గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, మార్చి 2022, శనివారం

వందారు భక్తజన మందారమా! (శ్రీ అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము) లో 2...

ఓం శ్రీమాత్రే నమః.🙏
శ్రీ అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము) లో 2వ పద్యము.

2. వందారు భక్తజన మందారమా! నిలుమ డెందంబునన్ కరుణతో, 
సౌందర్య రాశివయి డెందంబునన్ నిలువ నెందైన నిన్నె కననా. 
కందున్ నినున్ సతము, కందున్ త్వదీయ కృప, కందున్ శుభంబుల నిలన్. 
వందే జగజ్జనని ముందుండి నా  కనుల విందై కనంబడు సతీ!

భావము.
నమస్కరించుచున్న భక్తుల పాలిట కల్పవృక్షమా! కరుణతో కూడుకొన్నదానువయి నా హృదయములో స్థిరముగా ఉండుము. పోతపోసిన సౌందర్యముతో నొప్పుచు నా హృదయమున నీవు నిలిచి యున్నచో నేను అంతటనూ నెన్నే చూడఁ గలుగుదును కదా. ఎల్లప్పుడూ నిన్నే చూచుచుందును, నీ కృపనే చూచుచుందును. ఈ భూమిపై శుభములనే చూచుదును. ఓ లోకమాతా! నీకు నమస్కారము. ఓ సతీదేవీ! నా కనులకు ఆనందము కలుగు విధముగా కనబడుమమ్మా!
 🙏
అమ్మకు వందనములతో
చింతా రామకృష్ణారావు.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.