గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2024, మంగళవారం

లక్ష్మీసహస్రం. 42వ శ్లోకం. 317 - 324. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

శ్లోకాశ్యపీ కమలాదేవీ నాదచక్రనివాసినీ

మృడాధారా స్థిరా గుహ్యా దేవికా చక్రరూపిణీ 42  

317. ఓం *కాశ్యప్యై* నమః.

నామ వివరణ.

కాశ్యపి అనగా భూమి. భూమాత మన అమ్మయే.

తే.గీ.  *కాశ్యపీ! * భక్తి ముక్తులఁ గలుగఁ జేయు

నిన్ను  కనుఁగొని నీ శక్తి నెన్న తరమ?

మన్ననను నినున్ గొల్తు నే సన్నుతముగ

నన్ను దీవించు మమ్మరో! కన్నతల్లి!

318. ఓం *కమలాదేవ్యై* నమః.

నామ వివరణ.

కమలమువలె కోమలమగు దేవియైన కమలాదేవి అమ్మయే.

కం.  *కమలాదేవీ!*నా మది

విమలంబది నిన్ను దాల్చుఁ బ్రీతిగ నీవే

సుమధుర భావములీయగ

సముదంచిత రీతి రమ్ము సంస్తుతమతివై.

ఓం *కమలా*యై నమః.

నామ వివరణ.

కమలము హృదయకమలము అమ్మయే.

కం*కమలా! * దేవీ! నా మది

విమలంబది నిన్ను దాల్చుఁ బ్రీతిగ నీవే

సుమధుర భావములీయగ

సముదంచిత రీతి రమ్ము సంస్తుతమతివై.

ఓం * దేవ్యై* నమః.

కంకమలా! *దేవీ!*నా మది

విమలంబది నిన్ను దాల్చుఁ బ్రీతిగ నీవే

సుమధుర భావములీయగ

సముదంచిత రీతి రమ్ము సంస్తుతమతివై.

319. ఓం *నాదచక్రనివాసిన్యై* నమః.

నామ వివరణ.

ఓంకార నాదభరిత శ్రీచక్రమున నివసించు జనని

తే.గీ.  *నాదచక్ర నివాసినీ! * మేదుర గతి

నా దరిని నిల్చి వెల్గుమా, బోధ గొలుప,

శ్రీదవౌ నిన్నుఁ గనియెద నాద చక్ర

మందు భక్తితో, వర్ణింతు సుందరముగ.

320. ఓం *మృడాధారా*యై నమః.

నామ వివరణ.

పరమేశ్వరునకు ఆధారభూతమయిన జనని.

శివునకు ఆధారమయిన తల్లి మన అమ్మయే.

తే.గీ.   *మృడాధార!* నివసించుమొప్పిదముగ

నాదు మదిలోన మృడునితో మేదురగతి,

ఖేదమును బాపి కృపను నన్నాదుకొనుము,

వందనంబులు చేసెద నందుకొనుము.

321. ఓం *స్థిరా*యై నమః.

నామ వివరణ.

సర్వకాల సర్వావస్థలయ్ందును స్థిరముగా ఉండు జనని.

స్థిరముగా ఎన్నటికీ ఉండు జనని మన అమ్మ.

కంస్థిరముగ నామది నుండుము

వరమై సతతంబు  నీవు వర్ధిలఁజేయన్

గరుణను నన్నున్, జననీ

*స్థిరా!* చిదానంద తేజ! శ్రీకరమగుచున్.

322. ఓం *గుహ్యా*యై నమః.

నామ వివరణ.

రహస్యమయిన గూఢమయిన తల్లి మన అమ్మ.

తే. *గుహ్య!* నా యహంబును బాపి కూర్మితోడ

నిన్ను వర్ణించనిమ్మమ్మ! నిత్యమిటుల,

నైహికంబులనిత్యముల్, మోహబాహ్య

మోక్షపథమిచ్చు నీపదములను కనగ.

323. ఓం దేవికాయై నమః.

నామ వివరణ.

అమ్మ దేవికా రూపిణి.

తే.గీ*దేవికా! * నిన్ను గొల్వనీ దీక్షఁబూని

శ్రీ వదాన్యుల బోధనల్ భావమందు

నిలిపి, నినుచూడ నేర్వనీ, నిరుపమముగ,

వందనంబులు చేసెద నందుకొనుము.

324. ఓం *చక్రరూపిణ్యై* నమః.

నామ వివరణ.

శ్రీచక్ర రూపమున వెలుగొందుచుండు తల్లి మన అమ్మ.

తే.గీ.  *చక్రరూపిణీ! * సంసార చక్రముపయి

తిరుగు చుండుచు విసిగితి, పరమ పథము

నిన్ను కోరితి నొసగుమాపన్న రక్ష

వౌచు నాయమ్మ! నిన్ గొల్చి వేచియుంటి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.