జ,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం;-871.
84.మహాత్మ్య వృత్తము,,
మంచిగ మెలుగ!మహాత్ముండగున్!
సంచిత ధనము!సమస్యే సుమా!
కుంచిత తెలివి!గుణా లన్విడున్!
వంచన విడువ!పధంబే!గదా!
మహాత్మ్య వృత్తము,భ,న,య,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-639
85.మహోన్నతి వృత్తము,
మంచికి విలువ మహోత్కృష్టంబౌ?
కుంచిత తెలివి కఠోరం బేర్చున్!
వంచన విడుటె!పరంబేపారున్!
పెంచకు కలుష! ప్రచారాలెల్లన్!
మహోన్నతి వృత్తము,భ,న,య,గగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-127.
86 దివ్యతా వృత్తము,
. పావన మొందెండు భక్తియే?మోక్షమ్!
నేవము నీతెంచు?నిత్యమేర్పంగన్?
భావము రావంబు!పర్వమౌ?భూమిన్!
కావులె!దైవంబుకల్మినిన్!నిత్యమ్!
దివ్యతా వృత్తము,భ,త,ర,గగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-167.
87.లోక మంచి వృత్తము,
దానము ధర్మంబు!తప్ప బోకుమా?
ధ్యానము మోక్షంబు!దివ్య మే!సుమా!
కానని కష్టాలు!గాన రా వికన్?
మానిత లోకాన !మంచి నెంచుమా!
లోక మంచి వృత్తము,భ,త,ర,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-679.
88..వెఱంచు వృత్తము,
సిరులే!మేలెంచ సిడి ముడియౌ!
విరియౌ జీవంబె?వెస లనిశమ్!
వెరపై రక్షింప!వెఱచు నెదన్?
పరమోప న్జూడ!బడ కెడమౌ?
వెఱచు=భయపడు,సిడి ముడి=కోపము,వెసలనిశమ్=యెల్లపుడు
దూరమేర్చును,విరియౌ జీవము=విశాలమైన,పూవువంటి జీవితము
వెఱంచు వృత్తము,స,త,న,లగ,గణములు,
యతి.7.వ,యక్షరము,వృ,సం;-987.
89.మేథావినీ వృత్తము,
గురవై!గుర్తింపు!గురుత మేర్చున్!
పర బ్రహ్మంబౌచు!వరలు ధాత్రిన్!
వర మేథన్పెంచు!పరము డౌచున్?
పురము ల్దీర్చెండు!బుధు డతండే!
మేథావినీ వృత్తము,స,త,న,గగ,గణములు,
యతి ,7.వ,యక్షరము,వృ,సం:-475.
90.పరమేదను వృత్తము,
పరమంబేదంచు?పాపము జేయన్?
వెరపౌ?జీవంబు!వేదన గూర్చున్!
కరటౌ జన్మంబు!కల్మష!మేర్చున్!
పెరకున్భద్రంబు!భీతిద మౌచున్!
పరమేదను వృత్తము,స,త,భ,గగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-421.
91.నిరతానంద వృత్తము,
నిరతానందంబు!నెంచగ వలెన్!
పర శ్రీలంగోర!పాపము నిడున్!
చిరమౌ!కీర్తెంచు!జీవము సరౌ!
స్థిరమౌ?బుద్ధిన్ప్ర శిద్ధి తననౌ?
నిరతానంద వృత్తము,స,త,భ,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-933.
92.ప్రభావక వృత్తము,
పరమార్థంబౌచు!ప్రభావంబేర్పన్?
వర మంత్రాలెల్ల!స్వభావోద్దీప్తినిన్!
సురమోదంబందెను!శోభాయంబై!
పరగెన్భాగ్యంబు!సు భద్రం బౌచున్!
ప్రభావక వృత్తము,స,త,య,గగ,గణములు,
యతి.8.వ,యక్షరము,వృ,సం:-101.
93.భక్తి రక్ష వృత్తము,
వరమౌ!నిత్యంబది!పర్మంబయా!
తిరమౌ!సత్యంబె!తేజం బిడున్!
గురుతౌ?భక్తిం జన! గుర్తిం పదే?
కరుణన్?దైవంబదె?కాయున్నినున్!
భక్తి రక్ష వృత్తము,స,త,య,లగ,గణములు,
యతి.8.వ,యక్షరము,వృ,సం:-613.
94.సనాతన ధర్మ వృత్తము,
నరు లెరుగు సనాతన ధర్మమ్!
పరమునకది!పావన మేర్చున్!
సిరు లమరగ జీవన సౌఖ్యమ్!
తరియగ వలె!ధర్మ సురక్షన్!
సనాతన ధర్మ వృత్తము,న,న,భ,గగ,గణములు
యతి.7.వ,యక్షరము,వృ,సం:-448.
95.ఆదరణ వృత్తము,
మనియెడు జన మాదరణమే?
కన నగు శుభ కారకములన్!
విన వలె!వర వేదము లిలన్?
కనుమిల సమ భావత వడిన్!
ఆదరణ వృత్తము,న,న,భ,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము, వృ,సం:-960.
96.నీమమెంచు వృత్తము,
నిరతము గురు నీమం బెంచుమా!
పర ధనమది పాపంబౌ నయా!
సిరు లొకపరి చేరం జాలవే?
వెరగక విను వేదార్ధంబులన్!
నీమ మెంచు వృత్తము,న,న,య,లగ,గణములు,
యతి.7.వ,యక్షరము,వృ,సం:-576.
97.వరుణ దయ వృత్తము,
వరుణుని దయ!వర్షంబుల్కుర్యున్!
వరలు నుతుల భాగ్యంబే!యౌలే!
హరి హరు లిల హర్షం బేర్చంగన్!
చిర సిరివర శ్రేయంబౌ?భూమిన్!
వరుణ దయ వృత్తము,న,న,మ,గగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం;-64.
98..మంచేమేలు,వృత్తము,
మనసు నిలుపగ!మంచే!మేలౌ!
కనును ఫలములు!కర్మం బంతే?
వినకు చెడు గది!పెన్ముప్పౌగా!
కొనుమ నిజమును!కూర్మిం గూర్చున్!
మంచే మేలు వృత్తము,న,న,య,గగ,గణములు,
యత,8.వ,యక్షరము,వృ,సం:128.-
99..కుల గోల.వృత్తము,
కులము కులమను గోలేలనో?
తలప సమతది దక్కేనుకో?
చెలిమి నలపకు!చిల్పౌ చిలన్!
కలిసి మెలిగిన!కల్గున్!శుఖమ్!
కులగోల వృత్తము,న,న,య,లగ,గణములు,
యతి,8.వ,యక్షరము,వృ,సం:-640.
100.భద్రతిడు వృత్తము,
భరత దేశమే! భద్రతి డున్లే?
నరుల సౌఖ్యమే!నాణ్య తమంబై!
కరము సఖ్యతన్!గౌరవ మొప్పన్?
సరికి రారిలన్?సౌమ్యుల నంగన్!
భద్రతిడు వృత్తము,న,ర,భ,గగ,గణములు,
యతి.7.వ,యక్షరము,వృ,సం:-409.
101.సురసీమ.వృత్తము,
సురల రాజ్యమై!చూడ బడెనే!
పరమ మూర్తులే?వాసిలి రిటన్!
పరువు పెంపుకై!భాసిలి రనన్?
కరము దీక్షతో!గాసిలి రహో?
సుర సీమ వృత్తము,న,ర,భ,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-921.
102.కైవల్య దీక్ష వృత్తము,
సౌమ్యత సర్వదా!సాకూల్య మేర్చన్!
గమ్యము చేరగా! కైవల్య దీక్షన్!
రమ్యత జీవంబు!రక్తెంచి ముక్తిన్!
సామ్యమే?రక్షగా!సాగింతు రంతే?
కైవల్య దీక్ష వృత్తము,భ,ర,త,గగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-279.
103.రక్తెంచు వృత్తము,
సౌమ్యత సర్వదా!సాకూల్య మవన్?
గమ్యము చేరగా!కైవల్య!మతిన్!
రమ్యత జీవంబు రక్తెంచి!నిలన్!
సౌమ్యమేరక్షగాసాగింతు రటుల్!
రక్తెంచు వృత్తము,భ,ర,త,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:791.
104..శ్రీ లలరు. ,వృత్తము,
శ్రీ రఘు రాముడే!సిరులం బ్రోవన్!
ధీరత లోకమే! దివురున్!శోభన్!
భారత దేశమే? పలు భోగాలన్!
చేరుగా!శ్రీలచే?శివ మేర్పంగన్!
శ్రీ లలరు వృత్తము,భ,ర,స,గగ,గణములు,
యతి.7.వ,యక్షరము,వృ,సం:-215.
105.కష్టే ఫలి వృత్తము,
కష్టార్జి తంబది!గారాబు నగున్?
ముష్టేర్చు! దానము!మోదంబ వునే?
నష్టంబు గూర్చెడు!నాట్యం బదియే?
పుష్టెంచు!గెల్పుకు!పోషింపదియే?
కష్టే ఫలి వృత్తము,త,భ,త,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము, వృ,సం:-921.
106.కష్ట పడనీని వృత్తము,
కష్టించు వానిని కష్టింప నీకన్?
యిష్టంబు తీరగ నందించు రూకల్!
సృష్టంత!స్తభ్యత!జీవింపు!గాదే?
కష్టాని కోర్వని!గడ్డౌను?సర్వమ్!
కష్టపడ నీని వృత్తము,త,భ,త,గగ,గణములు,
యతి7.వ,యక్షరము, వృ,సం;-309.
107.సరివారి వృత్తము,
నీగొప్ప నీదని!నిగు డేలయా?
సాగించు ధర్మము సరివారి తో!
బాగోగు జూచుచో?పరమంబు నౌ!
త్యాగంబు మించిన ధనమేదిలన్?
సరివారి వృత్తము,త,భ,స,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-757.
108.భక్తి పరం వృత్తము,
నాదారి నాదని నడిచే వేలన్?
సాధింతు వేమిల?జగమే?మిథ్యా!
బోధంబు భక్తికి పరమార్థం బౌ!
ఛేదింప దుష్టుల!శివమౌ?జీవమ్!
భక్తి పరం వృత్తము,త,భ,స,గగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-245.
109.మిడియు వృత్తము,
మేమెంతొ?గొప్పని!మిడ్యంగన్?తప్పౌ!
క్షేమంబు గాదది!చింతింపే?నౌలే!
రామాన జీవ రసోత్కృష్టం బేర్చున్!
గోమాత సేవయే!గుణ్యంబౌ?పుణ్యమ్!
మిడియు వృత్తము,త,భ,మ,గగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-53.
110.పూతావి వృత్తము,
దారంబు లేనటి!తావేదీ?భువిన్!
ధీరంబు నేపుగ!దీప్తెంచ న్సుథౌ?
సారంబు నెంచని?సౌశీల్యమ్!వృథా!
వారింపు గానని!వాదంబే?సుమా!
పూ తావి వృత్తము,త,భ,మ,లగ,గణములు,
యతి ,7.వ,యక్షరము,వృ,సం:-565.
111.ఘోషిలు వృత్తము,
దోషంబు ఘోషిల!దురంబే?గూర్చున్!
రోషంబు జీవికి రొదం గల్గించున్!
మేషంబు భౌమ!మ మరించున్భూమిన్?
కాషాయమే?శివ!గణీయం బేర్చున్!
ఘోషిలు వృత్తము,త,భ,య,గగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-137.
112.తీర్పు వృత్తము,
తీర్పిచ్చు దైవము!దివాన న్మనున్!
ఓర్పేది?జీవికి!నుదారం బిలన్!
పర్వోపు జీవన!ప్రమోదం బిడున్!
గర్వంబు!మాపును!కరార్తి న్గనన్!
తీర్పు వృత్తము, త,భ,య,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-649.
113.రుద్రాత్మ వృత్తము,
భద్రంపు జీవన!భవము నాపున్!
నిద్రించు కీర్తిని!నెరపు!దీప్తిన్?
క్షుద్రాత్మఛేదన!సొదలు!దేల్చున్!
రుద్రాత్మ !శోధిలు?ఱుణ విశేషమ్!
రుద్రాత్మ వృత్తము,త,భ,న,గగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-499.
114.శివ తపన వృత్తము,
జీవించు కాలము!శివ తపనన్!
రావించు సౌఖ్యము!రస మయతన్!
కావించు పుణ్యము!కడకు!నిలున్?
భావించు శోభలు పరమొనరున్!
శివ తపన వృత్తము,,త,భ,న,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-1011.
115..క్రోధమేల?వృత్తము,
క్రోధం బదేలను?కూరిమి కోరన్?
వాదింపు మానుము!వర్ధిలు!కాంక్షన్!
శోధించు!మంచిని!శోభకు!శోభై!
రాదేది?వెంను!రాలెడు!నాడున్!
క్రోధ మేల?వృత్తము,త,భ,భ,గగ,గణములు,
యతి.7.వ,యక్షరము,వృ,సం;-437.
116.దమ్మము వృత్తము,
సొమ్మెంత యున్నను!జూతువె?కడన్!
గమ్మత్తు జీవన కాదిదె?భువిన్!
దమ్మమె!గాచును!తానుగ!నరున్!
మమ్మేలు!నాథు డుమేశుడె?సుమా!
దమ్మము,వృత్తము,త,భ,భ,లగ,గణములు,
యతి.7.వ,యక్షరము,వృ,సం;-949.
117.విద్యావినయ వృత్తము,
విజ్ఞానము పెంచు విద్య నేర్పంగన్?
సుజ్ఞాన సుథాశ్రి!శోభిలు న్ధాత్రిన్!
అజ్ఞాన తమంబు!హంతమౌ!నెంచన్?
ప్రజ్ఞాగ్ర వరీయ!భావియౌ?కీర్తిన్?
విద్యా వినయ వృత్తము,త,జ,ర,గగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-173.
118.శ్రీవాద వృత్తము,
దైవంబు తనంచు!తత్తరింపదే?
జీవార్తి యతండు జీరునే?శుభమ్!
శ్రీవాద మదెంతొ?చింతయే!గదా!
కానంగ సురాళి గానరా!రిలన్?
శ్రీవాద వృత్తము,త,జ,ర,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-685.
119..భవాబ్ధి వృత్తము,
బుద్బుద సముండ!పూజింతు దేవా!
అద్భుత భవాబ్ధి హర్షంబు నీవే!
మద్బుధ వరేణ్య మన్నించి నన్నున్!
చిద్భర శివాన! జీవింపు నిమ్మా!
భవాబ్ధి వృత్తము,భ,జ,త,గగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-301.
120.మేల్గుణ వృత్తము,
అన్నల మదెంచి హర్షిం తనిశమ్!
మిన్నగు గుణాల!మేలెంచి?రసన్!
పున్నమి వెలుంగుపూర్ణంబుమదిన్!
చెన్నగు సుశోభ!చెన్నార భవిన్?
మేల్గుణ వృత్తము,భ,జ,త,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-813.
121.చొలచు వృత్తము,
భద్రత నోపని బ్రతు కియ్యదే?
నిద్రయు హారము!నిలుపైనచో?
ఛిద్రత దేహము!క్షితిజేరునే!
క్షుద్ర తనంబది?చొలచున్భవిన్!
చొలచున్భవి=భవితను బాధించును,
చొలచు వృత్తము,భ,భ,స,లగ,గణములు
యతి,7.వ,యక్షరము,వృ,సం:-759.
122.రుద్ర మేర్చు వృత్తము,
భద్రత నిద్రిల భవితే!మృగ్యమ్!
నిద్రిల న్యాయము!నీఱగున్భువే?
క్షుద్రత భద్రత!చొరగా !రుద్రమ్!
కృధ్రత శత్రువు కిరువౌ!సత్యమ్!
రుద్రమ్=భయంకరము,భ,భ,స,గగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:247.
123.కీర్తింపు వృత్తము,
అభ్రము నంటెడు నాశా పాశంబే?
విభ్రమ మేర్చును!భీతావేశంబై!
శుభ్రత నంబదె?శోభాయం బేర్చున్!
నిబ్రత జీవము!నీతిన్కీర్తింపౌ!
కీర్తింపు వృత్తము,భ,భ,మ,గగ,గణములు
యతి,7.వ,యక్షరము,వృ,సం:-55.
124.భీషణ వృత్తము,
వేషము భాషయు!వేర్వేరైనచో?
భూషలు దూషిత పూజ్యంబౌ?గదే!
రోషము వీడుమి!రోదింపేల యా?
భీషణ చేష్టలు!ప్రీతిం బాపవే?
భీషణ వృత్తము,భ,భ,మ,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-567.
125.లోక విభూతి వృత్తము,
వేదము నాధము వినంగా వలెన్!
మోదము గూర్చును!మెరుంగౌ?భవిన్!
శ్రీధరు జ్ఞానమె!చిదానందమౌ?
బోధన లొక విభూతిన్గాంచెడున్?
లోక విభూతి వృత్తము,భ,భ,య,లగ,గణములు,
యతి 7.వ,యక్షరము,వృ,సం:-631.
126.శిరోధార్య వృత్తము,
పొల్లగు మాటలు!పురాలన్మాపున్!
చెల్లని పల్కులు!శిరోధార్యాలే?
వల్లని వర్తన ప్రశాంతం బౌనే?
తల్లిని గొల్వుమి!తరింపౌ?జన్మమ్!
శిరోధార్య వృత్తము,భ,భ,య,గగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-119.
జైహింద్.
Print this post
వ్రాసినది



0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.