గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, జనవరి 2019, గురువారం

అమెరికా పౌరులు శ్రీ పాలడుగు శ్రీచరణ్ విశాఖపట్టణంలో చేసిన అష్టావధానము.

1 comments

 జై శ్రీరామ్.
అమెరికా పౌరులు శ్రీ పాలడుగు శ్రీచరణ్  విశాఖపట్టణంలో చేసిన అష్టావధానము.

జైహింద్.

30, జనవరి 2019, బుధవారం

శ్రీ మీగడ రామలింగస్వామి సంగీత నవావధానము.

1 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా! మనలను తప్పక ఆనందడోలికలలో ఓలలాడిస్తుంది శ్రీ మీగడ రామలింగస్వాము సంగీత నవావధానము.
తప్పక చూడండి.

శ్రీ ఈగడ రామలింగస్వాముకు అభినందనపూర్వక శుభాకాంక్షలు తెలియఁ జేస్తున్నాను.
జైహింద్.

29, జనవరి 2019, మంగళవారం

ధరిత్రి చూడని చరిత్ర పాడని . పాట. . . . యం. అనంత కృష్ణా రావు.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!
యం.అనంత కృష్ణా రావు గారి పాట చూడండి.
జైహింద్.

28, జనవరి 2019, సోమవారం

1976 వేదాంత్ భేరిలోని శ్లోక వివరణములు.

0 comments

జైశ్రీరామ్
జైహింద్.

27, జనవరి 2019, ఆదివారం

పుణ్యాహ వాచనమ్ ఎందుకు. బ్రహ్మశ్రీ అందుకూరి చిన పున్నయ్య శాస్రి.

1 comments

                                  జై శ్రీరామ్ 
పుణ్యాహ వాచనమ్ ఎందుకు. బ్రహ్మశ్రీ అందుకూరి చిన  పున్నయ్య శాస్రి.   

ఈ పుణ్యాహవాచనం అనే మాటను వ్యవహారంలో అనేక రకాలు గా పలకటం మనం వింటూ ఉంటాము .. పుణ్యాహవచనమని .... పుణ్య వచనమని .{గజేంద్ర మోక్షం లాగా ... అసలు మాట గజేంద్ర మోక్షణం )కనుక మనము ఈ పదము యొక్క అసలు స్వరూపము -దాని ప్రయోజనము తెలుసుకుంటే ఆనందంగా ఉంటుంది . "జ్ఞాత్వా కర్మాణి కుర్వీత ".  అన్నారు.అంటే అర్థం తెలుసుకుని కర్మలు చెస్తే ఫలితం ఎక్కువ ఉంటుంది అని పరమార్థం .
ఇది తెలుసుకోబోయేముందు తెలుసుకోవాల్సింది   ఏమిటంటే ప్రపంచం లో ఏ జ్యోతిష శాస్త్రం లో లేని ఆచారం మన వైదిక జీవనం లో ఉన్నది. ఏమిటంటే మనిషి పుట్టిన నక్షత్రం కనుక్కుని ,ఇక జీవితంలో ఆతను ఏదైవ  కార్యం  చేసినా జ్యోతిష శాస్త్ర ప్రకారం కాలామృ తాది
గ్రంధాల  సహాయం తో దైవ కార్యం చేసే ముహూర్తం నక్షత్ర ప్రాధాన్యం గా నిర్ణ యిస్తారు. అంటే ఫలాని నక్షత్రం లో దేవ కర్మ చేయాలి .ఫలాని నక్షత్రంలో గృ హ్య కర్మ చేయాలి అని  నిర్ణ యిస్తారు. దీనికి కారణమూ ప్రమాణమూ ఏమిటంటే

తైత్తిరీయ బ్రాహ్మణం ,మొదటిభాగం, 5వ ప్రపాఠకం ,2 వ అనువాకం లో ఈ విషయం చెప్పబడినది.

ఆ మంత్రం ఇది.
"సలిలం వా ఇదమంతరాసీత్. యదతరన్  తత్తారకాణామ్ తారకత్వం . యో వా ఇహ యజతే . అ ముంస  లోకం నక్షతే . తన్నక్షత్రాణాం  నక్షత్రత్వం .దేవ గృ హా వై నక్షత్రాణి .య ఎవంవేద గృహ్యై వ భవతి. .
అర్థం: ద్యులోక పృ థివీ లోకముల మధ్యలో ఉండే స్థావర జంగమాత్మక మైన ఈ దృ శ్యమాన సృ ష్టి స్థానంలో పూర్వం ప్రళయ కాలంలో నీరు మాత్రమే ఉండేది . అ ప్పుడు కృ త్తికాది నక్షత్రాలు ఆ నీటిని దాటుకుని లోకాన్తరాలకు వెళ్లి నయ్యి .నీటిని దాటుకుని వేళ్లి నయ్యి కనుక (తరించినయ్యికనుక) వాటిని తారకలు అన్నారు. ఏ యజమానుడైతే (యజ్ఞం చే సేవాడు) ఈ నక్షత్ర యుక్తమైన కాలం లో యజ్ఞం చేస్తాడో ఆ యజమానుడు స్వర్గలో కాన్ని పొందుతాడు. అందుకని వాటిని నక్షత్రాలు అన్నారు. (ఇది 'నక్ష' శబ్దం మీదనుండి వచ్చింది. నక్ష అంటే గతి లేక గమనము అని అర్థము. )నక్షత్ర సహాయం తో స్వర్గ గమనము సాధిస్తాడు కనుక వాటిని నక్షత్రాలు అన్నారు.
ఈ నక్షత్రాలు దేవతా గృ హ సదృశాలు . మనుష్యులు ఎవిధంగానయితే
గృహంలో దీప ప్రకాశము తో వ్యవ హరిస్తారో అదే విధంగా దేవతలు నక్షత్ర ప్రకాశ సహాయం తో వ్యవహరిస్తారు. అందు వలన నక్షత్రాలు ప్రశస్తములు .ఇది తెలిసిన యజమానికి చాలా గృహాలు గానీ ,మంచి ప్రశస్త గృ హాలు కానీ కలుగుతయ్యి.

కనుక ఇప్పుడు మనం చేసే ప్రతికర్మకు నక్షత్రం కుదిరిందో లేదో చూసుకోవటం ఎందుకో ఇప్పుడు అర్థమయ్యింది కదా!. ఇక పుణ్యము అనేమాట ఎట్లా వచ్చిందో చూద్దాము.
సామానమయిన రోజుని (అంటే సరిగ్గా 60 ఘడియలు లేక 24 గంటలను అయిదు భాగాలుగా చేసారు,.
వాటికి క్రమంగా ప్రాతః ,సంగవ, మధ్యాహ్న ,అపరాహ్ణ ,సాయం కాలాలని పేరు పెట్టారు.ఈ ఐదు విభాగాలు పుణ్యమైనవి. దాని వలన ఆ రోజు పుణ్యమైన రోజు అవుతుందని తైత్తిరీయ బ్రహ్మణం చెబుతున్నది. కారణం
ప్రాతః కాలం లో సత్యాను ష్ఠాన పరులు వారి పనులు మొదలు పెడతారు.
సంగవకాలం లోఆవులు అరణ్యానికి వెళ్లి సంచరిస్తయ్యట
మధ్యాహ్నం లో సూర్యుడు తేజస్సుగా ఉంటాడు    .ఋషులు వేదాన్ని ప్రబలంగా అధ్యయనం చే స్తారు.
అపరాహ్ణం లో తల్లులు కుమార్తెలకు సౌభాగ్య సూచకమైన అంగ ప్రక్షాళన , ధమ్మిల్ల బంధన, న యనాంజనాది కర్మలు చేస్తారు (కళ్ళకు కాటుక దిద్దటం)
సాయం కాలం ...ఇది వరుణుడికి సంబంధించినది కాబట్టి సాయంత్రం సమయం లో అబద్ధం ఆడకూడదు , అబద్ధం చేయ కూడదు.

ఈ ప్రకారంగా ఆ సమయాలు ఏ విధముగా పుణ్యములో చెప్పారు.ఇక ఈ ఐదు సమయాలలో ఏ నక్షత్రాలు ఉంటె ,ఆ రోజు పుణ్యమైన రోజు అని అంటారో చెప్పుకుందాము. వేదంలో పరాయతము అనే భాగం లో ఈ విషయం చెప్పారుట .
ప్రాతః కాలం : హస్తా నక్షత్రం
సంగవ కాలం :అనురాధా నక్షత్రం
మధ్యాహ్నం : పుష్యమి
అపరాహ్ణమ్ :ఉత్తర ఫల్గుణి
సాయం కాలం : శతబిషమ్
ఈ సమయం లో ఈ నక్షత్రాలు ఉంటే , ఆ రోజు మొత్తము పుణ్యమైన రోజని , ఆ  రోజున దేవకర్మలు , గృహ్య కర్మలు(పెళ్లి,ఉపనయనం లాంటివి) చెయ్యొచ్చని  చెప్పారు. అయితే ఒక విశేషము విధించారు. (షరతు లేక కండిషన్ )ఇది ఉత్తరాయణం లో శుక్ల పక్షములో అయితే మాత్రమె పుణ్యమైన రోజులు అని కరాఖండి గా చెప్పారు.
చిక్కంతా ఇక్కడే వచ్చిన్ది.  
అంటే దీని లక్షణాలు ఎమిటి .
రోజుకి సరిగ్గా 24 గంటలే ఉండాలి .(ఎక్కువ గాని, తక్కువ గాని ఉండగూడదు.).ఉత్తరాయణమ్ లో అయి ఉండాలి . శుక్ల పక్షం అయిఉండాలి . ఈ అయిదు సమయాలలో పైన చెప్పిన నక్షత్రాలు ఉండాలి. లేకపోతె దేవతా సంబంధమైన కర్మలు చెయగూడదు.
ఉత్తరాయణం లో అంటే ఆరు నెలలలో శుక్లపక్షం 3 నెలలు ఉంటుంది . అందులో ఈ నక్షత్రాలు కలిగిన విశేష సమయాలు ఎన్ని ఉంటయ్యి. ... ఈ మూడు నెలలలోనే అన్ని శుభకార్యాలు చేయటం సాధ్యమా !

ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి . మన వైదిక కర్మలన్నీ గృహ్య సూత్రాలమీద ఆధార పడి  ఉంటయ్యి . మన వైదిక విధానం లో మనం చేయాల్సిన విధుల కోసంమహానుభావులు చాలామంది గృ హ్య  సూత్రాలు వ్రాశారు. ఆపస్తంబుడు ,ఆశ్వలాయనుడు మొదలైన వారు . గృ హ్య సూత్రాలంటే మన గృహాలలో చేసే దేవతా పూజలు అని చెప్పవచ్చు. అవి... జాత కర్మ , నామకరణం , చౌలొపనయనమ్ ,ఉపనయనం ,సమావర్తనం(స్నాతకం)  ,వివాహం మొదలైనవి.
ఇప్పుడు మ నం చూస్తున్న వైదిక క్రియలన్నీ , ముఖ్యంగా ఉపనయన వివాహాలు ,ఆపస్తంబ సూత్రాలను అనుసరించి చెస్తున్నవే . అయితే ఆ అపస్తంబుడు ఒక చిక్కు తెచ్చిపెట్టాడు .
"సర్వ ఋ తవో వివాహస్య " (2-12)అనే ఒక సూత్రం చెప్పాడు . అంటే సంవత్సరం పొడుగునా వివాహం చేయవచ్చు అని. (ఒక్క శిశిర ఋతువు,ఆషాఢ మాసం వదిలి ) అంటే దక్షిణాయనంలో కూడా చేయ వచ్చనే గదా అర్థం . మరి
"ఉదగయన పూర్వ పక్షాహః పుణ్యా హేషు కర్మాణి " అని 2 వ సూత్రం ఆపస్తంబుడే చెప్పాడు . అంటే దేవసంబంధమైన కర్మలు అన్నికూడా ఉత్తరాయణం లోను ,శుక్ల పక్షపు పుణ్య నక్షత్రములతొ కూడి చేయదగినవి అని .. మరి ఎట్లాగు .....
దానికి ఋ షులే ఒక మార్గం కనిపెట్టారు . అదేమిటంటే బ్రాహ్మణు డు 27నక్షత్రాల తరువాత 28 వ నక్షత్రం లాంటివాడు . అలాగే పుణ్య నక్షత్రాలు కలిగిన రోజులు మొత్తం 12 ఉంటె అందులో 12 వవాడు బ్రాహ్మణుడు . అ తను వచ్చి ఇవ్వాళ పుణ్యమైనా రోజు మీరు కర్మలు చేయవచ్చు అని చెబితే ఆ రోజుకి కర్మ యోగ్యతా వచ్చి శుభ కాల విశేషము అవుతున్ది. బ్రాహ్మణం ప్రకారం "యథా నక్షత్ర యోగాత్ కాలస్య కర్మ యోగ్యతైవం బ్రాహ్మణ వచనాదపి కాలః కర్మయోగో   భవతి. "  అంటే నక్షత్ర యోగము వలన కాలం కర్మ యోగ్యతకలిగినది గా అవుతుందో , అదేవిధం గా బ్రాహ్మణ వచనం వలన కుడా కలం కర్మయోగ్యతను పొందుతుంది . "అని దీని అర్థం ,.
ఈ పన్నెండు పుణ్యాహము లేమిటో చూద్దాము .సమమైన రోజును ఐదు భాగములు చేస్తే వచ్చే ఐదు సమయ విశేషాలు .పుణ్య  నక్షత్రాలతో కూడి నవి. ఆ తరువాత ఐదు సమయాల సంధు లలో అనగా
ప్రాతః-సంగవ,సంగవ-మధ్యాహ్న ,మధ్యాహ్న -అపరాహ్ణ ,అపరాణ్హ -సాయంకాల వచ్చే రెండు ముహూర్తాలు (ముహూర్తం అంటే 2 ఘడి యలు. )ఉదాహరణ కి ప్రాతః కాలం లో ని మూడు ముహుర్తాలలో చివరిది, దాని తరువాత ఉన్న సంగవ కాలం లోని మూడు ముహుర్తాలలో మొదటి ముహూర్తం కలిపి ఒక పుణ్య నక్షత్రం . ఇప్పుడు మొత్తం తొమ్మిది అయినయ్యి. ఇక ఉషః కాలము  , ప్రదోష కాలము ఇవి రెండు పుణ్య నక్షత్రాలు. మొత్తం పదకొండు అయినయ్యి.
ఇక బ్రాహ్మణుడు 12 వ పుణ్య నక్షత్రం . అందుకని జ్యోతిష్య శాస్త్ర రీత్యా జన్మ నక్షత్రాన్ని అనుసరించి ,క్రతువు చేయటానికి పుణ్యమైనరోజు నిర్ణయించినా అది ఉత్తరాయణం లో ఉన్నా లేకపోయినా బ్రాహ్మణుడిచేత పుణ్యాహ వాచనం చేయిస్తే (అంటే ఇవ్వాళ పుణ్యమైనరోజు అని చెప్పిస్తే )అది పుణ్యాహం లో చేసినట్టే అని ఋషులు చెప్పారు.
అందుకే బ్రాహ్మణుడు వచ్చి విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి .. మిగతా పూజ అంతా చేసి ..చివరికి
"పున్యాహంమితి భవంతో బ్రువన్తు "అంటాడు . అప్పుడు సభలో ఉన్న పెద్దలు , ముఖ్యం గా వేద విప్రులు పుణ్యాహం పుణ్యాహం పుఅ అని వేదం ణ్యాహం అ
ని మూడుసార్లు అంటారుట . కారణం ఏమిటంటే త్రిషత్యాహి  వై దేవాః " అని శా స్త్రమ్.ఏదైనా  మూడు సార్లు ఎబితేనే దేవతలు నమ్ముతారట . మరి దేవతలు నమ్మి మనకు సహాయం చేయాలిగదా .
ఇక సభలో ఉన్న వారు అనటం దేనికంటే .. వైదిక కర్మలె ప్పుడూ  సభలోనే చేయలిట  .. ఆఖరికి సంధ్యా  వందనం కూడా .. అందుకే చివరకు భో అని ప్రవర చెప్పుకుంటాము. '
సభా అనేది బ్రాహ్మణుడికి పశు సంపద అని వేదం చెబుతున్నది .

ఇదీ పుణ్యాహ వాచనం యొక్క అర్థం.
పైన చెప్పిన కారణాల కోసం పుణ్యాహ వాచనం చేయించాలి .
మంగళం 
అందుకూరి చిన  పున్నయ్య శాస్రి.
జై హింద్ 

26, జనవరి 2019, శనివారం

నూతన ఛందములలో గర్భ కవిత 110. . . . రచన . . . శ్రీ వల్లభ

1 comments

గర్భస్త వృత్తములు----విభూతినీ.శ్రీవరామ.తరంగ.రయోత్సుక.దుష్ప్రభా
రాజనీతి.సుస్వార్ధ.పరచింతన. మారణహోమ.వృత్తములు. 
                         విధి నటనా వృత్తము.

రచన.వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
యుగములసింహావలోకన.
-------------------------------------
ధర్మమునకుగ్లాని యేర్పడినపుడుశ్రీమహావిష్ణువు ధర్మసంస్థాపనార్ధమై
యవతారములెత్తుచుండును.నాల్గుయుగములందు  కృతయుగము
ధర్మప్రపూర్ణమైనిల్చెను .త్రేతాయుగమునందు సత్యముమూడుపాదాల
నడచెను.ద్వాపరమునధర్మమురెండుపాదములకుదిగెను.శివునివెన్నాడు
బ్రహ్మహత్యాపాతకనివారణకుగాను విష్ణువు18అక్షౌహినీలబలగమును
కురుక్షేత్రమందిడుటకు నొడంబడిక కుదుర్చుకొనెను.తత్కారణమున
కృష్ణావతారముయెత్తవలసివచ్చెను.అందులకుగానుఅక్రమసంతానమునకు
తెరదీయవలసి వచ్చెను.కుండలు గోళకులవృద్ధి వారిప్రధాన్యతపెచ్చెను.అధర్మము
తో ధర్మమునిలబెట్టుటకుప్రయత్నములుకొనసాగెను.మాయలు కుతంత్రములు
కుయుక్తులనిలయమాయెను.భారతమును పంచమవేదముగాపరిగణింపబడెను
ఆనాటి సాంఘిక రాజకీయ వ్యవహారపరిస్థితులకనుకూలముగాజగనన్నాటకధారి
కృష్ణపరమాత్మయాడిన నాటకమే భారతముధధర్మసంస్తాపనకు భక్తయేమూలమను
ప్రబోధ గావింపబడెను. మాయలకునెలవుగాబీజోత్పత్తి జరిగెనుకారణముబలగము
యుద్ధమునకుసమర్పించుటకే.కారణమే కరణమాయెను.ప్రస్తుత కలియుగముననొంటి
పాదమునకు చేరికొనెను.యుగయుగమునకుధర్మముదిగుభాగహారమాయెను.ఒంటి
పాదమునపట్టినధర్మమున్యాయమునకుమూడింతల లన్యాయమునొప్పప్పెను.
చరిత్ర పునరావృతము కాకతప్పదనునట్లు కుల జాత్ మతఘర్షణమృగాళ్ళ
పైసాచికృత్యములుమితిమీరుచున్నవి.నేరానికితగిన శిక్షలుకరువాయెను.
ధర్మఛాయామాత్త్రముగనిల్చెను. నాగరికత పేరుతోయనాగరికులనుమించిన నైజము
బొడజూపుచున్నది.సంస్కారమామట్టిగలసెను ధర్మము కలబాధలకు తట్టుకొనలేక
పరుగులు తీయుచుండెను. భూగర్భనిక్షిప్తాలను మనుగడకుముప్పు వాటిలునటుల
అక్రమార్కులకబంద హస్తలలాగబడుచున్నవి.ఇంత అన్యాయ అక్రమాలకుతాళజాలక
ప్రకృతి ప్రకోపానికిగురి కావలసివచ్చుచున్నది.ధర్మము పూర్తిగా నశించుచివరి
ఘడియలలో ధర్మము పూర్తిగాపెరిగి కృతయుగమునకుచేర్చును.ఇదిముమ్మాటికి
నిజముపైవిషయదృష్టినందిడుకొని. ద్వాపరయుగమున విధినటనా వృత్తము
గైకొని   విభూతినీ.శ్రీవరామ.తరంగ.రయోత్సక.దుప్రభా.రాజనీతి.సుస్వార్ధ.
పరచింతన.మారణహోమ.గోళక ప్రభా.వృత్తములు గర్భస్తముగావింపబడినవి.
           విధినటనావృత్తము.

25, జనవరి 2019, శుక్రవారం

అన్ని విభక్తులలో రామశబ్ద ఏకవచనం చెప్పబడిన శ్లోకమ్.సేకరణ డా.మాడుగుల అనిల్ కుమార్

2 comments

  జైశ్రీరామ్.
రామో రాజమణిస్సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః |
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం
రామే చిత్తలయం సదా భవతు మే హే రామ మాముద్ధర ||
ఈ శ్లోకంలో వాక్య నిర్మాణంతో కూడిన అన్ని విభక్తులలో రామశబ్ద ఏకవచనం చెప్పబడినది. విభక్తులను గుర్తుంచుకొనుటకు ఉపయోగపడును.

జైహింద్.

24, జనవరి 2019, గురువారం

అవధానం - సమస్యాపూరణం - దత్తపది . . . బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణ పండితులు.

1 comments

  జైశ్రీరామ్.
అర్యులారా! అవధానం - సమస్యాపూరణం - దత్తపది అనే అంశాన్ని బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణ పండితులు వివరించియున్నారు. తిలకించండి.
అవధానం - సమస్యాపూరణం - దత్తపది
అవధానం అనేది తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట ప్రక్రియ. సంస్కృతం, తెలుగు కాకుండా వేరే ఏ భాష లోనూ ఈ ప్రక్రియ ఉన్నట్లు కనపడదు. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ, అసంబధ్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్ధంగా ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు చెప్తూ - వీటన్నిటినీ ఏక కాలంలో - అవధాని చేసే సాహితీ విన్యాసమే అవధానం. ఇందులో అవధానికి అతిముఖ్యమయినవి ధార, ధారణ,చమత్కృతి, సమయస్ఫూర్తి. ఇందులో ఏది కొరవడినా అవధానము రక్తి కట్టదు. అందుకే అవధానమును అసిధారా వ్రతమన్నారు.
తిరుపతి వేంకటకవులు అవధానమునకు ఆద్యులు కాకపోయినా ఆవిద్యను దశదిశల వ్యాపింపజేయుటకు ఆద్యులు వారే. ముఖ్యముగా ఈ అవధాన విద్యలోని సమస్యా పూరణములోనూ, దత్తపదిలోనూ బాహిరముగా అశ్లీలము అగుపించినా దానిని వేటగాడు వాల్మీకియైన చందమున తమ ప్రజ్ఞాపాటవమును జతజేసి అవధానులు పూరించుట కద్దు. ఆశుకవితా సంప్రదాయానికి ఇది కొత్త ఊపిరి. తిరుపతివెంకట కవులకు ముందు అవధానప్రక్రియలో ఉద్దండులైన వారు ఎందరో వున్నా, దాన్ని రాజాస్థానాల్లోంచి జనసామాన్యంలోకి విస్తరింపజేసిన వారు వీరు. ఆ ప్రభావం ఇప్పటికీ మనం చూస్తూనే వున్నాము. వీరికి పృచ్చకులుగా ఉభాయభాశాలలోనూ మహా ఉద్దండులు ఉండేవారు. ఒక అవధాన సభలో వారికి ఇచ్చిన సమస్య: ‘సంధ్యావందనమాచరించ వలదా చౌశీతి బంధంములన్’. ఇది సాధారణ సమస్య కాదు. భాషా విభవము మిక్కిలి ఎక్కువగా వున్నవారు మాత్రమె చక్కగా పూరించగలరు, తమ సమయస్ఫూర్తిని జతజేస్తూ. లేకుంటే సంధ్యావందనమెక్కడ చౌశీతి బంధములు (84 విధములగు బంధములు) ఎక్కడ. వారు పూరించిన నైపుణ్యమును గమనించండి:
వింధ్యాద్రిప్రభలొప్పు బల్కుచములన్ వేపట్టి పెంపొందు కా
మాంధ్యంబార్పగలేక వేర్రివయి ఎలా మంచి ఈ రాతిరిన్
సంధ్యన్ జేసెదు కాముకేళి యనగా సాహిత్యమా లేక నీ
సంధ్యావందనమా! చరించ వలదా చౌశీతి బంధంములన్
మరి ఇచట శృంగారపరముగా చెప్పుట తప్పనిసరి. అంతమాత్రముచే వారి పాండితీగరిమను తప్పుబట్ట వచ్చునా!
ఇక 20 వ శతాబ్దములో అవధానమే తన వృత్తి మరియు ప్రవృత్తిగా చేసుకొని కుటుంబ పరమైన వ్యాపారమునకు పెద్దపీటవేయక, అవధానమే ప్రధానముగా చేసుకొనుచూ గడియారము వెంకటశేష శాస్త్రి గారి ప్రియశిష్యుడై మహా మహా ఉద్దండులైన నాటి పండితులను పృచ్ఛకులుగా కలిగి లోకాన్ని ఒప్పించి మెప్పించిన అనర్ఘ అవధాన రత్నము ఛ్.వ్. సుబ్బన్న శతావధాని గారు. నాటి ఆయన పృచ్ఛకులలో గడియారము వెంకటశేష శాస్త్రి గారు, దుర్భాక రాజశేఖర శతావధాని గారు, పుట్టపర్తి నారాయణాచార్యులవారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, వెంపరాల సూర్యనారాయణ శాస్త్రిగారు, గంటి జోగి సోమయాజి గారు,దీపాల పిత్చ్య్య స్దాష్ట్రిగారు, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు,జమ్మలమడక మాధవరాయ శర్మ గారు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారు,రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు, పేరి సూర్యనారాయణ శాస్త్రి గారు, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రిగారు, బోయి భీమన్న గారు, దాశరథి గారు సినారె గారు, ఈ విధముగా చెప్పుకొంటూ పోతే చేంతాడంత పట్టిక తయారవుతుంది.అన్నిటికీ మించి వీరి అవధానము శంకరాచార్య పీఠమున చంద్రశేఖర యతీంద్రుల వారి పనుపున జరిగినపుడు సంస్కృతి, సంస్కృత శిరోమణి యగు జయేంద్ర సరస్వతి స్వాములవారు పృచ్ఛక స్థానమును అలంకరించి వారికి దత్తపదిని ఇచ్చియుండినారు. మొదటి ప్రపంచ తెలుగు మహాసభకు ఆదరపూర్వకముగా ఆహ్వానింబడి, అత్యున్నత, అద్వితీయ గౌరవమును బడసిన ఆదియవధాని వీరే! ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే పైకి అశ్లీలముగా కనిపించే దత్తపది, సమస్యలు పైన తెలిపిన మహామహులలో కొందరిచ్చినా సుబ్బన్న గారు ఎంత గొప్పగా ఏమాత్రమూ అశ్లీలమునకు తావివ్వక పూరించినారో తెలియజేయుటకే! వీరు పూరించిన ఒక సమస్య :’ మీనాక్షికి కుచాములారు మీసములేడున్’
ఆనాడు ప్రోద్దువోయెను
జానయు తత్పతియుగూడి సరి క్రీడింపన్
లూన ముకురమున దోచెన్
మీనాక్షికి, కుచములారు మీసములేడున్
ఒకానొకరోజు తమకముతో తల్లడిల్లిన దంపతులు ఒకరికొకరు తీసిపోక పెద్దప్రోద్దు క్రీడించిరి. అద్దము చిట్లినది (లూన ముకురము) అన్న జ్ఞాపకము కూడా వారికి లేదాయే. అలసిన మీనాక్షి అనుకోకుండా అద్దములో చూస్తే ఆరు కుచములు ఏడు మీసములు కనిపించినవట.ఇక్కడ కవి ‘మీనాక్షి’ అన్న పదమును సాభిప్రాయ విశేషణముగా చేసినాడు. కామోద్రిక్తయైన మగువ తత్సమయమున మత్స్యస్ఫూర్తి పొండునన్నది శాస్త్ర వచనము. ఆశువుగా చెబుతూ కూడా ఎంత గొప్పగా పూరించినారో చూడండి. ఇందులో చూడస్వలసినది చమత్కారముకానీ శృంగారము కాదు. సందర్భానుసారముగా స్పందిన్చినవాడే నిజమయిన శ్రోత లేక పాఠకుడు.
ఇక ఆయన అవధానము చేయు కాలములోనే మహామహులగు పృచ్ఛకులు ఆయనకు అలనాటి సినిమా తారామణుల పేర్లు దత్తపదిగా ఇవ్వటము తటస్తించినది. గమనించండి:
భానుమతి, అంజలి, జయప్రద, జమున
సీత హరించె భానుమతి శిష్ట గతిన్ జని రావణుండు, త
జ్ఞాతిని సంహరింప యతి సంఘము గోరగనంజలించి, దో
ర్భూతి జయప్రద ప్రథనమున్ నడిపించి రఘుప్రవీరుడా
క్రోతి యశోక భూజమునకున్ బ్రధితత్వము గూర్చె శూరుడై
భానుమతి = ప్రకాశవంతమైన అంటే జ్ఞానియయ్యును సన్యాసి వేషములో సీతను అపహరిచగా, అరాచాకములు సేయు ఆతనిని సంహరించమని ఋషిగణము అడుగగా (ఇచ్చట జ్ఞాతి అన్న శబ్దము ఉపయోగింపబడినది, పులస్త్యుదుఇ బ్రహ్మ మానస పుత్రుడు మరియు మహర్షి. బ్రహ్మ మానస పుత్రులగు మిగత మహర్షుల సంతతికి రావణుడు జ్ఞాతియే కదా!) భయంకర (దొర్భూతి జయప్రద ప్రథానము = జయప్రదమైన భయంకర యుద్ధము) చేసి కోతికీ (హనుమంతునికి), అశోక వృక్షమునకు యశస్సు(ప్రధితత్వము) ను గూర్చెను.
ఆ కాలముననే ఇటువంటి దత్తపదుఇలు ఉండినవి అని తెలుపుటకు ఈ పద్యము ఉటంకించినాను. ఇక్కడ చూడవలసినది సినీతారల పేర్లుకాదు. అందులోని అక్షరాలను భిన్నార్ ము పాదములుగా ఎట్లు వాడుకొని రక్తి కట్టించినారు అన్నది చూడవలసినది. అసభ్యత అశ్లీలత ఆవగింజంత కూడా కనిపించవు పూరణలో. ఆమాటకొస్తే ఆ పద్యము కవియొక్క ఊహాశక్తికి అద్దము పడుతుంది. ఈవిధమైన తారల పేర్లతో నేను నింపాదిగా పూరించిన పద్యమును ఒక పండిత పాఠకుడు (నాకు అన్నయ్యతో సమానము) సినిమాతారల పేర్లెందుకు అని నిరసించుతూ మీరు కూడా అవధానియైపోయినారు అని అనటము జరిగినది. వారి మాటను ఆశీస్సుగా తీసుకొని, పరమాత్ముని వచ్చే జన్మలో నాకూ అంతటి ధిషణ ప్రసాదించమని కోరుకొంటాను. ఈ విధమైన ప్రయత్నమూ చేయుట వల్ల ధీజడిమ తగ్గి ధీపటిమ పెరుగుతుంది. నేర్పుగలవారు ఇటువంటి ప్రయత్నము చేయుట మంచిది. నేను చేసినదీ అటువంటి ప్రయత్నమే . తప్పేమీ నాకు గోచరము కాలేదు.
ఇక మాడుగుల వారిని గూర్చి వ్రాసిన చెడుగు పూర్తిగా అసందర్భము. నేను వ్రాసిన పూరణ బాగుందాలేదా అన్నదే ఆ ప్రచరణ లోని వస్తువు. దానిని ప్రక్కనుంచి పరనిందకు పాల్పడినారు కొందరు. ఒకరి మంచి చెడ్డ నిర్ణయించేది పరమాత్ముడు, మనము కాదు. మనకు కావలసినది పాండిత్యము. ఈ కాలములో ఆయన గొప్ప పండితుడు. శృంగేరి పీఠాధిపతి సంస్కృతావధానము చేయించనెంచి ఆయనను పిలువనంపి ఏర్పాటు చేయించినారు. తాను తెలుగు పండితునిగా పనిజేసిన కాలములో కడప రామకృష్ణ జూనియర్ కాలేజి కి ప్రిన్సిపాల్ గా వుండిన గోపాల కృష్ణమూర్తిగారు తాను వ్రాసిన పుస్తక ఆవిష్కరణకు అధ్యక్షత వహించమని ఆహ్వానించితే తన ఖర్చులతో పోయి ఆపని నిర్వహించినారు. ఆయన చరవాణి సంఖ్య తెలుసుకొని నేను ఆయనతో పునః పరిచయము చేసుకొంటూ శ్భీ-Zఓ-తిరుపతిలో ఆయన అవధానమును ఏర్పాటుచేసిన విషయము గుర్తుచేస్తే కష్టకాలములో వున్నపుడు నాలోని ప్రత్యేకతను గుర్తించి తగువిధముగా సన్మానించిన మీ వంటివారిని మరచిపోను అన్నాడు. అది ఆయనలోని సద్గుణము. గుర్తింపు దొరికిన పిమ్మట ప్రతివ్యక్తిలోనూ మంచి చెడు చూచుట సహజము, కానీ అది సందర్భానుసారముగా ఉండుట ఎంతో అవసరము. మనము హంసలమై క్షీరమును గ్రోలి నీటిని విడుచుట మంచిది.
నేనసలు ఒక నాలుగు దినముల క్రితము ప్రచురించిన దత్తపది ప్రజ్ఞ కలిగిన యువతను ప్రోత్సహించుటకే! నేనేమీ తప్పు చేయలేదు. అటువంటివి నాకు తోచినపుడు ఆస్య గ్రంధి లో పెడుతూ వుంటాను, యువత స్పూర్తిని పొందుతారన్న నమ్మకముతో! చివరిగా ఒక మాట. ఒకరినొకరు గౌరవించుకొంటే వాతావరణము సుహృద్భావముతో నిండి ఆహ్లాదకరముగా ఒప్పారుతుంది. ఆదిశగా అడుగేద్దాం.
స్వస్తి.

23, జనవరి 2019, బుధవారం

మనదైన అసలైన సంఖ్యామానము. .. .. .. బ్రహ్మశ్రీ కొరిడే విశ్వనాథశర్మ.

1 comments

  జైశ్రీరామ్. 
ఆర్యులారా! బ్రహ్మశ్రీ కొరిడే విశ్వనాథశర్మ మనదైన అసలైన సంఖ్యామానము గుర్తు చేసారు 
చూడండి.

సంఖ్యామానం:
ఒకటి =1
పది =10
వంద =100
వెయ్యి =1000
పదివేలు =10000.
లక్ష =100000
పదిలక్షలు =1000000
కోటి =10000000
పది కోట్లు= 100000000
శతకోటి =1000000000
సహస్త్ర కోటి =10000000000
అనంతకోటి =100000000000
న్యార్భుద్ధం =1000000000000
ఖర్వం =10000000000000
మహాఖర్వం =100000000000000
పద్మం =1000000000000000
మహాపద్మం =10000000000000000
క్షోణి =100000000000000000
మహాక్షోణి =1000000000000000000
శంఖం =10000000000000000000
మహాశంఖం =100000000000000000000
క్షితి =1000000000000000000000
మహాక్షితి =10000000000000000000000
క్షోబం =100000000000000000000000
మహా క్షోబం =1000000000000000000000000
నిధి =10000000000000000000000000
మహానిధి =100000000000000000000000000
పరాటం =1000000000000000000000000000
పరార్థం =10000000000000000000000000000
అనంతం =100000000000000000000000000000
సాగరం =1000000000000000000000000000000
అవ్యయం =10000000000000000000000000000000
అమృతం =100000000000000000000000000000000
అచింత్యం =1000000000000000000000000000000000
అమేయం =10000000000000000000000000000000000
భూరి =100000000000000000000000000000000000
మహాభూరి =1000000000000000000000000000000000000
మన భారతీయ  హైందవ సాంప్రదాయములో మాత్రమే అంత పెద్ద సంఖ్యలకు కూడా నిర్దిష్టమైన పేర్లు గలవు.
అందుకే మనం భారతీయునిగా పుట్టినందుకు గర్వించాలి, మన సాంప్రాదాయాలను కాపాడుకోవాలి.
స్వస్తి.
అందుకే నేనంటాను
జై విశ్వనాథా! అని.
జైహింద్.

22, జనవరి 2019, మంగళవారం

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులకు శుభోదయమ్.

కేవలం శాస్త్రపండితులకు కవిత్వం మీద గౌరవంవుండదు. శాస్త్రంచదివి పూర్వపక్ష సిద్ధాంతాలుచేసి ప్రతిపక్షుల ముఖపిదానం చేయడమే  వారిపరమార్థం - లోలోపల సంస్కృత పండితులలోనే శాస్త్రపండితులకూ కవులకూ రావరవలు వున్నాయి
"ఘట: పట ఇతి స్ఫుటం పటురటంతి నైయాయికాః
పఠన్తిచ హాఠాత్తరాం కఫ ఛటేతి పాతంజలా :
వయంవకుళ మంజరీ గళదరీణ మాధ్వీఝరీ
ధురీణ శుభరీతిభిః ఫణితిభిః ప్రమోదామహే
తర్కవ్యాకరణపండితులు రసజ్ఞులుకారు. శుష్క తర్క వితర్క వాచాలురు. కవులు మధుమయ ఫణుతులతో వినోదిస్తారు.
నైవవ్యాకరణాజ్ఞ మేవ పితరం నభ్రాతరం తార్కికం
దురాత్సంకుచితైవ గచ్ఛతి యథా చండాలవ చ్ఛాన్ద సాత్
మీమాంసా నిపుణం నపుంసక మితి జ్ఞాత్వా నిరస్యాదరాత్
కావ్యాలంకారణజ్ఞ మేవ కవితా కన్యా వృణేతే స్వయమ్
కవితాకన్యకు తండ్రివంటివాడు వైయాకరణుడు , సోదరుడు తార్కికుడు ; శ్రోత్రియుడు అంటరానివాడు ; మీమాంసకుడు నపుంసకుడు. వారెవ్వరూ వరించదగ్గవారుకారు. ఇక కావ్యాలంకారవేత్తయైన రసజ్ఞుడే వరణీయుడు - అని కవులు శాస్త్రపండితులను ఈసడించారు.
విద్వత్కవయః కవయ : కేవలం కవయస్తు కేవలం కపయ :పాండిత్యం తో చెప్పినవారే కవులు. వట్టి కవులు వట్టి కపులు - అనిపండితులు తిరస్కరించారు.
మొత్తం మీదచేస్తే కవులకు శాస్త్రపాండిత్యమవసరమే. కాని దానికి కొమ్ములిస్తే మాత్రం అది కవిత్వాన్ని పట్టి పల్లార్చడం నిజం
రెండింటి సరస సమ్మిశ్రణ మే ఉత్తమ కవితామార్గం.
జైహింద్. 

21, జనవరి 2019, సోమవారం

శివామృతలహరి ... శ్రీ ఏల్చూరి మురళీధరరావు

1 comments

జైశ్రీరామ్.
శివామృతలహరి  ...  శ్రీ ఏల్చూరి మురళీధరరావు 

౧. శ్రీనాదాంతవిభావనీయపరమశ్రేయోనిధానా! త్రివే
దానుస్వారవిధాన! వైదికలతాంతారూఢతత్త్వైకవి
ద్యానన్యాదృశకేళిరమ్య! ప్రణవధ్యానైకగమ్యా! స్వస
ర్గానూనస్థితిసంహృతిత్రితయముక్తాకార! విశ్వేశ్వరా!

౨. కలరూ పేర్పడరాని వైద్యుతలతాకల్పంబవై పొల్చి, పెన్
వెలుఁగై నిల్చిన నాదబిందుసుకళాభిజ్ఞాస్పదభ్రూయుగీ
విలసన్మధ్యతలావతార! కరుణావిస్తార! నాలోన ని
న్నెలమిం దాపము తీఱఁ జూచు టెపుడోయీ, స్వామి విశ్వేశ్వరా!    

౩. నీవై యుంచెదు మంటినేల మొలకన్;నీర్వోసి పేరాదటం
జేవ న్నించెద; విట్లు పెంచెదవు హృత్సీమన్ వెలుంగై మము
న్నీవే నొంచెద; వింకఁ ద్రుంచెదవునున్నీలాభ్రధూర్జాటజూ
టీవిస్తీర్ణసురాపగాశివచిరంటీరమ్య! విశ్వేశ్వరా!

౪. ఓంకారాభిధమంత్రబంధశుభవర్ణోర్జస్వలప్రౌఢిమా
లంకర్మీణ! భవార్తభక్తజన కల్యాణైకపారీణ! భా
వాంకూరశ్లథనైకదక్ష! దురితవ్యాఘ్రౌఘహర్యక్ష! య
స్తుంకారమ్మును జూపి బాపవె మనోదుఃఖమ్ము విశ్వేశ్వరా!                

౫. సేవింతున్ నిగమాగమాంకితశుభశ్రీనామధేయున్, నినున్
భావింతున్ జతురాస్యకేశవనిలింపాదృష్టచూడాపదుం,
గావింతున్ భవదీయదాసజనకైంకర్యంబు, నీ పాదరా
జీవద్వంద్వనిరంతరార్చనవిధిన్జీవింతు విశ్వేశ్వరా!

౬. చిరమై శారదచంద్రికారుచిరమైశీర్యణ్యగంగాశుభా
కరమై శాంతజితేంద్రియప్రకరమైకైవల్యమందారసుం
దరమై విద్రుతభక్తలోకదరమైధర్మానుసంధానసు
స్థిరమై పొల్చెడు వెల్గు నొకఁడేసేవింతు విశ్వేశ్వరా!                   

౭. నతభక్తార్ణవచంద్రమండలఘృణీ!నైజాత్మయోగారణీ!
స్తుతకల్యాణమణీ! జటాటదమరస్రోతస్వినీధోరణీ!
శ్రితలోకైకశిరోమణీ! శ్రుతిశిరస్సీమంతముక్తామణీ!
ప్రతిమానన్యు నినున్ భవాబ్ధితరణీ!ప్రార్థింతు విశ్వేశ్వరా.

౮. గాలింతున్ నిను గాలిలోఁ, బృథివి, నాకాశంబులో, నీటిలో,
లీలామేయ! వెలుంగులోన; నిజకేళీకల్పవిశ్వా! జగ
జ్జాలంబున్ మథియింతుఁ గాని, భవనిస్తారైకకేళీధృతిన్
నాలో నున్నది నీవు నేనని మదిన్భావింప విశ్వేశ్వరా.

౯. కల్యాణావహధర్మనిర్మలగుణౌకస్ఫూర్తి నీ జీవసా
కల్యంబుం బరమానురాగమయవీక్షాదీక్ష రక్షించి కై
వల్యానందమరందమత్తమధుపవ్రాతంబుగాఁ దీర్చు వై
పుల్యప్రోజ్జ్వలదివ్యభావమహితాంభోజాక్ష విశ్వేశ్వరా!

౧౦. శర్వాణీరమణీమణీహృదయశశ్వత్పద్మభృంగాణ! నీ
నిర్వాణప్రదనిర్మలాకృతిని మౌనిప్రాజ్ఞు లూహింప దృ
క్పర్వంబై యగుపింతు వెట్లు దయఁ బ్రోవన్ రావె తండ్రీ! నను
న్నర్వాచీనవటద్రుమూలఫలవిద్యామూర్తి! విశ్వేశ్వరా!      

౧౧. శ్రీగౌరీకుచకుంభసంభృతలసత్‌శ్రీగంధకస్తూరికా
భోగోరస్కుఁడ ! నిన్నుఁ గొల్తు, భుజగీభూషాక ! నీతో జనుః
ప్రాగల్భ్యంబు స్మరింతు, నీ కొఱకు నర్చాకర్మఁ గావింతు, నీ
కాగమ్యస్తుతిఁ జేతు, నిల్తుఁ గడ నీయం దేను విశ్వేశ్వరా!
(డిశంబరు సిరిమల్లె)
జైహింద్.

20, జనవరి 2019, ఆదివారం

భారణా,ఉత్సుక,భస్మభూ,పూర్ణోత్పల,ఉత్పలమాల,నిలుకడ,వరదాకర,చిరాయు,సుబోధినీ,రంబకా,రంజక,గర్భ"-హృదోత్పల వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి.జుత్తాడ.

1 comments

జైశ్రీరామ్.
భారణా,ఉత్సుక,భస్మభూ,పూర్ణోత్పల,ఉత్పలమాల,నిలుకడ,వరదాకర,చిరాయు,సుబోధినీ,రంబకా,రంజక,గర్భ"-హృదోత్పల వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి.జుత్తాడ.
                     
"-హృదోత్పల"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.న.భ.భ.ర.య.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమముగలదు.
భావ సుబోధకంబగుచు!పామర రంజక మేర్పడన్?వరాశ్రీ తెన్గునౌ భువిన్!
సేవితమై బుధాళికిని!క్షేమకమై రస నిల్చుతన్?చిరాయుః కీర్తి వర్ధిలన్!
దేవత లెల్ల కీర్తిలగ !ధీమహియౌ?వెస ధీదితుల్!స్థిరంబై నిల్చు లోకమున్!శ్రీవరదంబులౌ!కరము!శ్రీమతమై తెలుగున్జనున్!సిరుల్!దైవాను కూల్యమై!

1.గర్భగత"-భారణా"-వృత్తము.
బృహతీఛందము.భ.ర.న.గణములు.వృ.సం.471.ప్రాసగలదు.
భావ సుబోధకంబగుచు!
సేవితమై!బుధాళికిని!
దేవత లెల్ల కీర్తిలగ!
శ్రీవరదంబులౌ! కరము!

2.గర్భగత"-ఉత్సుక"-వృత్తము.
బృహతీఛందము.భ.భ.ర.గణములు.వృ.సం.183.ప్రాసగలదు.
పామర రంజక మేర్పడన్?
క్షేమకమై రస నిల్చుతన్?
ధీమహియౌ!వెసధీదితుల్!
శ్రీమతమై తెలుగున్జనున్!

3.గర్భగత"-భస్మభూ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.య.ర.లగ.గణములు.వృ.సం.82.ప్రాసగలదు.
వరాశ్రీ తెన్గునౌ భువిన్?
చిరాయుః కీర్తి వర్ధిలన్!
స్థిరంబై నిల్చు లోకమున్!
సిరుల్ దైవాను కూదైవానర

4.గర్భగత"-పూర్ణోత్పల"-వృత్తము.
ధృతిఛందము.భ.ర.న.భ.భ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమముగలదు.
భావ సుబోధకంబగుచు!పామర రంజక మేర్పడన్?
సేవితమై బుధాళికిని!క్షేమకమై రస నిల్చుతన్?
దేవతలెల్ల కీర్తిలగ! ధీమహియౌ వెస ధీదితుల్!
శ్రీవరదంబులౌ కరము!శ్రీమతమై తెలుగున్జనున్!

5.గర్భగత"-ఉత్పలమాల"-
కృతిఛందము.భ.ర.న.భ.భ.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.  ప్రాసననియమముగలదు.
భావ సుబోధకంబగుచు!పామర రంజకమేర్పడడన్? వరా!
సేవితమై! బుధాళికిని!క్షేమకమై రస నిల్చుతన్?చిరా
దేవత లెల్ల కీర్తిలగ!ధీమహియౌ వెస ధీదితుల్?స్థిరమ్!
శ్రీవరదంబులౌ కరము!శ్రీమతమై తెలుగున్జనున్!సిరుల్!

6.గర్భగత"-నిలుకడ"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.ర.య.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమముగలదు.
పామర రంజక మేర్పడన్?వరాశ్రీ తెన్గునౌ భువిన్?
క్షేమకమై రస నిల్చుతన్?చిరాయుః కీర్తి వర్ధిలన్?
ధీమహియౌ వెస ధీదితుల్?స్థిరంబై నిల్చు లోకమున్!
శ్రీమతమై తెలుగున్జనున్?సిరుల్ దైవానుకూల్యమై!

7.గర్భగత"వరదాకర"-వృత్తము
ఉత్కృతిఛందము.భ.భ.భ.ర.య.ర.య.స.జ.లలలగణములు.
యతులు.10,18.ప్రాసనియమముగలదు.
పామర రంజక మేర్పడన్?వరాశ్రీ తెన్గునౌ భువిన్?భావ సుబోధకంబగుచు!
క్షేమకమై రసనిల్చుతన్?చిరాయుః కీర్తి వర్ధిలన్?సేవితమై బుధాళికిని!
ధీమహియౌ వెస ధీదితుల్?స్థిరంబై నిల్చు లోకమున్!దేవత లెల్ల కీర్తిలగ!.
శ్రీమతమై తెలుగుం జనున్ సిరుల్? దైవాను కూల్యమై!శ్రీవరదంబులౌ                                                                                                         కరము!

8.గర్భగత"-చిరాయు"-వృత్తము.
అత్యష్టీఛందము.య.ర.య.స.జ.లల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనియమముగలదు.
వరాశ్రీ తెన్గునౌ భువిన్?భావ సుబోధకంబగుచు!
చిరాయుః కీర్తి వర్ధిలన్?సేవితమై బుధాళికిని!
స్థిరంబై నిల్చు లోకమున్!దేవత లెల్ల కీర్తిలగ!
సిరుల్ దైవాను కూల్యమై! శ్రీవరదంబులౌ?కరము!

9.గర్భగత"-సుబోధినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.య.ర.య.స.జ.స.స.స.లగ.గణములు.
యతులు.9,18.ప్రాసనియమముగలదు.
వరాశ్రీ తెన్గునౌ భువిన్?భావ సు బోధకంబగుచు!పామర రంజక మేర్పడన్?
చిరాయుః కీర్తి వర్ధిలన్?సేవితమై బుధాళికిని!క్షేమకమై రస నిల్చుతన్?
స్థిరంబై నిల్చు లోకమున్!దేవత లెల్ల కీర్తిలగ!ధీమహియౌ వెసధీదితుల్?
సిరులు దైవానుకూల్యమై!శ్రీవరదంబులౌ?కరము!శ్రీమతమై తెలుగున్జనున్!                                                                                        
10,గర్భగత"-రంబకా"-వృత్తము.
ధృతిఛందము.భ.భ.ర.భ.ర.న.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమముగలదు.
పామర రంజక మేర్పడన్?భావ సుబోధకంబగుచు!
క్షేమకమై రస నిల్చుతన్?సేవితమై బుధాళికిని!
ధీమహియౌ?వెస ధీదితుల్!దేవతలెల్ల కీర్తిలగ!
శ్రీమతమై తెలుగున్ జనున్!శ్రీవరదంబులౌ?కరము!

11.గర్భగత"-రంజక"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.ర.భ.ర.న.య.ర.లగ.గణములు.
యతులు.10,19.ప్రాసనియమముగలదు.
పామర రంజక మేర్పడన్?భావ సుబోధకం బగుచు!వరాశ్రీ తెన్గుతా!భువిన్?
క్షేమకమై రస.నిల్పుతన్?సేవితమై బుధాళికిని!చిరాయుః కీర్తి వర్ధిలన్!
ధీ మహియౌ?వెస ధీదితుల్!దేవతలెల్ల కీర్తిలగ!స్థిరంబై నిల్చు లోకమున్!
శ్రీమతమై!తెలుగున్ జనున్!శ్రీవరదంబులౌ?కరము!సిరులు దైవానుకూల్యమై!
స్వస్తి
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

19, జనవరి 2019, శనివారం

సర్వథా వ్యవహర్తవ్యం . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. “సర్వథా వ్యవహర్తవ్యం 
కుతో హ్యవచనీయతా |
యథా స్త్రీణాం తథా వాచాం
సాధుత్వే దుర్జనో జనః ” ||(ఉ.రా.చ.)
తే.గీ. స్త్రీలు మృదువుగా పలుకుచో బేలలంచు
లోకువగచూతురెల్లరున్ లోకమునను.
కర్కశులయెడ కఠినవైఖరిని మెలగి
తమను తామె కాపాడుకో తగును స్త్రీలు. 
భావము.స్త్రీలు మృదుప్రవర్తన కలిగి, మెత్తగా మాట్లాడితే సాధారణమానవులైనా దౌష్ట్యం ప్రదర్శిస్తారు. అందువలన లోకంలో స్త్రీలు కాఠిన్యం వహించి ప్రవర్తించడం మేలుచేస్తుంది.
జైహింద్.

18, జనవరి 2019, శుక్రవారం

రాయసా,మాతా,సమీపక,ప్రాయక,నీతివాచా,ఆగత,తేజోబల,అచిర,నిరామయ,భ్రమజీవనాగర్భ"శాలినీ"-వృత్తము.

1 comments

జైశ్రీరామ్.
రాయసా,మాతా,సమీపక,ప్రాయక,నీతివాచా,ఆగత,తేజోబల,అచిర,నిరామయ,భ్రమజీవనాగర్భ"శాలినీ"-వృత్తమరచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.            
శాలినీవృత్తము.  
ఉత్కృతిఛందము.ర.య.స.న.ర.మ.న.మ.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమముగలదు.
గూడు వీడిపోయే చిలుకా!కులుకు శాశ్వతంబా!కాదే!కొలువు శ్రీరామా! యంచున్!                                               పాడుపొట్ట నింపే తలపా!పలుకు నీతి వాక్యా లెల్లన్!బలముతేజంబెెం చన్గన్!                                                         మేడిపండు తీరెంచకుమా!మెలగు గమ్యమందే తీరున్!మెలకు వందన్ మేలౌగా?                                                 గోడునందు మార్గం విడుమా!కుల,మతాల పోరే!దోషమ్!కులకుడీవే లోకానన్?                                                                                
1.గర్భగత"-రాయసా"-వృత్తము.
బృహతీఛందము.ర.య.స.గణములు.వృ.సం.203.ప్రాసనియమముగలదు.
గూడువీడి పోయే!చిలుకా!
పాడుపొట్ట నింపే తలపా!
మేడిపండు తీ రెంచకుమా!
గోడునందు మార్గం విడుమా!
2.గర్భగత"-మాతా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.మ.గణములు.వృ.సం.24.ప్రాసనియమముగలదు.
కులుకు శాశ్వతంబా!కాదే!
పలుకు నీతి వాక్యాలెల్లన్!
మెలగు గమ్యమందేతీరున్!
కుల,మతాల పోరే!దోషమ్!
3.గర్భగత"-సమీపక"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.మ.గగ.గణములు.వృ.సం.8,ప్రాసనియమముగలదు.
కొలువు!శ్రీరామా!యంచున్!
బలము,తేజంబెంచంగన్?
మెలకు వందన్మే లౌగా!
కులికు డీవే?లోకానన్!
4.గర్భగత"-ప్రాయక"-వృత్తము.
ధృతిఛందము.ర.య.స.న.ర.మ.గణములు.యతి.10,వయక్షరము.
ప్రాసనియమముగలదు.
గూడు వీడిపోయే!చిలుకా!కులుకు శాశ్వతంబా!కాదే!
పాడు పొట్ట నింపే!తలపా!పలుకు నీతి వాక్యాలెల్లన్?
మేడిపండు తీరెంచకుమా!మెలగు గమ్యమందే!తీరున్!
గోడునందు మార్గం విడుమా!కుల,మతాల పోరే దోషమ్!
5.గర్భగత"-నీతి వాచా"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.మ.న.మ.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమముగలదు.
కులుకు శాశ్వతంబా!కాదే?కొలువు శ్రీరామా!యంచున్!
పలుకు నీతి వాక్యాలెల్లన్!బలము తేజం బెంచంగన్!
మెలగు గమ్య మందే తీరు న్మెలకు వంద న్మేలౌగా!
కుల మతాల పోరే!దోషమ్!కులికుడీవే!లోకానన్!
6.గర్భగత"-ఆగత"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.మ.న.మ.మ.జ.త.లగ.గణములు.
యతులు.10,18.ప్రాసనియమముగలదు.
కులుకు శాశ్వతంబా!కాదే?కొలువు శ్రీరామా!యంచున్!గూడు వీడి పోయే చిలుకా!                                               పలుకు నీతి వాక్యాలెల్లన్!బలము,తేజంబెంచంగన్!పాడు పొట్ట నింపేతలపా!                                                         మెలగు గమ్య మందే తీరున్!మెలకు  వందం మేలౌగా!మేడి పండు తీరెంచకుమా!                                               కుల,మతాల పోరే దోషమ్!కులికు డీవే లోకానన్!గోడు నందు మార్గం విడుమా!                                                                                  
7.గర్భగత"-తేజోబల"-వృత్తము.
అత్యష్టీఛందము.న.మ.మ.జ.త.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమముగలదు.
కొలువు శ్రీరామా!యంచున్!గూడు వీడి పోయే చిలుకా!
బలము తేజం బెంచంగన్!పాడు పొట్ట నింపే తలపా!
మెలుకు వందన్మేలౌగా! మేడిపండు తీరెంచకుమా!
కులికు డీవే?లోకానన్!గోడు నందు మార్గం విడుమా!
8.గర్భగత"-అచిర"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.మ.మ.జ.త.జ.స.య.గగగణములలు.
యతులు.9,18.
ప్రాసనియమముగలదు.
కొలువు!శ్రీరామా యంచున్!గూడు వీడీపోయే!చిలుకా!కులుకు శాశ్వతంబా! కాదే?                                               బలము,తేజం బెంచంగన్!పాడు పొట్ట నింపే!తలపా!పలుకు నీతి వాక్యాలెల్లన్!                                                     మెలుక వందం మేలౌగా!మేడిపండు తీరెంచకుమా!మెలగు గమ్యమందేతీరున్!                                                   కులికు డీవే!లోనానం!గోడు నందు మార్గం విడుమా!కుల,మతాల పోరే దోషమ్!                                                                                  
9.గర్భగత"-నిరామయ"-వృత్తము.
ధృతిఛందము.న.ర.మ.ర.య.స.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమముగలదు.
కులుకు శాశ్వతంబా!కాదే!గూడు వీడి పోయే చిలుకా!
పలుకు నీతి వాక్యా లెల్లన్?పాడు పొట్ట నింపే!తలపా!
మెలగు గమ్య మందే!తీరున్!మేడిపండు తీరెంచకుమా!
కుల,మతాల పోరే!దోషమ్!గోడునందు మార్గం విడుమా!
10,గర్భగత"-భ్రమజీవనా"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.మ.ర.య.స.న.మ.గగ.గణములు.
యతులు.10,19. ప్రాసనియమముగలదు.
కులుకు శాశ్వతంబా!కాదే?గూడువీడి పోయే చిలుకా!కొలువు శ్రీరామా!యంచున్?                                               పలుకు నీతి వాక్యా లెల్లన్!పాడుపొట్ట నింపే తలపా!బలము,తేజం బెంచంగన్?                                                       మెలగు గమ్య మందే తీరున్?మేడిపండు తీరెంచకుమా?మెలకువందం మేలౌగా!                                                 కుల,మతాలు పోరే!దోషమ్?గోడు  నందుమార్గం!విడుమా!కులికు డీవే? లోకానన్!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
 జైహింద్. 


17, జనవరి 2019, గురువారం

16 - 01 - 2019 వ తేదీన రవీంద్రభారతిలో అమెరికా బాలుఁడు 18 ఏండ్ల ప్రాయముగల చి.లలిత్ ఆదిత్య ద్విగుణీకృత సంస్కృతాంధ్ర అష్టావధానము చిత్రములు.

2 comments

  జైశ్రీరామ్.
ఆర్యులారా! 
16 - 01 - 2019 వ తేదీన రవీంద్రభారతిలో అమెరికా బాలుఁడు 18 ఏండ్ల ప్రాయముగల చి.లలిత్ ఆదిత్య ద్విగుణీకృత సంస్కృతాంధ్ర అష్టావధానం జరిగింది.
తాను చూపిన అసాధారణ ప్రతిభ సభాసదులను ముగ్ధులను చేసింది. 
ఈ కార్యక్రమమునకు సంబంధించిన ఛాయాచిత్రములు.
 
 ఇందు నేను దత్తపది పృచ్ఛకుఁడను.
నేనొసగిన దత్తపది
అమ్మ - అక్క - చెల్లి - అన్న
ఈ పదములనుఅన్యార్త్మములో ప్రయోగించి అవధాన భారతీ వైభవ వర్ణము.

అవధాని పూరణము.

అక్కటికమ్ము జూపె కమలాసన సుందరి శారదాంబ తా
నెక్కడికక్కడేశుచమునంతము చేసెడి మాట చెల్లి నే
చిక్కనటన్న దీవనను శీఘ్రమె వాణి సభన్ ఘటించి రెం
డ్రెక్కల సద్వధానమున లీలగనమ్మహనీయమై చనెన్.

నా పూరణము.
అమ్మహనీయ భారతి మహాద్భుత తేజము చెప్పనౌనె నా
కిమ్మహినక్కజంబుకద. హృద్యమనోజ్ఞ మహత్వ రూపమున్
సొమ్ములవెన్నొ చెల్లినను శోభిలనేరవు. వాణి మాత్రమే
సమ్మతినబ్బెనన్నతగుసత్యవధానప్రకాశితమ్మగున్.
జైహింద్.

16, జనవరి 2019, బుధవారం

కనుము శుభంబులార్యులకు గణ్యముగా కలిగించు నెమ్మితోన్

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! మీకందరికీ కనుము శుభాకాంక్షలు.
మినుమున గారెలన్ రుచిగ మేదుర రీతిని చేసి ప్రేమతోిన్
తిను బసవా యటంచు వినుతించుచు పెట్టిన మేలు గొల్పెడున్.
ఘనమగు సత్ఫలంబులకు కారణమౌనిది. కాన చేయుడీ!
కనుము శుభంబులార్యులకు గణ్యముగా కలిగించు నెమ్మితోన్.
జైహింద్. 

15, జనవరి 2019, మంగళవారం

మకర సంక్రాంతి పండుగ సందర్భముగా మీ అందరికీ శుభాకాంక్షలు.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!
మకర సంక్రాంతి సందర్భంగా మీరు సకుటుంబ బంధు మిత్ర పరివారముగా సుఖ సంతోషాలతో ఆనందసాగరంలో తేలియాడాలని మనసారా కోరుకొంటూ శుభాకాంక్షలు తెలిఅయఁ జేస్తున్నాను.
చ:-మకరమునందు సూర్యుఁడు విమానప్రదేశమునందు కూడగా
సకల జగమ్ము పుణ్య పరిసంభవ కాలముగా గణించుచున్
ముకుళిత హస్తులై తలచి పూర్వుల నెల్లర బ్రాహ్మణాళిలో.
సకల పదార్థముల్ గొనగ చక్కగ నిత్రు భుజింప భక్తితో. 

ఉ:-పంట పొలాలలో విరగ పండిన పంటల లక్ష్మి బండ్లపై
నింటికి చేరి శోభిలగ, హేమ ప్రభా రమణీయ తేజసం
బంటిన రైతు బిడ్డ పరమాన్నము పంచును గాదె! పూజ్యులై
యింటికి వచ్చు వారలకు, నెంతటి పుణ్య పునీత మూర్తియో!

ఉ:-బంగరు కాంతులీను పురి పాకలు, మామిడి తోరణావళుల్
ముంగిట రంగవల్లుల నమోఘముగా విరచించు కన్యకల్
చొంగలు కార్చుచున్ కనెడి సోకుల రాయుల వేష భాషణల్
రంగుగ నద్దినట్టి చదరంగపు మ్రుగ్గుల మధ్య గొబ్బిళుల్,
జంగమ దేవరల్ కొలుపు చక్కని నాదములిచ్చు శంఖముల్
టింగరి వోలె చెట్లపయి డేకుచు నాడెడు కొమ్మ దాసరుల్
సాంగముగా హరిన్ కొలుచు సన్నుత శ్రీ హరి దాసరావళుల్
పింగళ వర్ణులౌ పగటి వేషపు గాండ్రును, పల్లె వాసులున్,
రంగుల వస్త్ర ధారణను రాజిలు ముంగిటి గంగిరెద్దులున్
హంగులకాశ చేసి వరహాలను జల్లెడి పెత్నదారులున్
నింగికినంటు యాశల మునింగియు నల్గెడి క్రొత్త యల్లుళున్
రంగులు పూసి బావలకు రాతిరి యక్కల దాచు చెల్లెళున్
బంగరు బావ గారనుచు వందలు గుంజెడి బావ మర్దులున్,
బెంగగ నుండు నప్పులిల పేరుకు పోవుచునున్న మామలున్.
భంగమునొంది జూదమున పళ్ళికలించెడి తోటి యల్లుళున్.
ఖంగని మ్రోగునట్టి గుడి గంటలు. మండెడి భోగి మంటలున్,
నింగికి నంటు సంతసము నివ్వటిలే సరి క్రొత్త జంటలున్,
బంగరు పళ్ళెరంబులను పంటికి నోటికి నచ్చు వంటలున్,
రంగుల నీను పల్లెలును రమ్యత నొప్పెడి పట్టణంబులున్,
యింగిత మున్నసత్కవుల కెల్ల మనోజ్ఞ ము సంకురాత్రులౌన్.
జైహింద్

14, జనవరి 2019, సోమవారం

ఆంధ్రామృతకు పాఠకమహాశయులకు భోగి పండుగ శుభాకాంక్షలు.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శుభోదయమ్.
మనకందరికీ ఆనందప్రదమైన భోగి పండుగ నేడు మనలనలరించ వచ్చిన సందభముగా మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియఁజేస్తున్నాను.
మీరంత పరమోత్సాహంగా ఈ భోగి పండుగను మీ బంధుకోటితో కలిసి జరుపుకొని ఆనందం అందరికీ పంచాలనీ ఈ ఆనందం కలకాలం మీలో నిలవాలని కోరుకొంటున్నాను.
జైశ్రీమన్నారాయణ.
జైహింద్.

13, జనవరి 2019, ఆదివారం

మకరసంక్రాంతి " పండుగ ఇది " #ప్రకృతి - #పండుగ . . . " సామర్ల వేంకటేశ్వరాచార్య!!HYD

1 comments


జైశ్రీరామ్.
మకరసంక్రాంతి " పండుగ  ఇది  " #ప్రకృతి - #పండుగసామర్ల వేంకటేశ్వరాచార్య!!HYD
హిందూ బంధువులందరికీ మరియు విశ్వ జనులందరకీ  " #మకరసంక్రాంతి " పండుగ శుభాకాంక్షలు !!

ఇది  " #ప్రకృతి - #పండుగ " !!
ఇది అందరి పండుగ !!

మన ప్రాచీన #భారతీయకాలగణనం ' లో ప్రధానంగా మూడు రకాల కాల గణన పద్దతులున్నాయి !!

1- చాంద్ర మానం అంటే చంద్రుని గమనాన్ని అనుసరించి కాలాన్ని లెక్క గట్టే పద్దతి !!

2- సౌర మానం అంటే  సూర్యుని గమనాన్ని అనుసరించి కాలాన్ని లెక్క గట్టే పద్ఘతి !!

3- బృహస్పతి మానం అంటే గురు గ్రహం యొక్క గమనాను సారం కాలాన్ని లెక్క గట్టే పద్ధతి !!

* మనం జరుపుకునే " #మకరసంక్రాంతి " పండుగ #సౌరమానం ప్రకారం జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ !!

* సూర్యుడు ఒక రాశిలో ఒక నెల వుంటూ 12 రాశులు - 12 నెలలు  మారుతూ వుంటాడు !!
ఒక సంవత్సరములో 12 సంక్రమణలు
జరుగుతాయి!!

అలా సూర్యుడు ధనుస్ రాశి నుండి మకర రాశిలో ప్రవేశించటమే "#మకరసంక్రమణ" #పుణ్యకాలము!!

ఇప్పటి నుండి సూర్యుడు ఉత్తరాభి ముఖంగా ప్రయాణం సాగుతుంది కనక దీనిని ' ఉత్తరాయణ పుణ్యకాలం ' అని కూడా
అంటారు !!
పగలు ఎక్కువ రాత్రులు తక్కువగా మారతాయి!!
#ప్రకృతి లో మార్పు #కాలం లో మార్పు వచ్చి చలి క్రమంగా తగ్గి ఎండ తీవ్రతలు పెరుగుతాయి !! ఇది మనందరకీ తెలుసు !!

మన ప్రాచీన ఋషుల గొప్పతనం!!
#కాలగణన- #కాలవిభజన!!

ఒక రోజును 2 భాగాలు చేశారు!!
#పగలు - #రాత్రి!!

ఒక నెలను 2 భాగాలు చేశారు!!
#శుక్లపక్షము - #కృష్ణపక్షము!!

ఒక సంవత్సరాన్ని 2 భాగాలు చేశారు!!
#ఉత్తరాయణం - #దక్షిణాయనం!!

మనకు పగలు-రాత్రి ఒకరోజుకదా!!
మనకు  సంవత్సరము దేవతలకు ఒకరోజు!!

ఉత్తరాయణము దేవతలకు పగలు!!
దక్షిణాయనము దేవతలకు రాత్రి!!ఇదీసంగతి

ఈరోజునుండి #సూర్యుడుఉత్తరాభిముఖంగా ప్రయాణిస్తాడు కనుక ఇది #ఉత్తరాయణం అయింది!! దేవతలకు పగలు ప్రారంభమైంది!!

ఉత్రరాయణములో మరణిస్తే ఉత్తమలోకాలు
ప్రాప్తిస్తాయి కనుక #భీష్ముల వారు
మహాభారతయుద్దములో దక్షిణాయనములో
నేలకొరిగినా #ఇచ్ఛామరణవరసిద్దులు
కనుక తన ప్రాణాలను నిలిపి ఉత్తరాయణంలో
ప్రాణాలు వదిలారు.ఇదిమనందరికి తెలుసు!!

ఇది పంటల పండుగ !!
ఇది పాడి పశువుల పండుగ !!
ఇది ముగ్గుల పండుగ -
ముత్తైదువల పండుగ !!
ఇది పడచు పిల్లల పండుగ -
ఇది పతంగుల పండుగ !!

ఎటుచూసినా #ధాన్యరాశులతో
#పౌష్యలక్ష్మి కలకలలాడుతుంది!!
ప్రకృతి పరవశించిపోతుంది!!
రైతన్నల గుండెలలో ఆనందం వెల్లివిరుస్తుంది!!

#గంగిరెద్దులవిన్యాసాలు!!
#హరిదాసులసంకీర్తనలు!!
#ఇంటిముంగిటముత్యాలముగ్గులు!!
#ముగ్గల్లోగొబ్బెమ్మలుపసుపుకుంకుమలు!!

చిన్నపిల్లలకు  #భోగిపండ్లు పోస్తారు!!
#రేగుపండ్లనే  #బదరీఫలాలు అంటారు!!
బదరీక్షేత్రములో #నరనారాయణలచే
స్పృశించబడి వారి ఆకలిని తీర్చాయి కనుక
అవి పవిత్రమైనవి మనకు దీర్ఘాయువును
కలిగిస్తాయి!!

ఈ  రోజు అన ేక రకాల పిండి వంటలు చేసుకున్నాఅందులో ముఖ్యమైనది
" #నువ్వులలడ్డులు" !!
తీపికి మధురమైనస్నేహానికి ప్రతీకం!!
ఈ గజ గజ వనికే చలికాలములో  నువ్వులు- బెల్లముతో చేసినలడ్డూలు ఒంటిలో వేడిని కలిగిస్తాయి!!

#నువ్వులుతింటేనవ్వులువిరబూస్తాయి!!

తెలంగాణా ప్రాంతములో #అరిసెలు #సకినాలకు ఈ పండుగ ప్రసిద్ధి!!
ఇవినెలల పాటు నిల్వ చేసుకుంటారు!!

           #మకరసంక్రమణపుణ్యకాలము
* శ్రీ  హేవలంబినామ సం!!ర పుష్యమాస బహుళ త్రయోదశి భానువారము, మూల నక్షత్ర, ధృవయోగ, వనజికరణ, కర్కాటకలగ్న శుభ సమయములో 14-1-2018 తేది  రాత్రికాలము గం!! 7 - 18 ని!!లకు సూర్యుడు మకరరాశిలో ప్రవేశించును!!
#సర్వకాలేషుసర్వేషాంశుభమ్భవతు!!

ఈ "మకర సంక్రాంతి" పుణ్యకాలము మకర
ప్రవేశానికి ముందు 2గం!!లు తరువాత
2గం!!లు వుండును!!

ఈ రోజు #పితృదేవతలను ఆరాధించాలి!!
ఇష్ట దైవాన్ని, కుల దైవాన్ని పూజించాలి!!

#గోమాతను పూజించాలి!!
#విశేషంగా #దానధర్మాలు చేయాలి!!

మంత్ర జప ధ్యాన సాధనలు పారాయణాలు చేస్తే అనంత ఫలితాన్నిస్తాయి !

" #సూర్యారాధన " విశేష ఫలితాలనిస్తుంది !!

మరోసారి మిత్రులందరికీ సంక్తాంతి-పండుగ
శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు.....
.
శుభమ్ భూయాత్ !విశ్వశాంతి వర్ధిల్లునుగాక!
----మీ సామర్ల వేంకటేశ్వరాచార్య!!HYD!!
జైహింద్.

12, జనవరి 2019, శనివారం

అష్టావధానానికి స్వాగతమ్

1 comments

జైశ్రీరామ్.
ఈ రోజు మధ్యాహ్న0 ,3గ0లకు అన్నోజి గూడ గాయత్రి ఆలయం లో మన గౌరీనాధభట్ల మెట్రామశర్మ గారి అష్టావధానం జరుగ నున్నది. సరసులందరికి సాదర స్వాగతం
జైహింద్.

యువజన దినోత్సవము సందర్భముగా మీ అందరికీ నా శుభాకాంక్షలు......1893 లో అమెరికాలో చికాగో నగరంలో స్వామీ వివేకానంద చేసిన ఉపన్యాసం వినండి.

1 comments

జైశ్రీరామ్.
యువజన దినోత్సవము సందర్భముగా మీ అందరికీ నా శుభాకాంక్షలు..
ఈ సందర్భముగా
స్వామీ వివేకానంద చికాగో ఉపన్యాసము మీముందుంచుతున్నాను

జైహింద్.

11, జనవరి 2019, శుక్రవారం

సంక్రాంతి! ఉత్తరాయణ_పుణ్యకాలం. వివరణ. బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణ.

0 comments

జైశ్రీరామ్.
సంక్రాంతి! ఉత్తరాయణ_పుణ్యకాలం.  వివరణ. బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణ.
‘సరతి చరతీతి సూర్యః’ అనగా సంచరించువాడు సూర్యుడు. భాస్కరుని సంచారం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఉత్తరాయణం, రెండోది దక్షిణాయణం. మనకు ఒక సంవత్సరకాలం దేవతలకు ఒక్క రోజు. ‘ఆయనే దక్షిణే రాత్రిః ఉత్తరేతు దివా భవేత’ అంటే ఆరుమాసాల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు. దక్షిణాయణం రాత్రి.
‘సంక్రాంతి’ లేదా ‘సంక్రమణం’ అంటే ‘చేరడం’ లేదా ‘మారడం’ అని అర్థం.సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి.
జయసింహ కల్పద్రుమం అనే గ్రంథం ‘సంక్రాంతి’ని ఇలా నిర్వచించింది.
‘‘తత్ర మేషాదిషు ద్వాదశ
రాశి క్రమణేషు సంచరితః
సూర్యస్య పూర్వన్మాద్రాశే
ఉత్తర రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః’’
మకర సంక్రమణానికెంతో ప్రాముఖ్యత ఉందని పురాణేతిహాసాల్లో కానవస్తోంది.
‘‘రవి సంక్రమణే ప్రాపే న
న్నా యాద్యన్తు మానవః
సప్త జన్మసు రోగీ స్యా
నిర్దేనశే్చన జాయతే’’
అని స్కాంద పురాణం చెబుతోంది. అంటే, రవి మకర రాశిలో ప్రవేశించినపుడు ఎవడైతే స్నానం చేయడో అలాటి వాడు ఏడు జన్మలు రోగిగా, దరిద్రునిగా ఉండిపోతాడని భావం.
పురాణాల ప్రకారం సూర్య భగవానుడు ఈ రోజునేతన కుమారుడైన శని ఇంటికి వెళతాడు.ఆయనం అనగా పయనించడం అని అర్థం. ఉత్తర ఆయనం అంటే ఉత్తరవైపు పయనించడం అని అర్థం. సూర్యుడు భూమికి కొంత కాలం దక్షిణం వైపు పయనించాక దక్షిణం వైపునుంచి ఉత్తరం వైపు పయనించనారంభిస్తాడు. సూర్యుడు పయనించే దిక్కునుబట్టి, దక్షిణం వైపు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం అనీ, ఉత్తరం వైపు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు.
ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయణం పాప కాలం అని అర్ధం చేసుకోకూడదు. దక్షిణాయణం కూడా పుణ్య కాలమే.. అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు…
ఉత్తరాయణం లో లయ కారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు.. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరం గా వుండడం వలన పుణ్య క్షేత్రాలు, తీర్ధ యాత్రలకు అనువుగా వుంటుంది.... మనం ఉత్తర దిక్కునూ, ఉత్తర భూములనూ పవిత్రం గా భావించడం వల్లనూ వేద జననం ఉత్తర భూముల్లో జరగడం వల్లనూ, హైందవ సంస్కృతి, జ్ఞాన విజ్ఞానం, భాష, నాగరికత ఉత్తరాది వైపు నుండి దక్షిణాది వైపుకు రావడం వల్లనూ, సమస్త భాషలకూ తల్లి అయిన సంస్కృతం ఉత్తరాది వైపున పుట్టడం వల్లనూ, సమస్త ఋషులకూ, దేవతలకూ, పండితులకూ ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావటం వల్లనూ, ముఖ్యం గా; ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు ఉత్తర పధ చలనం చేయడం వల్లనూ, ఉత్తరాయణ కాలం ను పుణ్య కాలం గా హిందువులు భావించారు.
సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒక వైపు అనగా దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఒకవైపు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు. భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం రాత్రిగాను, ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలం పగలు గాను అభివర్ణించారు. మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయనం నందు మేలుకొని ఉంటారని, వారు మేలుకొని ఉండగా అడిగిన కోర్కెలు వెంటనేతీరుస్తారని, ఆ విషయం అందరికీ తెలియజేయడం కోసం పెద్దలు ఈ పండుగలను జరపడం మొదలుపెట్టారు.
ఈ రోజునుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. ఎందుకంటే ఈ మకర సంక్రమణం దేవతలకు పగటి కాలం కావడమే ప్రధాన కారణం. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. ఐతే పదకొండు సంక్రమణాల్లో ఇవ్వకపోయినా, ఈ మకర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు.
ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైందని ఆర్యోక్తి. ఉత్తరాయణ కాలంలో చేసే దానాలలో ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు మొదలైనవి ఉత్తమమైనవి. ఈ కాలంలో గోవును దానం చేస్తే స్వర్గ వాసం కలుగుతుందని ఆస్తిక లోక విశ్వాసం.
స్వస్తి.
చొప్పకట్ల సత్యనారాయణ.
బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారికి ధన్యవాదములు.
జైహింద్.

10, జనవరి 2019, గురువారం

రాజమహేంద్రవరంలో అమెరికా పౌరుఁడు చిరంజీవి లలిత్ ఆదిత్య చేసిన నవావధానము

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! అమెరికాలో అమెరికా పౌరుఁడు చిరంజీవి లలిత్ ఆదిత్య చేసిన నవావధానము తిలకించండి.
ఈ చిరంజీవికి ఆశీస్సులు.
జైహింద్.

9, జనవరి 2019, బుధవారం

అమెరికా పౌరుఁడయిన చి.గన్నవరం లలిత్ ఆదిత్య చేసిన అవధానమ్

1 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా! అమెరికా పౌరుఁడయిన చి.గన్నవరం లలిత్ ఆదిత్య చేసిన అవధానం తిలకించండి.
ఆ పరమాత్మ ఈ చిరంజీవికి ఆయురారోగ్యానందైశ్వర్యాలను కలిగిస్తూ కాపాడాలని మనసారా కోరుకొంతున్నాను.
జైహింద్.

8, జనవరి 2019, మంగళవారం

ఈ నెల పదహారున రవీంద్ర భారతిలో జరిగే లలిత్ ద్విగణిత అష్టావధానమునకు ఆహ్వానము.

1 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా! నమస్తే.
జైహింద్.

7, జనవరి 2019, సోమవారం

వేదాశ్రి,రామకా,అభయాశ్రి,సత్వర,సుమనీ,కాంక్షిలు,నాజిక,నిమురక,మరకత,డాంబిక,గర్భ"-అమృతవాణి"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

1 comments

జైశ్రీరామ్.
వేదాశ్రి,రామకా,అభయాశ్రి,సత్వర,సుమనీ,కాంక్షిలు,నాజిక,నిమురక,మరకత,డాంబిక,గర్భ"-అమృతవాణి"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.

అమృతవాణి"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.త.ర.మ.ర.త.న.ర.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
సమ సామాన్యంబు నెంచకం!సర్వంబుందాము గొప్పంచుం!సముచిత బుద్ధి లేదాయెన్!
కమనీయంబౌ!హరే డనం?గర్వంబౌనూహ!మేలౌనే?గమిగన నేర వేమయ్యా?
నిమిషంబీదౌనె?కానవే!నేర్వంన్రా మంచి నిద్ధాత్రిం?నిముర కశాంతి దేశానన్?
భములాకాంక్షల్మాను శోభిల్లం?పర్వంబౌ బోధ లాలింపం?ప్రముఖత నందు వేవేగన్!

1.గర్భగత"-వేదాశ్రి"-వృత్తము.
బృహతీఛందము.స.త.ర.గణములు.వృ.సం.184.ప్రాసగలదు.
సమ సామ్యంబు నెంచకన్?
కమనీయంబౌ?హరేడనన్?
నిమిషం బీ దౌనె?  కానవే!
భము లాకాంక్ష ల్మాను శోభిల్లన్?

2.గర్భగత"-రామకా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.మ.ర.గగ.గణములు.వృ.సం.17.ప్రాసగలదు.
సర్వంబుం దాము గొప్పంచున్?
గర్వంబౌ నూహ మేలౌనే?
నేర్వంన్రా మంచి నిద్ధాత్రిన్!
పర్వంబౌ!బోధ లాలింపన్?

3.గర్భగత"-అభయా"-వృత్తము.
బృహతీఛందము.న.జ.మ.గణములు.వృ.సం.48.ప్రాసగలదు.
సముచిత బుద్ధి లేదాయెన్?
గమి గన నేర వేమయ్యా?
నిముర కశాంతి దేశానన్?
ప్రముఖత నందు వేవేగన్!

4.గర్భగత"-సత్వర"-వృత్తము.
అత్యష్టీఛందము.స.త.ర.మ.ర.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
సమ సామాన్యంబు నెంచకం!సర్వంబుం దాము గొప్పంచున్?
కమ నీయం బౌ! హరే డనం?గర్వంబౌ నూహ మేలౌనే?
నిమిషం బీదౌనె? కానవే !  నేర్వం రా ! మంచి ! నిద్ధాత్రిన్!
భము లాకాంక్ష ల్మాను! శోభిలం?పర్వంబౌ! బోధ లాలింపన్?

5.గర్భగత"-సుమనీ"-వృత్తము.
అత్యష్టీఛందము.మ.ర.త.న.ర.గగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
సర్వంబుం దాము గొప్పంచుం?సముచిత బుద్ధి లేదాయెన్?
గర్వంబౌ! నూహ మేలౌనే? గమి గన నేర వేమయ్యా?
నేర్వం రా! మంచి నిద్ధాత్రిం!నిముర కశాంతి దేశానన్?
పర్వంబౌ! బోధ లాలింపం?ప్రముఖత నందు వేవేగన్!

6.గర్భగత"-కాంక్షిలు"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.ర.త.న.ర.త.య.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
సర్వంబుం దాము గొప్పంచుం?సముచిత బుద్ధి లేదాయెం?సమ సామ్యంబు  నెంచకన్?
గర్వంబౌ!నూహ,మేలౌనే?గమి గన, నేర, వేమయ్యా ? కమనీయంబౌ!హరే డనన్?
నేర్వం రా! మంచి నిద్ధాత్రిం! నిముర కశాంతి దేశానం?నిమిషంబీదౌనె?కానవే?
పర్వంబౌ!బోధ లాలింపం!ప్రముఖత నందు వేవేగం?భము లాకాంక్ష ల్మాను శోభిలన్?

7.గర్భగత"-నాజిక"-వృత్తము.
ధృతిఛందము.న.జ.మ.స.త.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
సముచిత బుద్ధి లేదాయెం?సమ సామ్యంబు నెంచకన్?
గమి గన నేర వేమయ్యా?కమనీయంబౌ!హరే డనన్?
నిముర కశాంతి దేశానం?నిమిషం బీదౌనె?కానవే!
ప్రముఖత నందు వే వేగం?భము లాకాంక్ష ల్మాను శోభిలన్?

8.గర్భగత"-నిమురక"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.జ.మ.స.త.ర.మ.ర.గగ.గణములు.యతులు.10,19,
ప్రాసనీమముగలదు.
సముచిత బుద్ధి లేదాయెం?సమ సామ్యంబు నెంచకం?సర్వంబుం దాము గొప్పంచున్?
గమి గన నేర వేమయ్యా? కమ నీయంబౌ! హరే డనం? గర్వంబౌ! నూహ మేలౌనే?
నిముర కశాంతి దేశానం?నిమిషంబీదౌనె?కానవే!నేర్వంరా!మంచి నిద్ధాత్రిన్?
ప్రముఖత నందు వేవేగం?భము లాకాంక్షల్మాను!శోభిల్లం!పర్వంబౌ! బోధ లాలింపన్?

9,గర్భగత"-మరకత"-వృత్తము.
అత్యష్టీఛందము.మ.ర.త.య.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
సర్వంబుం దాము గొప్పంచుం?సమ సామ్యంబు నెంచకన్?
గర్వంబౌ!నూహ మేలౌనే?కమనీయంబౌ! హరే డనన్?
నేర్వం రా!మంచి నిద్ధాత్రిం?నిమిషంబీదౌనె? కానవే!
పర్వంబౌ! బోధ లాలింపం?భము లాకాంక్షల్మాను శోభిల్లన్?

10,గర్భగత"-డాంబిక"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.ర.త.య.ర.జ.న.ర.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
సర్వంబు దాము గొప్పంచుం!సమ సామ్యంబు నెంచకం?సముచిత బుద్ధి  లేదాయెన్?
గర్వంబౌ!నూహ మేలౌనే?కమనీయంబౌ!హరే డనం?గమి గన నేర వేమయ్యా?
నేర్వం రా!మంచి నిద్ధాత్రిం?నిమిషం బీదౌనె? కానవే!నిముర కశాంతి దేశానన్?
పర్వంబౌ!బోధ లాలింపం?భము లాకాంక్షల్మాను శోభిల్లన్ప్రముఖత నందువే వేగన్?
స్వస్తి
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

6, జనవరి 2019, ఆదివారం

పద్య పక్ష కృష్ణ శతకము. రచన. చింతా రామకృష్ణారావు

1 comments

జైశ్రీరామ్.
శ్రీరస్తు. 
పద్య పక్ష కృష్ణ శతకము.
రచన. చింతా రామకృష్ణారావు
1.  కార్మిక సంక్షేమమ్ 
ఆ.వె. శ్రీ గణపతి దేవ చేకొమ్ము నతులంచు - కార్మికుల్ మొదలిడు కార్యములను.
చేయునటులఁ జేసి చేయూత నీయుమా - నమ్మి కొలుతు నిన్ననంత కృష్ణ.                     1.
ఆ.వె. తగిన వసతి, భుక్తి, ప్రగణిత వైద్యము, - చదువు నేర్ప బడులు సముచితముగ
వారి వారికొఱకు వర్ధిల్ల కల్పించు - భక్తిగ నినుఁ గొల్తు భవ్య కృష్ణ.                                 2.
ఆ.వె. కష్ట జీవులకును కర్మ వీరులకును - కామితములు తీర్చి కరుణఁ జూపు.
పద్య సద్రచనను పటువర్ధనము చేయు - పద్య పక్ష మధుర భావ కృష్ణ.                        3.
ఆ.వె. నీరజాక్ష! యతని భారము కనవేల - నిత్య సంతసమును నిలుప వేల?
యతని జీవితమున వెతలు బాపినఁ జాలు. - పద్య పక్షమటుల వరలుఁ గృష్ణ!                     4.
ఆ.వె. జీవితాన సుఖము, భావిపై నాశయు, - కలుగునటులఁ జేసి కనఁగ లేవ?
భావి లేని యతని జీవితమ్మది యెట్లు - వరలునయ్య? కనుమ వరలఁ గృష్ణ.                  5.
ఆ.వె. బంధు హితుల తోడఁ  బకపక నవ్వుచు - పండుగలను వెలుఁగ నిండు మదిని
చేయువాఁడవనుచు చేయంగ కోరుదు - నిష్టఁ గొలిచి నిన్ బ్రకృష్ట కృష్ణ! !                            6.
ఆ.వె. పద్య పక్షమునను ప్రబలెడి శ్రీకృష్ణ! - కార్మికులకు నీవు కావె రక్ష?
వారి జీవితమును వర్ధిల్లఁ జేయుమా! - భక్త సులభ దివ్య భాగ్య కృష్ణ!                           7.
ఆ.వె. యంత్రరాక్షసులను మంత్ర ముగ్ధులఁ జేసి - నేర్పు మీర ప్రగతి నిత్యమొసఁగు
సాధనమున దేశ సంపద పెంతురా - కార్మికులను నీవె కలవు కృష్ణ!                           8.
ఆ.వె. కార్మికులను కాచు ఘనులు కర్మాగార - ప్రభువులందు నిలిచి వరలు కృష్ణ!
కార్మికులను బ్రేమఁ గనఁ జేయుమా! వారి - గౌరవమును నిల్పి కాచు కృష్ణ!                   9.
2. జీవనాధార జలవనరుల సద్వినియోగం.
ఆ.వె. శ్రీకరమగు ధాత్రి జీవకోటికి నిత్య - జీవ జలమునిచ్చు, క్షేమమిచ్చు.
యుగ యుగాలుగనిది జగతిని నిత్యమున్ - సాగుననుట కీవె సాక్షి కృష్ణ                         10.
ఆ.వె. కలుషమైన జలము కలుషంబు లెటు పాపు? - కావ వలయు నీటి జీవన గతి
నీరు లేక జగతి నిలుచుటెట్టులు? కాన - నీటి నిలువ పెంచు మేటి కృష్ణ!                      11.            
ఆ.వె. ప్రాణులకిల నీరు ప్రాణవాయువటులే. - నీటి నిలువ భువిని నిలుప వలయు.
సలిల రక్షణమును జరుపకుండిన జల - మంతరించు కద యనంత కృష్ణ!                   12.
ఆ.వె. మానవుల్ జలమును మన్నించి రక్షించు - పూనికఁ గొని చేయఁ బుణ్యమొదవు.      
నీరు వ్యర్థ పరచు నీచులు పాపులై - యంతరింత్రుకద యనంత కృష్ణ!                        13.
ఆ.వె. ధనము ఖర్చయినను దానినార్జింపగా - వచ్చు. భువిని నీరు మచ్చుకయిన
మిగులనీక మితికి మించి వెచ్చించిన - మృగ్యమౌన్. గొలుపు పరిణతి కృష్ణ!                 14.
ఆ.వె. జ్ఞాన మొసగుమయ్య సద్భావనము నిమ్ము - మానవాళినిలను మనఁగనిమ్ము.
నీటి నిలువఁ బెంచు నేర్పరులుగఁ జేయ - నేలతల్లి మెచ్చు నిన్ను కృష్ణ!                      15.    
ఆ.వె. బ్రతుకనెంచు జనులు పరమాత్మ సృష్టి యీ - నీరమనుచు దాని పారఁబోయ
వలవ రిలను జలము వర్ధిల్లఁ జేయఁగాఁ - వలచి యింకఁ జేయఁ దలచు కృష్ణ!               16.
ఆ.వె. పూర్వ కాలమునను భూమి పీల్చుటఁ జేసి - నీటి మయము భూమి నిత్యమపుడు.
రాళ్ళ కట్టడములు వేళ్ళూనుటను చేసి - భూమి పీల్చునెటుల పూజ్య కృష్ణ!                 17.
ఆ.వె. ఇలకు నింక జలము నింకుడు గోతులన్ - గొలుపుటుత్తమమయ జలలు పెరుగు
సహజ వనరులందు సలిలంబు మృగ్యమౌన్ - కావకున్న దానిఁ గనుము కృష్ణ.!             18.
౩. వృద్ధాప్యం కష్ట సుఖాలు.
ఆ.వె. శ్రీ రమా రమణుఁడ! శేషశాయిగనుండి - చింత చేయ వసలు జీవితాన
మానవునిఁగ బుట్టి మనుజుఁడెంతటి బాధ - లనుభవించుననుచు, కనవు కృష్ణ.                   19.
ఆ.వె. బాల్య యౌవనములు పరుగిడి పోవగా - వృద్ధ దశకుఁ జేర విస్తు గొల్పు
చింతలెల్ల మదిని చీకాకు పరచెడు. - శాంతి మార్గమగుము చాలు కృష్ణ!                      20.
ఆ.వె. కన్నులుండియు నిను మిన్నకుందురు కనన్, - కంటి చూపు తొలఁగ కలత చెంది,
కన్నతండ్రివగుచు కనులలో నిలువుమా - యనుచు నేడ్తు రపుడు వినుము కృష్ణ!          21.
ఆ.వె. పిన్న వయసులోన కన్ను గానక, నాడు - చేయరాని పనులు చేసి యుండి,
తనువు మాయు సమయమున నిన్నుఁ దలచినన్ - బాప ఫలితమెటులఁ బాయు కృష్ణ!   22.
ఆ.వె. వృద్ధ వయసు తానె పిలవకనే వచ్చి - పైనఁ బడుచునుండ బాధపడుచు
బిడ్డలతని బాధ పెడచెవిన్ బెట్టుటన్ - నడ్డి విరిగినట్లు నడచు కృష్ణ!                           23.
ఆ.వె. దేహమతని మాట తిన్నగా వినకుండ - మూలఁబడుచు నుండ కూలిపోవు.
వృద్ధుఁడపుడు జ్ఞాన వృద్ధుఁడై చింతించి - నీవె దిక్కనునయ. నిజము కృష్ణ!                  24.
ఆ.వె. దాన గుణము వీడి, దాయాదులను వీడి - ధనము నిలువఁ జేసి తనయులకిడ,
వారలతని వీడి పైదేశములనుండ - చూడరంచు వగచుచుండు కృష్ణ!                         25.
ఆ.వె. పుణ్యమొసగు కార్యములు జేయనైతినే, - సన్యసించనయితి ధన్యుఁడనవ
జన్య జనక మర్మజంబగు మూర్ఖతన్ - తప్పు చేసితినని తలఁచు కృష్ణ!                        26.
ఆ.వె. ప్రగతిఁ గొలుప పద్య పక్షాన నిలనైతి - రచన చేసి కృతిని ప్రబలనైతి
ఇప్పుడేమి చేతు నీశ్వరా యని, వృద్ధు - డేడ్చుచుండి కరము మోడ్చి కృష్ణ!,                 27.
4. తొలకరి చినుకులు రైతుల తలపులు.
ఆ.వె. ఋతువులారు కలిపి వృత్తంబుగా చేసి - కాల గతిని కూర్చి కదిపినావు.
ధర్మబద్ధమయిన తరియన్నదే లేని - కాల గమనమందు కలుగు కృష్ణ!                      28.
ఆ.వె. ఋతువులందు సహజ ఋతు ధర్మముం గూర్చ - గ్రీష్మఋతువు లోని కీల చేత
భూమిమాడు చుండి బగబగల్ పుట్టించ - రైతు మనసులోన రగులు కృష్ణ.                  29.
ఆ.వె. అట్టి సమయమందు నాశలు పుట్టించ - తొలకరింపువగుచు పలుకుదీవు
ప్రకృతి రక్షకుఁడగు పరమాత్మగా నెంచి, - దానిఁ గనిన రైతి తనియు కృష్ణ!                      30.
ఆ.వె. గ్రీష్మ ఋతువు తాను భీష్మ కీలల మాడ్చ - వేగుచున్న ధరణి బీడువారు.
పైరుపచ్చలవని పై నెండిపోవగా - పసరములవియెట్లు బ్రతుకు కృష్ణ?                               31.
ఆ.వె. పసుల జీవికకయి పలుపలు విధముల - యత్నములను చేసి యలసిపోవు
నంతలో తొలకరి నంతసమ్మునుఁ గూర్చ - వచ్చు రైతు జనులు మెచ్చ కృష్ణ!               32.
అ.వె. తొలకరి పొడఁ గాంచి తుది లేని యానంద మొదవరైతు మదిని వ్యధను వీడి
భూమిదున్నుటకయి పూజలు చేయుచు పొంగిపోవునతఁడు. పూజ్య కృష్ణ!                  33.
ఆ.వె. చిఱు చిఱు వడగళ్ళు చెలరేగు పెనుగాలి, కారుమబ్బుల గతి కనిన రైతు
వర్షధార తడువ పరువెత్తు హర్షంబు మిన్నుముట్ట భవిత నెన్ని కృష్ణ!                        34.
ఆ.వె. చిటపట చిఱు జల్లు కటిక నేలను పడి నంతనావిరయి, నయ పరిమళము
జగతిని వెదజల్లు, సొగసైన కలవాపి నటన చేయ వలచునచట కృష్ణ!                         35.
ఆ.వె. తొలకరింపవనిని పలకరింపఁగ కవి కలము పట్టు రయితు హలము పట్టు
కలము హలములందు కలవునీవని నమ్మ, కలిగి శుభములీయఁ గలవు కృష్ణ!                36.
5. సర్కారు బళ్ళు చదువుల గుళ్ళు.
ఆ.వె. శ్రీకరంబు చదువు, చిత్జ్ఞాన సుఫలద. జీవితేశునఱయఁ జేయునిదియె.
జీవ శక్తినొసఁగు జీవికకిదిప్రాపు,  భావి భాగ్యమిదియె, దేవ! కృష్ణ!                              37.
ఆ.వె. చదువు సంద్యలరయ, సన్మార్గమరయంగ, గురుకులంబులమరఁ గొలుప నాడు
నేడు బ్రతుకు బాట నేర్పాటు సర్కారు బడులు చేయు నవియె గుడులు కృష్ణ!               38.
ఆ.వె. గుడులలోన శిలను కూర్మిని గను దైవ - మనుచు నేర్పు బడులు మనకు గుడులు.
సత్యమెన్నిచూడ సర్కారు బడి మేలు - కొలుపు, మదిని మేలుకొలుపు కృష్ణ!               39.
ఆ.వె. ఓనమాలనరయ నోర్పుతో సర్కారు బడులు నేర్పి కొలుపు భక్తి మనకు
ఆంగ్లవర్ణములనె యరయమంచును నేర్పు నట్టివేల విను మహాత్మ కృష్ణ!                         40.
ఆ.వె. పెక్క సొమ్ములొసఁగి పేరున్న బడులంచు నాంగ్ల భాషనరయనంప శిశువు
చిక్కులందుపడుచు చీకాకు పొందునే? క్షేమమేల కలుగు శ్రీశ! కృష్ణ!                          41.
అ.వె. భాగ్యమంతపోవు, భవిత శూన్యంబగు, -  తెలుఁగు భాష మరచు, నలిగిపోవు
నెట్టి కష్ట మనున దిలఁ గన సర్కారు - బడుల నుండదు కద! ప్రనుత కృష్ణ!                  42.
ఆ.వె. ఆటపాటలకును, మేటి విద్యలకును సాటిలేని ప్రగతి బాట నడుపు
సద్విభాసితమగు సర్కారు బడి సాటి లేదు చూడ భువిని లేదు కృష్ణ!                        43.
ఆ.వె. నిరుపమానులయిన నిష్ణాత బోధకుల్  నేర్పు విద్యలిచట నేర్పు మీర.
అటకు నిటకుపోయి ఆయాస పడనేల భావి జీవితమున వరల కృష్ణ!                         44.
ఆ.వె. అమ్మపాల సాటి యవనిని లేదుగా! - కమ్మ తెలుగు సాటి కనఁగ లేదు.
సదయ బోధనమున సర్కారు బడి సాటి - లేదు లేదు లేదు లేదు కృష్ణ!                     45.
6. విచ్ఛిన్నమౌతున్న వివాహ వ్యవస్థ - సంతానంపై దాని ప్రభావం.
ఆ.వె. శ్రీకరంబనుచును జీవన సరళికి = పెండ్లితంతు కొలిపిరిండ్లు వెలుఁగ
దాని వలన వారు తమదైన సంతతి - సుఖముపొందిరపుడు, శుభద కృష్ణ!                  46.
ఆ.వె. దంపతులగువారు తమరిద్దరొక్కటై - కలిసి మెలిసి బాధ్యతలు వహించు.
నొకరికొకరుతోడు సకల శుభములిచ్చు - ననుచునేర్పరచిరి వినుము కృష్ణ!                 47.
ఆ.వె. ఇట్టిచక్కనిదగు నీ సంప్రదాయము - మట్టిఁగలియుచుండె మహిని నేడు.
స్వేచ్ఛ పెఱిగి వారలిచ్ఛానుసారము - గొడవలు పడుచుండ విడరె కృష్ణ!                      48.
ఆ.వె. ఆలుమగల మధ్యనన్యోన్యతయె సంతు - హేతువన్నదెఱిఁగి నీతి తోడ
మెలఁగుచున్నఁ గలుగు మేలైన సంతతి - మెలగకున్న జనత కలఁగు కృష్ణ!                 49.
ఆ.వె. ధర్మమార్గము విడి దంపతులున్నచో - కలుగు సంతు దురిత గతుల నడచు
దురితులయిన సంతు దుర్గతిపాలౌను. - చేయరాని పనులు చేసి కృష్ణ!                      50.
ఆ.వె. తల్లిదండ్రులొసఁగు ధనము ప్రేమయె కనఁ - బ్రేమ లేని బ్రతుకు బీడువారు.
లోకకంటకులగు లోకాన బిడ్డలు - తల్లిదండ్రుల విడు ధరను కృష్ణ!                             51.
ఆ.వె. భర్తమాట వినని భార్యలుండగరాదు - భార్య మాట వినని భర్తలటులె.
వారసత్వ గతిని వర్ధిలఁ జేసిన - బాగు పడును పృథ్వి బాల కృష్ణ!                             52.
ఆ.వె. వారి సంతు వెలుఁగు భక్తిప్రపత్తులన్ - వరలఁ గలరు వారు వసుధ కృష్ణ!
కానినాడు జగతి గాఢాంధకారాన - కుములు నిజము కాంచ, గోప కృష్ణ!                      53.
ఆ.వె. ధర్మబద్ధమయిన దాంపత్య బంధమున్ - గౌరవింపవలెను కాపురమున,
గౌరవింతుమేని ఘనులైన పెద్దలన్ - దైవశక్తి మనకుఁ దక్కు కృష్ణ!                            54.
7. మాదక ద్రవ్యాల మత్తులో యువత - నాశనమవుతున్న భవిత.
ఆ.వె. శ్రీనివాసుఁడవని చిక్కుంచుకొన నిన్ను - చేయి పట్టి తరికి చేఁదుకొనవొ?
మానవాళి మరిగె మాదక ద్రవ్యముల్ - భవిత భ్రష్టమవదె? పాహి కృష్ణ!                       55.
ఆ.వె. అతిప్రమాదకరము లగును మాదకద్రవ్య - ములవి మరిగి ప్రాణములకు ముప్పు
తెచ్చుకొనుచునున్న వచ్చునెవ్వఁడు కావ, - మాన్పి కావుమఖిల మాన్య కృష్ణ!             56.
ఆ.వె. పెద్దవారు పలుకు సుద్దులు వినఁజాల - రిట్టి మాదకములనెఱిఁగిరేని.
పిన్నవారి భవిత పీకుకుపోవును - జాగు వలదు.కావ జాలు కృష్ణ!                            57.
ఆ.వె. నీతి నెఱుఁగ నేర్పి భాతిని పెంచినన్ బాలురెపుడు నేర్వజాలరిట్టి
మత్తు కలుగఁ జేయు మాదక ద్రవ్యముల్ గొనుట. నేర్పునటుల కనుము కృష్ణ!              58.
ఆ.వె. మంచి చెడులనెన్న మరతురు మత్తులో భవిత శూన్యమగుట భువిని కనరు.
మత్తుమందు మరిగి చిత్తగుచున్నట్టి వారి మదులు మార్చవేర? కృష్ణ!                        59.
ఆ.వె. తల్లిదండ్రులపయి దయన్నదే వీడు, తనను తాను కనడు గుణము చెడును.
మరిగిరేని జనులు మాదక ద్రవ్యముల్ మరుగకుండ సుగతి మనుపు కృష్ణ!                      60.
ఆ.వె. చదువు సంధ్యలు విడు సద్భావనలు వీడు సుగతి వీడు తనదు ప్రగతి వీడు
వీడ జాలక తను వాడు మాదకద్రవ్య ములను. కావుమతని పూజ్య కృష్ణ!                    61.
ఆ.వె. చేయ రాని పనులు చేయఁబూను యువత, ప్రాయముడుగునాడు పనికి రారు.
జ్ఞేయములను నేర్చి శ్రేయంబు గనుమార్గ గాములవగఁ జేసి కాచు కృష్ణ!                     62.
ఆ.వె. తల్లిదండ్రులెపుడు తమ పిల్లలను కని పొంగఁ జూతురుకద? ముదిమి కదిసి
మూల్గుచున్న తరిని పోషింపఁదగు సంతు మత్తు వీడి కనఁగ మలచు కృష్ణ!                 63.
8. సమాజ శ్రేయస్సు -  నా కర్తవ్యము. 
ఆ.వె. అజుని సృష్టిని భువినపురూప సౌందర్య - సత్ప్రభా ప్రణవ ప్రశస్తి నిండె.
జ్ఞాన హీనులమయి గ్రహియింపఁగాలేము. - జ్ఞానమొదవునట్లు కనుమ కృష్ణ!               64.
ఆ.వె. జ్ఞాన దీప్తి కలుగ కానంగనగును సత్. - సత్స్వభావమిలను జయపథంబు.
నాదు కృషిని దాని శోధించి వ్యాప్తిలం - జేయఁదగును. కలుగ జయము కృష్ణ!               65.
ఆ.వె. సత్వమీవె ప్రణవ సౌందర్యమును నీవె, నిన్నె జూపు జనులనెన్ని వారి
వలన ప్రబల సత్స్వభావంబు కృషి చేయ వలయునయ్యనేను వసుధ కృష్ణ!                 66.
ఆ.వె. చిత్స్వరూపమున ప్రసిద్ధంబుగా నీవు మనములందు దాగి మసలుదువయ
నిన్నుఁ గాంచి ప్రజల కెన్ని చూపుట నాదు విది. చరింపఁ గనుమ ప్రీతిఁ గృష్ణ!               67.
ఆ.వె. దోష గతులఁ బాపి, భాషణంబునమంచి భావనమున మంచి ప్రబలఁజేయు
ధర్మమమరె నాకు. తప్పక చేయించు, నాకు నీడవగుచు నడచు కృష్ణ!                       68.
ఆ.వె. నీవె దోష రహిత నిర్మలాత్ముఁడవయ్య! దోష రహితమైన భాషవీవె.
భావనములవెల్గు బ్రహ్మంబు నీవె నిన్ వరలజూపుదునయ వరద! కృష్ణ!                      69.
ఆ.వె. ఆత్మశుద్ధి కొఱకు హరి పాదపద్మముల్ మనములందు నిలుపి మనునటులను
చేయవలయు నేను చిన్మార్గ గామినై భక్తపాళికిలను భవ్య కృష్ణ!                               70.
ఆ.వె. నీదు తోడు కలిగి ఖేదంబులను బాపి నిత్య సంతసమును నిలుపవలయు
భారతీయులమది. పరమార్థమిదె కదా! ధర్మ పథము నిమ్ము దయను కృష్ణ!                71.
ఆ.వె. ఇహములోన కుములు నీస్వరు నెఱుఁగమిన్, మోహతప్తులగుచు మూర్ఖ జనులు.
వారి మదులకెక్క నీరూపమును జేయ వలయు నేను. మదుల నిలుచు కృష్ణ!             72.
9. తెలుఁగు భాషా పరిరక్షణలో ప్రభుత్వం యొక్క పాత్ర, మన కర్తవ్యము..
ఆ.వె. శ్రీకరంబు తెలుఁగు. శ్రీవాణి మంజీర - నాద మంజులమగు నా తెలుంగు.
తెలుఁగు దివ్వె భువిని కొడికట్టుకొనుచుండ, - ప్రభుత కాంచకుండె భవిత కృష్ణ.               73.
ఆ.వె. జీవభాష తెలుఁగు, చిన్మూర్తిఁ గనఁ జేయు, - ధైవభాష పోలి ధాత్రి వెలిఁగె.
భావ సుందరమగు పదసంపదల భాష. - బ్రతుకఁ జేయుమయ్య క్షితిని కృష్ణ!                74.
ఆ.వె. ప్రభుత దృష్టి పెట్టి పాఠశాలలనుండి - తెలుఁగు వరలఁజేసి నిలుప వలయు.
జనులు మాతృభాష ఘనతను మరువక - తెలుఁగు నేర్వ భువిని వెలుఁగు కృష్ణ!            75.
ఆ.వె. తెలుఁగు తెనుఁగు నాంద్ర దేదీప్య నామాల - వెలుఁగె నాడు తెలుఁగు జిలుఁగులీని
తెలుఁగు వెలుగుకింక తెల్లవారుచునుండె - నాంగ్లమరయుచుంట నమల కృష్ణ!              76.
ఆ.వె. చిత్ర కవిత, బంధ చిత్ర, గర్భకవిత, - శ్లేష కవిత తెలుఁగు హృదయమపుడు
నేడు వర్ణచయము నేర్వకుండుటఁ జేసి, - వీడిపోయె తళుకు వినుము కృష్ణ!                 77.
ఆ.వె. సద్వధాన సుగతి, సరస వాఙ్మయముతో - నలరు భాష తెలుఁగుకథమ గతియె
కలుగుచుండె. ప్రభుత కని కావఁగావలెన్, - మరచిరేని తెలుఁగు మనదు కృష్ణ!               78.
ఆ.వె. మనము తెలుఁగు భాష మాటలాడవలయు - సరస కావ్య తతిని చదువ వలయు.
ఘనత చాటు తెలుఁగు ఘన చిత్ర బంధముల్ - కలవటంచు తెలుపవలయు కృష్ణ!          79.
ఆ.వె. నవ రసామృత మిది, శ్రవనసుందరమిది - నవ్య గతుల వెల్గు భవ్య భాష
అట్టి తెలుఁగు వీడుటన్యాయమేకద! - అరసి కావుమయ! యనంతకృష్ణ!                      80.
ఆ.వె. బ్రతుకు కొఱకు మనము పాశ్చాత్య దేశాల - కేగి యుండవచ్చు నెచ్చటున్న
మాతృభాష తెలుఁగు మన్ననందునటుల మేము - చేయవలయు పృథ్వి కృష్ణ!              81.
10. వైద్యరంగం - మారుతున్న మీకరణాలు. 
ఆ.వె. శ్రీకర, మహనీయ, శ్రీహరి నామమున్ జేకొను మనుజుండు చెలఁగునెపుడు
ననుపమమయినట్టి యారోగ్య సంపదన్ వైద్యమతనికేల వినుత కృష్ణ!                       82.
ఆ.వె. వైద్య వృత్తి నలరు వైద్యుఁడే నారాయణుండటంచు గనరె నిండు మదిని,
అట్టివైద్యుడెలమినసహాయుడై వృత్తి నమ్ముకొంచు బ్రతుకు నవని కృష్ణ!                      83.
ఆ.వె. వైద్యవృత్తిచేత వర్ధిల్లిరానాడు. విశ్వ జనులు పొగడ వేల్పులయిరి.
ధనమె ఘనమటంచు దయమాలి పీడించు రాక్షసులయినేడు క్రాలు కృష్ణ!                   84.
ఆ.వె. మారుచుండె జగతి. మర్యాదలును మారె మానవత్వమిలను మట్టి కలిసె.
వైద్య విద్య కొఱకు వరలు భూములనమ్మి రిక్త హస్తులగుచు వ్రేగు కృష్ణ!                      85.
ఆ.వె. అట్టివారు పృథివి ననుపమ ధనవాంఛ నరయ నేర్వరహిత దురితగతులు.
ధనము కురియు రోగి తమకు దక్కినవేళ పిండుచుండిరవని. వేద్య కృష్ణ!                    86.
ఆ.వె. వైద్యవిద్యనరయ వలయునుచితముగ, పాలకులు గ్రహించి, వారి కొఱకు
ధనము కూర్చి చదువు తప్పక చదివించ లోకులఁ గని వారు సాఁకు కృష్ణ!                   87.
ఆ.వె. ఉచిత వైద్యమమరనొప్పగున్ జనులకు. బ్రతుకజాలుదురిల ప్రజలు భువిని,
ధనము కొఱకు వైద్యమును నేర్చుకొనుటిమి? శోచనీయముకద! శుభద కృష్ణ!              88.
ఆ.వె. ప్రకృతివైద్యమిలను ప్రాణరక్షణఁ గొల్పి వరలఁ జేసెనపుడు ధరను జనుల.
ప్రకృతి వికృతమయ్యె బ్రతుకు భారంబయె. జనుల స్వాస్త్యమమరఁ గనుము కృష్ణ!          89.
ఆ.వె. రోగముల్ ప్రబలెను. రోగార్తులను కాచు వైద్యముల్ ప్రబలెను. వైద్యశాల
లెల్ల ధనము కొఱకునెల్లలు మరచిరే! రోగికేమి దిక్కు? ప్రోవు కృష్ణ!.                            90.
11. టీవీ సీరియళ్ళు - సమాజంపై ప్రభావం. ( నామ గోపన చిత్రము )
ఆ.వె. శ్రీపతి కనిపించు చేతనత్వముఁగొల్పు - రమ్మని పిలిచేమొ రారు జనులు.
దూరదర్శనమున దూరిపోదురు వారు - కాంచు కాంక్ష వలన, కనుము కృష్ణ!                91.
ఆ.వె. బుల్లితెరను వచ్చు పుంఖానుపుంఖాల - నాటక క్రమదృష్టి నాట మదిని
చేటు కలుఁగఁ జేయు చిత్ర దర్శనమబ్బె. - మానవాళిఁ గనుమ మనిచి, కృష్ణ!                92.
ఆ.వె. చూచువారి మదికి సూదంటురాయియే - దూరదర్శన మనివారణమయె.
ధనముచేసుకొనెడి మనమె కానఁగవచ్చు. - ప్రబలె దీని మహిమ. పాపు కృష్ణ!              93.
ఆ.వె. సమయ పాలనమున సాక్షులై కనిపించు - బుధులు చూడ మరిగి విధులు మరచి
దూరదర్శనమున సారించి మనమును - దూరుదురయ దానిఁ గోరి కృష్ణ!                    94.
ఆ.వె. దూరదర్శన క్రమ భూరి దుర్గతి నాడు - వారు కూడ విడువఁ గోరు మగల
నాడువారి మనసులాకట్టుకొనునవి. - చెడ్డమార్పు లొసగుఁ జేటు కృష్ణ!                       95.
ఆ.వె. మంచియు చెడు నుండు మన దూరదర్శినిన్ - సమయపాలనమది జరుగనీదు.
కాలగతిని మరచి కాంచుటన్ వికటించి - జీవితములు సమసిపోవు కృష్ణ!                    96.
ఆ.వె. దూర దర్శనమున దురితంబులే చేయు - టీ వ్యవస్థ మరగు పృథ్వి పైన.
విలువలన్ విడుతురు విగత నైతికముల - వీక్షణమునఁ జేసి వినుత కృష్ణ!                   97.
ఆ.వె. విలువలెంచని మది నలముకొనదె యుదా - సీనత? మనకింక చెడుటె మిగులు.
ఇహ పరములపైన నేరీతిగా కల్గు - రిక్త జీవుల కనురక్తి? కృష్ణ!                                98.
ఆ.వె. ధర్మదూరులగుచు తరియింప లేక జ్ఞే -  ము నిలం దెలియక యలమటింత్రు.
అంతులేని కథల ననురక్తిఁ గనుచు, క్రు - ళ్ళుచు, కృశింతురు కలఁగుచును కృష్ణ!           99.
12. భారత రాజ్యాంగము అభిప్రాయ ప్రకటన స్వేచ్ఛ.
ఆ.వె. శ్రీనివాసమదియె స్వేచ్ఛకు నిలయము పలుకవచ్చు ధనము బలము చేసి.
భారతావనినిట ప్రకటింప భావముల్ - స్వేచ్ఛ లేదు నిజము వినుమ కృష్ణ!                 100.
ఆ.వె. స్వేచ్ఛ కలదటంచు వెలువరించితిమేని, తుచ్ఛులైన నరులు తునుమ వచ్చు.
భావప్రకటనంబు ప్రాణంబులకు తెచ్చు - ముప్పు నిజము చూడ పూజ్య కృష్ణ!               101.
ఆ.వె. మనసులోకలదని మాటలాడ తగదు. - మనుజులున్న లోక మార్గమెఱిఁగి.
బ్రతుకవచ్చు మనము ప్రఖ్యాతమెఱుఁగుచు, - బ్రతుకు బాట కనుచు రమ్య కృష్ణ!          102.
ఆ.వె. స్వేచ్ఛ కలదటంచు నిచ్ఛానుసారము - మంచి చెడ్డలు విడి మాన్య జనుల
పరువు మంటఁ గలుపు ప్రకటనలనుచేయు - మూర్ఖ లధికమైరి పుడమిఁ గృష్ణ!            103.
ఆ.వె. స్వేచ్ఛ కలుగనౌను. తుచ్ఛత సరికాదు. - భంగ పరుప రాదు పరుల శ్వేఛ్చ.
అట్టి భావప్రకటనంబునే రాజ్యాంగ - మొసగెనయ్య కనఁగ వసుధ కృష్ణ!                      104.
ఆ.వె. మాటలాడనగును మనభావమునుదెల్ప. నోటి మాట, వినిన తోటివారి
యాత్మగౌరవమును హాని పరుపరాదు. భావ భాగ్యమపుడె ప్రబలు కృష్ణ!                   105.
ఆ.వె. సమసమాజమునను సభ్యతా సంస్కార - ములను వీడఁ దగదు మూలమదియె.
భావప్రకటనంచు వాచాలురైనచో - శిక్షతప్పదపుడు శ్రీశ కృష్ణ!                                 106.
ఆ.వె. వ్రాతలందయినను భాషణంబందైన - భావ ప్రకటనాన వరలుసుగతి
నీవు కనుచు మంచి నేర్పుమా ప్రజలకు - నేర్పు మీర జనులు నేర్వ కృష్ణ!                 107.
ఆ.వె. భావ ప్రకటనాన బ్రహ్మస్వరూపంబు - జూపు వారు ఘనులు. శోభిలుదురు.
మంచిఁ గొలిపి మాకు మర్యాద దక్కించు. - మంగళములు నీకు మహిత కృష్ణ!              108.
స్వస్తి.
జైహింద్.