జైశ్రీరామ్.
ఓం బ్రహ్మచారిణ్యై నమః.
శ్లో. దధానాకర పద్మాభ్యా - మక్షమాలా కమండలూ
దేవీ ప్రసీదతు మయి - బ్రహ్మచారిణ్యనుత్తమా.
తే.గీ. అక్షమాల, కమండల, హస్త పద్మ!
బ్రహ్మచర్యసద్దీక్షతోఁ బ్రబలినట్టి
బ్రహ్మచారిణీ! నీకు మా వందనములు.
బ్రహ్మ సుజ్ఞానమును పొందు భాగ్యమిమ్ము.
భావము.
అక్షమాలను, కమండలమును హస్తపద్మములలో కలిగి, బ్రహ్మచర్యదీక్షతో
ప్రకాశించు ఓ లొకమాతా! నీకు నమస్కరింతుము. బ్రహ్మజ్ఞానమును
పొందే భాగ్యమును మాకు ప్రసాదించుము తల్లీ!
చింతా రామకృష్ణారావు.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.