గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, మార్చి 2022, సోమవారం

బహూని మే వ్యతీతాని..|| 4-5 ||..//..అజోऽపి సన్నవ్యయాత్మా.. || 4-6 ||..//.. జ్ఞాన కర్మ సన్యాసయోగః

 జైశ్రీరామ్.

శ్రీభగవానువాచ|

భావము.

శ్రీ కృష్ణభగవానుడు ఈ విధముగ పలికెను.

|| 4-5 ||

శ్లో. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున|

తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరన్తప

తే.గీ. గడచిపోయిన జన్మలు కలవు పెక్కు 

నీకు, నాకును, నెరుగవు నీవు, నేనె

రుంగుదును వాటి నన్నిటిన్, భంగపడకు

మర్జునా నీవు సత్యంబు నరయ వలయు.

భావము.

అర్జునా! నాకూ నీకూ కూడా ఎన్నో జన్మలు గడిచిపోయాయి. నేను వాటన్నిటిని 

ఎరుగుదును. నీవు ఎరుగవు.

 || 4-6 ||

శ్లో. అజోऽపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్|

ప్రకృతిం స్వామధిష్ఠాయ సమ్భవామ్యాత్మమాయయా.

తే.గీ. జన్మమే లేనివాడ నీ జగతిలోన

నవ్య యుండను, జీవుల కధిపతి నిక

నాదు ప్రకృతిని దాటుచు నాదు మాయ

వలన జన్మించు చుందును, వలసినపుడు.

భావము.

జన్మ లేని వాడినీ, అవ్యయుడినీ, జీవులందరికి అధిపతినైన, నా ప్రకృతిని 

అధిరోహించి నా మాయ వలన జన్మిస్తుంటాను.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.