గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, అక్టోబర్ 2023, గురువారం

అనుభూతి,శ్రీవరాంబుధీ,వీనులవిందు,పాయనేరని,శ్రీనావాణి!వైభోగ, వేనంన్వేలు,గర్భ"-ఆనందానుభవ"-వృత్తము. "-ఆనందానుభవ వృత్తము"- రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి. జుత్తాడ.

 

జైశ్రీరామ్.

అనుభూతి,శ్రీవరాంబుధీ,వీనులవిందు,పాయనేరని,శ్రీనావాణి!వైభోగ,

వేనంన్వేలు,గర్భ"-ఆనందానుభవ"-వృత్తము.

                      "-ఆనందానుభవ వృత్తము"-

                           రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి.
                                                        జుత్తాడ.

ఔ భద్రం బభిజ్ఞా అణిమల్!ఆనందాది రుదాదులన్!ఆయా ఛందాల
                                                                       పేరిడితిన్!
వైభోగంబునై వెలుంగన్!వీనుల విందు సుశోధనన్!బాయన్నేరంగ
                                                                      రా నటులన్!
శ్రీ భక్తాను భూతిం సుశోభన్!శ్రీ నావాణి ప్రసన్నతన్!స్వీయాలంకార
                                                                   భూషలటుల్!
భీభత్సంబులున్ద్రోల నౌతన్!వేనంన్వేలు ప్రశంసలన్!వేయించున్
                                                             శ్రీ వరాంబుధుల్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందు అనిర్ద్ఛందమందలి
                              ఉత్కృతి ఛందములోనిది.
ప్రాసనియమము కలదు. పాదమునకు 26,అక్షరములుండును.
10,18,అక్షరములకు యతి చెల్లును.

1.గర్భగత"-అభిజ్ఞా"-వృత్తము.

ఔభద్రం బభిజ్ఞా,అణిమల్
వైభోగంబునై వెలుగన్!
శ్రీ భక్తాను భూతిం సుశోభన్!
భీభత్సంబులు న్ద్రోల నౌతన్!

అభిజ్ఞా ఛందమునందలి బృహతి ఛందములోనిది,
ప్రాసనియమము కలదు.పాదమునకు"-9 అక్షరములుండును.

2,గర్భగత"-శోధనా"-వృత్తము.

ఆనందాది రుదాదులన్!
వీనుల్విందు సు శోధనన్!
శ్రీ నా వాణి ప్రసన్నతన్!
వేనం న్వేలు ఫ్రశంసలన్!

అభిజ్ఞా ఛందమందలి "-అనుష్టుప్"-ఛందము లోనిది
ప్రాస నియమము కలదు.పాదమునకు 8,అక్షరములుండును.

3.గర్భగత"-స్వీయాలంకృత"-వృత్తము.

ఆ యా ఛందాల పేరిడితిన్!
బాయన్నేరంగ రానటులన్!
స్వీయాలంకార భూష లటుల్!
వేయించున్ శ్రీ వరాంబుధుల్!

అభిజ్ఞా ఛందమునందలి"-బృహతె"-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"-9"-అక్షరములుండును.

4గర్భగత"-అనిరుద్"-వృత్తము.

ఔభద్రం బభిజ్ఞ అణిమల్!ఆనందాదిరుదాదులన్!
వైభోగంబునై వెలుంగన్!వీనుల్విందు సు శోధనన్!
శ్రీ భక్తాను భూతిం సుశోభన్!శ్రీ నా వాణి ప్రసన్నతన్!
భీభత్సంబులు న్ద్రోలనౌతన్!వేనం వేలు ప్రశంసలన్!

అణిమా"-ఛందమునందలి "-అత్యష్టీ"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు 17"అక్షరములుండును.
10,వ యక్షరముతో యతి చెల్లును.

5,గర్భగత"-ప్రసన్నతా"-వృత్తము.

ఆనందాది రుదాదులన్!ఆ యా ఛందాల పేరిడితిన్!
వీనుల్విందు సు శోధనన్!బాయన్నేరంగ రానటులన్!
శ్రీ నావాణి ప్రసన్నతన్!స్వీయాలంకార భూషలటుల్!
వేనం న్వేల ప్రశంశలన్!వేయించున్ శ్రీ వరాంబుధుల్!

అణిమా ఛందమునందలి"-అత్యష్టీ"-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు 17,అక్షరములుండును.
9,వ యక్షరముతో యతి చెల్లును.

6,గర్భగత"-ఆలంకార వృత్తము.

ఆయా ఛందాల పేరిడితిన్!ఔభద్రం అభిజ్ఞ అణిమల్!
బాయన్శేరంగ రానటులన్!వైభోగంబునై వెలుంగన్!
స్వీయాలంకార భూషలటుల్!శ్రీ భక్తాను భూతిం సుశోభన్!
వేయించున్ శ్రీ వరాంబుధుల్!భీభత్సంబులు న్ద్రోల నౌతన్!

అణిమా ఛందమందలి"-ధృతి"-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు18,అక్షరములుండును.
10,వ యక్షరమునకు యతి చెల్లును.

7,గర్భగత"-వరాంబుధీ"-వృత్తము.

ఆయా ఛందాల పేరిడితిన్!ఆనందానిరుదాదులన్!
బాయంన్నేరంగ రానటులన్!వీనుల్విందు సు శోధనన్!
స్వీయాలంకార భూషలటుల్!శ్రి నా వాణి ప్ర సన్నతన్!
వేయించున్ శ్రీ వరాంబుధుల్!వేనం న్వేలు ప్రషశంశలన్!

అణిమా"-ఛందమునందలి"-అత్యష్టీ ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17,అక్షరములుండును.
10,యక్షరముతోయతి చెల్లును.

8,గర్భగత"-అనుభూతి"-వృత్తము.

ఆనందాదిరుదాదులన్!!ఔభద్రం బభిజ్ఞ అణిమల్!!
వీనుల్విందు సుశోధనన్!వైభోగంబునై వెలుంగన్!
శ్రీ నా వాణి ప్రసన్నతన్!శ్రీ భక్తాను భూతిం సుశోభన్!
వేనం న్వేలు ప్రశంశలన్!భీభత్సంబులు న్ద్రోల నౌతన్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు17,అక్షరములుండును.
9,వయక్షరముతో యతి చెల్లును.

9,గర్భగత"-శ్రీవరాంబుధీ"-వృత్తము.

ఆయా ఛందాల పేరిడితిన్!  ఔభద్రం బభిజ్ఞ అణిమల్!
బాయన్నేరంగ రానటులన్!వైభోగంబునై వెలుంగన్!
స్వీయాలంకార భూషలటుల్!శ్రీ భక్తాను భూతిం సు శోభన్!
వేయించున్ శ్రీ వరాంబుధుల్!భూతంబులు న్ద్రోల నౌతన్!

అణిమాఛందమునందలి"-ధృతి ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు18,అక్షరములుండును.
యతి10,వ యక్షరమునకు చెల్లును.

9,గర్భగత"-వీనులవిందు"-వృత్తము.

ఆనందాది రుదాదులన్!ఆయా ఛందాల పేరిడితిన్!ఔ భద్రం అభిజ్ఞ
                                                                              అణిమల్!
వీనుల్విందు సుశోధనన్!బాయన్నేరంగ రా నటులన్!వై భోగంబునై
                                                                         వెలుగన్!
శ్రా నా వాణి ప్రసన్నతన్!స్వీ యాలంకార భూషలటుల్!శ్రీ భక్తాను
                                                           భూతిం సుశోభన్!
వేనంన్వేలు ప్రశంశలన్!వేయించున్ శ్రీవరాంబుధుల్!భీభత్సంబులు
                                                                న్ద్రోల నౌతన్!

అనిరుద్ఛందమందలి"-ఉత్కృతి "-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు 26,అక్షరములుండును.
9,18,అక్షరములకు యతులు చెల్లును.

10,గర్భగత"-బాయనేరని"-వృత్తము.

ఆయాఛందాల పేరిడితిన్!ఔభద్రం బభిజ్ఞ అణిమల్!ఆనందాది రుదా
                                                                                  దులన్!
బాయన్నేరంగ రానటులన్!వైభోగంబునై వెలుంగన్!వీనుల విందు సు
                                                                             శోధనన్!
స్వీయలంకార భూషలటుల్!శ్రీభక్తాను భూతిం సు శోభన్!శ్రీవాణినా
                                                                       ప్రసన్నతన్!
వేయించున్ శ్రీవరాంబుధుల్!భీభత్సంబులున్దవేంరోలు నౌతన్!వేనం
                                                            న్వేలు ప్రశంశలన్!

అనిరుద్ఛందమందలి "-ఉత్కృతి ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు 26,అక్షరములుండును.
10,19,యతులు చెల్లును.

11,గర్భగత"-శ్రీనావాణి"-వృత్తము.

ఆయాఛందాల పేరిడితిన్!ఆనందాది రుదాదులన్!ఔభద్రంబభిజ్ఞ
                                                                            !అణిమల్  !
బాయన్నేరంగ రానటులన్!వీనుల్విందు సుశోధనన్!వైభోగంబునై
                                                                          వెలుంగన్!
స్వీయలంకార భూషలటుల్!శ్రీనావాణి ప్రసన్నతన్!శ్రీభక్తాను భూతిం
                                                                    సు శోభనన్!
వేయించున్ శ్రీవరాంబుధుల్!వేనంన్వేలు ప్రసంశలన్!భీభత్సంబులు
                                                                 న్ద్రోల నౌతన్!

అనిరుద్ఛందమందలి"-ఉత్కృతి"-ఛందములోనిది,
ప్రాసనియమము కలదు.పాదమునకు26,అక్షరములుండును.
10,19,అక్షరములకు యతి చెల్లును.

12,గర్భగత"-వైభోగ"-వృత్తము.

ఆనందాది రుదాదులన్!ఔభద్రం బభిజ్ఞ అణిమల్!ఆయా ఛందాల
                                                                           పేరిడితిన్!
వీనుల్విందు సుశోధనన్!వైభోగంబునై వెలుంగన్!బాయన్నేరగ
                                                                     రా నటులన్!
శ్రీనావాణినా ప్రసన్నతన్!శ్రీభక్తాను భూతిం సుశోభన్!స్వీయాలంకార
                                                                   భూషలటుల్!
వేనం న్వేలు ప్రశంశలన్!భీభత్సంబులు న్ద్రోల నౌతన్!వేయించన్
                                                               శ్రీవరాంబుధుల్!

అనిరుద్ఛందమునందలి"-ఉత్కృతి ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు26,అక్షరములుండును.
10,18,అక్షరములకు యతి చెల్లును.

13గర్భగత"-వేనంన్వేలు"-వృత్తము.

ఔభద్రం బభిజ్ఞ  అణిమల్!ఆయాఛందాల పేరిడితిన్!ఆనందాది
                                                                        రుదాదులన్!
వైభోగంబునై వెలుంగన్!బాయన్నేరంగ రానటులన్!వీనుల్విందు సు
                                                                           శోధనన్!
శ్రీభక్తాను భూతింసు శోభన్!స్వీయాలంకార భూషలటుల్!శ్రీవాణినా
                                                                        ప్రసన్నతన్!
భీభత్సంబులు న్ద్రోల నౌతన్!వేయించున్ శ్రీవరాంబుధుల్!వేనంన్వేలు
                                                                       ప్రశంశలన్!

అనిరుద్ ఛందమునందలి"-ఉత్కృతి ఛందములోనిది.
ప్రాసనియమము కలదు,పాదమునకు26 అక్షరములుండును.
10,18,అక్షరములతో యతిచెల్లును.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.