గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, మార్చి 2022, ఆదివారం

ప్రకృతేర్గుణసమ్మూఢాః..|| 3-29 ||..//..మయి సర్వాణి కర్మాణి ..|| 3-30 ||..//..,శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము. కర్మయోగము.

  జై శ్రీరమ్.

,శ్రీమద్భగవద్గీత

3వ అధ్యాయము.  కర్మయోగము. 

|| 3-29 ||

శ్లో. ప్రకృతేర్గుణసమ్మూఢాః సజ్జన్తే గుణకర్మసు|

తానకృత్స్నవిదో మన్దాన్కృత్స్నవిన్న విచాలయేత్.

తే.గీ. ప్రకృతి ధర్మంబుచేమోహ పరవశులయి

కర్మలన్ మున్గు మందులు, ఘనులు జ్ఞాన

రహిత మందుల నెన్నుచు మహిని తాము

చెదరఁ గొట్టగా రాదది మదిని దలచి.

భావము.

ప్రకృతి యొక్క గుణాల వలన మోహంలో పడిన వారు గుణ కర్మలలో 

మునుగుతుంటారు. సరిగాతెలియని మంద బుద్ధులను సర్వం తెలిసిన 

జ్ఞాని చెదర కొట్టరాదు.

|| 3-30 ||

శ్లో. మయి సర్వాణి కర్మాణి సంన్యస్యాధ్యాత్మచేతసా|

నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః

తే.గీ. సర్వకర్మలన్ నా యందు సరగుననిడి,

చిత్తమున్ నిల్పి యాత్మలో, చెలఁగు మమత

నాశ మది వీడి యారాట మనునది విడి

యుద్ధమును జేయుమర్జునా! శ్రద్ధఁ గలిగి.

భావము.

సర్వ కర్మలను నా యందు సమర్పించి, చిత్తాన్ని ఆత్మలో నిలిపి, ఆశా 

మమకారాలను వదిలి,ఆరాటాన్ని విసర్జించి యుద్ధం చెయ్యి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.