గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, జూన్ 2020, శనివారం

జైశ్రీరామ్.
మత్తరజినీద్వయ,సమానీ,రజోరజ,మింటినంటు ద్వయ,రజినీకర ప్రియ,జ్ఞాపికా,గర్భ"-శంఖారావ"-వృత్తము.రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
                           
"-శంఖారావ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.య.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ధర్మ గ్లాని సంభవించెనా?త్రాత సృష్టి ఛేదనమా?తాళ లేని నీతి దోషమా!
కర్మ రోగ మంత రింపదా?ఘాతి నింపు ధోరణియా?కాళమౌ!కరోన కాటుయా?
మర్మరీకు లెంచు చర్యలా!మాత కీర్తి నాస్తి యనన్!మౌళికాలు గూర్చు లోపమా?
వర్మణీయ జాత్యహంబొకో?వాత రోగ మార్భటియా!ఫాలననేత్ర చూడ వేమయా?
                                       .                                        
మర్మరీకులు=దుర్మార్గులు,వర్మణీయ=కవచము,
భావము:- ప్రస్తుతము విజృంభించి మానవాళిని లక్షల సంఖ్యలో పొట్టను
పెట్టు కొనుచున్న కరోన మారి నవలోకించి చూడగా!
ధర్మమునకు గ్లాని యేర్పడెనా?బ్రహ్మ సృష్టి రహస్యాన్వేషణ ఫలితమా!
కలిని నిలువజాలని నీతి తప్పిదమా!చేయుకర్మలు చెడు ఫలిత సారమా!
పరార్థ మెంచని పొట్ట నింపుడు ధోరణియా!విష నాగు వంటి కరోనా కాటు
నైజమా!దుర్మార్గపు చైదముల భూమాత కీర్తిని కించ పరచు వారి చర్యలా!
మౌళిక వనరులు సమ కూర్చుటలో తారతమ్య భావమా!జాతి మత నామక
కవచ నిర్మిత యహం భావమా!గాలి రూపమున శరీరమును ప్రవేశించి
గొప్పను చాటుకొను కరోనా లక్షణమా!నుదుటి భాగమున వహ్ని నేత్రము
గల పరమేశ్వరా!జగత్పితా!మానవ లోకము వైపు చూడ వెందులకు?
చెడును భస్మమీపటలము గావించి!మమ్ములను చల్లగా కాపాడుము.

1.గర్భగత"-మత్తరజినీద్వయ"-వృత్తములు.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
1.ధర్మ గ్లాని సంభవించెనా?                2.తాళ లేని!నీతి దోషమా?
   కర్మ రోగ మంతరింపదా?                    కాళమౌ!కరోన కాటుయా?
  మర్మరీకు లెంచు చర్యలా!                   మౌళికాలు గూర్చు లోపమా!
వర్మణీయ జాత్యహంబొకో?                 ఫాలనేత్ర చూడ వేమయా?
2.గర్భగత"-సమానీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.లగ.గణములు.వృ.సం.107.
ప్రాసనియమము కలదు.
త్రాత సృష్టి ఛేదనమా?
ఘాతి నింపు ధోరణియా?
మాత కీర్తి నాస్తి యనన్?
వాత రోగ మార్భటియా?
3.గర్భగత"-రజోరజ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.జ.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ధర్మ గ్లాని సంభవించెనా?త్రాత సృష్టి ఛేదనమా?
కర్మ రోగ మంత రింపదా?ఘాతి నింపు ధోరణియా?
మర్మరీకు లెంచు చర్యలా!మాత కీర్తి నాస్తి యనన్?
వర్మణీయ జాత్యహంబొకో?వాత రోగ మార్భటియా?
4.గర్భగత"-మింటినంటు ద్వయ"-వృత్తములు.
అత్యష్టీఛందము.ర.జ.య.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.త్రాత సృష్టీ ఛేదనమా?తాళ లేని నీతి దోషమా?
   ఘాతి నింపు ధోరణియా?కాళమౌ!కరోన కాటుయా?
  మాత కీర్తి నాస్తి యనన్?మౌళికాలు గూర్చు లోపమా?
  వాత రోగ మార్భటియా?ఫాలనేత్ర చూడ వేమయా?
2.త్రాత సృష్టి ఛేదనమా?ధర్మ గ్లాని సంభవించెనా?
   ఘాతి నింపు ధోరణియా?  కర్మ రోగ మంతరింపదా?
  మాత కీర్తి నాస్తి యనన్?మర్మరీకు లెంచు చర్యలా?
  వాత రోగ మార్భటియా? వర్మణీయ జాత్యహంబొకో?
5.గర్భగత"-మర్మరీక"-ద్వయ వృత్తములు.
ఉత్కృతిఛందము.ర.జ.య.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.
త్రాత సృష్టి ఛేదనమా?తాళ లేని నీతి దోషమా?ధర్మ గ్లాని సంభవించెనా?
ఘాతి నింపు ధోరణియా?కాళమౌ!కరోన కాటుయా?కర్మ రోగ మంతరింపదా?
మాత కీర్తి నాస్తి యనన్?మౌళికాలు గూర్చు లోపమా?మర్మ రీకు లెంచు చర్యలా
వాత రోగ మార్భటియా?ఫాల నేత్ర చూడ వేమయా?వర్మణీయ జాత్య  హంబొకో?
2.
త్రాత సృష్టి ఛేదనమా?ధర్మ గ్లాని సంభవించెనా?తాళలేని!నీతి దోషమా?
ఘాతినింపు ధోరణియా?కర్మ రోగ మంతరింపదా?కాళమౌ!కరోన కాటుయా?
మాత కీర్తి నాస్తి యనన్?మర్మరీకు లెంచు చర్యలా?మౌళికాలు గూర్చు లోపమా?
వాతరోగ మార్భటియా?వర్మణీయ జాత్యహంబొకో?ఫాల నేత్ర చూడ వేమయా?
6.గర్భగత"-రజినీకర ప్రియ వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తాళ లేని నీతి దోషమా?ధర్మ గ్లాని సంభవించెనా?
కాళమౌ!కరోన కాటుయా?కర్మ రోగ మంతరింపదా?
మౌళికాలు గూర్చు లోపమా?మర్మరీకు లెంచు చర్యలా?
ఫాల నేత్ర చూడ వేమయా?వర్మణీయ జాత్యహంబొకో?
7.గర్భగత"-జ్ఞాపికా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.ర.జ.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తాళ లేని నీతి దోషమా?ధర్మ గ్లాని సంభవించెనా?త్రాత సృష్టిఛేదనమా?
కాళమౌ!కరోన కాటుయా?కర్మరోగ మంతరింపదా?ఘాతినింపు ధోరణియా?
మౌళికాలు గూర్చు లోపమా?మర్మరీకు లెంచు చర్యలా?మాత కీర్తి నాస్తియనన్?
ఫాల నేత్ర చూడ వేమయా?వర్మణీయ జాత్యహంబొకో?వాత రోగ   మార్భటియా?                                      
 స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
                     

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.