గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, అక్టోబర్ 2023, శుక్రవారం

సంపూర్ణకుంభో న కరోతి శబ్దం .... మేలిమి బంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్.

 శ్లో.  సంపూర్ణకుంభో న కరోతి శబ్దం

అర్ధోఘటో ఘోషముపైతినూనం ౹

విద్వాన్కులీనో న కరోతి గర్వం

జల్పంతి మూఢాస్తు గుణైర్విహీనాః ౹౹

తే.గీ.  సగము నిండిన కుండ తా సలుపు ధ్వనిని,

నిండుకుం డట్లు చేయదు, నిరుపమాన

పండితుఁడునట్లె వ్యర్థముల్ పలుకఁ బోడు,

పలుకు మూఢుండు గుణహీనుఁడల్పుఁడెపుడు.

భావము.  

సంపూర్ణంగా నిండిన కుండ చప్పుడు చెయ్యదు.అర్ధ నిండిన కుండ నిజంగా చప్పుడు చేస్తుంది.అలాగే,మేధావి అయిన విద్వాంసుడు ఎప్పుడూ గర్వము పొందడు.అయితే,సద్గుణులు కాని మూఢులు తమకు ఇష్టమైనట్టుగా మాట్లాడుతారు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.