గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, మార్చి 2022, మంగళవారం

తస్మాదసక్తః సతతం..|| 3-19 ||..//..కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా..|| 3-20 ||..//..శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము. కర్మయోగము.

 జైశ్రీరామ్.

శ్రీమద్భగవద్గీత

3వ అధ్యాయము.  కర్మయోగము.

|| 3-19 ||

శ్లో. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర|

అసక్తో హ్యాచరన్కర్మ పరమాప్నోతి పూరుషః

తే.గీ. కావునన్ కర్మలొనరింపగా తగు నది

మదిననా సక్తితోడ నేమరక చేయు

టొప్పునయ లోకకళ్యా ణమొనరఁ గోరి

చేసి నిష్కామకర్మలన్ భాసిలుమిల.

భావము.

కాబట్టి, మమకార బంధాలను విడిచిపెట్టి, ఆసక్తి రహితుడవై, నీ పనులను ఒక కర్తవ్యములాగా 

నిర్వహించుము. కర్మ ఫలములపై ఆసక్తి లేకుండా పని చేయటం వలన 

మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు. 

|| 3-20 ||

శ్లో. కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః|

లోకసంగ్రహమేవాపి సమ్పశ్యన్కర్తుమర్హసి

తే.గీ. అవని నిష్కామ కర్మల నంచితముగఁ

జేసి జనకాదులున్ ముక్తి చెందిరి కద,

లోక కల్యాణమునుగోరి శ్రీకరముగ

కర్మలన్ జేయఁ దగు నీకు మర్మమెఱిఁగి.

భావము.

జనకుడు మొదలైన వారు(నిస్కామ)కర్మల ద్వారానే మోక్షాన్ని పొందారు.

లోకకల్యాణాన్ని దృష్టిలో ఉంచుకుని అయినా కర్మ చేయడమే నీకు తగును.

జైహింద్స్. 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.