గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, జూన్ 2020, శుక్రవారం

"-శ్రీ లలితా చంద్ర మౌళీశ్వర"-శతక కర్తకు అభినందన మందారము....రచన...శ్రీవల్లభ

జైశ్రీరామ్.
బ్రహ్మశ్రీ,చింతా రామ కృష్ణ రావు గారు రచించిన"-శ్రీ లలితా చంద్ర మౌళీశ్వర"-శతకము నామూలాగ్రము పఠించి,సమర్పించు,సాదరాభిమాన. పూర్వక గర్భ కవితామందారము.ర
చన:-వల్లభవవఝ అప్పల నరసింహ మూర్తి.  జుత్తాడ.

        అభినందన మందారము.
       
మత్త రజినీ ద్వయ,ముకుంద,రసారవింద,ఉల్లాసినీ ద్వయ,రారయా!ద్వయ,!రజినీకర ప్రియ,కర్మణీగర్భ"-అనంత"- వృత్తము.

"-అనంత"-వృత్తము.
(ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.)
సా రసా!రసార విందమా!సౌరుచుల్!చంద్ర మౌళనన్!సారి సారి గొల్తు లెల్లరున్!
పారమార్ధ మెంచి కూర్చితే!పౌరులం దీర్చి ముక్తినిన్!పారద్రోల దుష్కృతం బులున్!
తారకుండవైతి!సత్కవీ!ధారలన్,శయ్య,పాకతన్!దారి జూపు ధార్మి కత్వతన్!
మేర లేని సాగరున్బలెన్?మీర రెవ్వారు మీ కనన్?మీరు మీరె!కాచు    సాంబుడున్!
                                                                     

-------------పైకృతికర్త విరచిత శతక"-మామూలాగ్రము,మంచిశయ్యతో,
కదళీ పాకముతో,మంచిధారా యుతమై,మేరలేని సాగరమున్బలెన్=
అంతులేని సాగరమువలె,అపార పారావారమనునట్లుగా,మీరరెవ్వారు
మీకనన్=మిమ్ము నతిశయించువారు లే రనునట్ల,మీరు మీరె=మీకుసాటి
మీరే!వేరొకరు కారు.సౌ రుచుల్=మంచి కాంతులు----------
             ===================

1.గర్భగత"-మత్తరజినీ ద్వయ వృత్తములు.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
1.సా రసా రసారవిందమా!                   2.సారి సారి గొల్తు లెల్లరున్!
  పారమార్ధ చింత గూర్చితే!                      పారద్రోల దుష్కృతంబులున్!
  తారకుండ వైతి సత్కవీ!                        దారి జూపు ధార్మి కత్వతన్!
మేర లేని సాగరున్బలెన్?                       మీరు మీరె?కాచు సాంబుడున్!

2.గర్భగత"-ముకుంద"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.ర.లగ.గణములు.వృ.సం.83.
ప్రాసనియమము కలదు.
సౌరుచుల్!చంద్ర మౌళనన్!
పౌరులం దీర్చి ముక్తినిన్!
ధారలన్,శయ్య,పాకతన్!
మీర రెవ్వారు?మీకనన్!

3.గర్భగత"-రసారవింద"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సా రసా రసార విందమా!సౌ రుచుల్!చంద్ర మౌళనన్?
పారమార్ధ చింత గూర్చితే?పౌరులం దీర్చి ముక్తినిన్!
తారకుండ వైతి!సత్కవీ!ధారలన్,శయ్య ,పాకతన్!
మేర లేని సాగరున్బలెన్?మీర రెవ్వారు?మీకనన్!

4.గర్భగత"-ఉల్లాసినీ ద్వయ"-వృత్తములు.
అత్యష్టీఛందము.ర.ర.య.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.సౌ రుచుల్!చంద్ర మౌళనన్?సారి సారి గొల్తు లెల్లరున్!
   పౌరులం దీర్చి ముక్తినిన్!పారద్రోల దుష్కృతంబులున్!
   ధారలన్,శయ్య పాకతన్!దారి జూపు ధార్మి కత్వతన్!
   మీర రెవ్వారు?మీకనన్!మీరు మీరె!కాచు సాంబుడున్!

2.సౌ రుచుల్!చంద్ర మౌళనన్.సారసా రసార విందమా!
   పౌరులం దీర్చి ముక్తినిన్!పారమార్ధ చింత కూర్చితే!
   ధారలన్,శయ్య ,పాకతన్!తారకుండ వైతి!సత్కవీ!
   మీర రెవ్వారు?మీకనన్!మేర లేని!సాగరున్బలెన్?

5.గర్భగత"-రా రయా"ద్వయ వృత్తములు.
ఉత్కృతి ఛందము.ర.ర.య.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సౌరుచుల్ చంద్ర మౌళనన్?సారి సారి గొల్తు రెల్లరున్!సారసా రసార   విందమా!
పౌరులం దీర్చి ముక్తినిన్!పార ద్రోల దుష్కృతంబులున్!పారమార్ధ చింత గూర్చితే?
ధారలన్!శయ్య పాకతన్!దారి జూపు ధార్మి కత్వతన్!తారకుండ వైతి!సత్కవీ!
మీర రెవ్వారు?మీకికన్!మీరు మీరె! కాచు సాంబుడున్!మేర లేని!సాగరున్బలెన్?
                                                                 
2.
సౌరుచుల్!చంద్ర మౌళనన్?సారసా రసార విందమాాసారి సారి గొల్తు  రెల్లరున్!
పౌరులం దీర్చి ముక్తినిన్!పారమార్ధ చింత గూర్చితే?పార ద్రోల దుష్కృ తంబులున్!
ధారలన్,శయ్య పాకతన్!తారకుండ వైతి!సత్కవీ!దారి జూపు ధార్మి  కత్వతన్?        
మీర రెవ్వారు?మీ కనన్!మేర లేని సాగరున్బలెన్?మీరు మీరె!కాచు సాంబుడున్!
                                                               
6.గర్భగత"-రజినీకర ప్రియ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సారి సారి గొల్తు రెల్లరున్!సారసా రసార విందమా!
పారమార్ధ చింత గూర్చితే?పార ద్రోల దుష్కృతంబులున్!
దారి జూపు ధార్మి కత్వతన్?తారకుండ వైతి!సత్కవీ!
మీరు మీరె!కాచు సాంబుడున్!మేర లేని సాగరుంబలెన్?

7.గర్భగత"-కర్మణీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.ర.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సారి సారి గొల్తు రెల్లరున్!సారసా రసార విందమా!సౌరుచుల్!చంద్ర  మౌళనన్?                          
పారమార్ధ చింత గూర్చితే?పార ద్రోల దుష్కృతంబులున్?పౌరులం దీర్చి  ముక్తినిన్!            
దారి జూపు ధార్మి కత్వతన్?తారకుండ వైతి!సత్కవీ!ధారలన్,శయ్య పాక తన్!
మీరు మీరె!కాచు సాంబుడున్!మేర లేని సాగరు న్బలెన్?మీర రెవ్వారు?మీకనన్!
స్వస్తి                                          
విద్వజ్జన విధేయుడు.
వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.విశ్రాంతోపాధ్యాయుడు. చోడవరము(మం).విశాఖ పట్టణము (జి),
ఆంధ్ర ప్రదేశ్.
తేదీ:-8-6-2020.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.