జైశ్రీరామ్.
విద్యాతపస్వి శ్రీ మామిళ్ళ లోకనాథం కవికృత శతకత్రయ గ్రంథావిషరణ కడపలో జరిగిన సందర్భముగా వారికి నా శుభాకాంక్షలు.
జైశ్రీరామ్.
విద్యాతపస్వి శ్రీ మామిళ్ళ లోకనాథం కవికృత శతకత్రయ గ్రంథావిషరణ కడపలో జరిగిన సందర్భముగా వారికి నా శుభాకాంక్షలు.
జైశ్రీరామ్.
జైహింద్.
జైశ్రీరామ్.
శ్లో. స్వభావేన హి తుష్యంతి
దేవ: సత్పురుషా: పితాl
జ్ఞానయస్త్వన్న పానేన
వాక్య దానేన పండితా:ll
తే.గీ. తృప్తిగాంతురు పితరులు, దేవతలును,
మంచివారును, మనయొక్క మంచిఁ గాంచి,
జ్ఞానులకు తృప్తిపరమాన్నపానములను,
వాక్య దానమ్ముచే పొందు పండితాళి.
భావము. మంచి స్వభావముచేత దేవతలు, సజ్జనులు, తండ్రి సంతృప్తి
చెందుతారు. బంధు మిత్రులు అన్నపానాలతో సంతుష్టులవుతారు.
విద్వాంసులైతే చక్కని మాటలతోనే ఆనందపడతారు.
జైహింద్.
16. శా. విన్నన్ నీ శుభ నామమే వినవలెన్ విభ్రాంతులం బాయఁగాఁ.
గన్నన్ నీ దర హాసమే కనవలెన్ గాంచంగ మోక్షంబు. లే
కున్నన్ జన్మము వ్యర్థమే కనఁగ దీనోద్ధారకా! దేవ! శ్రీ
మన్నారాయణ! ప్రేమతోడుత మమున్ మన్నించి రక్షింపుమా.
భావము.
దీనోద్ధారకా! ఓ శ్రీమన్నారాయణా! విన్నట్లైతే మాలో క్రమ్ముకొనిన భ్రాంతులు మాసిపోవువిధముగా నీనామమే వినవలెను కదా. చూచినట్లైతే మోక్షము పొందజేయు నీ చిఱునగవే కనవలెను. ఆ విధముగకానినాడు ఈ జన్మము వ్యర్థమే సుమా. నీవే మమ్ములను చూచి,మన్నించిరక్షించుము.
జైహింద్.
జైశ్రీరామ్.
శ్లో. మనసాఽపి యదస్పృష్టం
దూరాదపి యదుజ్ఝితమ్ |
తదప్యుపాయైర్వివిధైః
విధిరిచ్ఛన్ ప్రయచ్ఛతి ||
(సుభాషితసుధానిధి)
తే.గీ. మనసుచేనైన తాకంగ ననువుకాని,
ప్రబలినట్టి నిరాశన్ దిరస్కరింప
బడిన దేనినైనను విధి ప్రకటితముగ
నిచ్చుచుండును, విధివశమీజగమ్ము.
భావము. ఏది మనసుతో కూడా తాకడం సాధ్యపడదో, ఏది నిరాశతో తిరస్కరించబడిందో, అలాంటిదాన్ని కూడా విధి అనేక మార్గాల్లో నిర్ధరించి ఇస్తుంది.
అమ్మ దయతో🙏🏼
చింతా రామకృష్ణారావు.
జైహింద్.
జైశ్రీరామ్.
శ్లో. నారాయణో నామ నరో నరాణాం
ప్రసిద్ధ చౌరః కథితః పృథివ్యామ్ |
అనేక జన్మార్జితపాపసంచయం
హరత్యశేషం స్మరతాం సదైవ ||
(పాండవగీత)
తేగీ. నరుఁడు నారాయణాఖ్యుఁడు ధరను జనులు
స్మరణ చేసిన మాత్రాన నిరుపమముగ
దోఁచు నార్జిత పాపముల్, దొంగయతఁడు,
మదులలో దాగియుండును, వెదకి కనుఁడు.
భావము. నారాయణ అనే ఒక మనిషి అత్యంత ప్రసిద్ధి చెందిన దొంగగా
లోకంలో చెప్పబడుతున్నాడు. ఎవరైనా అతన్ని ఒకసారి స్మరిస్తే చాలు,
వారి అనేక జన్మల పాపఫలాలను అతను ఆ క్షణంలోనే పూర్తిగా
అపహరిస్తాడని అంటారు.
జైహింద్.
జైశ్రీరామ్.
శ్లో. సీమంతినీషు కా శాంతా ? (సీతా)
రాజా కోఽభూత్ గుణోత్తమః ? (రామః)
విద్వద్ధిః కా సదా వంద్యా ? (విద్యా)
తత్రైవోక్తం న బుధ్యతే ||
భావము. ముత్తైదువలలో శాంతస్వభావం కలవారు ఎవరు?
గుణశ్రేష్ఠుడైన రాజు ఎవరు అయివున్నారు?
విద్వాంసులు ఎల్లపుడూ ఎవరిని వందించాలి?
దీనికి ఉత్తరం ఇక్కడే చెప్పబడింది.
ఆ.వె. సీతఁ బోలునట్టి సీమంతి నే నుత? (సీత)
రాము సాటి రాజు రహిఁ దెలుపుమ? (రామ)
విదుషుఁ డేమి కలిగి వెలుగొందెడును సద్య (విద్య)
శమును గాంచ? నుత్తరము లిచటనె.
భావము. ముత్తైదువలలో శాంతస్వభావం కలవారు ఎవరు?
గుణశ్రేష్ఠుడైన రాజు ఎవరు అయివున్నారు?
విద్వాంసుఁడు మంచి కీర్తి కనుటకు ఏమి కలిగియుండును?
ప్రతీ ప్రశ్నకు ఆయా పాదములోగల ఆద్యంతాక్షరములే సమాధానము.
వివరణ. సీతను బోలు సీమంతిని సీతయే తప్ప మరొకరు లేనందున
సమాధానము - సీత.
రాముని పోలునట్టి గుణశ్రేష్ఠుడైన రాజు రాముఁడే తప్ప మరెవ్వరూ లేనందున
సమాధానము - రామ.
విద్వాంసుఁడు మంచి కీర్తి కనుటకు ఏమి కలిగియుండుననగా
సమాధానము - విద్య.
జైహింద్.
జైశ్రీరామ్.
శ్లో. నానృషి: కురుతే కావ్యం, నా గంధర్వః సురూపభ్రుత్
నా దేవాంశో దదాత్యన్నం నా విష్ణు: పృథివీ పతి:.
తే.గీ. ఋషియె కాకున్న కావ్యము నసదృశముగ
వ్రాయలే డగంధర్వుఁడువరలడంద
ముగ, భగవదంశలేకున్నభుక్తినిడడు.
లేక విష్ణ్వంశ రాజు కాలేడు ధరణి.
భావము. ఋషి కాకున్నచో కావ్యర్చన చేయ లేడు. దేవతాంశ లేకున్నవడు
ఆకర్షణీయమైన రూపముతో నొప్పలేడు. దైవాంశ లేనివాడు ఎవరికీ అన్నము
పెట్టఁజాలడు. విష్ణ్వంశ లేనివాడు రాజు కాలేడు.
జైహింద్.
జైశ్రీరామ్.
ఈ సందర్భముగా ఆచార్య డా. బేతవోలురామబ్రహ్మం మహోదయులకు నా అభినందనలు తెలియఁజేసుకొంటున్నాను.
అమ్మవారు వీరిని నిరంతరం సంతోషంగా ఉండేలా అనుగ్రహించాలని మనసారా కోరుకొంటున్నాను.
జైహింద్.
జైశ్రీరామ్.
శ్రీమన్నారాయణ శతకము నుండి
9వ పద్యము.
గానం. శ్రీమతి దోర్భల బాలసుజాత.
9. శా. ఉన్నావీవు హృదంతరాళమున స్నేహోదార సంపత్ప్రభన్,
బిన్నన్, నేఁ గనఁ జాలనయ్య నిను గోపీనాథ! యంతర్ముఖుం
డెన్నంజాలు నినున్, శుభాస్పదుఁడ! నీవే నాకు కన్పించు. శ్రీ
మన్నారాయణ పూజ్య పాద జలజా! మాం పాహి. సర్వేశ్వరా!
భావము.
ఓ శ్రీమన్నారాయణా! నీవు నా హృదంతరాళమున స్నేహోదార సంపత్ప్రభతో కొలువై యున్నావు.
నేను చిన్నవాడిని. నిన్ను ఏ విధముగనూ నిన్ను చూచుటకు సరిపోను. అంతర్ముఖుఁడైనావాడి
నిన్ను గుర్తించగలడు. ఓ శుభాస్పదుఁడా! నీవే నాకు కన్పించుము. ఓ పూజ్య పాదపద్మములు
కలవాడా! సర్వేశ్వరా! నన్ను రక్షించుము.
జైహింద్.
జైశ్రీరామ్.
శ్లో. ఉత్తిష్ఠమానస్తు పరో - నోపేక్ష్యః పథ్యమిచ్ఛతా |
సమౌ హి శిష్టైరామ్నాతౌ - వర్త్స్యంతావామయః స చ ||
(శిశుపాలవధ)
తే.గీ. ఎదుగు చున్నట్టి దుష్టుని యెదుగుదలను
మంచితోనాపవలె, వేచి మించనీక,
పెరుగువ్యాధియు శత్రువు ధరను హాని
మనకు గొలుపుననెడు మాట మరువరాదు.
భావము. హితాన్ని కోరేవాడు బలిష్ఠుడవుతున్న శత్రువును నిర్లక్ష్యం చేయకూడదు.
పెరుగుతున్న వ్యాధి మరియు పెరుగుతున్న శత్రువు ఇద్దరూ హానికరంగా
ఉండటంలో సమానమని ఉత్తములు భావిస్తారు.
జైహింద్.
జైశ్రీరామ్.
శ్లో. అత్యల్పమపి సాధూనాం - శిలా లేఖతి తిష్టతి।
జల లేఖేన నీచానాం - యత్ కృతం తత్ వినశ్యతి॥
తే.గీ. సాధు జనులకు చేసెడ దేదియైన
రాతిపై వ్రాతవలె నిల్చు ధాత్రిపయిన,
నీచులకు చేయునుపకృతి నీటిపైన
వ్రాతవలెమాయునప్పుడే, భవ్యులార!
(రాతి - ధాత్రి.సంయుతాసంయుత ప్రాస)
భావము. సజ్జనులకు చేసిన ఏ చిన్న ఉపకారమైనా అది రాతిమీద గీసిన గీతలా
ఎప్పటికీ నిలిచి ఉంటుంది. కొంచెము ఉపకారానికే వారు ఎల్లప్పుడూ
కృతజ్ఙులై ఉంటారు. మరి నీచులున్నారే, వారికి ఎంత పెద్ద మేలు చేసినప్పటికీ
నీటిమీద గీసిన గీతలా అది అప్పుడే నశించిపోతుంది.
జైహింద్.
జైశ్రీరామ్.
జైశ్రీరామ్.
శ్లో. ధన్యానాముత్తమమ్ దాక్ష్యం - ధనానాముత్తమమ్ శ్రుతమ్ ।
లాభనాం శ్రేయ ఆరోగ్యం - సుఖానాం తుష్ఠిరుత్తమా ॥
(యుధిష్ఠిర గీత 53వ శ్లోకం)
తే.గీ. భౌతికముకంటె మర్యాద వసుధ నిన్న,
జ్ఞానమెన్నగ సంపదకన్న ఘనము,
ధనము కన్నను స్వస్తత ధరణి మేలు,
సుఖములందున తుష్టియే చూడ ఘనము.
భావము. మర్యాద గల ప్రవర్తన భౌతిక విషయాల కంటే శ్రేష్ఠమైనది,
జ్ఞానం సంపద కంటే గొప్పది. ధనలాభము కంటే ఆరోగ్యం శ్రేష్ఠమైనది
మరియు సంతృప్తి అనేది అన్నింటిలోనూ ఉత్తమమైనది.
జైహింద్.
జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.🙏🏼
శ్లో. సుకృతేన కులే జన్మ - సుకృతేన సుభాషితమ్l
సుకృతేన సతీ భార్యా - సుకృతేన కృతీ సుత:ll
తే.గీ. మంచి కులమున పుట్టుట మహిత సుకృతి,
మంచి సుకృతిని లభియించు మంచి వాక్కు,
మంచి సుకృతిచేత లభించు మంచి భార్య,
మంచి సుకృతినే పుత్రుఁడున్ మహిని కలుగు.
కులము = 1. వంశము; 2. తెగ; 3. ఇల్లు; 4. ఊరు; 5. శరీరము.(శబ్దరత్నాకరము)
భావం: సత్కులములో జన్మించడమూ, మంచి మాటకారితనమూ,
సాధ్వియైన భార్యా, వివేకవంతుడైన పుత్రుడూ.. పుణ్యం వలన మాత్రమే
లభ్యమగును సుమా!
జైహింద్.
జైశ్రీరామ్.
శ్లో. దేహే పాతిని కా రక్షా - యశో రక్ష్యమపాతవత్|
తస్మాద్దేహేష్వనిత్యేషు - కీర్తి మేకా ముపార్జయేత్||
తే.గీ. పతన దేహంబునకు రక్ష క్షితిని లేదు,
కీర్తి దేహంబునకు లేదు క్షీణత ధర,
కాన దేహంబుతో కీర్తి గాంచుటొప్పు,
శాశ్వతంబగు సత్కీర్తి చక్కఁ గనుము.
భావము. నశించునట్టి ఈ మానవదేహమునకు రక్షణ ఎక్కడ కలదు?అందువలన
అనిత్యమైన ఈ దేహముతో నిత్యమై సత్యమై వెలుగొందు శాశ్వతమైన కీర్తిని
మానవుడు ఆర్జించవలెను.
జైహింద్.