గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జనవరి 2016, శుక్రవారం

మీ ఆశల సత్ఫలానికి మీరు తగిన ప్రణాళికాబద్ధంగా నడచుకొందురుగాక.

జైశ్రీరామ్.
ఆర్యులారా! 
కాలానికి మనం హద్దులు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాం. 
మనం ఏమి చేసినా అభ్యుదయపథంవైపే కొనసాగటానికి యత్నిస్తూంటాం. 
ఇక్కడ మనం ఒక్క విషయం మర్చిపోకూడదు. 
ఈ గడిచిన సంవత్సరం మనం ఏ అభివృద్ధి సాధించాలని నిర్ణయించుకొన్నాం? 
అందులో ఎంతవరకు మనం కృతకృత్యులమయ్యాం?
అలసత్వం కారణంగా మనం కోల్పోయినదేదైనా ఉందా? 
ఉంటే దాని విలువ మనం కట్టగలమా? 
గడిచిన కాలం వెనుకకు వస్తుందా? 
మరి గడవబోయే కాలం మన చేతిలో ఉంటుంది కాబట్టి 
ఏయే కార్యక్రమాలను మనం చేయాలని ప్రణాళిక కలిగి ఉన్నాం? 
వాట్ని సమర్థవంతంగా కాలంతోపాటు మనం కదులుతూ 
నిర్వహణలో అలసత్వానికి తావివ్వకుండా 
పూర్తి చేయటానికి సంసిద్ధంగా ఉన్నామా? 
లేక పశుపక్ష్యాదులవలె మనం కూడా ఏదో బ్రతికెయ్యటమేనా? 
ఇవన్నీ ఇప్పుడే ఆలోచించి, 
ఎవరికైనా మీరు శుభాకాంక్షలు చెప్పేటప్పుడు 
ప్రణాళికా బద్ధంగా జీవించాలనే ఆకాంక్షను తెలియజేసినట్లైతే 
వారికి చక్కటి ఆలోచనకు పునాది వెసినవారౌతారుకదా మీరు. 
మరి ఆలోచించండి. 
సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే 
గడిచిన కాలం మనలను వెక్కిరిస్తూ గడిచిపోతుందని మర్చిపోకండి. 
మీకు శుభమగునుగాక. 
మీ ఆశల సత్ఫలానికి మీరు తగిన ప్రణాళికాబద్ధంగా నడచుకొందురుగాక. 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
గడచిన కాలంతోబాటు కరిగిన జీవితం తిరిగిరాదు.మనమే కాలాను గుణంగా మనని మనం సరిదిద్దుకోవాలి మంచి విషయాలను తెలియ జెప్పారు.ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.