గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, అక్టోబర్ 2023, సోమవారం

ఓం సిద్ధిదాత్ర్యై నమః. శరన్నవరాత్రులలో 9వ రోజు.

జైశ్రీరామ్.

ఓం సిద్ధిదాత్ర్యై నమః.

శ్లో.  సిద్ధ గంధర్వ యక్షాద్యై - రసురైరమరైరపి

సేవ్యమానా సదా భూయాత్ - సిద్ధిదా సిద్ధిదాయినీ.

తే.గీ.  అసుర గంధర్వ యక్షులు నమరవరులు,

సిద్ధులున్ సేవఁ జేయుచు సిద్ధదాత్రి

కృపకుపాత్రులై యొప్పుదురిట్టి జనని

యత్నసంసిద్ధి మనకిచ్చి యాదుకొనుత.

 9.సిద్ధిదాత్రీ సిద్ధి అనగా ఒక పని సిద్ధించడందాత్రీ అంటే  ఇచ్చేది

భక్తులు కోరుకున్న పనిని తీర్చే అమ్మవారు ఈమెఇహ సుఖాలనే కాక

జ్ఞానాన్నీమోక్షాన్నీ కూడా సిద్ధిదాత్రీదేవి ప్రసాదించగల తల్లి.

శరన్నవరాత్రులలో 9వ రోజగు నేడు 

మన హృదయములో నెలకొని యున్న అమ్మవారు 

సిద్ధిదాత్రిగా మనలను కరుణించి కాపాడుచూ, ఇహపరసౌఖ్యాలననుగ్రహిస్తుంది. 

అట్టి అమ్మకు ప్రణమిల్లుచు 

మీకు నా శుభాకాంక్షలు తెలియఁజేయుచున్నాను.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.