గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, జూన్ 2020, సోమవారం

భద్రకా,ప్రమాణీ,మత్తరజినీ,భేదిలు,జారయా,చరచారయా,విస్తులా,కోటికాంతిదా,అంబుజాసి,అస్తి నాస్తీతి,"-గర్భ"-పరాశక్తి"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
భద్రకా,ప్రమాణీ,మత్తరజినీ,భేదిలు,జారయా,చరచారయా,విస్తులా,కోటికాంతిదా,అంబుజాసి,అస్తి నాస్తీతి,"-గర్భ"-పరాశక్తి"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                       
"-పరాశక్తి"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.త.ర.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఆది పరాశక్తి"-కాళికా!అనంతకోటి కాంతిదా!అస్తి నాస్తి ధర్మ సత్యముల్!
పాదు కొనెం దుర్మదంబిలన్!వనాంబు జాసనెంచుచున్!పస్తు పెట్టె న్యాయ     దేవతన్!                                           భేదిలె!సత్సంగ చర్యలున్!వినాశ హేతువాదమై!విస్తు కర్తృ భీత చేతనన్!
వేదిల లోకంబు మారణన్!పెనంగె!జీవనాశృలన్!విస్తరించె మృత్యు     ఘోషలున్!
1.గర్భగత"-భద్రకా"-వృత్తము.
బృహతీఛందము.భ.త.ర.గణములు.వృ.సం.167.
ప్రాసనియమము కలదు.
ఆది పరాశక్తి కాళికా!
పాదుకొనెం!దుర్మదంబిలన్!
భేదిలె!సత్సంగ చర్యలున్!
వేదిల లోకంబు మారణన్!
2.గర్భగత"-ప్రమాణీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.జ.ర.లగ.గణములు.వృ.సం.86.
ప్రాసనియమము కలదు.
అనంతకోటి కాంతిదా!
వనాంబు జాస నెంచుచున్!
వినాశ హేతు వాదమై!
పెనంగె!జీవనాశృలన్!
3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
అస్తి నాస్తి ధర్మ సత్యముల్!
పస్తుపెట్టె న్యాయ దేవతన్!
విస్తు కర్తృ భీత చేతనన్!
విస్తరించె!మృత్యు ఘోషలున్!
4.గర్భగత"-భేదిలు"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.త.ర.జ.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఆది పరాశక్తి కాళికా!అనంత కోటి కాంతిదా!
పాదుకొనెం దుర్మదం బిలన్!వనాంబుజాస నెంచుచున్?
భేదిలె!సత్సంగ చర్యలున్!వినాశ హేతు వాదమై!
వేదిల లోకంబు మారణన్!విస్తరించె!మృత్యు ఘోషలున్!
5.గర్భగత"-జారయా"-వృత్తము.
అత్యష్టీఛందము.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అనంత కోటి కాంతిదా!అస్తి నాస్తి ధర్మ సత్యముల్!
వనాంబు జాసనెంచుచున్!పస్తు పెట్టె!న్యాయ దేవతన్!
వినాశ హేతు వాదమై!విస్తు కర్తృ భీత చేతనన్?
పెనంగె!జీవనాశృలన్!విస్తరించె!మృత్యు ఘోషలున్!
6.గర్భగత"-చర చారయా"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.ర.య.జ.ర.య.స.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అనంత కోటి కాంతిదా!అస్తి నాస్తి ధర్మ సత్యముల్!ఆది పరాశక్తి కాళికా!
వనాంబుజాస నెంచుచున్!పస్తుపెట్టె న్యాయ దేవతన్!పాదుకొనెం దు   ర్మదంబిలన్?
వినాశ హేతువాదమై!విస్తు కర్తృ భీత చేతనన్!భేదిలె!సత్సంగ చర్యలున్!
పెనంగె!జీవనాశృలన్!విస్తరించె!మృత్యు ఘోషలున్!వేదిల లోకంబు    మారణన్!
7.గర్భగత"-విస్తులా"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.భ.త.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాస నియమము కలదు.వృ.సం.
అస్తి నాస్తి ధర్మ సత్యముల్!ఆది పరాశక్తి కాళికా!
పస్తు పెట్టె న్యాయ దేవతన్!పాదుకొనెం దుర్మదంబిలన్?
విస్తు కర్తృ భీత చేతనన్!భేదిలె!సత్సంగ చర్యలున్!
విస్తరించె మృత్యు ఘోషలున్!వేదిల లోకంబు మారణన్!
8.గర్భగత"-కోటికాంతిదా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.భ.త.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అస్తి నాస్తి ధర్మ సత్యముల్!ఆది పరాశక్తి కాళికా!అనంత కోటి కాంతిదా!
పస్తుపెట్టె న్యాయ దేవతన్!పాదుకొనెం దుర్మదంబిలన్?వనాంబుజాస     నెంచుచున్!                                             విస్తు కర్తృ భీత చేతనన్!భేదిలె!సత్సంగ చర్యలున్!వినాశ హేతువాదమై!
విస్తరించె!మృత్యు ఘోషలున్!వేదిల లోకంబు మారణన్!పెనంగె జీవ  నాశృలన్!        
9.గర్భగత"-అంబుజాసనీ"-వృత్తము.
అత్యష్టీఛందము.జ.ర.య.స.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అనంతకోటి కాంతిదా!ఆది పరాశక్తి కాళికా!
వనాంబుజాస నెంచుచున్!పాదు కొనెం దుర్మదంబిలన్?
వినాశహేతు వాదమై!భేదిలె!సత్సంగ చర్యలున్!
పెనంగె!జీవనాశృలన్!వేదిల లోకంబు మారణన్!
10,గర్భగత"-అస్తి నాస్తీతి"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.ర.య.స.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అనంతకోటి కాంతి దా!ఆది పరాశక్తి కాళికా!అస్తి నాస్తి ధర్మ సత్యముల్!
వనాంబు జాసనెంచుచున్!పాదుకొనెం దుర్మదంబిలన్?పస్తుపెట్టె న్యాయ   దేవతన్!
వినాశహేతు వాదమై!భేదిలె సత్సంగ చర్యలున్!విస్తు కర్తృ భీత చేతనన్!
పెనంగె!జీవనాశృలన్!వేదిల  లోకంబు మారణన్!విస్తరించె!మృత్యుఘోషలున్!                                                     స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
 జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.