జైశ్రీరామ్.
|| 4-9 ||
శ్లో. జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్త్వతః|
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోऽర్జున
తే.గీ. అర్జునా! యెవ్వ రెరుగుదు రతులితమును
దివ్యమునునైన నా జన్మ, దీపితమగు
దివ్య తత్వంబు వారికి దేహమువిడ
ముక్తియే గల్గు, నిజమిది యుక్తి గనుమ.
భావము.
అర్జునా! దివ్యమైన నా జన్మ కర్మల తత్వాన్ని ఎవరు యధార్ధంగా
తెలుసుకుంటారో, అతడు ఈ శరీరాన్ని వదలిన తరవాత తిరిగి పుట్టడు.
|| 4-10 ||
శ్లో. వీత రాగ భయ క్రోధా మన్మయా మాముపాశ్రితాః|
బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః.
తే.గీ. రాగమును భయక్రోధముల్ వేగమె విడి
నన్ను గూర్చిన తలపుల నున్న వారు
నన్నె తా మాశ్రయించిన సన్నుతులట
జ్ఞాన తపమున నన్ జేర గలగుదు రిల.
భావము.
రాగ భయ క్రోధాలను విడిచి నన్ను గురించిన ఆలోచనలతో నిండి నన్ను
ఆశ్రయించిన వారు ఎందరో జ్ఞానతపస్సు వలన నన్ను అందుకున్నారు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.