గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, జూన్ 2020, గురువారం

"- జుత్తాడపుర వివరణ"- రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

 జైశ్రీరామ్.
అతిపురాతన"-బ్రహ్మసూత్ర శ్వేతవర్ణ లింగ--మల్లేశ్వర స్వామి దేవళము.జుత్తాడ గ్రామము,చోడవర(మం).విశాఖ పట్టణము(జిల్లా). అతిపురాతన"-బ్రహ్మసూత్ర శ్వేతవర్ణ లింగ--మల్లేశ్వర స్వామి దేవళము.జుత్తాడ గ్రామము,చోడవర(మం).విశాఖ పట్టణము(జిల్లా).
"- జుత్తాడపుర వివరణ"- రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

కం:-శ్రీమంతంబౌ వసుధన్
నీమాశ్రిత ప్రోలనంగ నేర్మిన్!కూర్మిన్!
రామామృత వాగ్ఝరులచె!
దామంబై భక్త వరులు తగనొప్ప నిటన్!

తే.గీ:-పురము జుత్తాడ పూజ్యమై పుడమి వెలసె!
గురుతరంబగు"-మల్లేశు గుడియు నొకటి!
దవళ లింగంబు!భక్తులు తనియు నటుల!
బ్రహ్మసూత్ర విలిఖితమై భాసిలె నిట!

తే.గీ:-మదిని కోర్కెలు దీర్చెడి మల్లి విభుడు
పలు శతాబ్దుల ముందర పరగె నిచట!
వర తపో నిష్ట ఋషి సీమ వాసిగాంచె!
పరమ శారద వర వారి పారె నిచట!

తే.గీ:-పాడి పంటల తులతూగు భాగ్య సీమ!
పట్టమాంబిక నిచ్చోట పట్టు గొమ్మ!
ప్రభుడు మల్లేశు డలరారు ప్రాంత మిదియె!
భక్త రక్షణ పూర్ణతం భాసిలెండు!

ఆ.వె:-సంకటాప హరుడు వేంకటేశు డిచట!
జాగు మాని సిరుల సరగ బ్రోచి!
ప్రగతి మార్గమెంచి పద్ధతి పాటింప!
జనుల తీర్చి దిద్దె!చతురి మాన!

తే.గీ:-అట్టి జుత్తాడ జన్మించి నట్టి వారు
పట్టు గొమ్మలు నీతికి దిట్ట లనగ!
దాన ధర్మాల ముందుండు దాత లనగ!
వాసి కెక్కిరి మల్లేశు భక్తి పరగ!

తే.గీ:-వేద మంత్రాలు కడునిష్ట వినుచు భక్తి!
దివ మహంబులు దైవంబె దిక్కటంచు!
పరము నెద నిల్పి వర్తిలు ప్రజను కనగ!
కరము సంతోష సౌభాగ్య వరము కాదె?

8.తే,గీ:-స్థల మహాత్మ్యము వర్ణింప తరము కాదు!
పాడిపంటల నెలవైన భాగ్య సీమ!
కళల కాణాచి జుత్తాడ గ్రామ మెపుడు?
నిరుపమంబైన భక్తికి నెలవు సుమ్మి!

9.తే.గీ:-కలి వికారంబు జూపించి కదము త్రొక్క!
మలిన మొక కొంత వ్యాపించి మహిమ చెరచె!
కొంత వరకును దిగు వాయె!కోర్కె లలమ!
కాని! ధర్మంబు తరగక కడకు నిలిచె!

తే,గీ:-కృత యుగంబున ధర్మంబు స్మృతి వరంబు!
నాల్గు పాదాల నడయాడె స్వేచ్ఛ నాడు!
పరగె త్రేతాయుగంబున పట్టు సడలి
పాద త్రయమందు వర్తించె!ప్రగణితముగ!

తే.గీ:-ద్వాపరంబున సగమాయె!బక్కచిక్కి!
కృష్ణ వైవిద్య మార్భటి!కిల్భిష మతి!
నేడు కలి ప్రభావాన తా నేక పదము
నడుచు చున్నది ధర్మంబు నరుల నడుమ!

తే.గీ:-స్వార్థ చింతన మిన్నంటి జగము వెల్గె!
పరము నెంచెడి సమయంబు ప్రజలు గనక!
ధనము సర్వార్ధ సాధక తన్మయాన!
కనులు పొర గ్రమ్మె!నేడిల కన రదేమొ?

తే.గీ:-వేద విధు లను దూషించి విధిని తప్పి!
కామ మగ్నత చరియించి కఠిను లగుచు!
తల్లి భారతి కీర్తులు దలప మాని!
సాదు రక్షణ కరువాయె!సర్వ జగతి!
           
తే.గీ:-మానవాళిలొ ధర్మంబు మాధవుండు
మగుడ నిలుప జన్మబడయు!సుగమ మవగ!
జన్మ నెత్తిన కలిదోష చరము నగును!
ధర్మ మదినాల్గు పాదాల తగ నెసంగు!

తే.గీ:-మితిని మీరెను!గతిదప్పె!మితము గనక!
గతిని కనరాని తీరాయె!కల్మ షాన!
స్థితి లయంబుల హరి హరుల్!చేవ జూప!
జగపు ధర్మంబు నిల్చును!సరిసమాన!

తే.గీ:-మనుజు లందున దైవంబు గనుచు నరుడు!
చెడును విడనాడి సాగిన!స్థిరము సుఖము!
పరము నందెడు రీతిని బ్రతుక వలెను!
ధర్మ రక్షణమది సుమా! దలచి చూడ!!
స్వస్తి
మూర్తి. జుత్తాడ.
  జైహింద్
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.