గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, అక్టోబర్ 2023, శుక్రవారం

ఓం కాత్యాయన్యై నమః.

 జైశ్రీరామ్.

ఆర్యులారా! శరన్నవరాత్రులలో ఆరవ రోజయిన 

నేడు అమ్మ మన హృదయాలలో కాత్యాయనీదేవి రూపంలో 

కరుణిస్తుంది. ఈ తల్లిని మనసారా సేవించి మన జన్మసార్థకం చేసుకుందాం. 

అమ్మ మన ఆర్తిని తీర్చుగాక.

ఓం కాత్యాయన్యై నమః.

6కాత్యాయనీ దేవి

శ్లో.  చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా

కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ.

తే.గీ.  చంద్రహాసోజ్వలత్కర, జయనిధాన,

రూక్షశార్దూలవాహనారూఢ, జనని,

దుష్టదానవ ఘాతిని, శిష్టరక్ష,

వినుత కాత్యాయని శుభద వేల్పుఁగొలుతు.

అంబా శాంభవి చంద్రమౌళి రబలాపర్ణా ఉమా పార్వతీ ||

కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవి ||

సావిత్రీ నవయౌవనా శుభకరీ సాంరాజ్య లక్ష్మీప్రదా ||

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ||


6. కాత్యాయనీ పూర్వకాలంలో కాత్యాయనుడు అనే మహర్షి ఉండేవాడు

తనకు సంతానం కలగలేదుతను దుర్గా దేవికి గొప్ప భక్తుడుఆయన 

ఘోర తపస్సు చేసి తన కుమార్తెగా అమ్మవారు జన్మించాలని 

కోరుకుంటాడు సందర్భంగా  మహర్షి కోరిక అమ్మవారు 

నెరవేర్చింది.  దుర్గా దేవికి సంబంధించిన రూపాల్లో 

కాత్యాయనీ మాతది అత్యంత హింసాత్మక రూపాలలో 

ఒకటిగా పరిగణించబడుతుందిమహిషాసురుడు 

అనే రాక్షసుడిని కాత్యాయని అమ్మవారే వధించారు

అందుకే అమ్మవారిని మహిషాసురమర్దిని అని పిలుస్తారు

 తల్లి సింహంపై స్వారీ చేస్తుంది

కాత్యాయనీ దేవి అంటే దుష్ట శక్తులను నాశనం చేసే తల్లి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.