గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, అక్టోబర్ 2023, గురువారం

ఓం స్కందమాత్రే నమః ... శరన్నవరాత్రులలోఐదవరోజు.

 

జైశ్రీరామ్.
ఆర్యులారా! మన కృదయములలో నెలకొనియున్న ఆ జగన్మాత ఔదవరోజగు నేడు స్కందమాతగా మనలను దీవింపవచ్చియున్నది. మనకందరికీ ఆ అమ్మ దీవనలు లభించుగాక.
ఓం స్కందమాత్రే నమః

శ్లో.  సింహాసనగతా నిత్యం -  పద్మాశ్రిత కరద్వయా 

శుభమస్తు సదా దేవి - స్కందమాతా యశస్వినీ. 

తే.గీ.  నిత్య సింహాసనాధిష్ఠ! నిరుపమాన!

పద్మసమలంకృతకరా! ప్రపన్న రక్ష!

నీకు శుభమగు నిత్యమున్ నిర్వికార!

స్కందమాతా!యశశ్వినీ! సదయఁ గనుమ.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.