గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, మార్చి 2022, సోమవారం

ఏవాయం మయా తేऽద్య..|| 4-3 ||..//..అపరం భవతో జన్మ పరం..|| 4-4 ||..//.. జ్ఞాన కర్మ సన్యాసయోగః

 జైశ్రీరామ్.

|| 4-3 ||

శ్లో.  ఏవాయం మయా తేऽద్య యోగః ప్రోక్తః పురాతనః|

భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్.

తే.గీ. అట్టి ప్రాచీన యోగంబు నర్జున! సఖుఁ

డవని, భక్తుండ వని నీకు సవివరముఢ

బోధఁ జేసితి నుత్తమ పూజ్యమౌర

హస్య యోగంబిది కనుమయ్య నీవు.

భావము.

ఆ సనాతనమైన యోగాన్నే నా భక్తుడవు, స్నేహితుడవు ఐన నీకు 

భోధించాను. ఇది ఉత్తమమైనదీ రహస్యమైనదీ కూడా.

|| 4-4 ||

అర్జున ఉవాచ|

భావము.

అర్జునుడు ఈ విధముగ అడిగెను.

శ్లో. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః|

కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి

తే.గీ. ఇప్పటిదె నీదు జన్మం, బ దెప్పటిదగు 

సూర్యదేవుని జన్మము? సూర్యునకును

బోధఁ జేసితినంటివి బొధ పడద

దెట్టుల సాధ్యమౌ, యెఱుగ లేను.

భావము.

నీ జన్మ ఇటీవలది. సూర్యుని జన్మ ఎంతో ముందున్నది. నీవు సూర్యునికి 

ఉపదేశించావని అన్నావు. దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి?

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.