గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, జూన్ 2020, ఆదివారం

ప్రాచీన,తరంగ,మత్తరజినీ,జంఝాజ,సజావు,ప్రయోగినీ,పసందు,విథివ్రాలు,జంభారీ,తజ్జభా,గర్భ"-శ్రవంతీ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

 జైశ్రీరామ్.
ప్రాచీన,తరంగ,మత్తరజినీ,జంఝాజ,సజావు,ప్రయోగినీ,పసందు,విథివ్రాలు,జంభారీ,తజ్జభా,గర్భ"-శ్రవంతీ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                       
"-శ్రవంతీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.జ.ర.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పసందైన నూత్న ఛందముల్!ప్రయోగింప నిచ్ఛ లేదు!పాత బాణి వీడరేలనో?
రసాస్వాదనంబు లేదిలన్!రయంబే!మనోహరంబు!వ్రాతమార్ప!బ్రహ్మశక్యమే!
ప్రశాంతంబు లేదు భూతలిన్!వయో గౌరవంబు లేదు!పాతరేల? దుష్ప్ర  చారమున్!
నిశీథిం జరించు వారలై!నియోగంపు కార్య లేమి!నీతి నంత మేర్చు చుండిరే!

1.గర్భగత"-ప్రాచీన"-వృత్తము.
బృహతీఛందము.జ.జ.ర.గణములు.వృ.సం.174.
ప్రాసనియమము కలదు.
పసందైన నూత్న ఛందముల్!
రసాస్వాదనంబు లేదిలన్!
ప్రశాంతంబు లేదు భూ తలిన్!
నిశీథిం జరించు వారలై!
2.గర్భగత"-తరంగ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.త.జ.గల.గణములు.వృ.సం.173.
ప్రాసనియమము కలదు.
ప్రయోగింప నిచ్ఛ లేదు!
రయంబే మనోహరంబు!
వయో గౌరవంబు లేదు!
నియోగంపు కార్య లేమి!
3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
పాత బాణి వీడ రేలన్?
వ్రాత మార్ప బ్రహ్మ శక్యమే!
పాత రేల?దు ష్ప్రచారమున్!
నీతి నంతమేర్చు చుండిరే!
4.గర్భగత"-జంఝాట"-వృత్తము.
అత్య ష్టీఛందము.జ.జ.ర.త.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పసందైన నూత్న ఛందముల్!ప్రయోగింప నిచ్ఛ లేదు!
రసా స్వాదనంబు లేదిలన్!రయంబే!మనోహరంబు!
ప్రశాంతంబు లేదు భూ తలిన్!వయో గౌరవంబు లేదు!
నిశీథిన్జరించు వారలై!నియోగంపు కార్య లేమి!
5.గర్భగత"-సజావు"-వృత్తము.
అత్యష్టీఛందము.య.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ప్రయోగింప నిచ్ఛ లేదు!పాత బాణి వీడ లేదు!
రయంబే!మనోహరంబు!వ్రాత మార్ప బ్రహ్మ శక్యమే?
వయో గౌరవంబు లేదు!పాత రేల?దుష్ప్రచారమున్!
నియోగంపు కార్య లేమి!నీతి నంత మేర్చు చుండిరే!
6.గర్భగత"-ప్రయోగినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.య.జ.ర.జ.ర.జ.త.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ప్రయోగింప నిచ్ఛ లేదు!పాతబాణి వీడరేలనో?పసందైన నూత్న ఛందముల్!
రయంబే మనోహరంబు!వ్రాత మార్ప బ్రహ్మ శక్యమే?రసాస్వాదనంబు లేదిలన్!
వయోగౌరవంబు లేదు!పాత రేల?దుష్ప్రచారమున్!ప్రశాంతంబు లేదు భూ తలిన్!
నియోగంపు కార్య లేమి!నీతి నంత మేర్చు చుండిరే!నిశీథిం జరించు వారలై!
                                                                                 
7.గర్భగత"-పసందు"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.జ.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పాత బాణి వీడరేలనో?పసందైన నూత్న ఛందముల్!
వ్రాత మార్ప బ్రహ్మ శక్యమే?రసా స్వాదనంబు లేదిలన్?
పాత రేల?దుష్ప్రచారమున్!ప్రశాంతంబు లేదు భూతలిన్!
నీతి నంత మేర్చు చుండిరే!నిశీథిం జరించు వారలై!
8.గర్భగత"విథి వ్రాలు"-వృత్తము
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.జ.ర.త.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పాత బాణి వీడరేలనో?పసందైన నూత్న ఛందముల్!ప్రయోగింప నిచ్ఛలేదు!
వ్రాత మార్ప బ్రహ్మ శక్యమే?రసాస్వాదనంబు లేదిలన్!రయంబే!మనో హరంబు!
                                                                               
పాత రేల?దుష్ప్రచారమున్!ప్రశాంతంబు లేదు భూతలిన్!వయో గౌరవంబు లేదు!
                                                                                 
నీతి నంత మేర్చు చుండిరే!నిశీథిం జరించు వారలై!నియోగంపు కార్య లేమి!
                                                                                 
9.గర్భగత"-జంభరీ"-వృత్తము.
అత్యష్టీఛందము.త.జ.భ.త.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ప్రయోగింప నిచ్ఛ లేదు!పసందైన నూత్న ఛందముల్!
రయంబే మనోహరంబు!రసా స్వాదనంబు లేదిలన్!
వయోగౌరవంబు లేదు!ప్రశాంతంబు లేదు భూతలిన్!
నియోగంపు కార్య లేమి!నిశీథిం జరించు వారలై!
10,గర్భగత"-తజ్జభా"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.జ.భ.త.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ప్రయోగింప నిచ్ఛ లేదు!పసందైన నూత్న ఛందముల్!పాత బాణి వీడ రేలనో?
రయంబే మనోహరంబు!రసాస్వాదనంబు లేదిలన్?వ్రాత మార్ప బ్రహ్మ శక్యమే?
వయోగౌరవంబు లేదు!ప్రశాంతంబు లేదు భూతలిన్!పాత రేల?దుష్ప్ర చారమున్!.
నియోగంపు కార్యలేమి!నిశీథిం జరించు వారలై!నీతి నంతమేర్చు చుండిరే!
                     
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
 జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.