గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, మార్చి 2022, సోమవారం

యే మే మతమిదం నిత్య..|| 3-31 ||..//..యే త్వేతదభ్యసూయన్తో..|| 3-32 ||..//..,శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము. కర్మయోగము.

  జై శ్రీరామ్.

,శ్రీమద్భగవద్గీత

3వ అధ్యాయము.  కర్మయోగము. 

|| 3-31 ||

శ్లో. యే మే మతమిదం నిత్య మనుతిష్ఠన్తి మానవాః|

శ్రద్ధావన్తోऽనసూయన్తో ముచ్యన్తే తేऽపి కర్మభిః

తే.గీ. మత్సర రహితు లెవ్వారు మన్మతంబు

నాచరింతురో వారలుననుపమగతి

కర్మ బంధముల్ విడుదురు ఘనతరముగ.

నీవు గ్రహియింపుమర్జునా! నేర్పు మీర.

భావము.

నాయొక్క యీ మతాన్ని ఏమానవులు మత్సరం లేకుండా ఆచరిస్తారో, వాళ్ళు 

కూడా కర్మల నుండివిడుదల పొందుతారు.

|| 3-32 ||

శ్లోయే త్వేతదభ్యసూయన్తో నానుతిష్ఠన్తి మే మతమ్|

సర్వజ్ఞాన విమూఢాం స్తాన్విద్ధి నష్టా నచేతసః

తే.గీ. యసూయాపరులు నా యభీష్ట మతము

ననుసరింపరో యా యజ్ఞు లనవరతము

జ్ఞానులందరిచేతను ఘనతరముగ

వంచితులగుచుందురిలను పార్థ! కనుమ.

భావము.

ఎవరైతే అసూయాపరులై నా మతాన్ని అనుష్టించరో తెలివి తక్కువ వాళ్ళు సర్వ

జ్ఞానములనుండి వంచితులై నశించిపోతారని తెలుసుకో

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.