గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, జూన్ 2019, శనివారం

చంద్రికా పరిణయ పరిశోధనా గ్రంథావిష్కరణము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! వసుచరిత్రవలె శ్లేష భూయిష్ఠమయి, మృదుపద ఘటితమయి, యత్యంత ప్రౌఢముగానుండు శ్రీ కొల్లాపాధీశ్వర మాధవరాయ కృత చంద్రికా పరిణయము అను ప్రబంధము శ్రీమద్వెల్లాల సదాశివ శాస్త్రులవారి చేతను, అవధానము శేషశాస్త్రివారిచేతనుచింపఁబడిన వ్యాఖ్యానముతో నున్నది ఈ క్రింది యూఆరెల్ల్ లో దిగుమతి చేసుకొని పఠింప వచ్చును.

https://archive.org/details/in.ernet.dli.2015.373598

పరమార్థకవి డా. వెలుదండ సత్యనారాయణ ఈ కావ్యముపై పరిశోధన సలిపి డాక్టరేటు పొందినారు.
వీరి ఈ పరిశోధనా గ్రంథమును భారత భారతి సాహితీ సంస్థ వారు ౦౯ - ౬ - ౨౦౧౯ వతేదీన యల్బీనగర్లో ఆవిష్కరించిరి. ఆ ఆవిష్కరణ చిత్రములు తిలకింపనగును.
ఈ సందర్భముగా డా.వెలుదండ సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియఁ జేయుచున్నాను.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అభినందన మందారములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.