గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, జూన్ 2020, బుధవారం

మత్తరజినీ ద్వయ,సమాశ్రీ,వసుగంథి,యిర్నవ సుగంథిద్వయ, కొంగు బంగరుద్వయ,రజినీకరప్రియ,పసందగు,గర్భ"-కల్పద్రుమ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

 జైశ్రీరామ్.
మత్తరజినీ ద్వయ,సమాశ్రీ,వసుగంథి,యిర్నవ సుగంథిద్వయ, కొంగు బంగరుద్వయ,రజినీకరప్రియ,పసందగు,గర్భ"-కల్పద్రుమ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.     
                           
"-కల్పద్రుమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తొంగి జూచి వంగి వాలరే!తొల్లి కోర్కె కాంక్ష దీర!తూలు చుంద్రు మోహ   భ్రాంతినిన్ !
భంగపాటు లెక్క సేయరే!వల్లెయంచు చేర రెంచ!వాలకంబు స్వార్థ  చింతనన్!
జంగమయ్య జోలికేగరే!జల్లెడందు నీటితీరు!జాల మేల ముందు నుందురే!
సంగతింతె!కల్యుగంబునన్!జల్లు లేని పంటయట్లు!చాలతెల్విదర్శ  నీయతన్!
                                                                       
1.గర్భగత"- మత్తరజినీద్వయ"-వృత్తములు
బృహతీఛందము.ర.జ.ర,గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
తొంగి జూచి వంగి వాలరే!           తూలుచుంద్రు మోహ భ్రాంతినిన్!
భంగ పాటు లెక్క సేయరే!         వాల కంబు స్వార్థ చింతనన్!
జంగమయ్య జోలి కేగరే!            జాల మేల ముందు నుందురే!
సంగతింతె!కల్యుగంబునన్!       చాల తెల్వి దర్శ నీయతన్!
2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
తొల్లి కోర్కె కాంక్ష దీర!
వల్లెయంచు చేర రెంచ!
జల్లెడందు నీటి తీరు!
జల్లు లేని పంట యట్టు!
3.గర్భగత"-వసుగంథి"-వృతము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తొంగిజూచి వంగి వాలరే!తొల్లి కోర్కె వాంఛ దీర!
భంగపాటు లెక్క చేయరే!వల్లెయంచు చేర రెంచ!
జంగమయ్య జోలి కేగరే!జల్లెడందు నీరు తీరు!
సంగతింతె!కల్యుగంబునన్!జల్లు లేనిపంట యట్లు!
4.గర్భగత"-యతిర్నవసుగంథి"-వృత్తములు
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తొల్లి కోర్కె కాంక్ష దీర!తూలు చుంద్రు మోహ భ్రాంతినిన్!
వల్లెయంచు చేర రెంచ!వాలకంబు స్వార్ధ చింతనన్!
జల్లెడందు నీటి తీరు!జాలమేల ముందు నుందురే!
జల్లు లేని పంట యట్లు!చాల తెల్వి దర్శనీయతన్!

తొల్లి కోర్కె కాంక్ష దీర!తొంగి జూచి వంగి వాలరే!
వల్లెయంచు చేర రెంచ!భంగపాటు లెక్క సేయరే!
జల్లెడందు నీటితీరు!జంగమయ్య జోలి కేగరే!
జల్లు లేని పంట యట్లు!సంగతింతె!కల్యుగంబునన్!
5.గర్భగత"-కొంగుబంగరు ద్వయ"-వృత్తములు.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18
ప్రాసనియమము కలదు.వృ.సం.
తొల్లి కోర్కె కొంత దీర!తూలు చుంద్రు మోహ భ్రాంతినిన్!తొంగిజూచివంగి వాలరే!                            
వల్లె యంచు చేర రెంచ!వాలకంబు స్వార్థ చింతనన్!భంగ పాటు లెక్క సేయరే!
జల్లె డందు నీటి తీరు!జాల మేల ముందు నుందురే!జంగ మయ్య జోలి కేగరే!
జల్లు లేని పంట యట్లు!చాల తెల్వి దర్శ నీయతన్!సంగ తింతె!కల్యు గంబునన్!                                                                                
తొల్లి కోర్కె వాంఛ దీర!తొంగి జూచి వంగి వాలరే!తూలు చుంద్రు మోహ భ్రాంతినిన్!
వల్లె యంచు చేర రెంచ!భంగ పాటు లెక్క సేయరే!వాలకంబు స్వార్థ చింతనన్!
జల్లె డందు నీటి తీరు!జంగ మయ్య జోలి కేగరే!జాలమేల ముందు  నుందురే!
జల్లు లేని పంట యట్లు!సంగ తింతె కల్యు గంబునన్!చాల తెల్వి దర్శ నీయతన్!
                                                                             
6.గర్భగత"-రజినీకరప్రియ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తూలు చుంద్రు మోహ భ్రాంతినిన్!తొంగి జూచి వంగి వాలరే!
వాల కంబు స్వార్థ చింతనన్!భంగపాటు లెక్క సేయకన్!
జాల మేల ముందు నుందురే!జంగమయ్య జోలి కేగరే!
చాల తెల్వి దర్శ నీయతన్!సంగతింతె!కల్యుగంబునన్!
7.గర్భగత"-పసందగు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తూలు చుంద్రు మోహ భ్రాంతినిన్!తొంగి జూచి వంగి వాలరే!తొల్లి కోర్కె వాంఛ దీర!
వాల కంబు స్వార్థ చింతనన్!. భంగ పాటు లెక్క సేయకన్!వల్లె యంచు చేర రెంచ!
జాల మేల ముందు నుందురే!జంగ మయ్య జోలి కేగరే?జల్లె డందు  నీటి తీరు!
చాల తెల్వి దర్శ నీయతన్!సంగ తెంచి కల్యుగంబునన్!జల్లు లేని పంట యట్టు!
                                                                       
స్వస్తి
మూర్తి.జుత్తాడ.
 జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.