గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, జూన్ 2020, బుధవారం

వినయశా,శమా,భాసుథీ,నుతిగను,గనునుతి,చతురిమా,స్తుతిదము,మతి నుతి,మెతక,ప్రకాశికా,గర్భ"-మితమతి"-వృత్తమురచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

జైశ్రీరామ్.
వినయశా,శమా,భాసుథీ,నుతిగను,గనునుతి,చతురిమా,స్తుతిదము,మతి నుతి,మెతక,ప్రకాశికా,గర్భ"-మితమతి"-వృత్తమురచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
                         
"- మితమతి"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.స.న.న.న.న.జ.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మిత మతి నుతి గనుమా!మెతకగ బ్రతుకకు!మెరియుమి!ప్రకాశమునన్!
చతురిమ గను జగతిన్!జత గురు నుత మవ!సరళత మెలంగ వలెన్!
కతిపయ దినములలోన్!గతి సుగమ మగును!కరమరుదు నౌ!చరితన్!
స్తుతి వరదము లలరున్!స్తుత మతి వగుదువు!సురవరులు మేలొసగన్!
1.గర్భగత"-వినయశా"-వృత్తము.
బృహతీఛందము.న.న.స.గణములు.వృ.సం.256.
ప్రాసనియమము కలదు.
మితమతి నుతి గనుమా!
చతురిమ గను జగతిన్!
కతిపయ దినములలోన్!
స్తుతి వరదము లలరున్!
2.గర్భగత"-శమా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.న.లగ.గణములు.వృ.సం.128.
ప్రాసనియమభు కలదు.
మెతకగ బ్రతుకకు!
జత గురునుత మవ!
గతి సుగమ మగును!
స్తుత మతి వగుదువు!
3.గర్భగత"-భానుథీ"-వృత్తము.
బృహతీఛందము.భ.స.స.గణములు.వృ.సం.223.
ప్రాసనియమము కలదు.
మెరియుమి!ప్రకాశమునన్!
సరళత మెలంగవలెన్!
కరమరుదు నౌ చరితన్!
సురవరులు మేలొసగన్!
4.గర్భగత"-నుతిగను"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.స.న.న.లల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మితమతి నుతి గనుమా!మెతకగ బ్రతుకకు!
చతురిమ గను జగతిన్!జత గురు నుత మవ!
కతిపయ దినముల లోన్!గతి సుగమ మగును!
స్తుతి వరదము లలరున్!స్తుత మతి వగుదువు!
5.గర్భగత"గనునుతి"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.స.న.జ.లగ.గణములు.యతి9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మెతకగ బ్రతుకకు!మెరియుమి ప్రకాశమునన్!
జత గురు నుత మవ!సరళత మెలంగ వలెన్!
గతి సుగమ మగును!కరమరుదునౌ!చరితన్!
స్తుతమతి వగుదువు!సురవరులు మేలొసగన్!
6.గర్భగత"-చతురిమా"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.స.న.జ.న.న.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మెతకగ బ్రతుకకు!మెరియుమి ప్రకాశమునన్!మితమతి నుతి గనుమా!
జత గురు నుత మవ!సరళత మెలంగ వలెన్!చతురిమ గను జగతిన్!
గతి సుగమ మగును!కరమరుదునౌ చరితన్!కతిపయ దినములలోన్!
స్తుతమతి వగుదువు!సురవరులు మేలొసగన్!స్తుతి వరదము లలరున్!
7.గర్భగత"-స్తుతిద"-వృత్తము.
ధృతిఛందము.భ.స.స.న.న.స.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము గలదు.వృ.సం.
మెరియుమి ప్రకాశమునన్!మితమతి నుతి గనుమా!
సరళత మెలంగ వలెన్!చతురిమ గను జగతిన్!
కర మరుదునౌ చరితన్!కతిపయ దినములలోన్!
సురవరులు మేలొసగన్!స్తుతి వరదము లలరున్!
8.గర్భగత"-మతినుతి "-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.స.న.న.స.న.న.లల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మెరియుమి ప్రకాశమునన్!మితమతి నుతిగనుమా!మెతగక బ్రతుకకు!
సరళత మెలంగ వలెన్!చతురిమ గను జగతిన్!జత గురు నుత మవ!
కర మరుదునౌ  చరితన్!కతిపయ దినములలోన్!గతి సుగమమగును!
సురవరులు మేలొసగన్!స్తుతి వరదము లలరున్!స్తుతమతి వగుదువు!
9.గర్భగత"-మెతక"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.న.న.న.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మెతకగ బ్రతుకకు!మితమతి నుతి గనుమా!
జత గురు నుత మవ!చతురిమ గను జగతిన్!
గతి సుగమముగును!కతిపయ దినములలోన్!
స్తుత మతి వగుదువు!స్తుతి వరదము లలరున్!
10,గర్భగత"-ప్రకాశిక"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.న.న.న.య.న.జ.లగ.గణములు.యతులు9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మెతకగ బ్రతుకకు!మితమతి నుతి గనుమా!మెరియుమి ప్రకాశమునన్!
జత గురునుత మవ!చతురిమ గను జగతిన్!సరళత మెలంగ వలెన్!
గతి సుగమ మగును!కతిపయ దినములలోన్!కరమరుదునౌ!చరితన్!
స్తుత మతి వగుదువు!స్తుతి వరదము లలరున్!సురవరులు మేలొసగన్!
 స్వస్తి
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.