గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, మార్చి 2022, గురువారం

యే యథా మాం ప్రపద్యన్తే..|| 4-11 ||..//..కాఙ్క్షన్తః కర్మణాం సిద్ధిం - || 4-12 ||..//..జ్ఞాన కర్మ సన్యాసయోగః

0 comments

A జైశ్రీరామ్.

|| 4-11 ||

శ్లో. యే యథా మాం ప్రపద్యన్తే తాంస్తథైవ భజామ్యహమ్|

మమ వర్త్మానువర్తన్తే మనుష్యాః పార్థ సర్వశః.

తే.గీ. ఎవ్వ రెట్టుల నన్గొల్తు రీప్సితముగ

వారి నట్టులే నేనును పార్థ! కనుదు,

నాదు జాడలోనే జనుల్నడచుదు రిల, 

నీవు గ్రహియింప వలెనిది నేర్పుమీర.

భావము. 

అర్జునా! నన్ను ఎవరు ఎలా కొలిస్తే నేను వారిని అలాగే అనుగ్రహిస్తాను. మనుష్యు

లెప్పుడూ నా జాడలోనే సంచరిస్తారు.

|| 4-12 ||

శ్లో. కాఙ్క్షన్తః కర్మణాం సిద్ధిం యజన్త ఇహ దేవతాః|

క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా.

తే.గీ. కర్మ ఫలములు పొందంగ ఘనతరముగ

దేవతాళిని పూజింత్రు తృప్తి గనగ

కర్మ ఫలములు లభియించు ఘనతరముగ

వేగముగ, పార్థ! గ్రహియించు ప్రీతితోడ.

భావము.

కర్మల ఫలితాన్ని కోరుకునే వాళ్ళు దేవతలను ఆరాధిస్తారు, మానవ 

లోకంలో కర్మల వలన కలిగే ఫలం త్వరగా లభిస్తుంది కదా!

జైహింద్.

30, మార్చి 2022, బుధవారం

Income Tax 2021-22|60-80సం. 80సం.పైబడ్డ పెన్షనర్ల పన్ను మినహాయింపు ఎలాపొ...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

# Income Tax లో ఎంత ఆదాయానికి ఎంత శాతం పన్ను విధించబడుతుంది # పాత మరియు ...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

జన్మ కర్మ చ మే దివ్యమేవం..|| 4-9 ||..//.. వీత రాగ భయ క్రోధా మన్మయా..|| 4-10 ||..//.. జ్ఞాన కర్మ సన్యాసయోగః

0 comments

 జైశ్రీరామ్.

|| 4-9 ||

శ్లో. జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్త్వతః|

త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోऽర్జున

తే.గీ. అర్జునా! యెవ్వ రెరుగుదు రతులితమును

దివ్యమునునైన నా జన్మ, దీపితమగు

దివ్య తత్వంబు వారికి దేహమువిడ

ముక్తియే గల్గు, నిజమిది యుక్తి గనుమ.

భావము.

అర్జునా! దివ్యమైన నా జన్మ కర్మల తత్వాన్ని ఎవరు యధార్ధంగా 

తెలుసుకుంటారో, అతడు ఈ శరీరాన్ని వదలిన తరవాత తిరిగి పుట్టడు.

|| 4-10 ||

శ్లో. వీత రాగ భయ క్రోధా మన్మయా మాముపాశ్రితాః|

బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః.

తే.గీ. రాగమును భయక్రోధముల్ వేగమె విడి

నన్ను గూర్చిన తలపుల నున్న వారు

నన్నె తా మాశ్రయించిన సన్నుతులట

జ్ఞాన తపమున నన్ జేర గలగుదు రిల.

భావము.

రాగ భయ క్రోధాలను విడిచి నన్ను గురించిన ఆలోచనలతో నిండి నన్ను 

ఆశ్రయించిన వారు ఎందరో జ్ఞానతపస్సు వలన నన్ను అందుకున్నారు.

జైహింద్.

శ్రీ అష్టోత్తర శత సతీ అశ్వధాటి. (సతీ శతకము) 6వ పద్యము.

0 comments

జైశ్రీరామ్.

6. రక్షించు మా జనని! రక్షించుమా, జన నిరీక్షన్ మదిన్ దలచుమా.

రక్షింతువీవని నిరీక్షించు సజ్జనులు మోక్షప్రదా! కనుమికన్.

సాక్షాత్కరింప కిటు శిక్షింపగా తగున? దాక్షాయినీ! కను మమున్,

లాక్షారుణప్రభల శిక్షించు దుష్టులను రక్షించు మమ్మిక సతీ!

భావము.

ఓ సాతీ మాతా! రక్షించుము తల్లీ! నీ రక్షణ కొఱకై జనుల ఎదురు చూపులను

మనసులో తలచుకొని, గుర్తించి, రక్షించుము. ఓ మోక్షప్రదా!  నీవు

రక్షించుదువని మంచివారైన నీ భక్తులు ఎదురు చూచుచుండిరి. అది నీవు

గమనించి రక్షించుము. వారికి నీ సాక్షాత్కారమును కలుగుఁజేయక ఈ

విధముగా శిక్షించుట నీకు తగదు. ఓ దాక్షాయనీ! మమ్ము చూడుము. నీ

ఎఱ్ఱని ప్రభలతో దుష్టులను శిక్షించుము. మమ్ములను రక్షించుము.

జైహింద్.

29, మార్చి 2022, మంగళవారం

యదా యదా హి ధర్మస్య .. || 4-7 ||..//..పరిత్రాణాయ సాధూనాం, .|| 4-8 ||...//.. జ్ఞాన కర్మ సన్యాసయోగః

0 comments

 జైశ్రీరామ్.

|| 4-7 ||

శ్లో. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత|

అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్

తే.గీ. ధర్మ మది క్షీణమగుచు నధర్మ మెపుడు

వృద్ధి యగుచుండు నప్పు డేన్ పృథ్విపైన

పుట్టు చుందు నధర్మమున్ మట్టుపెట్టి

ధర్మ సంరక్షణను జేయ ధర్మ మిదియె. 

భావము.

అర్జునా! ఎప్పుడు ధర్మము క్షీణించి అధర్మం వృద్ధి చెందుతుందో 

అప్పుడు నన్ను నేను సృజించుకుంటాను.

|| 4-8 ||

శ్లో. పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతామ్|

ధర్మసంస్థాపనార్థాయ సమ్భవామి యుగే యుగే.

తే.గీ. సాధు జనులను రక్షింప, సమయు నటుల

జేయ దుష్కృతులను భువిన్, జేయగాను

ధర్మ సంస్థాపనంబును  ధరను నేను

సంభవింతు యుగయుగములంభరతజ!

భావము.

సాధువులను రక్షించడానికి, దుష్టులను నాశనం చేయడానికీ, ధర్మాన్ని 

నెలకొల్పడానికి యుగ యుగంలోను నేను జన్మిస్తాను.

జైహింద్.

28, మార్చి 2022, సోమవారం

బహూని మే వ్యతీతాని..|| 4-5 ||..//..అజోऽపి సన్నవ్యయాత్మా.. || 4-6 ||..//.. జ్ఞాన కర్మ సన్యాసయోగః

0 comments

 జైశ్రీరామ్.

శ్రీభగవానువాచ|

భావము.

శ్రీ కృష్ణభగవానుడు ఈ విధముగ పలికెను.

|| 4-5 ||

శ్లో. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున|

తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరన్తప

తే.గీ. గడచిపోయిన జన్మలు కలవు పెక్కు 

నీకు, నాకును, నెరుగవు నీవు, నేనె

రుంగుదును వాటి నన్నిటిన్, భంగపడకు

మర్జునా నీవు సత్యంబు నరయ వలయు.

భావము.

అర్జునా! నాకూ నీకూ కూడా ఎన్నో జన్మలు గడిచిపోయాయి. నేను వాటన్నిటిని 

ఎరుగుదును. నీవు ఎరుగవు.

 || 4-6 ||

శ్లో. అజోऽపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్|

ప్రకృతిం స్వామధిష్ఠాయ సమ్భవామ్యాత్మమాయయా.

తే.గీ. జన్మమే లేనివాడ నీ జగతిలోన

నవ్య యుండను, జీవుల కధిపతి నిక

నాదు ప్రకృతిని దాటుచు నాదు మాయ

వలన జన్మించు చుందును, వలసినపుడు.

భావము.

జన్మ లేని వాడినీ, అవ్యయుడినీ, జీవులందరికి అధిపతినైన, నా ప్రకృతిని 

అధిరోహించి నా మాయ వలన జన్మిస్తుంటాను.

జైహింద్.

ఏవాయం మయా తేऽద్య..|| 4-3 ||..//..అపరం భవతో జన్మ పరం..|| 4-4 ||..//.. జ్ఞాన కర్మ సన్యాసయోగః

0 comments

 జైశ్రీరామ్.

|| 4-3 ||

శ్లో.  ఏవాయం మయా తేऽద్య యోగః ప్రోక్తః పురాతనః|

భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్.

తే.గీ. అట్టి ప్రాచీన యోగంబు నర్జున! సఖుఁ

డవని, భక్తుండ వని నీకు సవివరముఢ

బోధఁ జేసితి నుత్తమ పూజ్యమౌర

హస్య యోగంబిది కనుమయ్య నీవు.

భావము.

ఆ సనాతనమైన యోగాన్నే నా భక్తుడవు, స్నేహితుడవు ఐన నీకు 

భోధించాను. ఇది ఉత్తమమైనదీ రహస్యమైనదీ కూడా.

|| 4-4 ||

అర్జున ఉవాచ|

భావము.

అర్జునుడు ఈ విధముగ అడిగెను.

శ్లో. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః|

కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి

తే.గీ. ఇప్పటిదె నీదు జన్మం, బ దెప్పటిదగు 

సూర్యదేవుని జన్మము? సూర్యునకును

బోధఁ జేసితినంటివి బొధ పడద

దెట్టుల సాధ్యమౌ, యెఱుగ లేను.

భావము.

నీ జన్మ ఇటీవలది. సూర్యుని జన్మ ఎంతో ముందున్నది. నీవు సూర్యునికి 

ఉపదేశించావని అన్నావు. దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి?

జైహింద్.

# Learn sanskrit-16 सा,ते, ताः #

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

#Learn sanskrit - 14स्त्री षष्ठी#

0 comments

జైశ్రీరామ్
జైహింద్.

#learn sanskrit - 13पुं षष्ठी#

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

#Learn sanskrit - 12सर्वत्र, एकत्र#

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

#Learn Sanskrit - 11अन्यत्र#

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

# learn sanskrit - 10तत्र, कुत्र# సంస్కృతంలో సంభాషణ శిక్షణము.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

సంస్కృత సంఖ్యలలో లింగ బేధాలు..సంస్కృతభాషలో సంభాషణ శిక్షణము. 17వ భాగము.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

# Learn Sanskrit-8पुंलिङ्गवाक्यानि# సంస్తంస్కృతంలో సంభాషించుట. 8వ భాగము.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

# Learn sanskrit - 7एव,द्विव,बव# సంస్కృతములో సంభాషించుట..శిక్షణము.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

#Learn sanskrit - 6नास्ति,न स्तः,न सन्ति# సంస్క్ఉతములో సణ్భాషించుట శిక్షణము. 6వ భాగము.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

ఇమం వివస్వతే యోగం ..|| 4-1 ||..//..ఏవం పరమ్పరాప్రాప్తమిమం..|| 4-2 ||..//..జ్ఞానకర్మసంన్యాసయోగః

0 comments

 జైశ్రీరామ్.

అథ చతుర్థోధ్యాయః - జ్ఞానకర్మసంన్యాసయోగః

|| 4-1 ||

శ్రీభగవానువాచ|

భావము.

శ్రీ కృష్ణభగవానుడు పలికెను.

శ్లో. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్|

వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవేబ్రవీత్

తే.గీ. ఘనతరంబుగ కర్మ యోగంబు రవికి 

బోధఁ జేసితి, తానది బోధఁ జేసె

మనువు, కాతఁ డిక్ష్వాకున కును తెలిపె, న

నన్య మిదియు తెలియుము, ఫర్జన్య! తెలియ.

భావము.

అవ్యయమైన ఈ కర్మయోగాన్ని నేను సూర్యుడికి భోదించాను. సూర్యుడు 

మనువుకి చెప్పాడు. మనువు ఇక్ష్వాకుడికి చెప్పాడు.

|| 4-2 ||

శ్లో. ఏవం పరమ్పరాప్రాప్తమిమం రాజర్షయో విదుః|

స కాలేనేహ మహతా యోగో నష్టః పరన్తప.

తే.గీ. రాజ ఋషు లెఱింగిన యట్టి రాజయోగ 

మిది, ప‌రంతపా! ప్రాప్తించె నిల పరంప

రగనె, పరికింప నీయోగ  మగణితమెగ

కాలగర్భంబులో నేడు కలిసిపోయె.

భావము.

ఇలా పరంపరగా ప్రాప్తమైన కర్మయోగాన్ని రాజర్షులు ఎరుగుదురు. 

ఓ పరంతపా!  కాల గతిలో ఈ గొప్ప యోగం ఈ లోకంలో నశించి పోయింది.

జైహింద్.

26, మార్చి 2022, శనివారం

#Sanskrit learning -5अस्ति,स्तः,सन्ति# సంస్కృత భాషణలో శిక్షణ.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

#Learn sanskrit - 4सा,एषा,का# సంస్కృతభాషణలో శిక్షణ తెలుగులో

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

#Learn sanskrit-3सः,एषः,कः# సంస్కృత భాషణలో శిక్షణ. 3వ భాగము.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

# SANSKRIT LEARNING-2अहं, भवान्, भवती# తెలుఁగులో

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

#Sanskrit learning -1, मम नाम...# తెలుఁగులో.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

తస్మాత్త్వమిన్ద్రియాణ్యాదౌ..|| 3-41 ||..//.. ఇన్ద్రియాణి పరాణ్యాహురి..|| 3-42 ||..//..ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా..|| 3-43 ||..//..శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము. కర్మయోగము.

0 comments

  ,జైశ్రీరామ్.

శ్రీమద్భగవద్గీత

3వ అధ్యాయము.  కర్మయోగము.

|| 3-41 ||

శ్లో. తస్మాత్త్వమిన్ద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ|

పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనమ్.

తే.గీ. జ్ఞాన విజ్ఞాన నాశినిన్ గామము నిక,

వదిలి పెట్టుము పార్థుఁడా! పట్టుపట్టి

యింద్రియములను గెలువుమో యింద్ర తనయ!

మహిత కర్తవ్యదీక్షతో మహిని నీవు.

భావము.

అందువలన భరత కుల శ్రేష్టుడా! ముందుగా నీవు ఇంద్రియాలని నిగ్రహించి

జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేసే పాపిష్టి కామాన్ని నిర్మూలించు.

|| 3-42 ||

శ్లో. ఇన్ద్రియాణి పరాణ్యాహురిన్ద్రియేభ్యః పరం మనః|

మనసస్తు పరా బుద్ధి ర్యో బుద్ధేః పరతస్తు సః.

తే.గీ. ఇంద్రియంబులు ఘనమని యందురనఘ!

అంతకన్నను మనసెయౌ నధిక ఘనము,

మనసుకన్నను బుద్ధియఘ మరియు ఘనము,

బుద్ధికన్న నాత్మ ఘనము బుద్ధినరయ.

భావము.

ఇంద్రియాలు గొప్పవని చెబుతారు. ఇంద్రియాలకన్నా అధికమైనది మనస్సు

మనస్సు కన్నాగొప్పది బుద్ధి, బుద్ధి కంటే శ్రేష్టమైనది ఆత్మ.

|| 3-43 ||

శ్లో. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మాన మాత్మనా|

జహి శత్రుం మహాబాహో! కామరూపం దురాసదమ్

తే.గీ. బుద్ధి కన్న నాత్మయె ఘనంబుగఁ గ్రహించి,

నిగ్రహించుచు నిను నీవు, నేర్పు మీర

కామమను శత్రువున గెల్చి, ఘనతరముగ

చేయఁ దగినట్టి ధర్మంబు చేయుమరసి.

భావము.

మహాబాహుడా! ఇలా ఆత్మను బుద్ధికన్నా ఎక్కువైన దానిగా తెలుసుకొని, నిన్ను నీవు 

నిగ్రహించుకొని,కామరూపి అయిన శత్రువునను జయించుము.

3వ అధ్యాయము. కర్మ యోగము సమాప్తము.

జైహింద్.

25, మార్చి 2022, శుక్రవారం

శ్రీ అష్టోత్తర శత సతీ అశ్వధాటి. (సతీ శతకము) 5వ పద్యము.

2 comments

జైశ్రీరామ్.

ఓం శ్రీమాత్రే నమః.

5. అశ్రాంతమున్ జనుల సుశ్రేయమున్ గని గుణశ్రీదవై నిలుతువే.

సుశ్రీ పదోజ్వలిత సుశ్రావ్యకావ్యపు శుభశ్రీగ నీవు నిలుమా.

యశ్రద్ధనే విడిచి విశ్రాంతినే మరచి సుశ్రీద నిన్ గొలువనా.

సుశ్రోతలన్, కవుల సుశ్రేయమున్ గను దవిశ్రాంత మీవిల సతీ!

భావము.

ఓ సతీమాతా! ఎల్లప్పుడూ జనుల యొక్క గొప్ప క్షేమమునే

చూచి సద్గుణలక్ష్మిని ప్రసాదించు దానివై నీవు వెలుఁగుచుందువమ్మా! మంచి

మంగళప్రదమయిన పదములతో ప్రకాశించుచున్న మంచి వినసొంపయిన

కావ్యమున శుభశ్రీనొసంగుదానివై నిలుము తల్లీ! అశ్రద్ధను పూర్తిగా

విడిచిపెట్టి, విశ్రాంతి యనునదే మరచిపోయి, మంచి మంగళములు

కలుగఁజేయుదానివైన నిన్ను నేను సేవించనా తల్లీ? ఈ భువిపై మంచి

శ్రోతలను, కవులయొక్క మంచి శ్రేయమును అవిశ్రాంతముగా నీవు

చూచుచుందువమ్మా.

జైహింద్.

ఆవృతం జ్ఞాన మేతేన..|| 3-39 ||..//..ఇన్ద్రియాణి మనో బుద్ధి..|| 3-40 ||..//..|శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము. కర్మయోగము.

0 comments

  ,జైశ్రీరామ్.

శ్రీమద్భగవద్గీత

3వ అధ్యాయము.  కర్మయోగము.

|| 3-39 ||

శ్లో. ఆవృతం జ్ఞాన మేతేన జ్ఞానినో నిత్య వైరిణా|

కామ రూపేణ కౌన్తేయ! దుష్పూరే ణానలేనచ.

తే.గీ. కామమది తృప్తిఁ గలిగింపఁ గాని యగ్ని,

జ్ఞానమున కది వైరి, సు జ్ఞానమునది

కప్పివేయును, మనుజుని కనులు మాయ

క్రమ్మి కామాగ్ని దగ్ధుఁడై కనడు నిజము.

భావము.

కామం తృప్తి పరచడానికి వీలులేని అగ్ని వంటిది.ఇది జ్ఞానానికి నిత్య శత్రువు

దీనితో జ్ఞాని జ్ఞానంకప్పబడి ఉంటుంది.

|| 3-40 ||

శ్లో. ఇన్ద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే|

ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినమ్.

తే.గీ. కామమునకు నాధారముల్ కనగ బుద్ధి

యింద్రియంబులు, మనసు, జ్ఞానేంద్రియమును

కామమది కప్పి వ్యామోహ కలితుఁ జేయు

మానవుని కాన కామమున్ మాపవలయు.

భావము.

ఇంద్రియములు, మనస్సు, భుద్ధి, కామానికి ఆధార స్థానములు అని చెప్పబడు

తున్నవి. కామముజ్ఞానమును కప్పి వేసి ఇంద్రియాల ద్వారా దేహధారిని వ్యామోహ 

పరుచును

జైహింద్.

24, మార్చి 2022, గురువారం

కామ ఏష క్రోధ ఏష రజో..|| 3-37 ||..//.. ధూమేనావ్రియతే వహ్నిర్య..|| 3-38 ||..//..శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము. కర్మయోగము.

0 comments

 ,జైశ్రీరామ్.

శ్రీమద్భగవద్గీత

3వ అధ్యాయము.  కర్మయోగము. 

|| 3-37 ||

శ్రీభగవానువాచ|

భావము.

శ్రీ భగవానుఁడు ఇట్లు పలుకుచుండెను.

శ్లో. కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః|

మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్.

తే.గీ. క్రోధ కామముల్ కన  రజో గుణము నుండి

యుద్భవించు నాకలి దానికుండు మెండు,

పాప మూల రజోగుణ వర్ధనంబె

శత్రు వందరికీధరన్, సరిగ కనుమ.

భావము.

ఇవి కామము, క్రోధము, రజోగుణం నుండి ఉద్భవిస్తాయి. దానికి మహా ఆకలి

అది పాపిష్టిది.ఈలోకంలో అందరికి అదే శత్రువని తెలుసుకో.

|| 3-38 ||

శ్లో. ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన |

యథోల్బేనావృతో గర్భ స్తథా తేనేదమావృతమ్.

తే.గీ. అగ్నిని పొగయును, మలిన మద్దమును, మరి

మావి శిశువును క్రమ్మునట్లే విజయుఁడ!

క్రమ్మివేయును  జ్ఞానమున్ గామమరయ,

కామమును గెల్చువారలే ఘనులు భువిని.

భావము.

అగ్నిని పొగ ఆవరించినట్లు, అద్దాన్ని దుమ్ము కప్పినట్లు, గర్భస్త శిశువుని మావి 

కప్పినట్లు జ్ఞానాన్నికామం కప్పి వేస్తుంది.

జైహింద్.

23, మార్చి 2022, బుధవారం

శ్రేయాన్స్వధర్మో విగుణః ..|| 3-35 ||..//..అథ కేన ప్రయుక్తోయం పాపం ..|| 3-36 ||..//..,శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము. కర్మయోగము.

0 comments

   జై శ్రీరామ్.

,శ్రీమద్భగవద్గీత

3వ అధ్యాయము.  కర్మయోగము. 

|| 3-35 ||

శ్లో. శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్|

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః.

తే.గీ. గుణము లేనిదైనను గాని తనదె యయిన

ధర్మమే మేలు, కన పరధర్మమేల?

నది భయంకర మరయు మో యర్జునాఖ్య!

మన సుధర్మంబె చరియింప మనకు శుభము.

భావము.

బాగా ఆచరించిన పర ధర్మం కన్నా లోపభూయిష్టమైనది ఐనా స్వధర్మం 

మేలు. పర ధర్మం భయంకర మైనది.

|| 3-36 ||

అర్జున ఉవాచ|

భావము.

అర్జునుడు విధముగ అడిగెను.

శ్లో. అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః|

అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః

తే.గీ. కృష్ణ! పాపంబుల నెవరి ప్రేరణమున

మానవుఁడు చేయచుండెనో మదిన చేయ

నిష్టమది లేకపోయినన్? సృష్టిలోన

ప్రేర ణెవరిది పాపంబు విరివి చేయ?

భావము.

కృష్ణా! ఇష్టం లేకపోయినా ఎవరో బలవంత పెడుతున్నట్లు మానవుడు పాపం ఎందుకు

చేస్తున్నాడు? ప్రేరణశక్తి ఎవరిది?ఎవరి కారణంగా పాపం చేస్తాడు?

జైహింద్. 

22, మార్చి 2022, మంగళవారం

శ్రీ అష్టోత్తర శత సతీ అశ్వధాటి. (సతీ శతకము) 4వ పద్యము.

0 comments

జై శ్రీరామ్.
జైశ్రీమాత్రే నమః.🙏
శ్రీ అష్టోత్తర శత సతీ అశ్వధాటి. (సతీ శతకము) 4వ పద్యము.

4. శక్తి ప్రదాతవని ముక్తిప్రదాతవని భక్తిన్ నినున్ గొలిచెదన్ 
భక్తాగ్రగణ్యులు విముక్తిన్ గనన్ మిగుల రక్తిన్ నినున్ గొలుతురే. 
రక్తాక్షివై దురిత శక్తిప్రపూర్ణులను రక్తంబు చిందఁ గనుమా. 
యుక్తంబు లిచ్చుచు నయుక్తంబులన్ దరుము యుక్తిప్రదా వర సతీ!

భావము.
ఓ శ్రేష్టురాలివైన సతీమాతా! నీవు శక్తిని, ముక్తిని కలుగఁజేయు తల్లివని భక్తితో 
నిన్ను కొలిచెదను. గొప్ప భక్తులు ఈ సంసార బంధములనుండి విముక్తి 
పొందుట కొఱకు మెక్కిలి అనురక్తితో నిన్ను సేవించుదురు కదా. దుర్మార్గుల 
విషయమున నీవు కన్నులు కోపములురక రక్తము చిందువిధముగా 
శిక్షింపుము. ఓ యుక్తిని ప్రసాదించు తల్లీ! మాకు అనుభవింపఁదగినవే 
ప్రసాదింపుము. అయుక్తములయినవాటిని పోఁగొట్టుము.

🙏
అమ్మకు వందనములతో
రచన చింతా రామకృష్ణారావు.
గానం శ్రీ కుమార సూర్యనారాయణ. విజయవాడ.
జైహింద్.

అన్నవర సమీప గోపాలపట్టణంలో కొలువై యున్న శ్రీ నేరేళ్ళమాంబ సుప్రభాతమ్. రచన. చింతా రామకృష్ణారావు. హైదరాబాదు.

0 comments

🙏 ఓం శ్రీమాత్రే నమః.🙏

అన్నవర సమీప

గోపాలపట్టణంలో కొలువై యున్న

శ్రీ నేరేళ్ళమాంబ సుప్రభాతమ్.

రచన. చింతా రామకృష్ణారావు. హైదరాబాదు.

నేరేళ్ళాంబ! జయో ఽస్తు తే.

ప్రముఖుల సమీక్షలు

చింతాగ్రస్తులకు మేలుగరిపె  చింతా వారి నేరేళ్ళాంబ  మేలుకొలుపు

బ్రహ్మశ్రీ కొరిడె విశ్వనాథ శర్మ

రిటైర్డ్ ప్రిన్సిపాల్ & సంస్కృత అసోసియేటెడ్ ప్రొఫెసర్….ధర్మపురీ …..తే.19/03/2022.

ఓం గం గణపతయే నమః.

ఓం శ్రీ వాగీశ్వర్యై నమః

       జ్ఞాన వైరాగ్యము లకు భక్తి మాతృక అంటున్నది పద్మ పురాణము. భక్తి కలిగితే క్రమముగా జ్ఞాన

వైరాగ్యములు  పెంపొందుతాయి. జ్ఞాన వైరాగ్యములు లేకపోయినను భక్తి వలన భగవంతునికి

ప్రియుడిగా అవుతాడు ఎందుకనగా 'భక్త ప్రియో మాధవః' అన్నారు.

"నాహం వసామి వైకుంఠే, న యోగిహృదయే, రవౌ, మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద !"

       భక్తులు ఎక్కడైతే నన్ను స్తుతిస్తారో, గానము చేస్తారో అక్కడ నేను ఉంటాను అని భగవంతుఁడు

పేర్కొన్నాడు. భగవంతుని హృదయమును చేరుటకు భక్తియే పరమొత్కృష్టమైన మార్గము. అందుకు

భక్తి సాహిత్యం తోడ్పాటు కలిగిస్తుంది.

       సాహిత్యకారులు నవరసములతోపాటు భక్తిని పదవ రసముగా గ్రహించినారు. భక్తిని

పెంపొందించుటకు వైదిక సాహిత్యముతోపాటు పురాణములు , భక్తి కావ్యములు, నాటకములు,

శతకములు, స్తోత్రములు మొదలైన వివిధ సాహిత్య ప్రక్రియలు వెడలినవి. అందులో సుప్రభాత

సాహిత్యమును స్తోత్ర సాహిత్యంగా పేర్కొనవచ్చు.

       భక్తుడు సూర్యోదయం కంటే పూర్వమే లేచి  శుచియై భగవంతుని నిద్రనుండి మేలుకొలుపుటకై

మనసు నిండా భక్తిని నింపుకొని వివిధములైన భగవద్ వృత్తములను ప్రశంసిస్తూ మేలు కొమ్మని

సున్నితంగా చక్కనైన వృత్తములో మధురమైన గాత్రముతో ప్రయత్నించుటయే సుప్రభాతమునకు

మూలము.

       సుప్రభాత కర్త ముందుగా భక్తి తత్త్వం ఎఱిఁగిన వాడు కావలెను. భగవద్గాథలు, వేద వేదాంత

రహస్యములు తత్త్వములు యెఱిఁగిన వాడు ఐనచో ఆ యా వాఙ్మయ సేవకు వన్నె పెట్టినట్లు అగును.

       ఇక్కడ సుప్రభాతం ఒక లఘు కావ్యంగా తలంచవచ్చును. ఈ లఘు కావ్యంలో సుప్రభాతముతో

పాటు  భగవత్ స్తుతి ,  ప్రపత్తి,  మంగళాశాసనములు కూడా అంతర్భాగములుగా అవుతున్నాయి.

కొన్నిచోట్ల అపరాధ క్షమార్పణ స్తోత్రము కూడా కనబడి మరింత మెరుగులు దిద్దుచున్నవి.

వివిధములైన రూపములలో ఉన్న ఆ భగవంతుని ఏ విధముగా కొలిచినను "సర్వదేవనమస్కారః

కేశవం ప్రతి గచ్ఛతి" అన్నట్లు అమ్మవారి రూపమునందుననూ , అయ్యవారి రూపము నందుననూ ఏ

ఆకారమున కొలిచినను అన్ని నిరాకార పరమాత్మ కే చెందుతాయి.

       కవి శ్రీ శ్రీ చింతా రామకృష్ణ రావు గారు నాకు దాదాపు పదేళ్ల నుండి పరిచయమైనవారు.

ఆత్మీయులు. సహృదయులు. వారి సౌహృదయ‌సుధాంబుధిలో  నన్ను ఓలలాడించినవారు.

శ్రీ రామకృష్ణ రావు గారు నేరేళ్ళాంబ సుప్రభాత ,  స్తుతి ,  ప్రపత్తి ,  మంగళాశాసనములను వ్రాసినారు.

ఉద్దండ పండితులు. అనేక అనేక శతక కర్తలు చిత్ర కవితా దురంధరులు నిరంతరం భక్తి కవితా

రచనాగ్ర చిత్తులు. ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు ముందే బ్రాహ్మీముహూర్తముననే లేచి

ముందుగా భగవత్ స్తుతి కరమైన కొన్ని పద్యములు నైనా వ్రాస్తేనే గాని మంచము దిగని వారు.

అట్టివారు పరమ భక్తులు అని చెప్పనక్కరలేదు. నాకు తెలిసి వారి రచనలు అన్నీ కూడా భక్తి సాహిత్య

సుధా రస పూర్ణములైనవే !

       ఇప్పటివరకు చేసిన ఆంధ్ర పద్యముల ద్వారా అమృతమును అందరికీ పంచి యివ్వడమే కాక

ఈ సుప్రభాత రచన ద్వారా సంస్కృతభాషలో  కూడా పాదము మోపి తమ నైపుణ్యాన్ని చూపించి

గీర్వాణ భాషా ప్రియులకు కూడ ప్రియులై, మాన్యులైనారు.

       భాష ఏదైనా కవిలో నున్న భావము ఒకటే కదా !  కనుక ఆ భాషా పదవిన్యాసము పై పట్టు సాధిస్తే ఏ

భాషలోనైనా కవి తన భావ రసాన్ని పంచగలడు. కవిగా తన అభిలాషను దేవికి అంతర్లీనంగా

చెప్పుటలో ఆయన సమర్థుడు. కప్పిపుచ్చే వాడు కవి అని ఉంటారు ఇక్కడ చింతా రామకృష్ణ రావు

గారు ప్రశంసా స్తుతి ని గావిస్తూనె తమ  భక్తుల విషయంలో కోరికలన్నీ టిని కాంతిసమ్మితముగా

కోరినారు. చూడండి.

శ్రీ రమ్య వాక్ సుగుణధే ! శ్రితరక్షణాఢ్యే !

ధీరాది సద్గుణనిధే దినరాజకాంతే !

నేరేళ్ళ నామ  జనని ! త్వమనంత శక్తిః ,

ధారాల వాక్సువరదే ! తవ సుప్రభాతమ్ . (3)

        ఆ తల్లి ని ప్రశంసించుట లో ఎంతో సుమనోహరమైన పద విన్యాసం చదివితేనే మనము ఆ

అమ్మవారి ముందు ఉన్నామనిపించే తన్మయత్వం కలిగించే శైలి. ఈ ప్రశంసలో స్తుతి తో పాటు

అంతర్లీనంగా మంచి రమ్యమైన సుగుణమ్ము లైన వాక్కుల నిమ్మని, రక్షణనిమ్మని,

సద్గుణములనిమ్మని, శరీర కాంతిని యిమ్మని , అనంతమైన శక్తినిమ్మని ఎంత చక్కగా కవి కోరారో కదా !

అదేవిధంగా

శ్రేయస్కరే! భవహరే శ్రితపారిజాతే !

న్యాయస్వరూపిణి ! వరోన్నత సద్విభాసే !

జన్మాది కర్మఫల నాశ మహత్ప్రభాసే !

ధ్యేయాక్షరి ! ద్విషవినాశిని ! సుప్రభాతమ్ (7)

       భక్తులకు శ్రేయస్సును కలిగిస్తూ సంసార బాధలు నివృత్తి చేస్తూ భక్తుల కల్పవృక్షమై

సమస్తాభీష్టములను అందిం పజేస్తూ న్యాయము రక్షిస్తూ , ఈ జన్మ పరంపర కర్మఫలములను

నశింపజేస్తూ మహత్తేజో నిలయమైన ముక్తిని కలిగింప చేయమని అరిషడ్వర్గములు నశింపజేయు

మని ఎంతో ప్రశంసా పూర్వకంగా తెలియజేసినారు.

       ఒక దేవత సుప్రభాతం రాయాలంటే ఆ పరిసర ప్రాంతముల విషయములు కూడా తెలిసి

ఉండాలి.

"గోపాల విశ్రుతపురీ గుణభాస యోషే !" (6)

నేరెళ్ల అంబాదేవి గోపాల పట్టణనిలయ వాసినియని ,

" శ్రీతాండవాభిధ నదీజల నిత్య సేవ్యే!" (17)

తాండవనదీ తీరనివాసినియని , ప్రాంత పరిచయము గావించినారు.

" భక్తా రమా సహిత సత్య విభుం ద్రష్టుం

త్వత్ స్వాజ్జ్ఞయైవ వరమన్నవరం విశంతి ,,..."(9)

అని  ఈ అమ్మవారి అనుగ్రహం వలన ఆజ్ఞ వల్ల ఇక్కడి నుండి అన్నవరం శ్రీ సత్యనారాయణుని

దర్శించడానికి వెళ్ళుతుంటారని చెప్పడము ద్వారా అన్నవర సమీప నివాసినియని,  మార్గోపదేశం

చేసినారు.

యద్యత్త్వనంత శుభకర్మసు బద్ధచిత్తాః

తత్తత్ సుకర్మ ఫలాని త్వదీప్సితాని .

త్వద్వీక్షణేన  నిరపేక్ష్య శుభాని యాంతి .

నేరేళ్ళ మాతృ చరణౌ శరణం ప్రపద్యే .. (20)

       భక్తులు తమ అ పూర్వకర్మ సంచితమైన ఫలములను పొందుట కూడా అమ్మ వారి యొక్క

అభీష్టం మేరకే ఆమె కటాక్ష వీక్షణ చేత కోరకుండానే పొందుతారని తత్త్వమును తెలియజేసినాడు.

       ఒక్కొక్క శ్లోకములో ఒక్కొక్క విశేషము కానవస్తుంది. ఎంత విశ్లేషించిన అంతా రామణీయకత్వం

కనపడుతూ ఉంటుంది. భక్తి పారవశ్యాన్ని పెంపొందించుటతో పాటు భక్తుల హృదయాలలో,

గళములలో చిరస్థాయిగా నిలిచిపోతుందనుటలో అతిశయము కాదని తలుస్తూ…

స్వస్తి.

కొరిడె విశ్వనాథ శర్మ.

 అమ్మకు గొబ్బిళ్ళు.


బ్రహ్మశ్రీ  డా.ఇనగంటి  ఉమారామారావు.

విశ్రాంత నాయాచార్య,

ఆంధ్రగీర్వాణ విద్యాపీఠం,

కొవ్వూరు,

పశ్చిమగోదావరి జిల్లా.

   భారత భూమి కర్మభూమి. దేవతల ఆరాధనలచే  కోరికలు తీర్చుకొని, కోరికలు లేని శ్రీ కైవల్యం

పొందుటకనువైన నేల మనది. ఈ నేలలో నలుచెరగులా దేవతావైభవం ఉట్టిపడుతూ ఉండును. శ్రద్ధ

ఆసక్తి యుంటే అమ్మను కొలుచుకొను అదృష్టం పడుతుంది. అంతటా నీరున్నా రేవులుంటే గాని ఆ

నీరు సులభలభ్యం కాదు. అట్లే అంతటా అమ్మ శక్తి నిండి యున్నా అమ్మ కొలువు తీరిన ఆ గుడులే

మనకు సుఖారాధ్య ద్వారాలు. ఆ జగన్మాత యొక్క పరిపూర్ణ దయను బహు జన్మలందు చేసిన

పుణ్యం వలన పొందినవారు అరుదుగా ఉంటారు. వారిలో ఒకరుయెడ్లశ్రీనివాసు మహోదయులు.

తనకు సంబంధించిన సర్వస్వమూ వెచ్చించుటకైనా వెనుకాడకామ్మకు ఆలయ శోభను సమకూర్చి

అమ్మ దయకు తనలాంటివారినెందరికో పంచుట వారి సుకృతము. ఆ అమ్మను నిత్యమూ

పూజించుటకు తలచుటకు మననం చేయుటకు అనువుగా అక్షరార్చన చేయించు తలంపు మెచ్చుకో

తగినది. అందుకు తగిన కవులనెన్నుకొనుట నేరేళ్ళమ్మవారి దయకు నిదర్శనం బ్రహ్మశ్రీ చింతా

రామకృష్ణారావు కవిగారు అష్టావధానులు. చిత్రకవితా నిపుణులుగా ప్రసిద్ధులు. శ్రీ లలితా మాత యొక్క

సహస్ర నామములకు వేయిపద్యములల్లి సమర్పించిన పుణ్యమూర్తులు. నిరంతర మాతృచింతే

వారింటిపేరు. ఒక్క రోజులో అష్టోత్తరశత అశ్వధాటీ వృత్తములు వ్రాసి రోజుకొక పద్యము పఠన

యోగ్యముగా పంపుట వారి నిత్యకృత్యముగాఇప్పుడు కలిగియున్న ధన్యజీవి.

   నేరేళ్ళమ్మవారి చరిత్ర, వైభవము,   భక్తానురక్తిని, సుప్రభాతంగా ప్రపత్తిగా, స్తుతులుగా అందించి,

భక్తులకు అమ్మవారి కృప వర్షింపఁ జేసి మహోపకారం చేసిన కవివరులకు అందుకు పూనుకొన్న

యడ్లవంశీయులకు, నన్ను భాగస్వామి చేసిన నేరేళ్ళమ్మకు వందనాలతో…

స్వస్తి.

ఆ తల్లికి  ఓ బిడ్డ,

డా.ఇనగంటి  ఉమారామారావు.

తే.01 . 4 . 2022. శ్రీ శుభక్రుత్ నామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమీ స్థిరవారమ్.  

ఓం శ్రీమాత్రే నమః.

ఆనంద భాష్పాంతరంగం.

కృతికర్త.

చింతా రామక్ఉష్ణారావు.

   శ్రీమన్మంగళ దివ్య స్వరూపిణి అమ్మవారు. ఆ తల్లి అనుగ్రహిస్తే అజ్ఞానాంధుఁడయినను సద్విజ్ఞానిగా

వెలుగఁగలడు. ఆ తల్లి చల్లని చూపులు నాకవితకు ఊపిరి పోయుచుండును. . ఆ లోకమాత తన శ్రీలలితా

సహస్రనామములకు పద్యములు నాలోన తానుండి వ్రాయించుకొనినది.  దివ్యమయిన

అశ్వధాటీవృత్తమునకు క్రొత్తవరవడి దిద్ది నాచేత ఇరువదినాలుగు గంటల వ్యవధిలో శతకమే

వ్రాయించుకొనిన కరుణామయి. ఈ జగన్మాత. ఇప్పుడు గోపాలపట్టణమున వెలుఁగుచుండి తన

భక్తుల రూపమున సుప్రభాతము వ్రాయ ప్రేరేపించి తన శక్తిని నాలో నిలుపుకొని వ్రాయించుకొన్నది.

ఇంతటి దయామూర్తి అయిన అమ్మను గూర్చి తెలుపుటకు నాకు మాటలు చాలవు. ఆ అమ్మ

పాదపద్మములకు సాగిలి మ్రొక్కుట తప్ప వేరు పలుక నోరాడదు.

   నా సహోదరుఁడయిన డా.లింగాల సత్యయాజ్ఞవల్క్యశర్మ  గోపాలపట్టణమునందలి

నేరేళ్ళమ్మవారినుద్దేశిచి సుప్రభాతము వ్రాయవలసినదిగా శ్రీ ఎడ్లశ్రీనివాసు తనకు చేసిన విన్నపమును

నాకు తెలియఁజేయగా, అమ్మకు మహత్తరమయిన సుప్రభాతము వ్రాయునంతటి సమర్ధుఁడను కానని

నేనూహించుకొని, ఎవరో ఒకరిరిచే వ్రాయించవచ్చునులే అని భావించి సమ్మతించితిని.

   నాకు సుపరిచితులయిన బ్రహ్మశ్రీ కొరిడె విశ్వనాథశర్మగారికి విషయము తెలియఁజేసి సుప్రభాత రచన

చేయ వలసినదిగా కోరగా… అమ్మ ఆజ్ఞాపించినది మీకు, మీరు తెలుఁగులో అమోఘమయిన

పద్యములలవోకగా వ్రాసియున్నారు. ఈ సుప్రభాతము వ్రాయుట మీకు అసాధ్యము కాదు. తప్పక మీరే

వ్రాయఁ గలరు. ప్రయత్నించి వ్రాసి నాకు చూపినచో అవసరమగు మెఱుగులు దిద్దుటలో

సహకరించఁ గలనని పలికి నన్ను ప్రోత్సహించిరి.

   చేయఁగలిగినది లేక ఆ జగన్మాతపైననే భారము వేసి వ్రాయుట ప్రారంభించి ఐదు శ్లోకములు

మచ్చునకు వ్రాసి శ్రీ విశ్వనాథశర్మగారికి చూపఁగా వారి సహజధోరణిలో నన్ను ప్రశంసలలో ముంచెత్తి ఈ

కార్య నిర్వహణ నాకనివార్యముగా చేసిరి. వారి ప్రోత్స్ఆహముతో శ్లోకములు అకుంఠితముగా వ్రాయుచు

వారికి చూపుచుండగా వారు చూచుచు అవసరమగు సూచనలు చేయుచు నాచేత ఈ పని పూర్తి చేయించిరి.

వారి అభిమానమునకు ధన్యవాదములు.

   నా సహోదరుఁ యాజ్ఞవల్క్యశర్మ అంతయూ చూచి ప్రశంసించుటే కాక, తే.18 . 3 . 2022న ఈ

సుప్రభాతమును ఆవిష్కరణకు వెన్వెంటనే ప్రయత్నించి అమ్మవారిపై తనకుగల తపనను

చూపించుకొనెను.

   శ్రీ ఎడ్ల శ్రీనివాస్ ఈ నేరేళ్ళమ్మ ఆలయ పునరుద్ధరణకు ద్ఉఢచిత్తుఁడై శారీరక మానసిక ఆర్థిక

వ్యయప్రయాసలను లెక్క చేయక అణువణువునా ఆ జగన్మాతనే చూచుచు, నిరంతరమూ అమ్మ సేవకై

తపించుచు, ఈ సుప్రభాత రచన పూర్తి అయిన వార్తకు ఎంతగానో ఉప్పొంగుచు ఆవిష్కరణ

కార్యక్రమమును గంటల వ్యవధిలో ఏర్పాటు చేసి గ్రామ పెద్దల, భక్తుల సమక్షమున ఎంతో వేడుకగా పూర్తి

చేసిరి. వీరు మాపై చూపిన ఆదరణ అసాధారణమైనది. అమ్మ వీరి లక్ష్యములను పూర్తిగా తప్పక నెరవేర్చి

తీరును.

   ఇక నేను తెలుఁగులో పద్యములేదో వ్రాయుచుండెడివాడనే కాని సంస్కృతమున వ్రాయు సాహసము

పెద్దగా చేసినవాడను కాను. ఐననూ అమ్మ అనురాగము కలిగినచో ఏది మనకు సాధ్యము కాకుండా

ఉండును?  అత్తల్లియే వ్రాయించుకొన్నది.

   దృష్ఠం కిమపి లోకేస్మిన్ న నిర్దోషో న నిర్గుణః.

ఎంచనెంచినచో  దోషరహితమయినది గుణరహితమయినదీ ఏదీ ఉండదని పెద్దలు చెప్పియున్నారు.

యత్సారభూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీరమివాంబుమిశ్రమ్.

క్షీర నీర మిశ్రమమునుండి హంస క్షీరమును గ్రహించి నీరమును విడిచిపెట్టును. అదే విధముగా

సహ్ఉదయులగు పాఠకులు.ఇందలి మంచినే గ్రహింతురుగాక.

   ఆవిష్కరణ సమయమున నన్నాదరించిన అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నాను.

తాము నన్ను ప్రోత్సహించుటయే కాక తమ అమూల్యమయిన అభిప్రాయమును ప్రేమతో వ్రాసి

యిచ్చిన బ్రహ్మశ్రీ కొరిడే విశ్వనాథ శాస్త్రిగాకి,  బ్రహ్మశ్రీ ఇనగంటి ఉమారామారావు గారికి నా ధన్యవాదములు

తెలియఁజేసుకొనుచుంటిని.

   నా సహోదరుఁడు డా.లింగాల సత్యయాజ్ఞవల్క్యశర్మ ప్రేరణకు చాలా సంతోషము కలిగినది. వీనికి నా

ఆశీస్సులు అందజేయుచూ అమ్మ అనుగ్రహము వీనికి నిరంతరమూ ఉండవలెనని ఆకాంక్షించుచుంటిని.

   మన నేరేళ్ళమ్మ తల్లి యొక్క అనుగ్రహం కలిగి నిరంతరమూ గ్రామము నిత్య శోభనపరంపరలతో

నిత్యకల్యాణము పచ్చ తోరణములతో కలకాలము వర్ధిల్లవలెనని మనసారా కోరుకొనుచుంటిని.  ఈ

అవకాశము కలిగించిన శ్రీ ఎడ్లశ్రీనివాసరావు పార్వతి దంపతులకు, మాతమ్మునకు నా సంతోషమును

తెలియజేసుకొనుచుంటిని. అమ్మకు వందనములతో..  

సద్విధేయుఁడు,

చింతా రామకృష్ణారావు.

కృతి సమర్పణ. (తెలుగులో)

కొర లే దో శశిమౌళి! నాకుఁ, దలపన్  గూఢాక్ష  మే నీవుగా,

గురి నీపైన జనించె, నాథు కృపయే గూర్పించె మేల్కొ ల్పిటన్,

హరుఁడే గాంచగ విశ్వ వేద్యుఁడుగ, నే నర్పిం చెదన్ నిల్పి నీ

స్మరణన్ వందిత విశ్వసంస్తుతకృతిన్ భావించెదన్ నిన్నటన్.

భావము

శశిమౌళివయిన తల్లీ!ఆలోచించగా నాలో కనిపించకుండా ఉండెడి జ్ఞాన నేత్రమే నీవయి యుంటివి

కదా. నీపై నాకుఏకాగ్ర చిత్తము ఏర్పడినదమ్మా. లోకనాథుఁడయిన నీ పతిదేవుఁడే  సుప్రభాతమును

నాచేత వ్రాయించెను.. చూడగా పరమేశ్వరుడేకదా లోకమున తెలియఁదగినవాఁడు. నీ సంస్మరణ

చేయుఉ లోకనాథునకు నిన్ను ఊహించుకొనుచు  గౌరవిపదగినలోకముచే పొగడఁబడెడి 

సుప్రభాత కృ తిని నేను సమర్పింతును తల్లీ!



అన్నవర సమీప

గోపాలపట్టణంలో కొలువై యున్న

శ్రీ నేరేళ్ళమాంబ సుప్రభాతమ్.

రచన. చింతా రామకృష్ణారావు. హైదరాబాదు.

1. శ్రీమద్భక్తాశ్రయే ! దేవి ! పూర్వాసంధ్యా ప్రవర్తతే ,

నేరేళ్ళ దేవి! ఉత్తిష్ఠ కర్యవ్యం భక్త రక్షణమ్ .

భావము

భక్తులకు ఆశ్రయమగు శుభప్రదా! దేవీ! తూర్పు దిక్కున సంధ్యా  సమయము అగుచున్నది.

నేరేళ్ళమ్మ తల్లీ! మేల్కొనుము. భక్తులను రక్షించుట నీ కర్తవ్యమయి యున్నది.

 

2. ఉత్తిష్ఠోత్తిష్ఠ జనని ! ఉత్తిష్ఠ శుభకారిణి !

నేరేళ్ళ  భవ్య సన్నామ్ని! ఉత్తిష్ఠ మహిమాన్వితే !

భావము

లోకమాతా! లే లెమ్ము. శుభకారిణీ లెమ్ము. నేరేళ్ళమ్మ అను  గొప్ప పేరు గల తల్లీమహిమలు కల

జననీ! లెమ్ము

 

3. శ్రీ రమ్య వాక్ సుగుణధే ! శ్రితరక్షణాఢ్యే !

ధీరాది సద్గుణనిధే దినరాజకాంతే !

నేరేళ్ళ నామ  జనని ! త్వమనంత శక్తిః ,

ధారాల వాక్సువరదే ! తవ సుప్రభాతమ్ .

భావము.

మంగళప్రదమయిన వాక్కులు కలిగిన సద్గుణములకు స్థానమయిన తల్లీఆశ్రితులను రక్షించు తల్లీ!

ధైర్యము మున్నగు మంచి గుణములకు నిధివైన తల్లీసూర్యునివలె ప్రకాశించు మాతా! అంతు లేని

శక్తిమంతురాలివయిన  నేరేళ్ళమ్మ తల్లీ!మంచి మాటలాడెడి శక్తిని ప్రసాదించు తల్లీనీకు

శుభోదయము.

 

4. ప్రాతః  స్మరంతి తవ శోభన దివ్యరూపమ్ ,

ప్రాతర్భజంతి సుజనా  భవదీయ తేజః ,

ప్రాతర్నమంతి శిరసా తవ దర్శనార్థమ్ ,

ధౌతప్రభే! శుభయుతే ! తవ సుప్రభాతమ్ .

భావము.

సుజనులు ప్రాతః కాలములో నీ మంగళప్రదమగు రూపమును స్మరించుకొనుచున్నారు.

సుజనూవయిన నీ భక్తులు ప్రాతః కాలముననే నీ తేజస్సును భజించుచున్నారు. నిన్ను చూచుట

కొఱకు శిరసువంచి  నమస్కరించుచున్నారుగొప్ప ప్రకాశము కలదానా! శుభములతో 

కూడుకొనిన తల్లీ! నీకు శుభోదయము.

 

5. పౌరాణికోత్తమ నుతే ! భవబంధ నాశే !

శ్రీ రత్నశైలనుత భాసిత సన్నిధానే !

క్షీరాబ్ధిజే ! సుపరివాసిత పుణ్య రాశే !

ధారాల వాక్సుఝర దే ! తవ సుప్రభాతమ్ .

భావము.

పౌరాణికోత్తములచే ప్రశంసింపఁబడు మాతా! పుట్టుట మున్నగు  బంధములను నశింపఁజేయు

తల్లీ!ప్రశంసింపఁబడుమంగళప్రదమయిన రత్నగిరిసమీపమున ఉన్న మా తల్లీ! క్షీరాబ్ధిజా!మంచిగా 

పుణ్యప్రదేశమున వశించుచున్న తల్లీ! ధారాళమయిన మంచి వాక్ధారను ప్రసాదించు జననీనీకు

శుభోదయము.

 

6. గోపాల విశ్రుతపురీ గుణభాస యోషే !

సద్భక్తబృంద పరిసేవిత పాదపద్మే !

పాపౌఘ నాశనపటో ! పరమేశ పత్ని !

తాపోపశాంతి ఫలదే ! తవ సుప్రభాతమ్ .

భావము.

గోపాలపట్టణమున మహత్తరమయిన గుణములతో ప్రకాశించు తల్లీ! మంచి భక్తుల సమూహముచే

సేవింపఁబడు శుభప్రదమయిన పాదపద్మములు కల అమ్మా! పాపముల సమూహమును

నశింపచేయుట యందు నైపుణ్యముకల మాతా! పరమేశ్వరుని అర్థాంగివైన

జననీ!తాపమును నశింపజేయుట అనెడి చక్కని ఫలితమునిచ్చు జననీ! నీకు శుభోదయము.

 

7. శ్రేయస్కరే! భవహరే శ్రితపారిజాతే !

న్యాయస్వరూపిణి ! వరోన్నత సద్విభాసే !

జన్మాది కర్మఫల నాశ మహత్ప్రభాసే !

ధ్యేయాక్షరి ! ద్విషవినాశిని ! సుప్రభాతమ్ .

భావము.

మంచిని కలిగించు తల్లీ! భవమును హరించు జననీ! ఆశ్రిత పారిజాతమా న్యాయ స్వరూపిణీ!

శ్రేష్ఠమయిన మహౌన్నత్యమయిన మంచిచే ప్రకాశించు మా తల్లీజన్మించుట మొదలుగాగల

కర్మఫలములను నశింపఁజేయు గొప్పగా ప్రకాశము  కలదానా! ధ్యేయముతో కూడిన అక్షరస్వరూపిణీ!

వైషమ్యములు నశింపఁజేయు తల్లీ! నీకు శుభోదయము.

 

8. శ్రీభాస్కరారుణ మహద్ద్యుతి శోభితాద్రిః

త్వద్దర్శనోత్సుక విరాజిత పుష్ప నేత్రః

ద్వారేఽత్ర తిష్ఠతి వికాస ముఖారవిందే !

ఉత్తిష్ఠ లోక శుభదే ! తవ సుప్రభాతమ్ .

భావము

మంగళప్రదుడయిన సూర్యనారాయణుని అరుణ కాంతులతో గొప్పగా ప్రకాశించుచున్న 

ఉదయపర్వతము నీ దర్శనము చేసుకొన వలెననెడి కుతూహలముతో వికసించిన పుష్పములనెడి

కన్నులతో ఇక్కడ ద్వారము వద్దయున్నది.  ప్రకాశించుచున్న ముఖపద్మము కల తల్లీలోకములకు

శుభములను చేకూర్చు జననీమేలుకొనుమునీకు  శుభోదయము.

 

9. భక్తా రమా సహిత సత్య విభుం ద్రష్టుం

త్వత్ స్వాజ్జ్ఞయైవ వరమన్నవరం విశంతి ,

తద్భక్త కోటి పవరివాంఛిత సత్ప్రదే ! త్వమ్

ఉత్తిష్ఠ , లోక శుభదే ! తవ సుప్రభాతమ్ .

భావము.

భక్తులు రమాసత్యనారాయణుల దర్శనము చేసుకొనుట కొఱకునీ అనుజ్ఞార్ధము  వచ్చి అన్నవరమున

ప్రవేశించుచుండిరి, అట్టి భక్తుల మంచి కోరికలను తీర్చు  తల్లీ! నీవు మేలుకొనుము. లోకమునకు 

శుభములు చేకూర్చు తల్లీనీకు శుభోదయము.

 

10. మందార పుష్ప పరి శోభిత శుభ్ర దేశే ,

సౌందర్య పూరిత మనోజ్ఞ లతా వితానే

శ్రీమందిరే , వర ! సుపూజ్య విరాజమానే !

ఉత్తిష్ఠ దివ్య చరణే ! తవ సుప్రభాతమ్ .

భావము.

శ్రేష్టురాలా! మందారము పూవులతో గొప్పగా కళగా ఉన్న పవిత్ర ప్రదేశముననుకనులకు ఇంపు

గొలిపెడి లతానికుంజములతోనుమంగళప్రదమయి  యొప్పుచున్న మందిరమున గొప్పగా 

పూజింపఁబడుచు ప్రకాశించుచున్న తల్లీమహత్తరమయిన పాదపద్మములు కల జననీ

లెమ్మునీకు శుభోదయము.

 

11. దేదీప్యమాన భవదీయ ముఖారవిందం

నేత్రోత్సవం భవతి దర్శన భాగ్యమాత్రాత్ ,

తద్భాగ్య దే ! సుఫలదే ! వరదాంబ ! దేవి !

ఉత్తిష్ఠ ! సన్నుత శివే ! తవ సుప్రభాతమ్ .

భావము

మిక్కిలి ప్రకాశవంతమయిన నీ ముఖ పద్మముచూచు వారికి చూచినంత మాత్రమున  కనులకు

ఆనందము కలుగు చున్నదిఅట్టి భాగ్యమునొసంగు తల్లీ! సత్ ఫలితములనే యొసంగు జననీ!  

వరముల నొసంగు తల్లీ జననీలెమ్ము. ప్రశంసింపఁ బడిన మంగళ దేవతా! నీకు శుభోదయము.

 

12. యడ్లాన్వయో వినుత సద్గుణః శ్రీనివాసః

భార్యాయుతః సుగుణ నిర్జిత శత్రుషట్కః ,

త్వత్సేవనాయ నను తిష్టతి లోక మాతః !

ఉత్తిష్ఠ భక్త వరదాయిని ! సుప్రభాతమ్ .

భావము.

లోకమాతా! తనకు గల సుగుణములచే అరిషడ్వర్గమును జయించిన  వాఁడుఎడ్లవారి

కుటుంబమునకు చెందిన ప్రశంసింపఁబడు శ్రీనివాస అనే పేరు కలవాడు  తన భార్యా సమేతుఁడయి నీ

సేవ చేయుట కొఱకు వేచియుండెను భక్తవరదాయినివయిన తల్లీ! లెమ్ము. నీకు శుభోదయము.

 

13. సత్కావ్య కల్పన చణా భవదీయ తత్త్వమ్

జ్ఞాత్వాఽపి యోగ్యరహితాః ఖలు వర్ణనాయ

త్వ త్సేవనా త్పరమ శక్తి మవాప్నువంతి ,

శ్రేయఃప్రదే ! విజయదే ! తవ సుప్రభాతమ్ .

భావము.

మంచి కావ్యములు విరచించుటయందు నిపుణులైనవారు సహితము నీ యొక్క తత్త్వమును

తెలినవారైనప్పటికీ నిన్ను వర్ణించుటకు చాలరయిరి.  నీ యొక్క సేవ చేసుకొనుటవలన

అద్భుతమయిన శక్తిని పొందఁ గలుగుదురుశ్రేయస్సును కలిగించు తల్లీ! విజయములిచ్చెడి 

అమ్మా! నీకు శుభోదయము.

 

14. యడ్లాన్వ యోజ్వలిత సన్నుత భాగ్య రాశే !

పూర్వోదయాద్రిజ విశేష మహారుణాంకః

త్వత్పాద దర్శన కుతూహల రశ్మి భానుః  

ద్వారే ೭త్ర తిష్ఠతి, శివే ! తవ సుప్రభాతమ్ .

భావము.

ఎడ్ల వంశమున ప్రభవించిన తల్లీ! ప్రకాశించెడి పొగడ బడెడి సర్వసౌభాగ్య రాశివయిన జననీ!

తూరుపు కొండపై ఉదయించిన, ప్రత్యేకత కలిగిన అరుణ వర్ణముతో భానుడు నీ పాద దర్శన

కుతూహలుఁడై వెలుగుచుండి ఇక్కడ నీ గుడి ముఖద్వారమున చూచుచు నిలుచి యుండెను.

పరమేశ్వరీనీకు శుభోదయము.

ప్రపత్తిః

15. పాపాపహార వర నామ సుధా స్రవంతౌ !

జ్ఞానప్రభాంచిత దృగంచల చంద్రికాభౌ

గోపాల పట్టణ మహద్ద్యుతి మూల శక్తౌ !

నేరేళ్ళమాతృ చరణౌ శరణం ప్రపద్యే .

భావము.

పాపములను హరించెడి శ్రేష్టమయిన నామ సుధా ప్రవాహ మయినదియుజ్ఞానమును ప్రసాదించెడి

ఒప్పిదమయిన కడగంటి చూపులనెడి మంగళప్రదమయిన వెన్నెల కలదియు, గోపాలపట్టణము

యొక్క ప్రసిద్ధికి మూలశక్తియు అయిన నేరెళ్ళమాంబ పాదములను శరణుజొచ్చెదను.

 

16. దీనావ నాభినుత సుందర దివ్య హస్తౌ !

మానాభిమాని పరిరక్షణ చిత్త భాసౌ !

సద్భక్తమండల సుపూజిత పాదయుగ్మౌ !

నేరేళ్ళమాతృ చరణౌ శరణం ప్రపద్యే .

భావము.

దీనులను కాపాడుట యందు పొగడఁ బడెడి దివ్యమయిన చేతులు కలదిమానాభిమానములను

పరిరక్షించు మనసుతో ప్రకాశించునది, మంచి భక్తుల సమూహముచే బాగుగా పూజింపఁ బడుచున్న

పాదపద్మద్వయము కలది,  అయిన నేరెళ్ళమాంబ యొక్క పాదములను శరణు జొచ్చెదను.

 

17. శ్రీతాండవాభిధ నదీజల నిత్య సేవ్యౌ !

నిత్యోజ్జ్వల ఛ్ఛివద దేహలతే మదంబ !

చంద్రాగ్ని సూర్య యుత సన్నుత నేత్ర భాసౌ !

నేరేళ్ళమాతృ చరణౌ శరణం ప్రపద్యే .

భావము

శుభప్రదమయిన తాండవ నదీ జలములతో నిత్యమూసేవింపబడునట్టిదియు,నిత్యమూ మిక్కిలి

ప్రకాశించుచుండెడి మంచిని కలిగించునట్టిదియు,కోమలమయిన శరీరము కలదియు, చంద్రుఁడు

అగ్నియు సూర్యుఁడు కలిగిన మూడు కన్నులతో ప్రకాశించునదియునా తల్లియు అయిన  నేరెళ్ళాంబ

పాదములను శరణు జొచ్చెదను.

 

18. ఆజన్మ దుఃఖ పరి పీడిత మానవాలిః ,

త్వత్పాద కల్ప విటపం  శరణం ప్రపన్నాః ,

మద్దుఃఖ హారిణి ! లసద్ద్యుమణే ! శుభౌ తౌ

నేరేళ్ళ మాతృ చరణౌ శరణం ప్రపద్యే .

భావము.

జన్మించినది మొదలు (సాంసారిక) దుఃఖముచే మిక్కిలిపీడించబడుచున్న మానవ సమూహము నీ

పాదములు అనెడు కల్పవృక్షమును శరణు పొందుతున్నారు. నా దుఃఖము లను హరింపఁ జేసెడి

దేవీప్రకాశించే సూర్య కాంతి వంటిదానాశుభంకరీ! నేరెళ్ళమాతృ మూర్తి వైన నీ పాదములను 

శరణు పొందుతున్నాను.

 

19. శ్రీసత్యదేవ చరణాశ్రిత భక్తవర్యాః

త్వత్పాద దర్శన ఫలేన గుణాన్ లభన్తే .

భద్రాకృతే ! శుభ నిధే ! విజయప్రదే ! తౌ

నేరేళ్ళ మాతృ చరణౌ శరణం ప్రపద్యే .

భావము.

లక్ష్మీ సమేయుఁడగు సత్యదేవుని పాదముల నాశ్రయించు భక్తుల సమూహము నీ పాద దర్శన ఫలముచే

శౌర్యాది గుణములను పొందుచుండిరిభద్రాకారము కల తల్లీ శుభ నిధానమా! జయముల నొసఁగు

జననీనేరెళ్ళమ్మా! నీ పాదములను శరణు పొందుచుంటిని.

 

20. యద్యత్త్వనంత శుభకర్మసు బద్ధచిత్తాః

తత్తత్ సుకర్మ ఫలాని త్వదీప్సితాని .

త్వద్వీక్షణేన  నిరపేక్ష్య శుభాని యాంతి .

నేరేళ్ళ మాతృ చరణౌ శరణం ప్రపద్యే .

భావము.

ఏయే అనంతమయిన శుభప్రదమయిన కర్మలయందు బద్ధమైనచిత్తము కలవారు ఆయా మంచి కర్మల

వలన కలిగెడి ఫలములు నీవు కోరుకొనినవే, నీ చూపుల చేతనే అపేక్షింప కుండగనే  శుభములు కలుగు

చున్నవి నేరేళ్ళమ్మ తల్లి యొక్క పాదములనే శరణుపొందుచుంటిని.

 

స్తోత్రః

21. సకలాగమశాస్త్ర నిధే ! జనని !

నిగమాంత సువేద్య ప్రశస్త రమే !

సుగుణాకర భక్తచయే ! వరదే !

విజయా భవ సన్నుత మాతృవరే.

భావము

సమస్తమయినటువంటి వేద శాస్త్రములకు మూలమైనదానా! ఓతల్లీ!వేదాంత సారముగా తెలియఁ బడు

ప్రశస్తమయిన లక్ష్మీ స్వరూపిణీమంచిగుణములకు స్థానమయిన భక్తుల సమూహము కలిగిన తల్లీ

వర ప్రదాయినీ!ప్రశంసింపఁబడు జ్ఞానపూర్ణవయిన అమ్మా! నీకు విజయమగుగాక.

 

22. కలికాలజ కల్మష నాశ మతే !

ప్రళయాంతక దుష్ట వినాశ చణే !

శ్రుతి ధర్మ సుపాలన దక్షమతే !

విజయా భవ శ్రీకర మాతృ సుధే !

భావము.

కలికాలమున సంభవించెడి కల్మషములను నశింపఁ జేయు గొప్ప మనసు ఉన్న అమ్మా!

ప్రళయాంతకులయిన దుర్మార్గులను నశింపఁ జేయుటయందు నిపుణురాలివయిన  లోక మాతా! వేద

ధర్మ పరిపాలనమున దక్షతనొప్పెడి హృదయముకలిగిన జననీ! శుభప్రదవయిన జ్ఞాన పూర్ణవయిన 

మాత్రుమూర్తీనీకు విజయము కలుగు గాక.

 

23. పరమాద్భుత సత్కవితారసదే ,

వరణీయ మహోన్నత భావసుధే !

పరికల్పిత సఛ్ఛుభ కార్య నిధే !

విజయా భవ శోభిత మాతృ సుధే !

భావము.

గొప్ప అద్భుతమయినమంచికవితారసమును ఉప్పొంగించు తల్లీప్రశంసింపఁ దగిన

మహోన్నతమయిన భావామృతమూర్తీ! సృష్టింపఁ బడిన మంచి శుభప్రదమయిన పనులకు

స్థానమయిన అమ్మా! ప్రకాశించెడి జ్ఞాన పూర్ణవయిన మాతా! నీకు విజయమగు గాక.

 

24. విజయాశ్రయ సౌమ్య ముఖాంబురుహే ,

వరదే! శుభ నామ మదంబ! సుధే !

జలజాత జిదక్షి ! సుగణ్య మతే !

విజయాభవ శాంకరి ! భక్త నుతే .

భావము.

విజయములకు ఆశ్రయమయిన సౌమ్యముగా నొప్పియున్న ముఖపద్మము కలదానా! వర ప్రదాయిని

వయిన తల్లీ! శుభనామముతో నొప్పెడి నా సుధాంబుధి వయిన జననీ! పద్మముల వంటి కన్నులు

గల జననీ! ప్రశంసింపఁబడు  హృదయమున్న మాతా! భక్తులచే పొగడఁబడు నేరేళ్ళమ్మ తల్లీ!

శాంకరీ! నీకు విజయమగుగాక.

 

25. నిరతాక్షయ సద్వరదే  వినుతే

ప్రవరార్చనతత్పర భక్తతతే !

పరమామృత సత్కవనాభినుతే ,

విజయాభవ  రక్షణశీలవతి!

భావము.

నిరంతరము అంతు లేని మంచి వరములను ప్రసాదించు జననీప్రశంసింపఁబడు తల్లీ! సద్గుణములు

గల మంచి భక్తులచే మంచిగా సేవింపఁ బడు అమ్మా! గొప్ప అమృతోపమాన మయిన కవిత్వమునందు 

ప్రశంసింపబడు జననీ! రక్షించెడి స్వభావము కలిగిన నేరెళ్ళాంబానీకు జయమగుగాక.

మంగళాశాసనమ్.

26. ఓంకార పూర్ణ రూపాయై 

సృష్టి నిర్మాణ హేతవే

నేరేళ్ళమాతృ రూపిణ్యై

ముక్తిదాయై సుమంగళమ్ .

భావము.

ఓంకార పూర్ణ రూపమయినదియు, సృష్టి నిర్మాణమునకు కారణమయినదియునేరేళ్ళ అను పేరుతో

ప్రకాశించు జననికి, ముక్తిప్రద అయిన తల్లికి మంగళ మగుగాక.

 

27. చిన్ మయానంద రూపాయై చింతితార్థద తేజసే ,

తాపోపశాంతయే , దేవ్యై , యడ్లజాయై సుమంగళమ్ .

భావము.

చిన్మయానంద రూపిణికి, భావించిన దానిని ప్రసాదించు తేజస్సు గలిగిన తల్లికి, తాపమును హరించు

జననికి, గొప్పదైన అమ్మకు, ఎడ్లవంశసంజాతకు శుభమంగళము.

 

28. రాగద్వేష గుణాతీతే , రమ్య సద్గుణ శోభితే ,

త్స రాది ద్విషణ్ణాశే ! మంగళాయై సుమంగళమ్ .

భావము.

అనురాగ ద్వేషములకు అతీతమయిన తల్లికి, మనోహరమయిన మంచి గుణములతో ప్రకాశించు

జననికి, మత్సరాది దుర్గుణముల కతీతమయిన మాతృమూర్తికి మంగళాంగి అయిన నేరేళ్ళమ్మతల్లికి

మంచి మంగళములగు గాక.

 

29. కృష్ణాలకప్రకాశిన్యై , కృపా సాగర మూర్తయే ,

రావోద్భూత మహోంకారే ! తుభ్యం మాత్రే సుమంగళమ్ .

భావము.

నల్లని అద్భుతమయిన శిరోజములు కల అమ్మకు,కృపాసముద్రమే స్వరూపమా అన్నట్లు ఉండు

అమ్మకు, శబ్దము నందు ఉద్భాసించు గొప్ప ఓంకార స్వరూపిణికిఎడ్లవంశజ అయిన

నేరేళ్ళమాంబకు మంచిగా మంగళమగుగాక.

 

30. సన్నుతాంఘ్రి ద్వయే ! తుభ్యం, శ్రీమద్భక్త సమన్వితే ,

నిత్య పూజ్యే ! నిర్వికారే ! లోకమాతః ! సుమంగళమ్ .

భావము.

ప్రశంసార్హమయినపాద ద్వయము కలిగిన నీకు, శుభప్రదులయిన భక్తులతోకూడుకొనిన నీకు,నిత్య

పూజ్యవు, నిర్వికారవు అయిన నీకులోకజననివయిన నీకు మంగళమగుగాక.

 

31. ప్రసన్నే పంచకోశస్థే ! ప్రఖ్యాత శుభ లక్షణే ,

యోగినామాత్మ వర్తిన్యై భక్తిదే ! తేఽస్తు మంగళమ్ .

భావము,

ప్రసన్న స్వరూపిణి, పంచ కోశస్థ, ప్రఖ్యాత శుభలక్షణ, అయి, యోగుల ఆత్మలందు  సంచరించుచు

భక్తిని ప్రసాదించు నేరేళ్ళమ్మకు మంగళము.

 

32. శ్రీమన్మంగళ రూపాయై , గోపపత్తన సంస్థితే

భక్తానన విభా‌సిన్యై ఏడ్లజాయై సుమంగళమ్ .

భావము

మంగళప్రదమయిన మంచి రూపము గల తల్లికి, గోపాలపట్టణమున ఉండు జననికి, భక్తుల

ముఖములలో ప్రకాశించునట్టి అమ్మకు, ఎడ్లవంశ సంభవ అయిన నేరేళ్ళమ్మ తల్లికి మంగళమగు గాక.

 

33. రామకృష్ణ ప్రపూజ్యాయై , శోభనాక్షర భాసి తే,

దివ్య నేరేళ సన్మాత్రే  మంగళం నిత్యమంగళమ్ .

భావము.

రామకృష్ణచేత బాగుగా పూజింపఁబడు తల్లికి, మంగళప్రదమయిన అక్షరములతో శోభిల్లునటువంటి,

దివ్యమయిన నేరేళ్ళమ్మతల్లికిమంగళమునిత్యమూ మంగళము అగు గాక.

ఫలశ్రుతి.

34.  చింతా వంశజ రామకృష్ణ కవితాం , నేరేళ్ళ దేవీ ప్రభాం ,

యః ప్రాతస్సమయే సదా నను పఠే న్నేరేళ్ళమాతృ కృపామ్

సత్యం ప్రాప్య సుఖం విందతి సదా , నేరేళ్ళమాతుః స్తవాత్

తద్భక్తోజ్జ్వల కారకోఽస్తు వరద శ్శ్రీ సత్య నారాయణః .

భావము.

చింతావారి యింట జన్మించిన రామకృష్ణారావు యొక్క కవిత్వమయిన సుప్రభాత రూపముననున్న శ్రీ

నేరెళ్ళమ్మపేరుగల యీ దేవీ ప్రభను నిత్యమూ ప్రాతః కాల సమయమున ఎవరు పఠించుచుందురో

వారు నేరెళ్ళమాంబ కృపకు పాత్రులై

నిత్యమూసుఖాస్పదులగుదురునేరెళ్ళాంబ సంసేవనా ఫలముగా అట్టి భక్తుల ఔన్నత్యమునకు 

శ్రీ సత్యనారాయణ స్వామివారు  కారణ మగుదురు.

స్వస్తి.