జై శ్రీరామ్.
శ్రీమద్భగవద్గీత
3వ అధ్యాయము. కర్మయోగము.
|| 3-23 ||
శ్లో. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతన్ద్రితః|
మమ వర్త్మానువర్తన్తే మనుష్యాః పార్థ సర్వశః
తే.గీ. పార్థ! విశ్రాంతి గొనక నే పనులఁ జేయ
కున్న, నన్నుననుసరింత్రు మన్ననమున
జనులు కావున కర్మలన్ సలుపుచుందు
ఫలితమాశించనేర్వను, భవ్యమదియె.
భావము.
అర్జునా; నేను విశ్రాంతి లేకుండా నిరంతరం పని చేయకపోతే, మనుష్యులు
అన్ని విధాలనామార్గమే అనుసరిస్తారు.
|| 3-24 ||
శ్లో. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్|
సఙ్కరస్య చ కర్తా స్యాముపహన్యామిమాః ప్రజాః
తే.గీ. కర్మ దూరుండ నయిన లోకములు నాశ
నమగు, వర్ణ సంకరమది నా వలననె
కలుగు, నేనె కారణముగా కాన యటుల
జరుగనీయక కర్మలు జరుపుచుందు.
భావము.
నేను కర్మలు చేయకపోతే ఈలోకాలన్నీ నశించి పోతాయి. వర్ణ సంకరానికి
కారకుఁడనౌతాను. ఈప్రజలను నాశనం చేసిన వాఁడనౌతాను.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.