గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, అక్టోబర్ 2023, ఆదివారం

మౌనికుల,ఆశిత,మానుమిక,సుధామాథురీ,సౌరుచి,వరోచిత,సుధామయ ,చెడువిడు గర్భ"-నవమాతృకా"-వృత్తము. "-నవమాతృకా"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

 జైశ్రీరామ్.

మౌనికుల,ఆశిత,మానుమిక,సుధామాథురీ,సౌరుచి,వరోచిత,సుధామయ
,చెడువిడు గర్భ"-నవమాతృకా"-వృత్తము.    

                          "-నవమాతృకా"-వృత్తము.

                                   రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
                                                              జుత్తాడ.

మానవ నవ మాతృక!మావాహయ సారమయా!మానస సరోవరమా!
జ్ఞాన వరదయా శ్రయ!సౌవర్ణ సుథా మధురా!జ్ఞాన సౌదాయమా!
మానుమికను స్వార్ధము!మా"-వాసిత సౌరుచికిన్!మౌనికుల సామమై!
దానవ మెడ నెట్టుమి!తావీవన సాగుమయా!తానుగ వరోచితమై!

సృజనా త్మమక గర్భ కవితా స్రవంతి యందలి"-సంకృతి"- ఛందము
లోని"-అనిరద్"-ఛందము నుండి గ్రహింప బడినది!
ప్రాసనియమము కలదు,పాదమునకు24అక్షరములుండును.
యతులు,9,17,చెల్లును,

1.గర్భగత"-మాతృక"-వృత్తము.

మానవ నవమాతృక!
జ్ఞాన వరదయా శ్రయా!
మాను మికను స్వార్ధము!
దానవ మెడ నెట్టుమి!

అభిజ్ఞా ఛందమునందలి,అనుష్టుప్"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"-8"'అక్షరములుండును.

2.గర్భగత "-ఆవాహయ"-వృత్తము.

మావాహయ సారమయా!
సౌవర్ణ సుధా మథురా!
మా"వాసిత సౌ రుచికిన్!
తావీవన సాగుమయా!

అభిజ్ఞా ఛందము నందలి"-అనుష్టుప్"-ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు.పాదమునకు 8,అక్షరము లుండును.

3.గర్భగత"-సరోవర"-వృత్తము.

మానస  సరోవరమా!
జ్ఞాన సముదాయకమా!
మౌనికుల సామజమై!
తానుగ వరోచితమై!

4గర్భగత"-జ్ఞానదాయి"-వృత్తము.

మానవ నవమాతృక!మావాహ సారమయా!
జ్ఞాన వరదయాశ్రయ!సౌవర్ణ సుధా మథురా!
మాను మికను స్వార్ధము!మా"వాసిత సౌరుచికిన్!
దానవ మెడ నెట్టుమి!తా వీవన సాగయా!

అణిమా ఛందమునందలి"-అష్టి"-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"16"అక్షరములుండును!
యతి 9,వయక్షరమునకు చెల్లును.

5,గర్బగత"-మాథురీ"వృత్తము.

మావాహయ సారమయా! మానస సరోవరమా!
సౌవర్ణ సుధా మథుర!జ్ఞాన సముదాయకమా!
మా"వాసిత సౌరుచికిన్!మౌనికుల సామజమై!
తావీవన సాగుమయా!తానుగ వరోచితమై!

అణిమాఛందమునందలి" అష్షి"ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు16,అక్షరములుండును.
యతి"9వయక్షరమునకు చెల్లును.

6.గర్భగత"-సముదాయక"-వృత్తము.

మానస సరోవరమా!మానవ నవమాతృక!
జ్ఞాన సముదాయకమా!జ్ఞాన వరదయాశ్రయ!
మౌనికుల సామజమై!మానుమికను స్వార్ధము!
తానుగ వరోచితమై!దానవ మెడ నెట్టుమ!

అణామా ఛందమునందలి"అష్టి"-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"16"అకషరములుండును.
యతి"9,వ యక్షరముతో చెల్లును.

7.గర్భగత"-మౌశికుల"-వృత్తము.

మానవ నవమాతృక!మానస సరోవరమా!
జ్ఞానవరదయా శ్రయా!జ్ఞాన సముదాయకమా!
మాను మికను స్వార్ధము!మౌనికుల సామజమై!
దానవ మెడ నెట్టుమ!తానుగ వరోచితమై!

అణిమా ఛందమునందలి"-అష్టిఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"16,అక్షరము లుండును!
యతి"9"వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"--ఆశిత"-వృత్తము

మానస సరోవరమా!మావాహయ సారమయా!
జ్ఞాన సముదాయకమా!సౌ వర్ణ సుధా మథురా!
మౌనికుల సామజమై!మా వాసిత సౌ రుచికిన్!
తానుగ వరోచితమై!తావీవన సాగుమయా!

అణిమాఛందము నందలి"-అష్టి"ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"16"అక్షరములుండును.
యతి"9"వ యక్షరమునకు చెల్లును.

9,గర్భగత"మానుమిక"వృత్తము.

మావాహయ సారమయా!మానవ నవమాతృక!
సౌవర్ణ సుధామథురా!జ్ఞాన వర దయా శ్రయ!
మా"వాసిత సౌరుచికిన్!మాను మికను స్వార్ధము!
తా వీవన సాగుమయా!దానవ మెడ నెట్టుమ!

అణిమా ఛందము నంధలి"అష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"16"అక్షరములుండును.
యతి"9"వ యక్షరమునకుచెల్లును.

10,గర్భగత"-సుధా మాథురీ"-వృత్తము.

మావాహయ సారమయా!మానస సరోవరమా!మానవ నవమాతృక!
సౌవర్ణ సుధామథురా! జ్ఞానసముదాయకమా!!జ్ఞానవరదయాశ్రయ!
మావాసిత సౌరుచికిన్!మౌనికుల సామజమై!మానకను స్వార్ధము!
తృవీవని సాగుమయా!తానుగ వరోచితమై!దానవ మెడ నెట్టుమ!

అనిరుద్ ఛందాంతర్గత"-సంకృతి"ఛందమునందలిది.
ప్రాసనియమము కలదు,పాదమునకు 24,అక్షరములుండును.
యతు లు9,17"లకుచెల్లును .

11.గర్భగత"-సౌరుచీ"-వృత్తము.

మానస సరోవరమా!మానవ నవమాతృక!మావాహయ సారమయా!
జ్ఞాన సముదాయకమా!జ్ఞాన వర దయాశ్రయ!సౌవర్ణ సుధా మథురా!
మౌనికుల సామజమై! మానుమికను స్వార్ధము!మా"వాసిత సౌరుచికిన్!
తానుగ వరోచితమై!దానవ మెడ నెట్టుమ!తా వీవన సాగుమయా!

అనిరుద్ ఛందాంతర్గత"సంకృతి ఛందము నందలిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు24"అక్షరములుండును.
యతులు"9,17"లకు చెల్లును.

12.గర్భగత"-వరోచిత"-వృత్తము.

మానవ నవమాతృక!మానస సరోవరమా!మావాహయ సారమయా!
జ్ఞాన వరదయాశ్రయ!జ్ఞాన సముదాయకమా!సౌవర్ణ సుధా మథురా!
మానుమికను స్వార్ధము!మౌనికుల సామజమై!మాతాశ్రిత సౌరుచికిన్!
దానవ మెడ నెట్టుమి!తానుగ వరోచితమై!తావీవన సాగు మయా!

అనిరుద్ఛందాంతర్గత"సంకృతి ఛందమునందలిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు24"అక్షరములుండును.
యతులు"9,17,అక్షరములకు చెల్లును.

13.గర్భగత"-సుధామయ"-వృత్తము

మానస సరోవరమా!మావాహయ సార మయా!మానవ నవమాతృక!
జ్ఞాన సముదాయకమా!సౌవర్ణ సుధా మథురా!జ్ఞాన వరదయాశ్రయ!
మౌనికుల సామజమై!మాతాశ్రిత సౌరుచికిన్!మానుమికను స్వార్ధము!
తానుగ వరోచితమై!తావీవన సాగుమయా!దానవ మెడ నెట్టు మి!

అనిరుద్ఛందాంతర్గత"-"సంకృతి ఛందము నందలిది
ప్రాసనియమము కలదు.పాదమునకు"24"అక్షరములుండును.
యతులు"9"17,అక్షరములకు చెల్లును.

14,గర్భగత"-చెడువిడు"-వృత్తము.

మావా.య సారమయా!మానవ నవమాతృక!మానస సరోవరమా!
సౌవర్ణ సుధా మథురా!జ్ఞాన వర దయాశ్రయ!జ్ఞాన సముదాయకమా!
మాతాశ్రిత సౌ రుచికిన్!మానుమికన స్వార్ధము!మౌనికుల సామజమై!
తావీవన సాగుమయా!దానవ మెడ నెట్టుమి!తానుగ వరోచితమై!

అనిరుద్ఛందాంతర్గత"సంకృతి"ఛందము నందలిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"24"అక్షరములుండును.
యతులు."9"17"అక్షరములకు చెల్లును.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.