గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, మార్చి 2022, గురువారం

దేవాన్భావయ తానేన తే..|| 3-11 ||..//..ఇష్టాన్భోగాన్హి వో దేవా..| 3-12 ||..//..శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము. కర్మయోగము.

 జైశ్రీరామ్.

శ్రీమద్భగవద్గీత

3వ అధ్యాయము.  కర్మయోగము.

|| 3-11 ||

శ్లో. దేవాన్భావయ తానేన తే దేవా భావయన్తు వః|

పరస్పరం భావయన్తః శ్రేయః పరమవాప్స్యథ.

తే.గీ. దేవతాతతిన్ గొల్వుఁడు దివ్యమయిన

యిట్టి యజ్ఞములను చేసి, యిత్తు రరసి

మీకు దేవతల్ శుభములు, మేలు గొలుప,

నిహపరమ్ముల సాధింపు డహము వీడి.

భావము.

దేవతలను యజ్ఞంలో ఆరాధించండి. ఆదేవతలు మిమ్మలను 

అనుగ్రహిస్తారు.

|| 3-12 ||

శ్లో. ఇష్టాన్భోగాన్హి వో దేవా దాస్యన్తే యజ్ఞభావితాః|

తైర్దత్తానప్రదాయైభ్యో యో భుఙ్క్తే స్తేన ఏవ సః

తే.గీ. యజ్ఞ భావిత దేవత లఖిల భోగ

ముల నొసంగుదు రా భోగములను పొంది,

ప్రతిగ నేమియు నీయక  వారలనుభ

వించ నది చౌర్యమేయగున్ బ్రీతిఁగనుమ.

భావము.

యజ్ఞం చేత ఆరాధించబడిన దేవతలు మీకు ఇష్ట భోగాలను ఇస్తారు

వారికి ఏమీ సమర్పించకుండా వాళ్ళు ఇచ్చిన వాటిని అనుభ

వించేవాడు చోరుడే అవుతాడు .


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.