గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, జనవరి 2016, మంగళవారం

శ్రీ కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె ఇక మనకి లేరు.

శివ శివా!
కీ.శే.కరణం బాల సుబ్రహ్మణ్యం పిళ్ళె..
తే. 27-12-2015 న శ్రీ కోడూరి ప్రభాకర రెడ్డి సాహితీ పీట్యం ద్వారా పురస్కారమునందుకొనిన శ్రీ కరణం బాల సుబ్రహ్మణ్యం పిళ్ళె నిన్న (11-01-2016) రాత్రి 8.00 గంటలకు గుండె పాటుతో స్వర్గస్థులయ్యారు. ఈ వార్త తెలియఁ జేయటానికి చింతిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.
తే.13-010-2016. సాయంత్రం 5 గంటలకు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ బిల్డింగ్ వివేకానంద నగర్ కూకట్ పల్లిలో సంతాప సభ ఏర్పాటు చేయనున్నట్లు శ్రీ గుత్తి(జోళదరాశి)చంద్రశేఖర రెడ్డి తెలియజేసియున్నారు.
ఓం నమశ్శివాయ.

Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

వారి ఆత్మకు శాంతి కలగాలని

Zilebi చెప్పారు...


నివాళి ;

వారి జీవిత చరిత్ర ని బ్రీఫ్ గా మీరు టపా మూలకం గా పెడితే బాగుంటుంది

జిలేబి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.