గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, జులై 2017, సోమవారం

నూతన ఛందములలో గర్భ కవిత 105. . . . రచన . . . శ్రీ వల్లభ

1 comments

  జైశ్రీరామ్.
 పురమోహినీ. గర్భవివక్షక (ధృగ్గోచర) వృత్తము.
రచన .వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి . జుత్తాడ.
 వివక్షకవృత్తము.
విలువేది విప్రజాతికి వెలమాపె స్వేచ్ఛ భారతి పెర పాలనంబు కోరన్.
వెలమాసె వేద సంస్కృతి విలువోప బ్రహ్మ శక్యమె వెరగేమి లేని దాయెన్. 
తిలకింపరైరి తేజము తెలిఛాయ శంకరయ్యరొ తెరదీయు నీతి స్వేచ్ఛన్. 
పలికించు మంచి మాటలు బలమేర్చు సర్వ సామ్యత పరమంబుగూర్చరమ్మా
 1---(1).విలువేది విప్ర జాతికి 
              వెలమాసె వేద సంస్కృతి.
              తిలకింపరైరి తేజము . 
            పలికించు మంచిమాటలు.
      (2)వెలమాపె స్వేచ్ఛ భారతి.
            విలువోప  బ్రహ్మ శక్యమె
            తెలి ఛాయ శంకరయ్యరొ
             బలమేర్చు సర్వ సామ్యత.
2.పెర పాలనంబు కోరన్
వెరగేమి లేనిదాయెన్
తెరదీయు నీతి స్వేచ్ఛన్
పరమంబుగూర్చ రమ్మా.
3.విలువేది విప్రజాతికి  వెలమాపె స్వేచ్ఛ భారతి 
వెలమాసె వేద సంస్కృతి విలువోప బ్ర హ్మ శక్యమె
తిలకింపరైరి తేజము తెలి ఛాయ శంకరయ్యరొ. 
పలికించు మంచి మాటలు బలమేర్చు సర్వ సామ్యత. 
4.వెలమాపె వేద సంస్కృతి పెరపాలనంబుకోరన్
విలువోప బ్రహ్మ శక్యమె వెరగేమి లేనిదాయెన్
తెలి ఛాయశంకరయ్యరొ తెరదీయు నీతి స్వేచ్ఛన్
బలమేర్చు సర్వ సామ్యత పరమంబు గూర్చ రమ్మా. 
5.వెలమాపె వేద సంస్కృతి పెరపాలనంబు కోరన్ విలువేదివిప్రజాతికి.
విలువోప బ్రహ్మ శక్యమె వెరగేమి లేనిదాయెయెన్  వెలమాసె వేదసంస్కృతి.
తెలిఛాయ శంకరయ్యరొ తెరదీయు నీతి స్వేచ్ఛన్ తిలకింపరైరి తేజము
బలమేర్చు సర్వ సామ్యత పరమంబు గూర్చ రమ్మా పలికించుమంచిమాటలు
6.పెరపాలనంబు కోరన్ విలువేది విప్రజాతికి
వెరగేమిలేనిదాయం వెలమాసె వేద సంస్కృతి 
తెరదీయు నీతి స్వేచ్ఛన్ తిలకింపరైరి తేజము. 
పరమంబు గూర్చ రమ్మా పలికించు మంచిమాటలు.

7.తిలకించు నీతిమార్గం తెలివైన జన్మ నెత్తియు
విలువొంది నిల్చు భూమిన్ వెలవోని సత్యవాక్కులు.
తులువౌట హీనమోపున్ తులలేని కీర్తి నందుము 
పలుమాటలాడ పాపం పలికించు మంచి నెన్నడు. 

8. తిలకించు నీతిమార్గంతతెలివైన జన్మనెత్తియు తిమిరంబు నందెదేలను.
విలువొంది నిల్చుభూమిన్ వెలవోని సత్యవాక్కుల విమలంపు ప్రజ్ఞనందుమ
తులువౌట హీనమోపున్ తులలేని కీర్తినందుము దుముకాడు సర్వరక్షణ.
పలుమాటలాడ పాపం పలికించుమంచినెన్నడు భములందవెన్నడీవయ
9.తిమిరంబునందె దేలను తెలివైన జన్మనెత్తియు 
విమలంపుప్రజ్ఞ నందుమ వెలవోసత్యవాక్క్కుల 
దుముకాడు సర్వరక్షణతులలేనని కీర్తి నందుము
భములంద వెన్నడీవయ పలికించు మంచినెన్నడు. 
10.తిమిరరంబు నందెదేలను తెలివైన జన్మనెత్తియు తిలకించు 
నీతిమార్గమవిమలంపు ప్రజ్ఞనందుమ వెలవోని సత్యవాక్కుల
దుముకాడు సర్వరక్షణ తులలేనికీర్తి నందుమతులువౌటహీనోపున్
భములందవెన్నడీవయ పలికించుమంచి నెన్నడు పలుమాటలాడ పాపం.
1 .1.2 కందళి బృహతీ స.జ.భ. వృ.సం.428.
2.జడిపిలు . అనుష్టుప్ స.జ.గగ.వృ.సం.44.
3. 1.8.వివక్ష. ధృతి .స.జ.భ.స.జ.భ.యతి .10.
4.చెలాకి.అత్యష్టీ స.జ.భ.స.జ.గగ.యతి .10.
5. వెలగాని ఉత్కృతి .స.జ.భ.స.జ.త.జ.ర.లల.యతులు .10.18.
6.యుతిలేని .అత్యష్టీ .స.జ.త.జ.ర.లల.యతి 9.
7.విరోధిని  .ఉత్కృతి స.జ.త.జ.ర.లల. యతులు.9.18.
8 .పెరమోహిని .ఉత్కృతి .స.జ.భ.స.జ.భ.స.జ.గగ.యతులు.10.19.
జైహింద్.

30, జులై 2017, ఆదివారం

నూతన ఛందములలో గర్భ కవిత 104. . . . రచన . . . శ్రీ వల్లభ

1 comments

  జైశ్రీరామ్.
నీతి చర వృత్తము.  
రచన. వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి . జుత్తాడ. 
మిత్రుని మాటలు విను మేలును గన చెడువిడు మేధిని సుఖ మందుమయా 
చిత్రపు టూహలు గను చీలనిమది గుణమున భేదిలు దురితంబు భువిన్ 
తత్రపు సారము మది తాలగవలె పటుతను  తాదివిసుఖమందెదులే
శత్రుల చేర్చకుదరి చాలును కనినవను సాధితుడ వనందగు మా
1. మిత్రుని మాటలువిను 
చిత్రపుటూహలుగను 
తత్రపు సారము మది
శత్రుల చేర్చకు దరి. 
2 మేలును గను చెడు విడు
చీలని మది గుణమున
తాలగవలె పటుతను. 
చాలును కనినవను. 
3.మేధిని సుఖ మందు మయా 
భేదిలు దురితంబు భువిని. 
తా దివి సుఖమందెదు లే .
సాధితుడ వనందగుమా. 
4. మిత్రుని మాటలు విను మేలును గను చెడు విడు
. చిత్రపు టూహలు గను చీలనిమది గుణమున .
తత్రపు సారము మది తాలగవలె పటుతను .
శత్రుల చేర్చకు దరి చాలును కనిన వను. 
5. మేలునుగను చెడు విడు మేధిని సుఖమందు మయా 
చీలని మది గుణమున భేదిలు దురితంబు భువిన్ .
తాలగవలె పటుతను తాదివవి సుఖమందెదులే 
చాలును కనినవను సాధితుడ వనందగుమా ..
6. మేలునుగను చెడు విడు మేధిని సుఖమందుమయా మిత్రుని మాటలువిను. 
చీలనిమది గుణమున భేదిలుదురితంబు భువిం చిత్రపు టూహలుగను. 
తాలగవలె పటుతను తా దివిని  సుఖ మందెదులే తత్రపు సారము మది.
చాలును కనినవను సాధితుడ వనందగుమా శత్రుల చేర్చకు దరి. 
7.మేధిని సుఖమందుమయా మిత్రుని మాటలు విను 
భేదిలు దురితంబు భువించిత్రపు టూహలుగను .
తా దివిసుఖమందెదులే తత్రపు సారముమది.
సాధితుడ వనందగుమా శత్రుల చేర్చకుదరి .
8.మేధిని సుఖమందుమయా మిత్రుని మాటలువిను మేలునుగను చెడువిడు .
ఛేదిలు దురితంబు భువిం  చిత్రపుటూహలుగను చీలనిమది గుణమున. 
తా దివిసుఖ మందెదులే తత్ర సారముమది తాలగవలె పటుతను.
సాధితుడవనందగుమా శత్రుల చేర్చకుదరి చాలును కనినవను .

9.మేలునుగను చెడువిడు మిత్రుని మాటలువిను .
చీలని మదిగుణమున చిత్రపు టూహలుగను .
తాలగవలె పటుతను తత్రసారముమది 
చాలును కనినవను శత్రుల చేర్చకు దరి .
10.మేలునుగను చెడువిడు మిత్రునిమాటలు విను మేధిని సుఖమందు మయా. 
చీలని మది గుణమున చిత్రపుటూహలుగనుఛఛేదిలుదురితంబు భువిన్ .
తాలగవలె పటుతను తత్రపు సారముమది తా దివిసుఖమందెదులే .
చాలును కనినవను శత్రులచేర్చకుదరి సాధితుడ వనందగుమా .
 
నీతిచర వృత్తము .ఉత్కృతి భ.భ.స.న.న.స.న.జ.లగ. యతులు 9.18.
1. ఆతప .అనుష్టుప్ భ.భ.లల.వృ.సం. 247.
2.భద్రత బృహతీ భ.న.న.వృ.సం. 511. 
3.భాసుధీ .బృహతీ .భ.స.స.వ.సం. 223.
4.గుణోన్నతి .అత్యష్టీ .భ.భ.స.న.న.లల.యతి 9.
5.మృదుమేథ ధృతి భ.న.న.భ.స.స. యతి10.
6.మిత్రమా భ.న.న.భ.స.స.భ.భ.లల.యతులు 10.19.
7.మేథినీ కృతి భ.స.స.భ.భ.భ.లల. యతి10
8.మేల్గను ఉత్కృతి భ.స.స.భ.భ.స.న.న.లల. యతులు 10.18.
9.చిత్రగతి అత్యష్టీ భ.న.న.భ.భ.లల యతి 10.
10.చెడువిడు .ఉత్కృతి భ.న.న.భ.భ.స.న.జ.లగ. యతులు 10.18.
జైహింద్.

29, జులై 2017, శనివారం

నూతన ఛందములలో గర్భ కవిత 103. . . . రచన . . . శ్రీ వల్లభ

0 comments

జైశ్రీరామ్.
జనజత నత.నయహీన.పదునొదవని.గర్భజనతావృత్తము. రచన. వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
జనతావృత్తము.
పదునుచెడె రాజకీయం పదపడి మార్చంగ నౌనె వనజు కల్పాంతమునన్.
ముదము కులగజ్జి ప్రాకెన్ ముదిరెను మందేది లేక మొనకొనెం భూతిదమై. 
పొదల జనె ప్రజ్ఞ సర్వం బుధతకు కీడెంచి మించి పునర మెంచన్వశమే
సుదతులకు రక్షలేకం సొదలకు తావౌచు నిల్చె జొనెను శాపంబగుచున్. 
1.పదునుచెడె రౌజకీయం .
ముదము కుల గజ్జి ప్రాకెన్ 
పొదల జనె ప్రజ్ఞ సర్వం
సుదతులకు రక్ష లేకన్. 
2.పదపడి మార్చంగ నౌనె .
ముదిరెను మందేది లేక .
బుధతకు కీడెంచి మించి .
సొదలకు తావౌచు నిల్చె .
3.వనజు కల్పాంతమునన్. 
మొనకొనెన్ భూతిదమై. 
పునరమెంచన్వశమే.
జొనెను శాపంబగుచున్. 
4. పదునుచెడె రాజకీయం పదపడి మార్చంగనౌనె. 
ముదము కులగజ్జి ప్రాకెన్ ముదిరెను మందేది లేక 
పొదలజనె ప్రజ్ఞ సర్వం బుధతకు కీడెంచి మించి 
సుదతులకు రక్ష లేకన్ సొదలకు తావౌచు నిల్చె . 
5.పదపడి మార్చంగనౌనె వనజు కల్పాంతమునన్. 
ముదిరెను మందేది లేక మొనకొనెన్ భూతిదమై .
బుధతకు కీడెంచిమించి పునర మెంచన్వశమే.
సొదలకు తవౌచు నిల్చి జొనెను శాపంబగుచున్. 
6.పదపడి మార్చంగనౌనె వనజు కల్పాంతమునన్ పదును చెడె రాజకీయం. 
ముదిరెను మందేది లేక మొనకొనెన్ భూతిదమై ముదము కులగజ్జి ప్రాకెన్ 
బుధతకు కీడెంచిమించి పునరమెంచన్వశమే పొదలజనె ప్రజ్ఞ సర్వం
బుధతకు కీడెంచి మించి పునరమెంచన్వశమే పొదలజనె ప్రజ్ఞ సర్వం
7 వనజు కల్పాంతమునం పదునుచెడె రాజకీయం 
మొనకొనెన్ భూతిదమైముదము కులగజ్జి ప్రాకెన్
పునరమెంచన్వశమేపొదలజనె ప్రజ్ఞ సర్వం
జొనెను శాపంబగుచున్ సుదతులకు తావు లేకన్ 
8.వనజు కల్పాంతమునన్ పదును చెడె రాజకీయం పదపడి మార్చంగనౌనె 
మొనకొనెన్ భూతిదమై ముదము కులగజ్జి ప్రాకెన్ ముదిరెను మందేదిలేక.
పునరమెంచన్వశమే పొదలజనె ప్రజ్ఞ సర్వం బుధతకు కీడెంచిమించి .
జొనెను శాపంబగుచున్ సుదతులకు తావు లేకన్ సొదలకు తావౌచు నిల్చె. .
9.పదపడి మార్చంగనౌనె పదునుచెడె రాజకీయం 
ముదిరెను మందేది లేక ముదము కులగజ్జిప్రాకెన్ 
బుధతకు కీడెంచి మించి పొదలజనె ప్రజ్ఞ సర్వం. 
సొదలకు తవౌచు నిల్చె  సుదతులకు తావు లేకన్. 
10.
పదపడి మార్చంగనౌనె పదునుచెడె రాజకీయంవనజు కల్పాంతమునన్. 
ముదిరెను మందేదిలేక ముదకులగజ్జజ్జిప్రాకెన్ మొనకొనెం భూతిదమై. 
బుధతకు కీడెంచిమించి పొదలజనెప్రజ్ఞ సర్వం పునర మెంచన్వశమే
సొదలకు తవౌచునిల్చె సుదతులకు తావులేకన్ జొనెను శాపంబగుచున్.

జనతా ఉత్కృతి న.స.జ.న.య.జ.న.త.ల.గ.యతులు 10.19.
1.దీక్షిత  బృహతీ న.స.య.వృ.సం.96.
2 నయజ బృహతీ నయజ.వృ.సం.336.
3.పరనింద అనుష్టుప్ న.త.లగ.వృసం. 104.
4  మార్పొనరు ధృతి నసయనయజ.యతి10
5. నయధృతి. అత్యష్టీ .న.య.జ..న.త.లగ.యతి10.
6 నయజని ఉత్కృతి న.య.జ.న.త.జ.న.జగగయతులలు 10.18.
7.నతలోకన అత్యష్టీ న.త.జ.న.జ.గగ.యతి 9.
8.జనజత నతా ఉత్కృతి న.త.జ.న.జ.త.న.త.గల.యతులు 9.18.
9.నయహీన ధృతిన.య.జ.న.స.య.యతి10
10.పదనొదవని ఉత్కృతి న.య.జ.న.స.య.న.త.లగ.యతులు 10.19.
జైహింద్.

28, జులై 2017, శుక్రవారం

నూతన ఛందములలో గర్భ కవిత 102. . . . రచన . . . శ్రీ వల్లభ

1 comments

  జైశ్రీరామ్.
 పదవీమోహనవృత్తము.  
రచన.వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
పద్ధతిమీరి పొందినది భద్రతమేర్చుటకేసుమా పదవికివచ్చుటంద్రు.
కొద్దిగగుప్పియోట్లుగని కుద్రతమోపనిమాటలన్ కొదువొదవంగనీరు.
సుద్దులుబల్కుచెన్నిటినొ క్షుద్రులు గానటు దోచుచున్ క్షుదలను దీర్చుకొంద్రు. 
వద్దనరేమిచూపినను భద్ర తమంబునజిక్కుచున్ పదిలపుజీవులౌచు. 
1.పద్ధతి మీరి పొందినది 
కొద్దిగ గుప్పి యోట్లుగని
 సుద్దులు బల్కుచెన్నిటినొ. 
వద్దన రేమిజూపినను. 
2.భద్రత మేర్చుటకే సుమా.
కుద్రతమోపనిమాటలన్. 
క్షుద్రులుగానటు దోచుచున్. 
భద్రతమంబున జిక్కుచున్. 
3.పదవికివచ్చుటంద్రు. 
కొదువొదవంగనీరు .
క్షుదలనుతీర్చుకొంద్రు. 
పదిలపుజీవులౌచు. 
4.పద్దతిమీరిపొందినది భద్రతమేర్చుటకేసుమా 
కొద్దిగగుప్పియోట్లుగని కుద్రతమోపనిమాటలన్
సుద్దులుబల్కుచెన్నిటినొ క్షుద్రులుగానటుదోచుచున్. 
వద్దనరేమిచూపినను భద్ర తమంబున జిక్కుచున్. 
5.భద్రతమేర్చుటకేసుమా పదవికివచ్చుటంద్రు. 
కుద్రతమోపని మాటలన్ కొదువొదవంగనీరు 
క్షుద్రులుగానటు దోచుచున్ క్షుదలను తీర్చుకొంద్రు.
భద్ర తమంబున జిక్కుచున్ పదిలపుజీవులౌచు. 
6.భద్రతమేర్చుటకేసుమా పదవికివచ్చుటంద్రు పద్ధతిమీరిపొందినది. 
కుద్రతమోపని మాటలన్ కొదువొదవంగనీరు  
కుద్రతమోపని మాటలన్ కొదువొదవంగనీరు   కొద్దిగగుప్పియోట్లుగని.
క్షుద్రులుగానటు దోచుచున్ క్షుదలనుదీర్చుకొంద్రు సుద్దులు బల్కుచెన్నిటినొ.
భద్ర తమంబున జిక్కుచున్ పదిలపుజీవులౌచు వద్దనరేమిచూపినను. 
7.పదవికివచ్చుటంద్రు పద్ధతి మీరి పొందినది 
కొదువొదవంగనీరు కొద్దిగగుప్పియోట్లుగని .
క్షుదలను దీర్చుకొంద్రు సుద్దులు బల్కుచెన్నిటినొ
పదిలపుజీవులౌచు వద్ధనరేమి జూపినను .
8.పదవికి వచ్చుటంద్రు పద్ధతిమీరి పొందినది భద్రతమేర్చుటకేసుమా.
కొదువొదవంగనీరు కొద్దిగ గుప్పియోట్లుగని కుద్రతమోపని మాటలన్.
క్షుదలను దీర్చు కొంద్రు సుద్దులు బల్కు చెన్నిటినొక్షుద్రులుగానటుదోచుచున్
పదిలపు జీవులౌచు వద్దనరేమి చూపినను భద్ర తమంబున జిక్కుచున్.
9.భద్రతమేర్చుటకేసుమా పద్ధతిమీరి పొందినది 
కుద్రత మోపని మాటలన్ కొద్దిగ గుప్పి యోట్లుగని. 
క్షుద్రులు గానటు దోచుచున్ సుద్దులు బల్కు చెన్నిటినొ 
భద్రతమంబున జిక్కుచున్ వద్దన రేమి జూపినను. 
10.
భద్ర తమంబేర్చుటకేసుమా పద్ధతి మీరి పొందినది పదవికి వచ్చుటంద్రు.
కుద్రత మోపని మాటలన్ కొద్దిగ గుప్పి యోట్లుగని  కొదువొదవంగనీరు
క్షుద్రులు గానటు దోచుచున్ సుద్దులు బల్కు చెన్నిటినొ క్షుదలను దీర్చుకొంద్రు.
భద్ర తమంబున జిక్కుచున్వద్దనరేమిజూపినను పదిలపుజీవులౌచు.
పదవీమోహనవృత్తము ఉత్కృతి భ.ర.న.భ.భ.ర.న.జ.గల.యతులు10.19.
1.విభూతినీ బృహతీ భ.ర.న.వృ.సం. 471.
2.ఉత్సుక .బృహతీ. భ.భ.ర.వృ.సం.183.
3.జీవప్రేమ. అనుష్టుప్ .వృ.సంస.176.
4 .పూర్ణోత్పల ధృతి భ.ర.న.భ.భ.ర.యతి10.
5.కూర్మిలు .అత్యష్టీ భ.భ.ర.న.జ.గల.యతి10.
6.భంగుర..ఉత్కృతి .భ.భ.ర.న.జ.ర.స.జ.లల.యతులు 10.18.
7.రసజ్ఞ అత్యష్టి న.జ.ర.స.జ.లల.యతి 9.
8.గప్తక ఉత్కృతి న.జ.ర.స.జ.స.స.స.లగ.యతులు.9.18.
9.రంభకా ధృతి .భ.భ.ర.భ.ర.న.యతి10.
10.భద్రతమ .ఉత్కృతి భ.భ.ర.భ.ర.న.న.జ.గల.యతులు.10.19.
జైహింద్.

27, జులై 2017, గురువారం

నూతన ఛందములలో గర్భ కవిత 101. . . . రచన . . . శ్రీ వల్లభ

0 comments

  జైశ్రీరామ్.
వీడనినీడ.చాతురిభా. ఛాయాగ్రాహి.గర్భ కర్మ చేతనా వృత్తము.  
రచన .వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి   జుత్తాడ. 
కర్మ చేతనా వృత్తము.
వీడని నీడవోలె నిను వీడదు కర్మపు చేతన బేలతనంబదేలనో 
పీడిలజేయు కర్మమది పీడకు లోనగు నెంచుమ పేలవబుద్ధి కీడగున్. 
పాడిగ నెంచి మన్నుమయ పాడియె నీతికి మూలము పాలనమెంచు కీర్తినిన్.
దాడిని కోరకెన్నడును తాడనమెంచకుమానవ తాలిమి పొందు శాంతిలున్ .
1. వీడని నీడవోలెనిను 
పీడిల జేయు కర్మమది 
పాడిగ నెంచి మన్నుమయ 
దాడిని కోరకెన్నడును.
2 .వీడదు కర్మపు చేతన 
పీడకు లోనగు నెంచుమ 
పాడియె నీతికి మూలము
తాడనమెంచకు మానవ.
3.బేలతనంబదేలనో 
పేలవ బుద్ధి కీడగున్
పాలనమెంచు కీర్తినిన్ 
తాలిమి పొందు శాంతిలున్. 
4.వీడని నీడ వోలె నిను వీడదు కర్మపు చేతన 
పీడిల జేయు కర్మమది పీడకులోనగు నెంచుమ 
పాడిగ నెంచి మన్నుమయ పాడియె నీతికి మూలము 
దాడిని కోరకెన్నడును తాడిమి నెంచకు మానవ 
5.వీడదు కర్మపుచేతన బేలతనంబదేలనో
పీడకులోనగునెంచుమ పేలవ బుద్ధి కీడగున్
పాడియె నీతికి మూలము పాలనమెంచు కీర్తినిన్.
తాడన మెంచకు మానవ తాలిమి పొందు శాంతిలున్.
6. వీడదు కర్మపుచేతన బేలతనంబదేలనో వీడని నీడవోలెనిను 
పీడకులోనగు నెంచుమ పేలవబుద్ధి కీడగున్ పీడిల జేయు కర్మమది
పాడియె నీతికిమూలము పాలనమెంచు కీర్తినిన్ పాడిగ నెంచిమన్నుమయ.
తాడనమెంచకు మానవ తాలిమి పొందు శాంతిలున్దాడినికోరకెన్నడును.
7.బేలతనంబదేలనో వీడని నీడవోలెనిను
పేలవ బుద్ధి కీడగున్ పీడిలజేయు కర్మమది 
పాలనమెంచు కీర్తినిన్ పాడిగ నెంచి మన్నుమయ 
తాలిమి పొందు శాంతిలున్ దాడిని కోరకెన్నడును.
8.బేలతనంబదేలనో వీడని నీడవోలెనిను వీడదు కర్మపుచేతన. 
పేలవ బుద్ధి కీడగున్ పీడిలజేయు కర్మమది పీడకు లోనగు నెంచుమ.
పాలనమెంచుకీర్తిననిన్ పాడిగనెంచిమన్నుమయ పాడియెనీతికిమూలము. 
తాలిమిపొందు శాంతిలున్ దాడిని కోరకెన్నడును తాడనమెంచకుమానవ. 
9.వీడదు కర్మపు చేతన వీడనినీడ వోలెనిను 
పీడకు లోనగు నెంచుమ పీడిలజేయు కర్మమది 
పాడియె నీతికి మూలము పాడిగ నెంచి మన్నుమయ
తాడనమెంచకు మానవ దాడిని కోరకెన్నడును.
10. 
వీడదు కర్మపుచేతన వీడని నీడవోలెనిను బేలతనంబదేలనో
పీడకు లోనగునెంచుమ పీడిలజేయు కర్మమది పేలవబుద్ధికీడగున్.
పాడియె నీతికిమూలము పాడిగనెంచిమన్నుమయపాలనమెంచుకీర్తినిన్.
తాడనమెంచకుమానవ దాడిని కోరకెన్నడును తాలిమిపొందు శాంతిలున్.
కర్మచేతనావృత్తము ఉత్కృతి భ.ర.న.భ.భ.భ.భ.ర.లగ.యతులు10.19.
1విభూతినీ బృహతీ భ.ర.న.వృ.సం.471.
2.ఆదర్శ .బృహతీ భ.త.భ.వృ.సం. 423.
3.పరిహరణా అనుష్టుప్ .వృ.సం.87.
4.కోటిప్రభాసి  .ధృతి .భ.ర.న.భ.భ.భ. యతి10.
5.మనోవికార .అత్యష్టీ భ.త.భ.భ.ర.లగ.యతి10.
6..బేలతా. ఉత్కృతి భ.త.భ.భ.ర.త.స.జ.లల. యతులు 10.18.
7.వెన్నాడు అత్యష్టీ భ.ర.య.స.జ.లల.యతి9.
8.వీడనినీడ .ఉత్కృతి భ.ర.య.స.జ.స.స.స.లల.యతులు .9.18.
9. చాతురిభా. ధృతి. భ.భ.భ.భ.ర.న.యతి .10.
10.ఛాయాగ్రాహి .ఉత్కృతి .భ.భ.భ.భ.ర.న.న.ర.లగ.యతులు 10.19.                  
జైహింద్.

26, జులై 2017, బుధవారం

నూతన ఛందములలో గర్భ కవిత 100. . . . రచన . . . శ్రీ వల్లభ

0 comments

 జైశ్రీరామ్
దిద్దు .కందద్వయ గర్భ తెలుగు వెల్గు వృత్తము   రచన .వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తిజుత్తాడ.
తెలుగు వెల్గు వృత్తము
తెలుగింటి యాడ పడుచా తెలివే కొదువేమి నీకు తిలకము దిద్దన్ బుద్దిన్. 
వెలవోని కీర్తి వరదా విలువేగలదెంతొ తల్లి వెలుగవె ఖ్యాతిన్ భూమిన్. 
బలమంది బుద్ధి పెరుగన్ పలు భాషల పట్టు పెంచి వలనగురీతిన్ నీతిన్. 
కులగౌరవంపు సిరివై కులవిద్యలు వీడకమ్మ కొలువల మేటై నిల్వన్. 
1. తెలుగింటి యాడపడుచా 
వెలవోని కీర్తి వరదా 
బలమంది బుద్ధి పెరుగన్
కులగౌరవంపు సిరివై. 
2 తెలివే కొదువేమి నీకు 
విలువేగలదెంతొ తల్లి 
పలు భాషల పట్టు పెంచి 
కుల విద్యలు వీడకమ్మ.
3. తిలకము దిద్దన్ బుద్ధిన్ 
వెలుగవె ఖ్యాతిన్ భూమిన్. 
వలనగురీతన్ నీతిన్. 
కొలువల మేటై నిల్వన్
4. తెలుగింటి యాడపడుచా తెలివే కొదువేమి నీకు .
వెలవోని కీర్తి వరదా విలువే గలదెంతొ తల్లి .
బలమంది బుద్ధి పెరుగన్ పలు భాషల పట్టు పెంచి 
కుల గౌరవంపు సిరివై కుల విద్యలు వీడకమ్మ.
5.తెలివే కొదు వేమి నీకు తిలకము దిద్దన్ బుద్ధిన్. 
విలువే గలదెంతొ తల్లి వెలుగవె ఖ్యాతిన్ భూమిన్. 
పలుభాషల పట్టు పెంచి వలనగు రీతిన్ నీతిన్ 
కులవిద్యలు వీడ కమ్మ కొలువుల మేటై నిల్వన్
6.తెలివే కొదువేమి నీకు తిలకము దిద్దన్ బుద్ధిన్.తెలుగింటి యాడ పడుచా .
విలువే గలదెంతొ తల్లి వెలుగవె ఖ్యాతిన్ భూమిన్ వెలవోని కీర్తి వరదా 
పలుభాషల పట్టు పెంచి వలనగు రీతిన్ నీతిన్ బలమంది బుద్ధి పెరుగన్ .
కులవిద్యలు వీడ కమ్మ కొలువుల మేటై నిల్వన్ కులగౌరవంపు సిల్వన్
7.తిలకముదదిద్దన్ బుద్ధిన్ తెలుగింటి యాడపడుచా 
వెలుగవె ఖ్యాతిన్ భూమిన్ వెలవోని కీర్తి వరదా 
వలనగు రీతిన్ నీతిన్ బలమంది బుద్ధి పెరుగన్ 
కొలువుల మేటై నిల్వన్ కుల గౌరవంపు సిరి వై. 
8 తిలకము దిద్దన్ బుద్ధిన్ తెలుగింటి యాడపడుచా తెలివే కొదువేమి నీకు 
వెలుగవె ఖ్యాతిన్ భూమిన్ వెలవోని కీర్తి వరదా విలువే గలదెంతొ తల్లి .
వలనగు రీతిన్ నీతిన్ బలమంది బుద్ధి పెరుగన్ పలుభాషల పట్టు పెంచి 
కొలువల మేటై నిల్వన్ కులగౌరవంపు సిరివై కులవిద్యలు వీడ కమ్మ
9.  1.కం. తెలుగింటి యాడ పడుచా 
తెలివే కొదువేమి నీకు  తిలకము దిద్దన్ 
వెలవోని కీర్తి వరదా 
విలువే గలదెంతొ తల్లి వెలుగవె ఖ్యాతిన్.
    2 కం బలమంది బుద్ధి పెరుగన్.
పలు భాషల పట్టు పెంచి వలనగు రీతిన్.
కుల గౌరంపు సిరివై 
కుల విద్యలు వీడ కమ్మ కొలువుల మేటై. 
జైహింద్.

25, జులై 2017, మంగళవారం

బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంతకృష్ణ విరచిత ఈశా భక్త కల్పద్రుమా శతకావిష్కరణ సభకు ఆహ్వానము.

0 comments

  జైశ్రీరామ్.
జైహింద్.

అశ్వత్ధ మేకం, పిచుమంధ మేకం, . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో:- అశ్వత్ధ మేకం, పిచుమంధ మేకం, స్య గ్రోధమేకం, దశ పుష్ప జాతీం. 
ద్వే ద్వే తధా దాడిమ మాతులింగే పంచామ్ర వాపీ నరకం న యాతీ. వరాహ పురాణం

తే.గీ. రావి, నిమ్మ, మఱ్ఱి, ప్రాతుమొక్కొక్కటి,
రెండు లుంగుషములు, రెండు దాడి
మముల నామ్ల ద్రువులు మహినైదు పూజాతి
చెట్లు పదియు పెంచ చెలఁగు సుగతి.

భావము. ఒక రావి చెట్టు, ఒక నిమ్మ చెట్టు, ఒక మఱ్ఱి చెట్టు, రెండు దానిమ్మ చెట్లు, రెండు మాధీ ఫలపు చెట్లు, అయిదు మామిడి చెట్లు, పది పూల చెట్లు వేసినవాడు నరకానికి వెళ్ళడు.
జైహింద్.

నూతన ఛందములలో గర్భ కవిత 99. . . . రచన . . . శ్రీ వల్లభ

0 comments

జైశ్రీరామ్.
శ్రీవశీ. ముక్తిదా. సద్వర. దేవాశ్రి. సమజా. పరమగు కపిలా. ప్రమోదినీ. నేవనావరి. 
ముదల. తొలినుత. మతవర్తి .శుభంకరీ. శ్రీకర్తృ. సిరివరు. స్మరామి. క్షేమనా.
అగజానన. క్షేమజ. సేవిత. గర్భ నుతివల్లభ వృత్తము రచన వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
నుతివల్లభ వృత్తము. 
శ్రీమంతుండగజాసుతు క్షేమంబేర్పంగనెంచి శివసూనునిలం సేవింతుందొలిన్ 
నీమంబారగబుద్ధిని నేవంబుంగూర్చు కావ్యనివహంబుధరనం కావింతుం శివా. 
రామంబేర్పడజేయగ రామా శ్రీరామ నీమ రవళింపసిరుల్ రావింతుంబుధా. 
క్షేమంబౌకృతి క్ష్మాతలికామారరింకీర్తిసేతు శివమేర్చవలెం జీవంబౌ కతన్. 
1.శ్రీమంతుండగజా సుతు
నీమంబారగ బుద్ధిని.
రామంబేర్పడ జేయగ 
క్షేమంబౌ కృతి క్ష్మాతలి. 
2.క్షేమంబేర్పంగ నెంచి 
నేవంబుంగూర్చు కావ్య.
రామా శ్రీరామ నీమ. 
కామారిం కీర్తి సేతు .
3.శివసూను నిలం
నివహంబు ధరన్.
రవళింప సిరుల్ 
శివమేర్చ వలెన్ .
4.సేవింతుందొలిన్
కావింతుం శివా .
రావింతుం బుధా. 
జీవంబౌకతన్. 
5. శ్రీమంతుండగజాసుతు క్షేమంబేర్పంగ నెంచి .
నీమంబారగ బుద్ధిని నేవంబుంగూర్చు కావ్య. 
రామంబేర్పడ జేయగ రామా శ్రీరామ నీమ .
క్షేమంబౌకృతిక్ష్మాతలి కామారింకీర్తి సేతు. 
6.శ్రీమంతుండగజాసుతు క్షేమంబేర్పంగనెంచి శివ సూనునిలన్.
నీమంబారగ బుద్ధినినేమంబుం గూర్చు కావ్య నివహంబుధరన్ .
రామంబేర్పడజేయగరామాశ్రీరామ నీమ రవళింప సిరుల్. 
క్షేమంబౌకృతి క్ష్మాతలి కామారిం కీర్తి సేతు శివమేర్చ వలెన్ .
7.క్షేమంబేర్పంగ నెంచి శివ సూను నిలం 
నేవంబుం గూర్చు కావ్య నివహంబు ధరన్.
రామా శ్రీరామనీమ రవళింప సిరుల్ .
కామారిం కీర్తి సేతు శివ మేర్చవలెన్. 
8. క్షేమంబేర్పంగ నెంచి శివససూను నిలన్ సేవింతు దొలిన్ 
నేవంబుంగూర్చు కావ్య నివహంబు ధరన్ కావింతుం శివా
రామాశ్రీరామ నీమ రవళింప సిరుల్ రావింతున్ బుధా 
కామారిం కీర్తి సేతు శివమేర్చ వలెన్ జీవంబౌ కతన్ .
9.క్షేమంబేర్పంగనెంచిశివసూనునిలన్ సేవింతున్ దొలిన్  శ్రీమంతుండగజాసుతు 
నేవంబుం గూర్చు కావ్య నివహంబు ధరన్ కావింతుం శివానీమంబారగ బుద్ధిని.
రామా శ్రీరామ నీమ రవళింప సిరుల్ రావింతున్ బుధా రామం బేర్పడ జేయగ. 
కామారింకీర్తిసేతు శివమేర్చవలెన్ జీవంబౌ కతన్ క్షేమంబౌ కృతి క్ష్మాతలి.
10.శివ సూను నిలం సేవింతుం దొలిన్ శ్రీమంతుండగజాసుతు 
నివంబుం ధరన్ కా వింతుం శివా నీమంబారగ బుద్ధిని 
రవళింపం సిరుల్ రావింతున్ బుధా రామంబేర్పడ జేయగ.
శివమేర్చ వలెన్ జీవంబౌకతన్ క్షేమంబౌ కృతిక్ష్మాతలి .
11. శివసూనునిలం సేవింతుం దొలిన్ శ్రీమంతుండగజాసుతు క్షేమంబేర్పంగ నెంచి
నివహంబుధరం కావింతుం శివా నీమంబారగ బుద్ధిని నేమంబుంగూర్చుకావ్య 
రవళింపం సిరుల్ రావింతుం బుధా రామంబేర్పడ జేయగ రామాశ్రీరామ నీమ 
శివమేర్చ వలెన్ జీవంబౌకతం క్షేమంబౌ కృతి క్ష్మాతలి కామారిం కీర్తి సేతు. 
12.సేవింతుం దొలిం శ్రీమంతుండగజా సుతు. 
కావింతుం శివా నీమంబారగ బుద్ధిని 
రావింతుం బుధా రామంబేర్పడ జేయగ
జీవంబౌ కతం క్షేమంబౌ కృతి క్ష్మాతలి. 

13.
సేవింతుం దొలిం శ్రీమంతం డగజాసుతు క్షేమంబేర్పంగ నెంచి
కావింతుం శివా నీమంబారగ బుద్ధిని నేమంబుం గూర్చు కావ్య 
రావింతుం బుధా రామమంబేర్పడ జేయగ రామా శ్రీరామ నీమ 
జీవంబౌ కతం క్షేమంబౌ కృతి క్ష్మాతలి కామారింకకీర్తి సేతు. 
14.
సేవింతుందొలిం శ్రీమంతుండగజాసుతు క్షేమంబేర్పంగ నెంచి శివసూను నిలన్. 
కావింతుం శివా నీమంబారగ బుద్ధిని నేమంబుం గూర్చు కావ్య నివహంబుధరన్ .
రావింతుం బుధా రామం బేర్పడ జేయగ రామా శ్రీరామనీమ రవళింప సిరుల్. 
జీవంబౌ కతం క్షేమంబౌ కృతి క్ష్మాతలి కామారిం కీర్తి సేతు శివమేర్చ వలెన్.
15. క్షేమం బేర్పంగనెంచి శ్రీమంతుం డగజాసుతు. 
నేమంబుం గూర్చు కావ్య నీమంబారంగ బుద్ధిని.
రామాశ్రీరామ నీమ రామంబేర్పడ జేయగ. 
కామారిం కీర్తి సేతు క్షేమంబౌ కృతి క్ష్మాతలిగ 
16 క్షేమం బేర్పంగ నెంచి శ్రీమంతుండగజాసుతు శివసూను నిలన్
నేమంబుంగూర్చు కావ్య నీమంబారంగ బుద్ధిని నివహంబు ధరన్ .
రామాశ్రీరామ నీమ రామంబేర్పడ జేయగ రవళింప సిరుల్ 
కామారం కీర్తి సేతు క్షేమంబౌ కృతి క్ష్మాతలి శివ మేర్చ వలెన్.
17. 
క్షేమంబేర్పంగ నెంచి శ్రీమంతు డగజాసుతు శివ సూను నిలం సేవింతుందొలిన్ .
నేమంబుంగూర్చు కావ్య నీమంబారంగ బుద్ధి నివహంబు ధరం కావింతుంశివా 
రామా శ్రీరామా నీమ రామంబేర్పడ జేయగరవళళింప సిరుల్ రావింతుం బుధా.
కామారిం కీర్తి సేతు క్షేమంబౌ కృతి క్ష్మాతలి శివమేర్చవలెం జీవంబౌ కతన్. 
18. శివ సూను నిలం శ్రీమంతుండగజా సుతు  
నివహంబు ధరం  నీమంబారగ బుద్ధిని 
రవళింపం సిరుల్ రామంబేర్పడ జేయగ 
శివమేర్చ వలెం క్షేమంబౌ కృతి క్ష్మాతలి.
19.శివసూనునిలం శ్రీమంతుండగజా సుతు క్షేమంబేర్పంగ నెంచి 
నివహంబు ధరం నీమంబారగ బుద్ధిని నేమంబుంగూర్చు కావ్య. 
రవళింపం సిరుల్ రామంబేర్పడ జేయగ  రామా శ్రీరామ నీమ 
శివమేర్చ వలెం క్షేమంబౌ కృతి క్ష్మాతలి కామారిం కీర్తి సేతు. 
20.
శివసూను నిలం శ్రీమంతుండగజా సుతు క్షేమంబేర్పంగ నెంచి సేవింతుం దొలిన్. 
నివహంబు ధరం నీమంబారగ బుద్ధిని నేమంబుం గూర్చు కావ్య కావింతుం శివా. 
రవళింపం సిరుల్ రామంబేర్పడ జేయగ రామా శ్రీరామ నీమ రావింతుంబుధా. 
శివమేర్చవలెం క్షేమంబౌ  కృతి క్ష్మా తలికామారరిం కీర్తి సేతు శివమేర్చవలెన్. 
నుతివల్లభ .ఉత్కృతి మ.స.స.మ.జ.స.స.మ.లగ.యతులు 9.16.22.

1. శ్రీవశీ  అనుష్టుప్ మ.స.లల.వృ.సం. 217.
2. ముక్తిదా ఉష్ణిక్ మ.ర.ల. వృ సం. 81.
3.సద్వర. గాయిత్రి .స.స. వృసం. 28.
4. దేవాశ్రి .సుప్రతిష్ట .మ.లగ.వృ.సం. 9.
5.సమజా అతిశక్వరి మ.స.స.మ.జ.యతి 9.
6.పరమగు ప్రకృతి మ.స.స.మ.జ.యతి 9.
7.కపిలా అతిజగతి మ.ర.న.భ.గ యతి 8.
8.ప్రమోదినీ ధృతి  మ.ర.న.భ.మ.ర.యతి 8.
9.సేవనావరి ఉత్కృతి మ.ర.న.భ.మ.ర.మ.స.లల.యతులు8.14.19.
10.ముదల అతిధృతి స.స.మ.యత.జ ల. యతులు 7.12.
11.తొలినుత .ఉత్కృతి స.స.మ.య.త.జ.య .త.గల.యతులు 7.12.20.
12.మతవర్తి అతి జగతీ మ.య.త.జ.ల.యతి 6.
13. శుభంకరీ కృతి మ.య.త.జ.య.త.గల.యతి 14.
14 . శ్రీకర్త ఉత్కృతి మ.య.త.జ.య.త.భ.జ.లగ.యతులు 6.14.20.
15.సిరివరు అతిశక్వరి మ.ర.య.భ.భ. యతి 8.
16. స్మరామి ప్రకృతి .మ.ర.య.భ.భ.స.స. యతి8.
17.క్షేమనీ ఉత్కృతి మ.ర.య.భ.భ.స.స.మ.లగ. యతులు 8.16.22.
18.అగజానన. శక్వరీ .స.స.మ.స.లల.యతి14
19.క్షేమజ  ప్రకృతి స.స.మ.స.స.మ.జ.యతి7.
20.సేవిత .ఉత్కృతి స.స.మ.స.స.మ.జ.మ.లగ.యతులు 7.15.22.
జైహింద్.

24, జులై 2017, సోమవారం

నూతన ఛందములలో గర్భ కవిత 98. . . . రచన . . . శ్రీ వల్లభ

0 comments

  జైశ్రీరామ్
ఆతప. భద్రత. భాసుదీ. గుణోన్నతి. మృదుమేధ.మిత్రమా.మేధినీ. మేల్గను. చిత్ర గతి .చెడువిడు గర్భనీతిచర వృత్తము. 
రచన. వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి .  జుత్తాడ. 
నీతి చర వృత్తము. 
మిత్రుని మాటలు విను మేలును గన చెడువిడు మేధిని సుఖ మందుమయా 
చిత్రపు టూహలు గను చీలనిమది గుణమున భేదిలు దురితంబు భువిన్ 
తత్రపు సారము మది తాలగవలె పటుతను  తాదివిసుఖమందెదులే
శత్రుల చేర్చకుదరి చాలును కనినవను సాధితుడ వనందగు మా
1. మిత్రుని మాటలువిను 
చిత్రపుటూహలుగను 
తత్రపు సారము మది
శత్రుల చేర్చకు దరి. 
2 మేలును గను చెడు విడు
చీలని మది గుణమున
తాలగవలె పటుతను. 
చాలును కనినవను. 
3.మేధిని సుఖ మందు మయా 
భేదిలు దురితంబు భువిని. 
తా దివి సుఖమందెదు లే .
సాధితుడ వనందగుమా. 
4. మిత్రుని మాటలు విను మేలును గను చెడు విడు
. చిత్రపు టూహలు గను చీలనిమది గుణమున .
తత్రపు సారము మది తాలగవలె పటుతను .
శత్రుల చేర్చకు దరి చాలును కనిన వను. 
5. మేలునుగను చెడు విడు మేధిని సుఖమందు మయా 
చీలని మది గుణమున భేదిలు దురితంబు భువిన్ .
తాలగవలె పటుతను తాదివవి సుఖమందెదులే 
చాలును కనినవను సాధితుడ వనందగుమా ..
6. మేలునుగను చెడు విడు మేధిని సుఖమందుమయా మిత్రుని మాటలువిను. 
చీలనిమది గుణమున భేదిలుదురితంబు భువిం చిత్రపు టూహలుగను. 
తాలగవలె పటుతను తా దివిని  సుఖ మందెదులే తత్రపు సారము మది.
చాలును కనినవను సాధితుడ వనందగుమా శత్రుల చేర్చకు దరి. 
7.మేధిని సుఖమందుమయా మిత్రుని మాటలు విను 
భేదిలు దురితంబు భువించిత్రపు టూహలుగను .
తా దివిసుఖమందెదులే తత్రపు సారముమది.
సాధితుడ వనందగుమా శత్రుల చేర్చకుదరి .
8.మేధిని సుఖమందుమయా మిత్రుని మాటలువిను మేలునుగను చెడువిడు .
ఛేదిలు దురితంబు భువిం  చిత్రపుటూహలుగను చీలనిమది గుణమున. 
తా దివిసుఖ మందెదులే తత్ర సారముమది తాలగవలె పటుతను.
సాధితుడవనందగుమా శత్రుల చేర్చకుదరి చాలును కనినవను .

9.మేలునుగను చెడువిడు మిత్రుని మాటలువిను .
చీలని మదిగుణమున చిత్రపు టూహలుగను .
తాలగవలె పటుతను తత్రసారముమది 
చాలును కనినవను శత్రుల చేర్చకు దరి .
10.మేలునుగను చెడువిడు మిత్రునిమాటలు విను మేధిని సుఖమందు మయా. 
చీలని మది గుణమున చిత్రపుటూహలుగనుఛఛేదిలుదురితంబు భువిన్ .
తాలగవలె పటుతను తత్రపు సారముమది తా దివిసుఖమందెదులే .
చాలును కనినవను శత్రులచేర్చకుదరి సాధితుడ వనందగుమా .
నీతిచర వృత్తము .ఉత్కృతి భ.భ.స.న.న.స.న.జ.లగ. యతులు 9.18.
1. ఆతప .అనుష్టుప్ భ.భ.లల.వృ.సం. 247.
2.భద్రత బృహతీ భ.న.న.వృ.సం. 511. 
3.భాసుధీ .బృహతీ .భ.స.స.వ.సం. 223.
4.గుణోన్నతి .అత్యష్టీ .భ.భ.స.న.న.లల.యతి 9.
5.మృదుమేథ ధృతి భ.న.న.భ.స.స. యతి10.
6.మిత్రమా భ.న.న.భ.స.స.భ.భ.లల.యతులు 10.19.
7.మేథినీ కృతి భ.స.స.భ.భ.భ.లల. యతి10
8.మేల్గను ఉత్కృతి భ.స.స.భ.భ.స.న.న.లల. యతులు 10.18.
9.చిత్రగతి అత్యష్టీ భ.న.న.భ.భ.లల యతి 10.
10.చెడువిడు .ఉత్కృతి భ.న.న.భ.భ.స.న.జ.లగ. యతులు 10.18.
జైహింద్.

23, జులై 2017, ఆదివారం

మన సు‘కవులకాహ్వానమ్.

0 comments

  జైశ్రీరామ్.
ప్రజ - పద్యంబను వేదిక
సుజనుల సత్కవులతోడ శోభిలనుండెన్.
విజయము సేయుడు సుకవులు
ప్రజలకు సంతోషమొదవు వర కవితలతోన్.
జైహింద్.

22, జులై 2017, శనివారం

నూతన ఛందములలో గర్భ కవిత 97. . . . రచన . . . శ్రీ వల్లభ

0 comments

  జైశ్రీరామ్
నీతివిదూర. నిందిలు గర్భ నిజనిష్టురవృత్తము..రచన. వల్లభవఝల అప్పల నరసింహమూర్తి . జుత్తాడ
నిజనిష్టుర వృత్తము .
నిజము నిష్టుర మొప్పు నిందల పాల్జేయు నీతిహీనుల చేతుల నీచమందు. 
సృజనతే కొదువౌను చిందిలు కష్టాలు చేతగానటు గన్పడు జీవితాన. 
భజనకీర్తిదమౌను. బంధిగ నిల్బెట్టు పాతమేర్చును ఖ్యాతిని భగ్న మేర్చు .
తేజము గీడ్పడు ధాత్రి  తిందువు చీవాట్లు తీతురే యపవాదుల తెల్సికొమ్మ. 
1.నిజమునిష్టుర మొప్పు 
సృజనతే కొదువౌను .
భజన కీర్తిదమౌను .
తేజము గీడ్పడుధాత్రి. 
2.నిందలపాల్జేయు .
చిందిలుకష్టాలు .
బంధిగ నిల్బెట్టు
తిందువు చీవాట్లు .
3. నీతి హీనుల చేతుల 
చేత గానటు గన్పడు .
పాతమేర్చును ఖ్యాతిని .
తీతురే యపవాదుల 
4. నీతిహీనుల చేతుల నీచమందు .
చేతగానటు గన్పడు జీవితాన. 
పాతమేర్చును ఖ్యాతిని భగ్న మేర్చు .
తీతురేయపవాదుల తెల్సి కొమ్మ. 
5. నీతి హీనులచేతుల నీచమందు నిజము నిష్టుర మొప్పు .
చేత గానటు గన్పడు జీవితాన సృజనతే కొదువౌను 
పాతమేర్చును ఖ్యాతిని భగ్న మేర్చు భజన కీర్తిదమౌను .
తీతురే యపవాదుల తెల్సి కొమ్మ .తేజముగీడ్పడు ధాత్రి .
6.నిజము నిష్టురమొప్పు నిందల పాల్జేయు. 
సృజనతే కొదువౌను చిందిలు కష్టాలు  .
భజన కీర్తిదమౌను బంధిగ నిల్బెట్టు .
తేజము గీడ్పడు ధాత్రి తిందువు చీవాట్లు .
7. నిజము నిష్టురమొప్పు నిందల పాల్జేయు నీతిహీనుల చేతుల .
సృజనతే కొదువౌను చిందిలు కష్టాలు చేతగానటు గన్పడు 
భజన కీర్తిదమౌను బంధిగ నిల్బెట్టు పాత మేర్చును ఖ్యాతిని .
తేజము గీడ్పడుధాత్రి తిందువు చీవాట్లు తీతురే యపవాదుల .
8.నిందల పాల్జేయు నీతి హీనుల చేతుల
చిందిలు కష్టాలు చేత గానటు గన్పడు
బంధిగ నిల్బెట్టు పాత మేర్చును ఖ్యాతిని
తిందువు చీవాట్లు తీతురే యపవాదుల .
9.నిందల పాల్జేయు నీతిహీనుల చేతుల నీచ మందు .
చిందిలు కష్టాలు చేతగానటు గన్పడు జీవితాన .
బంధిగ నిల్బెట్టు పాత మేర్చును ఖ్యయాతిని భగ్నమేర్చు
తిందువు చీవాట్లు తీతురే యపవాదుల తెల్సి కొమ్మ .
10.
నిందల పాల్జేయు నీతి హీనుల చేతుల నీచమందు నిజము నిష్టుర మొప్పు .
చిందిలు కష్టాలు చేత గానటు గన్పడు జీవితాన సృజనతే కొదువౌను 
బంధిగ నిల్బెట్టు పాత మేర్చును ఖ్యాతిని భగ్న మేర్చు భజన కీర్తిదమౌను .
తిందువు చీవాట్లు తీతురే యపవాదు ల తెల్సి కొమ్మ తేజముగీడ్పడు ధాత్రి .
11. 
నీతిహీనుల చేతుల నీచమందు నిజమునిష్టురమొప్ప నిందల పాల్జేయు .
చేత గానటు గన్పడు జీవితాన సృజనతే కొదువౌను చిందిలు కష్టాలు 
పాతమేర్చును ఖ్యాతిని భగ్నమేర్చు భకీర్తర్తిదమౌను బంధిగ నిల్బెట్టు 
తీతురే యపవాదుల తెల్సికొమ్మ తేజము గీడ్పడు ధాత్రి తందువు చీవాట్లు. 
నిజనిష్టుర ఉత్కృతి .న.భ.ర.స.ర.జ.జ.జ.గల. యతులు .9.15.23. 
1.దశాశ్రి .అనుష్టుప్ .న.భ.గల.వృ.సం.184. 
2.భావగాయిత్రి. భ.త .వృ.సం.39. 
3.నిందా .అనుష్టుప్. ర.స.లల. వృ.సం. 219.
4.సంతస. జగతి .ర.స.స.జ. యతి9.
5.నిమ్నతా కృతి ర.స.స.జ.న.భ.గల.యతి 13
6.రసగుణి .శక్వరీ .న.భ.ర.స.గల. యతి 9.
7.ప్రభాకలి ఆకృతి న.భ.ర.స.ర.జ.జ.ల.యతులు 9.15.
8.హీనచేతన .శక్వరీ భ.త.ర.స.లల. యతి  7. 
9.చేతనా ధృతి భ.త.ర.స.స.జ.యతి 14. 
10 .నీతివిదూర .ఉత్కృతి భ.త.ర.స.స.జ.న.భ.గల. యతులు 7.15.19.
11. పాల్జేయు  ఉత్కృతి ర.స.స.జ.న.భ.ర.స.గల. యతులు 9.17.21. 
జైహింద్.

21, జులై 2017, శుక్రవారం

నూతన ఛందములలో గర్భ కవిత 96. . . . రచన . . . శ్రీ వల్లభ

0 comments

 జైశ్రీరామ్.
ఆంధ్రోన్నయ వృత్తము.రచన. వల్లభవఝల అప్పలనరసింహమూర్తి .  జుత్తాడ
సమరస భావభాసుర సమీకృత సారమాంధ్రము సమోన్నతంబిలం గనన్ 
విమల మనోజ్న భావరి విమోచిని దోషదూషిణి ప్రమాణికంబునైజనెన్
రమణిత కీర్తి వల్లరి రమాశ్రయ సూక్తి ముక్తము రమంబునై భువిం వడిన్
గమనము మంచిచూపుచు క్రమంబుగ మేలుగూర్చును క్రమోత్సుఖంబవం గనున్. 
గర్భగతవృత్తములు. 
1.సమరస భావభాసుర
విమల  మనోజ్నభావరి
రమణితకీర్తి వల్లరి
గమనము మంచిచూపు. 
2. సమీకృతసారమాంధ్రము
విమోచిని దోషదూషిణి
రమాశ్రయసూక్తిముక్తము .
క్రమంబుగ మేలు గూర్చును
3.సమోన్నతంబిలంగనన్
ప్రమాణికంబునైజనెన్
రమంబునైభువింవడిన్
క్రమోత్సుఖంబవంకనున్.
4. సమరసభావభాసుర సమీకృతసారమాంధ్రము
విమలమనోజ్న భావరి విమోచిని దోషదూషిణి
రమణితకీర్తివల్లరి రమాశ్రయసూక్తిముక్తము
గమనముమంచిచూపుచుక్రమంబుగమేలుచగూర్చును. 
5 .సమీకృతసారమాంధ్రము సమోన్నతంబిలంగనన్
విమోచినిదోషదూషిణి ప్రమాణికంబునైజనెన్
రమాశ్రయసూక్తిముక్తము రమంబునైభువింవడిన్
క్రమంబుగమేలు గూర్చును క్రమోత్సుఖంబవంగనున్. 
6.సమీకృత సామాంధ్రము సమోన్నతంబిలంగనన్ సమరసభావభాసుర.
విమోచిని దోషదూషిణి ప్రమాణికంబునైజనెన్విమలమ నోజ్నభావరి
రమాశ్రయసూక్తిముక్తము రమంబునైభువిన్వడిన్రమణితకీర్తివల్లరి
క్రమంబుగ మేలుగూర్చుక్రమోత్సుఖంబవన్గనుం గమనముమంచిచూపుచు.
7.సమోన్నతంబిలంగనం సమరసభావభాసుర
ప్రమాణికంబునైజనెం విమలమనోజ్నభావరి
రమంబునైభువిం వడిన్ రమణితకీర్తివల్లరి .
క్రమోత్సుఖంబవన్ కనున్ గమనము మంచిచూపుచు. 
8సమోన్నతమిలంగననన్ సమరసభావభాసుర. సమీకృతసారమాంధ్రము
ప్రమాణికంబునైజనెన్విమలమనోజ్నభభావవరి విమోచినిదోదూషషిణి
రమంబునైభువిన్ వడిన్ రమణితకీర్తి వల్లరి రమాశ్రయ సూక్తిముక్తము. 
క్రమోత్సుఖంబవంగనున్ గమనము మంచిచూపుచు క్రమంబుగమేలుగూర్చును.
9. సమీకృతసారమాంధ్రము సమరసభావభాసుర
విమోచినిదోషదూషిణణి విమలమోజ్నభావరి 
రమాశ్రయసూక్తిముక్తము  రమణితకీర్తివల్లరి
క్రమంబుగ మేలుగూర్చును గమనముమంచిచూపుచు. 
10.
సమీకృత సారమాంధ్రము సమరసభావభాసుర  సమోన్నతంబిలం గనన్
విమోచిని దోషదూషిణివిమలమనోజ్నభావరి ప్రమాణికంబునైజనెన్
రమాశ్రయ సూక్తిముక్తము రమణిత కీర్తి వల్లరి రమంబునై భువిం వడిన్.
క్రమంబుగమేలుగూర్చును గమనముమంచిచూపుచు క్రమోత్సుఖంబవం గనున్. 
ఆంధ్రోన్నయ .ఉత్కృతి న.జ.భ.జ.జ.భ.జ.ర.ల. యతులు 10.19.
1.చంప. బృహతి .న.జ.భ. వృ.సం. 432.
2. ద్విజభ.బృహతి .జ.జ.భ.వృ.సం.430.
3.ప్రమాణి అనుష్టుప్ వృ.సం.86.
4.నృతచర.ధృతి .యతి. 10.న.జ.భ.జ.జ.భ.
5.సమీకృత. అత్యష్టి .జ.జ.భ.జ.ర.లగ.యతి.10.
6.సారోన్నతి.ఉత్కృతి.జ.జ.భ.జ.ర.జ.న.ర.లల.యతులు..10.16.
7.భాకరి.అత్యష్టి .జ.ర.జ.న.ర.లల.యతి 9.
8.కృతసార.ఉత్కృతి .జ.ర.జ.న.ర.న.భ.ర.లల. యతులు 9.18.
9.రసజా ధృతి ..జ.జ.భ.న.జ.జ.భ. యతి10.
10.సమోన్నత. ఉత్కృతి. జ.జ.భ.న.జ.భ.జ.భ.లగ.యతులు 10.19.
జైహింద్.

20, జులై 2017, గురువారం

నూతన ఛందములలో గర్భ కవిత 95. . . . రచన . . . శ్రీ వల్లభ

0 comments

  జైశ్రీరామ్.
శివభామినీ. పరాధీన .శ్రీపాల. లోగొను. జమీహర. నిస్తేజ. భుక్తిమా. జిగిబాయు. నిర్దీపక. తేజసీ. చరధర్మ. దోషభూ. కాజేయు. గర్భ భావివష్క్షతా వృత్తము.  రచన. వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి.  జుత్తాడ. 
భావ వివక్షతా వృత్తము
దేవబ్రాహ్మణ మాన్యముల్దిగంమ్రింగి తేజంబలర దిప్తంబొకో క్ష్మాతలింగనం కలిన్
సేవకార్పణమౌకతం జిగింగీల్పడం పెంపొనరె క్షిప్తంబయెం భా వికారతన్.
ధృవముల్తలక్రిందవతెగెంధ్ధర్మమీ క్ష్మాతలిని తృప్తింగనం సాధ్యమాస్మృతిన్.
జీవనంబిక సాధ్యమా సిగందన్నె కర్మంబునను చిత్తంబులం మార్పుగల్గునే. 
              గర్భగత వృత్తములు. 
1. దేవబ్రాహ్మణ మాన్యముల్
సేవకార్పణమౌ కతన్
ధృవముల్తలక్రిందవన్
జీవనంబిక సాధ్యమా. 
2. దిగంన్మ్రింగి తేజంబలర.
జిగింగీల్పడం పెంపొనరె. 
తెగెంధర్మ మీక్ష్మాతలిన్. 
సిగందన్నె కర్మంబునన్. 
3 దీప్తంబొకో క్ష్మాతలిం కలిన్ .
క్షిప్తంబయెం భా  వికారతన్. 
తృప్తింగనం సాధ్యమా స్మృతిన్. 
చిత్తంబులం మార్పు గల్గునే. 
4.దేవబ్రాహ్మణ మాన్యముల్దిగంమ్రింగి తేజంబలర. 
సేవకార్పణమౌకతం జిగింగీల్పడంపెంపొననరె. 
ధృవముల్తలక్రిందవం తెగెంధర్మమీక్ష్మాతలిన్. 
జీవనంబికసాధ్యమా సిగందన్నె కర్మంబునను. 
5.దేవబ్రాహ్మణ మాన్యముల్దిగంమ్రింగి తేజంబలర దీప్తంబొకో
 సేవకార్పణమౌకతం జిగింగీల్పడం పెంపొనరె క్షిప్తంబయెం. 
ధృవముల్తల క్రిందవం తెగెంధర్మమీక్ష్మాతలిని తృప్తింగనం
జీవనంబిక సాధ్యమా సిగందన్నెకర్మంబునను చిత్తంబులం
6. దిగంమ్రింగి తేజంబలర దీప్తంబొకో
జిగింగీల్పడం పెంపొనరె క్షిప్తంబయెం
తెగెంధర్మమీక్ష్మాతలిని తృప్తింగనం.
సిగందన్నె కర్మంబునను చిత్తంబులం.
7.దిగంమ్రింగి తేజంబలర దీప్తంబొకో క్ష్మాతలిం
జిగింగీల్పడం పెంపొనరె క్షిప్తంబయెంభావికా.
తెగెంధర్మమీక్ష్మాతలిని తృప్తింగనం సాధ్యమా 
సిగందన్నె కర్మంబునను చిత్తంబులంమార్పుకా
8.దిగంమ్రింక్తేజంబలర దీప్తంబొకో క్ష్మాతలిం కలిన్.
జగింగీల్పడం పెంపొనరె క్షిప్తంబయెం భావికా రతన్. 
తెగెంధర్మమీక్ష్మాతలిని తృప్తింగనం సాధ్యమా స్మృతిన్. 
సిగందన్నె కర్మంబునను చిత్తంబులం మార్పుకా. 
9.. దీప్తంబొకో క్ష్మాతలిం కలిన్ దేవ బ్రాహ్మణ మాన్యముల్ .అం
క్షిప్తం బయెం భా వికారతన్ సేవకార్పణమౌ కతన్
తృప్తిం గనం సాధ్యమా స్మృతిం ధృవముల్తలక్రిందవన్11.
చిత్తంబులం మార్పు కల్గునే జీవనంబిక సాధ్యమా. 
10.దీప్తంబొకో క్ష్మాతలిం దేవ బ్రాహ్మణ మాన్యముల్దిగం మ్రింగి 
క్షిప్తంబయెం భా వికారతన్ సేవకార్పణమౌ కతన్ జిగిం .
తృప్తింగనం సాధ్యమా స్మృతిం ధృవముల్తలక్రిందవన్ తెగెం
చిత్తంబులంమార్పు గల్గునేజీవనంబిక సాధ్యమా సిగం
11.దీప్తంబొకోక్ష్మాతిం దేవబ్రాహ్మణ మాన్యముల్దిగంమ్రింగి తేజంబలర
క్షిప్తంబయెం భా వికారతం సేవకార్పణమౌకతన్ జిగింగీల్పడం పెంపొనరె. 
తృప్తింగనం సాధ్యమా స్మృతిం ధృవముల్తలక్రిందవం తెగెంధర్మమీక్ష్మాతలిన్. 
చిత్తంబులంమార్పు గల్గునే జీవనంబిక సాధ్యమా సిగందన్నె కర్మంబునన్. 
12.దిగంన్మ్రింగి తేజంబలర దేవబ్రాహ్మణ మాన్యముల్
 జిగింగీల్పడను పెంపొనరె సేవకార్పణమౌకతన్ .
తెగెంధర్మ మీ క్ష్మాతలినిధృవముల్ తలక్రిందవన్
సిగందన్నెకర్మంబుననుజీవనంబిక సాధ్యమా. 

13. దిగంన్మ్రింగె తేజంబలరం దేవబ్రాహ్మణ మాన్యముల్దీప్తంబొకో క్ష్మాతలిం కలిన్.   
జిగింగీల్పడంపెంపొనరె సేవకార్పణమౌకతంక్షిప్తంబయెంభావికారతన్
తెగెంధర్మమీక్ష్మాతలినిధృవముల్తలక్రిందవన్తృప్తింగనంసాధ్యమా స్మృతిన్
సిగందన్నెకర్మంబుననుజీవనంబిక సాధ్యమా చిత్తంబులంమార్పుకల్గునే
భావివక్షతా  ఉత్కృతి ర.స.జ.త.త.స.ర.ర.లగ.యతులు9.18.
1.శివభామినీ అనుష్టుప్ ర.స.లగ.వృ.సం.93.
2.పరాధీన బృహతీ 458.య.య.న.
3.శ్రీపాల బృహతీ త.త.ర. వృసం .165. 
4.లోగొను .అత్యష్టీ ర.స.జ.త.త.ల.యతి13.
5.జమీహర .ప్రకృతి .ర.స.జ.త.త.లల. యతి9.
6.నిస్తేజ అతిజగతి త.త .న.త.గ.యతి10.
7 భుక్తిమా ధృతి త.త.న.త.త.ర.యతి10 
8 జిగిబాయు త.త.న.త.త.ర.స.స.లగ.యతులు10.19.
9నిర్దీపక అత్యష్టీ త.త.ర.ర.సలగ.యతి10.
10.తేజసీ.ప్రకృతి త.త.ర.ర.సజత యతి 10 
11 చరధర్మ ఉత్కృతి త.త.ర.ర.స.జ.త.త.ల.ల.యతులు 10.18.
12.దోషభూ అత్యష్టి త.త.న.ర.స.లగ.యతి 10.
13.కాజేయు .ఉత్కృతి త.త.న.ర.స.త.ర.ర.లగ. యతులు10.18.
జైహింద్.